Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశ స్వేచ్ఛ, స్వాతంత్ర్యం కోసం మరణించాలని మన రక్తంలో రాసి ఉంది - It is written in our blood to die for the country's freedom and independence

స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన నాయకులు: "దేశ స్వేచ్ఛ కోసం మరణించాలని మన రక్తంలో రాసి ఉంది. స్వతంత్రతా కాంక్షలో మ...

స్వాతంత్ర్యోద్యమానికి స్ఫూర్తిగా నిలిచిన నాయకులు: "దేశ స్వేచ్ఛ కోసం మరణించాలని మన రక్తంలో రాసి ఉంది. స్వతంత్రతా కాంక్షలో మనం ఎంతో మంది ఉన్నతులైన నాయకులను త్యాగం చేశాం. సంఘటిత బలంతో మనం ఈ స్వేచ్ఛను కాపాడుకోవాలి" అని నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఒక సందర్భంలో అన్నారు. ఇది 2022వ సంవత్సరం మనకు స్వాతంత్ర్యం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో మన స్వాతంత్ర్య సమర యోధుల నిస్వార్ధమైన త్యాగం గురించి మనందరం తెలుసుకోవడం ప్రధానం. దేశ స్వతంత్రం కోసం పోరాడిన ఎంతో మంది నాయకులకు రావలసిన గుర్తింపు రాలేదు. అయినా వారు దేశం కోసం నిస్వార్ధ త్యాగాలు చేశారు. ముఖ్యంగా అలాంటి వారి గురించి తెలిపే ప్రయత్నమే మెగామైండ్స్ చేస్తుంది...

స్వాతంత్ర్య పోరాటంలో ఒకపక్క సత్యాగ్రహం పేరిట ప్రతిఘటన కొనసాగుతుండగా మరోపక్క బ్రిటిష్ సామ్రాజ్యంపై సాయుధ తిరుగుబాటు కూడా సమాంతరంగా సాగింది. ఎంత మూల్యం చెల్లించైనా దేశమాత స్వేచ్ఛ కోసం పోరాడాలని తిరుగుబాటు వర్గాల వారు భావించారు. ఒక వేళ ప్రాణాలు అర్పించాల్సి వచ్చినా వెనుకడుగు వేయరాదని వారి సంకల్పం. స్వాతంత్య్ర యోధులు తమ యువ జీవితం అంతా జైళ్లలో గడిపారు. దేశ విముక్తి కోసం తమ ప్రాణాలు ఫణంగా పెట్టి ఉరికంబాలు ఆహ్వనించారు. ఇప్పుడు ఈ అమృత్ మహోత్సవ్ విభాగంలో దేశ విముక్తినే పరమపవిత్ర కార్యంగా భావించిన ఆ తిరుగుబాటు వీరుల కథనాలు మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. మన ఈ వ్యాసంలో అలాంటివారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

యువతలో దేశభక్తి స్పూర్తిని నింపిన కెప్టెన్ రాం సింగ్: ఆజాద్ హింద్ ఫౌజ్ గీతం "కదం కదం బఢే జాయే జా" కు స్వరకల్పన చేసిన కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూర్ 1914 ఆగస్టు 15వ తేదీన హిమాచల్ ప్రదేశ్ లోని కంగ్రా జిల్లా ప్రధాన కేంద్రం ధర్మశాల సమీపంలోని ఖనియార్ గ్రామంలో జన్మించారు. 1943 అక్టోబర్ 21వ తేదీన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సమక్షంలో రామ్ సింగ్ తన ప్రతిభను ప్రదర్శించారు. ఆయన ప్రదర్శనకు ముగ్ధుడైన నేతాజీ తన వయొలిన్ ను రామ్ సింగ్ కు బహుమతిగా ఇచ్చారు. అంతే కాదు స్వాతంత్య్ర సాధనకు ముందు మహాత్మా గాంధీ రామ్ సింగ్ ను కలిసి స్వతంత్ర సాధన అనంతరం ఎర్రకోటలో సంగీతం, మాధుర్యభరితమైన గీతాల ప్రదర్శన ఎలా నిర్వహించాలన్న విషయం చర్చించారు.

ఆయన సంగీతం యువతలో దేశభక్తి భావాన్ని, స్ఫూర్తిని నింపేది యువతరం నిర్భీతి, ఆత్మవిశ్వాసంతో పోరాటం కొనసాగించే వారు.. "భారత్ కే జాన్ నిసాదో హిల్ మిల్ కి గ్రీన్ గానో", "శేష్ ఝంబాబే భారత్ మాతా తుఝ కరూన్ ప్రజామ్', 'నల్ సీ ఉచ్చా రుమియా మేం ప్యారా తీరంగా ఝండా హమారా' గీతాలు కూడా అజాద్ హింద్ ఫౌజ్ కోసం కెప్టెన్ రామ్ సింగ్ స్వరపరిచారు. 1963 జూలై 3వ తేదీన సింగపూర్ సమయంలో "సుభాష్ జీ, సుభాష్ జీ వో జాన్ ఇ హింద్ గయే' గీతంతో అభినందించాడు. దానికి ఎంతో ఆనందించిన నేతాజీ ఆయనను ఎంతో పొగిడారు. అంతే కాదు అబాద్ హింద్ ఫౌజ్ కు చెందిన ధీరులందరూ ఉత్సాహంగా పాడగలిగే రీతిలో తేలిగ్గా, సరళంగా ఉండే ఒక క్వామి తరానా కంపోజ్ చేయాలని నేతాజీ కోరారు. దాంతో కెప్టెన్ రామ్ సింగ్ "కదం కదం బఢే జాయే జా" గీతానికి స్వరకల్పన చేశారు.

మిలిటరీ నేపథ్యం గల కుటుంబం ఆయనది. రామ్ సింగ్ తండ్రి కానిస్టేబుల్, ఎనిమిదో తరగతి వరకు విద్యాభ్యాసం చేసిన అనంతరం రామ్ సింగ్ 14 సంవత్సరాల వయసులో సెకండ్ ఫస్ట్ గూర్ఖా రైఫిల్ దళంలో చేరారు. 1928లో బ్యాండ్ తో తన ప్రయాణం ప్రారంభించాడు. తన మాతామహులు (తల్లిగారి తండ్రి) నాథూ చుద్ ఠాకూర్ నుంచి ఆయన శాస్త్రీయ సంగీతం అభ్యసించారు. కెప్టెన్ రామ్ సింగ్ అజాద్ హింద్ ఫౌజ్ లో చేరిన తర్వాత రెండో ప్రపంచ యుద్ధ కాలంలో జపాన్ దళాలు ఆయన్ని బంధించాయి.

సంగీతంలో మక్కువ, పాండిత్యం చూసి రామ్ సింగ్ ను ఐఎన్ఏ బ్యాండ్ కెప్టెన్ గా నియమించారు. ఆయన తన పాటలతో జపాన్ బందీలుగా ఉన్న వేలాది మంది సైనికుల్లో స్ఫూర్తిని నింపడమే కాకుండా అజాద్ హింద్ ఫౌజ్ లో చేరేలా వారిని ఉత్తేజపరిచే వారు అజాద్ హింద్ రేడియో ప్రారంభించినప్పుడు ఆయన సింగపూర్, రంగూన్ రేడియో మ్యూజిక్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. 1945లో రంగూన్ ను బ్రిటిష్ సేనలు ఆక్రమించినప్పుడు ఇతర సైనికులతో పాటుగా రామ్ సింగ్ ఠాకూర్ ను కూడా అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయనపై విచారణ జరిపించి జైలులో పెట్టారు. 1947 ఆగష్టు 15వ తేదీన దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత కెప్టెన్ రామ్ సింగ్ ఠాకూర్ నాయకత్వంలోని అర్కెస్ట్రా 'సుఖ్ చైన్ శ్రీ లడ్డా బచ్చే" గీతం ప్రదర్శించింది. జనగణమనకు ఉర్దూ-హిందీ తర్జుమా ఇది. దేశానికి స్వాతంత్ర్యం లభించిన తర్వాత కూడా ఆయన దేశానికి సేవలందించారు. గోవా విముక్తి పోరాటంలో కూడా పాల్గొన్నారు. 2002 ఏప్రిల్ 15వ తేదీన ఆయన తుదిశ్వాస విడిచారు.

భారత మాత ముద్దుబిడ్డ రాజ్ గురు: సాధారణంగా నేటి యువత తమ కెరీర్ ను తీర్చి దిద్దుకునే 22-23 సంవత్సరాలు వయసులోనే 90 సంవత్సరాల క్రితం రాజ్ గురు దేశ స్వేచ్ఛ కోసం ఉరికంబం ఎక్కాడు. ఉరి కంబానికి వేలాడే ముందు కూడా ఆయన ముఖంలో ఎలాంటి భయం, పగ కనిపించలేదు. భగత్ సింగ్, సుఖ్ దేవ్ లతో కలిసి ఆయన తన జీవితాన్ని భారతమాత విముక్తి కోసం త్యాగం చేశాడు. పూణెలోని భేదాలో 1908 ఆగస్టు 24వ తేదీన ఆయన జన్మించారు. తల్లిదండ్రులు ఆ బాలునికి శివుని పేరిట శివరామ్ హరి రాజ్ గురుగా నామకరణం చేశారు.

ఆ తర్వాత కొద్ది కాలానికి తల్లిదండ్రులు మరణించాడు. రాజ్ గురు తన సోదరుని ఇంట్లో ఉండి చదువుకునే వాడు. రాజ్ గురు సోదరుడు ప్రభుత్వోద్యోగి, అయినా రాజ్ గురు భారత మాత స్వేచ్ఛ పట్ల వ్యామోహం పెంచుకున్నాడు. 16 సంవత్సరాల వయసులో సోదరునితో విభేదాల కారణంగా రాజ్ గురు - ఇల్లు వదిలి కాశీ వెళ్లిపోయాడు. అప్పటికి ఒకే ఒక జత దుస్తులు, 3 అణాలు అతని చేతిలో ఉన్నాయి. గంగా ఘాట్ వద్ద అతను తొలి రాత్రి గడిపాడు. గంగా నది ఘాట్ పై అతనికి ఒక పెన్నీ దొరికింది. దాన్ని తన భోజడానికి ఉపయోగించుకునే వారు. ఆ తర్వాత కొద్ది రోజులకే తల దాచుకునే ప్రదేశం అతనికి లభించింది. అతను సంస్కృతం నేర్చుకోవడం ప్రారంభించాడు.

ఆ సమయంలోనే అతను చంద్రశేఖర్ అజాద్ నుంచి గురు హెగ్దేవార్ సహా ఎందరో స్వాతంత్ర యోధులను కలిశారు. ఇతను హిందుస్తాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ ఆర్మీ సభ్యులుగా చేరాడు. 1928 సమయంలో ప్రతీ ఒక్క భారతీయుని గుండె లోతుల్లోను స్వాతంత్య్ర కాంక్ష రగులుతోంది. అదే ఏడాది బ్రిటిష్ పోలీసులు సైమన్ కమిషన్ ను వ్యతిరేకించిన భారతీయులపై జారీ చేశారు. ఆ లాఠీ చార్జీ లో చాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడి ప్రాణాలు విడిచారు. లజపత్ రాయ్ మరణానికి ప్రతీకారంగా రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్.. జెపి సాండర్స్ ను హతమార్చారు. సాండర్స్ హత్య అభియోగంతో బ్రిటిషర్లు రాజ్ గురు, సుఖ్ దేవ్, భగత్ సింగ్ లకు మరణ దండన విధించింది. 1931 మార్చి 23వ తేదీన దేశభక్తికి ప్రతీకలైన రాజ్ గురు, భగత్ సింగ్, సుఖ్ దేవ్ సుగ్గురినీ బ్రిటిషర్లు ఉ తీశారు, ప్రతీ ఏడాది ఆ రోజును స్మృతి మృతవీరుల స్మారక దీనంగా పాటిస్తాం.

దేశ స్వాతంత్ర్యం కోసం వారు తమ కలలుసు కూడా త్యాగం చేశారు. ఈ ముగ్గురు, యోధులు మనందరికీ స్ఫూర్తిదాయకులు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురుల త్యాగాన్ని వర్ణించడానికి మాటలు చాలవు. ఈ ముగ్గురు యువకులను చూసి బ్రిటిష్ సామ్రాజ్యం మొత్తం గడగడలాడింది. వారికి మరణదండన విధించారు, ఉరి తీత తేదీ కూడా నిర్ణయం అయిపోయింది. కాని బ్రిటిషర్లకు ఎలా ముందడుగు వేయాలో తెలియదు. వాస్తవానికి వారిని ఉరి తీయడానికి నిర్ణయించిన తేదీ మార్చి 24 అయినా ఒక రోజు ముందు 23వ తేదీనే వారిని ఉరి తీశారు. సాధారణ వైఖరికి భిన్నంగా అత్యంత రహస్యంగా ఈ ఉరితీత నిర్వహించారు. ఆ తర్వాత బ్రిటిషన్లు వారి వృతదేహాలను ప్రస్తుతం పంజాబ్ గా వ్యవహరించే రాష్ట్రంలో అతి రహస్యంగా దహనం చేశారు. యువకులెవరైనా పంజాబ్ సందర్శించే అవకాశం వచ్చినప్పుడు తప్పనిసరిగా భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురు, భగత్ సింగ్ తల్లి, బడుకేశ్వర్ దత్ మ్యూజియంలను తప్పనిసరిగా సందర్శించాలి.

ఆధ్యాత్మికత మేళవించిన తిరుగుబాటు చిహ్నం అరబిందో ఘోష్: శ్రీ అరబిందో ఘోష్ 1872లో పశ్చిమ బెంగాల్ లోని కోల్కతాలో జన్మించారు. ఆయన తండ్రి కృష్ణ ధన్ ఘోష్ వైద్యుడు, బ్రహ్మసమాజానికి చెందిన వాడు. అరబిందో తన సోదరులతో కలిసి ఏడు సంవత్సరాల వయసులోనే బ్రిటన్ వెళ్లి 18 సంవత్సరాల పిన్న వయసులోనే ఐసిఎస్ పరీక్షలో ఉత్తీర్ణుడయ్యారు. దేశానికి తిరిగి వచ్చిన తర్వాత ఆయన బరోడాలో తన అడ్మినిస్ట్రేటివ్ కెరీర్ ప్రారంభించారు గాని దేశానికి సేవ చేయాలన్న భావనే ఆయన మనసును ప్రభావితం చేసేది.

అలాంటి సమయంలోనే ఆయన ఒక పక్క ఉద్యోగం చేసుకుంటూనే మరోపక్క వెనుక నుంచి స్వాతంత్ర్యోద్యమం పట్ల ఆసక్తి చూపించడం ప్రారంభించాడు. బరోడా నుంచి కోల్ కతా వచ్చిన తర్వాత మహర్షి అరబిందో పూర్తి స్థాయిలో స్వాతంత్ర్యోద్యమంలో భాగస్వాములు కావడం ప్రారంభించారు. సోదరుడు బారిన్ ఘోష్ ఆయనను బాఘా జతీన్, జతీన్ బెనర్జీ, సురేంద్రనాథ్ ఠాగూర్ వంటి తిరుగుబాటు నాయకులకు పరిచయం చేశారు. అరబిందో ఘోష్ ఆలోచనలు అత్యంత విప్లవాత్మకమైనవి. అందువల్లనే ఆయన లోకమాన్య బాల గంగాధర్ తిలక్ తో కలిసి కాంగ్రెస్ లోని అతివాదులు ఆలోచనలు ప్రజ్వలింపచేయడం ప్రారంభించారు.

ఆయన యువతలో కూడా తిరుగుబాటు భావాలను రగిలిస్తూ వందేమాతరం ఆంగ్ల పత్రిక కూడా ప్రచురించారు. ఆయన బ్రిటిష్ ఉత్పత్తులను బహిరంగంగానే బహిష్కరిస్తూ సత్యాగ్రహోద్యమంలో భాగస్వాములు కావాలని ప్రజలను చైతన్యవంతులను చేసే వారు. తిరుగుబాటు ఉద్యమంతో అరబిందో పేరును ముడిపెట్టారు.. 1908-09 సంవత్సరంలో అలీపూర్ బాంబ్ కేసులో ఆయనకు శిక్ష విధించారు. బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో చురుకైన భాగస్వాములయ్యేలా, బెంగాల్ ఐక్యతకు ఉద్యమించేలా. ప్రజలను ప్రోత్సహించాలన్న లక్ష్యం ఆయనది. జైలులో ఉండగానే.

అసాధారణమైన ఆధ్యాత్మిక అనుభవాలు సాధించి మనసును ఆ వైపు తిప్పారు. జైలులో ఉండగా స్వామి వివేకానంద బోధనలు ఆయనపై తీవ్ర ప్రభావం చూపేవి యోగ సాధన ప్రారంభించారు. 1910లో జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన చందానగర్ మీదుగా పాండిచ్చేరి చేరారు. పాండిచేరిలో ఆయన పూర్తిగా ప్రజాజీవనం నుంచి వైదొలగి ఆధ్యాత్మికత వైపు, రచనా వ్యాసంగానికి తనను తాను పరిమితం చేసుకున్నారు. 1950 డిసెంబర్ 5వ తేదీన ఆయన మరణించారు. కాని ఆయన శరీరాన్ని దహనం చేయలేదు, డిసెంబర్ 9వ తేదీన ఆశ్రమంలోనే సమాధి చేశారు. శ్రీ అరబిందో భావాలు, అలోచనలు, ఆధ్యాత్మిక సిద్ధాంతాలు నేటికీ ఎంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

స్వాతంత్ర్యం కోసం ప్రాణ త్యాగాన్ని ఎంచుకున్న కన్నయ్యలాల్ దత్: దేశ స్వాతంత్య్రం కోసం ఆనందంగా ప్రాణత్యాగం చేసిన అసాధారణ తిరుగుబాటు యోధుడు కన్నయ్యలాల్ దత్ స్వాతంత్ర్యోద్యమంలో పాల్గొనేందుకు యువతకు స్ఫూర్తిగా నిలిచారు. 1888 ఆగష్టు 30వ తేదీన జన్మాష్టమి రోజున కన్నయ్య లాల్ దత్ జన్మించారు. జన్మాష్టమి రోజున పుట్టినందుకే తల్లిదండ్రులు. ఆయనకు కన్నయ్యగా నామకరణం చేశారు.

1908లో విద్యాభ్యాసం పూర్తి చేసుకున్న అనంతరం. కన్నయ్య కోల్ కతా కు తరలివెళ్లారు. కోలకతాలో ఆయనకు 'జుగాంతర్ సంఘటన్ కు చెందిన తిరుగుబాటుదారులతో పరిచయం అయింది. బరీంద్ర ఘోష్ ఇంటిలో నివశించడం ప్రారంభించారు. ఆ ఇంటిలోనే తిరుగుబాటుదారులు తమ ఆయుధాలు, ఆయుధ సామగ్రి దాచేవారు. ఇదిలా ఉండగా 1908 ఏప్రిల్ 30వ తేదీన ఖుదీరామ్, ఆయన సహచరుడు ప్రఫుల్లచంద్ర చాకీ ముజఫర్ పూర్ లోని కింగ్స్ ఫోర్ట్ పై బాంబుదాడి చేశారు. ఆ దాడితో బ్రిటిషర్లు దిగ్భ్రాంతులయ్యారు, తిరుగుబాటుదారులను అరెస్టు చేసే ప్రయత్నాలు. ప్రారంభం అయ్యాయి. ఆ సమయంలోనే కన్నయ్య, ఆయన స్నేహితులు కార్యకలాపాల గురించి కూడా పోలీసులకు ఆధారాలు లభించాయి.

1908 మే 2వ తేదీన పోలీసులు కన్నయ్య స్థావరంపై దాడి చేసి ఆయ ఇంటిలో బాంబుల ఫ్యాక్టరీని కనుగొన్నారు. తిరుగుబాటుదారుల నుంచి భారీ పరిమాణంలో ఆయుధాలు, ఆయుధ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత బ్రిటిషర్లు అరబిందో ఘోష్, బరీంద్ర ఘోష్, సత్యేంద్రనాథ్ (సత్యేన్) కన్నయ్య లాల్ సహా 35 మంది తిరుగుబాటుదారులను అరెస్టు చేశారు. వారిని అలీపూర్ జైలులో నిర్బంధించి విచారణ ప్రారంభించారు.

అరెస్టయిన వారిలో ఒక సహచరుడైన నరేంద్రనాథ్ గోస్వామి బ్రిటిష్ ప్రభుత్వంపై భయంతోను, తాను జైలు విడుదల కావచ్చునన్న దురాలోచనతోను తన సహచరులు పేర్లన్నీ చెప్పడం ప్రారంభించాడు. గోస్వామి చేసిన మోసం కారణంగా ఇతర తిరుగుబాటుదారులు కూడా బ్రిటిషర్ల వలలో చిక్కారు. దీంతో కళ్లు తెరుచుకున్న మరెవరు తిరుగుబాటుదారులు మాతృభూమికి ఇలాంటి మోసం చేయుకుండా ఉండేందుకు అతనికి గుణపాఠం నేర్పాలని నిర్ణయించారు. తిరుగుబాటుదారుల అసంతృప్తిని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించింది.

నరేంద్రకు అదనపు భద్రత కల్పించి అతన్ని వేరే జైలులో పెట్టారు. అయినప్పటికీ కన్నయ్య, సత్యేన్ బోస్ ఇద్దరూ కలిసి విచారణకు ముందుగానే నరేంద్రను సధించారు. ఈ సంఘటన దేశవ్యాప్తంగా భయోత్పాతం సృష్టించింది. ఆ తర్వాత కన్నయ్య, సత్యేన్ లను ప్రాసిక్యూట్ చేశారు. 1908 అక్టోబర్ 21వ తేదీన కన్నయ్య, సత్యేన్ లకు ఉరి శిక్ష విధించారు. మొత్తం విచారణ జరుగుతున్న సమయంలో ఏ సందర్భంలోనూ కన్నయ్య ఎలాంటి బలహీనత ప్రదర్శించలేదు. అతన్ని చంపడానికి కారణం ఏమిటని న్యాయమూర్తి ప్రశ్నించినప్పుడు అతను. మాతృదేశ ద్రోహి కావడం వల్లనే అని నిర్భీతిగా సమాధానం చెప్పారు.

కోర్టు తీర్పునకు వ్యతిరేకంగా అప్పీలు చేసుకోవడానికి కూడా నిరాకరించాడు. 1908 నవంబర్ 10వ తేదీన కేవలం 30 సంవత్సరాల వయసులోనే కన్నయ్యలాల్ దత్ ఉరికంబానికి వేలాడారు. చందానగర్ ప్రాంతం మొత్తం స్వాతంత్య్ర పోరాటం, సంస్కృతి, దేశ మేథస్సు, సైన్స్ యాత్రా స్థలం. మహర్షి అర్వింద్, రాజ్ బెహార్ బోస్, కన్నయ్యలాల్ దత్, ఉపేంద్ర నారాయణ్ బందోపాధ్యాయ వంటి ఎందరో ఈ ప్రాంతానికి చెందిన వారే.. ఇటువంటి వారందరిని ఈ అమృత మహోత్సవాలలో స్మరించుకోవడం మన బాధ్యత.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

No comments