స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మరుగున పడిన కొన్ని పోరాటాలు - movements that got lost in the run up to independence

megaminds
0
స్వాతంత్య్ర ఉద్యమ సమయంలో మరుగున పడిన కొన్ని పోరాటాలు: భారతదేశాన్ని పరిపాలించడానికి, బ్రిటీష్ వారు ఎల్లప్పుడూ 'విభజించు మరియు పాలించు' విధానాన్ని ఉపయోగించారు. క్రమంగా వారు దేశ మత, సామాజిక, ఆర్థిక మరియు పరిపాలనా వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం ప్రారంభించారు. అటువంటి పరిస్థితిలో స్థానిక నిరసనలు త్వరగా చెలరేగాయి. ఇవి 1857లో ప్రారంభమైన భారతదేశం మొదటి స్వాతంత్ర్య దశకు పునాది వేశాయి. ఈ నేపథ్యంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా అనేక ఆందోళనలు జరిగాయి. బ్రిటిష్ వారికి గట్టి ప్రతిఘటనలు ఎదురైనాయి. దేశంలో జరిగిన అన్ని ఉద్యమాలు, పోరాటాలు బ్రిటిష్ వారితో పోరాడటానికి భారతీయులలో విశ్వాసాన్ని నింపాయి. వీటి స్ఫూర్తితో జరిగిన స్వాతంత్య్ర పోరాటంలో ఆగస్టు 15, 1947 న భారతదేశం స్వాతంత్ర్యం సాధించింది.

అనేక సంవత్సరాల బ్రిటీష్ బానిసత్వం తర్వాత భారతదేశం ఆగష్టు 15, 1947 న స్వాతంత్యం పొందింది. అయితే, స్వాతంత్యం పొందిన భారతదేశం కొంత భాగాన్ని కోల్పోయింది. కొంత భూభాగాన్ని కోల్పోయే షరతుతో భారతదేశాన్ని రెండు భాగాలుగా విభజించడానికి రూపొందించిన ప్రణాళికను భారతదేశ వివరి వైస్రాయ్ గా పని చేసిన లార్జ్ లూయిస్ కు మౌంట్ బాటన్ జూన్ 3, 1947 న సమర్పించారు. భారతదేశ విభజనలో భాగంగా జరిగిన ఈ సంఘటనను "3 జూస్ ప్లాన్' లేదా 'మౌంట్ బాటన్ ప్లాన్" అని పిలుస్తారు. అయితే ఈ ప్రణాళికపై విస్తృత వ్యతిరేకత ఉన్నప్పటికీ, భారతదేశాన్ని విభజించాలనే బ్రిటిష్ ప్రభుత్వ ప్రణాళికను 1947 జూన్ 15న న్యూఢిల్లీలో జరిగిన అఖిల భారత కాంగ్రెస్ సమావేశం ఆమోదించింది. ఈ ప్రణాళిక ఆధారంగా భారతదేశం బ్రిటిష్ వారి నుంచి స్వాతంత్యం పొందింది, కానీ, భారతదేశంలోని చాలా భాగం పాకిస్తాన్ గా విభజించబడింది. జూన్ 3 మరియు 15 తేదీలు భారతదేశ చరిత్ర మరియు భౌగోళికతను మార్చిన రోజులుగా నిలిచిపోతాయి.

విభజన వల్ల లక్షలాది మంది ప్రజలు తమ ఇళ్లను విడిచిపెట్టి పారిపోయారు. విభజన తరువాత చెలరేగిన హింసాకాండలో దాదాపు 10 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. విభజన 20 మిలియన్ల మందిని ప్రభావితం చేసిందని అంచనా. విభజన ఫలితంగా అతిపెద్ద సంఖ్యలో ఆశ్రయం కోల్పోయారు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఆశ్రయం కోల్పోవడం ప్రపంచంలో ఇదే తొలిసారి. లక్షలాది కుటుంబాలు తమ పూర్వీకులు. గ్రామాలు, పట్టణాలు మరియు నగరాలను విడిచిపెట్టి శరణార్థులుగా కొత్త జీవితాన్ని ప్రారంభించవలసి వచ్చింది. దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన వారందరికీ, విభజన వల్ల ఆశ్రయం కోల్పోయిన వారి త్యాగాలను స్మరించుకుని, నివాళి అర్పించేందుకు ప్రతి సంవత్సరం ఆగష్టు 14ని సంస్మరణ దినంగా పాటించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. అదనంగా, ప్రభుత్వం ఆగస్టు 14 ను విభజన విభిషేక స్మారక దినంగా పాటించి వారికి నివాళి అర్పించాలని నిర్ణయించింది. ఆగష్టు 15, 1947 న బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్ర్యం పొందింది. ఈ రోజు దేశానికి సంతోషకరమైన మరియు గర్వించదగిన రోజు. అయితే, ఈ స్వాతంత్ర్యం సాధించడానికి మనం అనేక ఉద్యమాలు, పోరాటాలు మరియు దశల ద్వారా వెళ్ళవలసి వచ్చింది.

1857 స్వాతంత్య్ర పోరాటానికి ముందు దేశంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు జరిగాయి. దీనిని భారతదేశ స్వాతంత్ర్యం ఉద్యమ మొదటి దశగా పేర్కొనవచ్చు. ఉద్యమాలలో ఫకీర్ ఉద్యమం (1776-77), సన్యాసి ఉద్యమం, పద్యగర్ ఉద్యమం (1901-1905), వెల్లూరు ఉద్యమం (1806), నాయక్ ఉద్యమం (1806), ట్రావెన్ కోర్ ఉద్యమం (1808), చెరో ఉద్యమం (1802), ఒడిశాలో పైకాన్ ఉద్యమం (1821). కిత్తూరు ఉద్యమం (1824), అస్సాంలో అహోం ఉద్యమం (1824), పాల్ మరియు కూర్గ్ ఉద్యమాలు (1832-37), గోండు ఉద్యమం (1833-57) ఉన్నాయి. స్వాతంత్య్రం ఆజాది కా అమృత్ మహోత్సవ్ ఇండియా @75 అమృత్ మహోత్సవ్ పురస్కరించుకుని ఈ వ్యాసంలో మరుగున పడిన కొన్ని ఉద్యమాల గురించి తెలుసుకుందాం..

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా సన్యాసుల నాయకత్వంలో ఉద్యమాలు: "వందే మాతరం" భారతదేశ చరిత్రలో విప్లవ స్ఫూర్తి రగిలించిన నివాదం. వందేమాతరం నివాదంతో ప్రతిఒక్క వ్యక్తి స్ఫూర్తి పొంది ఎల్లవేళలా అంకితభావంతో మాతృభూమిని గౌరవించేలా చేసింది. భారత స్వాతంత్య్ర్య సమరంలో దేశం కోసం వేలాది మంది వీరులు వందేమాతరం గీతాన్ని అలపిస్తూ తమ ప్రాణాలను అర్పించారు. ఉరికంబానికి తమకు తామే ఉరివేసుకుని ప్రాణ త్యాగం చేసిన ఎందరో భరతమాత పుత్రులు కూడా ఉన్నారు. 'వందేమాతరం' గీతాన్ని ఆలపిస్తున్నప్పుడు అనేక మంది కాల్చి చంపబడ్డారు. స్వాతంత్య్ర పోరాటంలో వందేమాతరం ప్రాథమిక మంత్రంగా మారింది. బంకించంద్ర ఛటర్జీ తన "ఆనంద్ మఠం' అనే నవలలో "వందేమాతరం" రచించారు. బెంగాల్ కరువు, సన్యాసులు తిరుగుబాటు నుంచి ప్రేరణ పొంది ఆయన ఈ గీతాన్ని రాసారు.

వందేమాతరం వంటి అద్భుతమైన స్వరకల్పనలు చేసిన బంకించంద్ర ఛటర్జీని అరబిందో ఘోష్ వంటి విప్లవకారుడు "జాతీయవాదం స్ఫూర్తి దాత" గా వర్ణించారు. గిరి శాఖకు చెందిన సన్యాసుల నేతృత్వంలోని దీర్ఘకాలంగా నడిచిన సన్నాసి ఉద్యమము బ్రిటీష్ ప్రభుత్వాన్ని వణికించింది. మన దేశంలో ఋషులు, సన్యాసులు ఎల్లప్పుడూ దేశ పరిస్థితికి అనుగుణంగా ప్రజల ప్రయోజనాల కోసం ముందుకు వచ్చి మార్గనిర్దేశం చేశారు. అవసరం వచ్చినప్పుడు వారు బ్రిటిష్ వారిపై కూడా ఉద్యమించారు. అటువంటి నేపథ్యంలో వారు జాతీయ మతాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక ప్రాచీన మతానికి ప్రతినిధిగా కూడా ప్రముఖంగా ఎదిగారు.

బ్రిటిష్ వారు మొదటిసారి అడుగు పెట్టిన బెంగాల్ మరియు బీహార్లో సన్యాసీల తిరుగుబాటు సుదీర్ఘ కాలం జరిగింది. బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి తిరుగుబాటుకు సన్యాసులు నాయకత్వం వహించారు. దీనిలో వేలాది మంది ప్రజలు మరణించారు. ఈ ఉధ్యమాన్ని అణచివేసేందుకు బ్రిటిష్ వారు సైనిక ఉద్యమం బ్రిటిష్ బలగాలను ఉపయోగించాల్సి వచ్చిందనే వాస్తవాన్ని గమనిస్తే ఉద్యమం ఎంత భారీ ఎత్తున జరిగిందన్న అంశం అర్ధమవుతుంది. బెంగాల్ ని బ్రిటీష్ స్వాధీనం చేసుకున్న తర్వాత 1770లో తీవ్ర కరువు ఏర్పడింది. అయినప్పటికీ బ్రిటిష్ వారు కఠినంగా పన్నులు వసూలు చేయడం కొనసాగించి మత కార్యక్రమాలపై ఆంక్షలు విధించడం ప్రారంభించారు. బ్రిటీష్ వారి క్రూరమైన విధానంతో ఆగ్రహం చెందిన సన్యాసీలు తిరుగుబాటు చేయాలని నిర్ణయించారు.

బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో సన్యాసీలకు రైతులు, భూస్వాములు మరియు చిన్నకుల పెద్దలు సంఘీభావం ప్రకటించారు. వారితో కలిసి ఉద్యమాన్ని ప్రారంభించారు. స్వాతంత్య వీరులు దేశాన్ని తమ తల్లిగా, తమను తాము తమ బిడ్డలుగా ప్రకటించుకుని దేశం పట్ల తనుకున్న నిబద్ధతను చాటుకున్నారు. వారు గెరిల్లా యుద్ధంలో నిపుణులు, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టి దోచుకున్న నిధులను నిరుపేదలకు విరాళంగా ఇచ్చేవారు. ఈ ఆందోళనకారులు బ్రిటీష్ వారి బంగ్లాలను నాశనం చేసి, వారిలో చాలా మందిని హతమార్చారు. హిందూ-ముస్లిం ఐక్యత ఉద్యమం అత్యంత ముఖ్యమైన అంశాలలో ఇది ఒకటి, తిరుగుబాటును అణచివేయడానికి బ్రిటిష్ వారు తను వనరులన్నింటినీ ఉపయోగించాల్సి వచ్చింది. సుదీర్ఘ పోరాటం అనంతరం బెంగాల్ గవర్నర్ జనరల్ వారెన్ హేస్టింగ్స్ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయగలిగారు.

మొదటిసారి బ్రిటిష్ వారిపై యుద్ధం చేసిన పాలయకర్రర్లు: 1857లో భారతదేశంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా జరిగిన మొదటి స్వాతంత్య ఉద్యమం ముందు భారతదేశంలోని పాలీగార్ కు చెందిన పాలయకర్రర్లు బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా యుద్ధం చేసారు. బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ సార్వభౌమాధికారాన్ని గుర్తించడానికి నిరాకరించారు. ఈ ఉద్యమానికి వీరపాండ్య కట్టబొమ్మన నాయకత్వం వహించారు. వీరపాండ్య కట్టబొమ్మన ను కట్టబొమ్ నాయకన్ ను పాలయకర్రర్ లేదా పాలీగార్ అని కూడా పిలుస్తారు.

ఈ ఉద్యమం 1801 మరియు 1805 మధ్య తమిళనాడులో జరిగింది. దక్షిణ కోటల అధిపతులుగా పిలిచే పాలయకర్రర్లు బ్రిటిష్ వారి అణచివేత విధానాలను వ్యతిరేకించారు. ఇంతేకాకుండా వారు శిస్తు కట్టడానికి నిరాకరించారు. ఇది బ్రిటీష్ వారికి ఆగ్రహం కలిగింది. దీనితో పాలయకర్రర్లు తో వారు పోరాటం ప్రారంభించారు. కట్టబొమ్మన్ నాయకన్ నేతృత్వంలోని పాలయకర్రర్లు, బ్రిటీష్ వారిపై ధైర్యంగా పోరాడారు మరియు వారి సైన్యాన్ని భయపెట్టారు. ఈ ఉద్యమంలో పాల్గొన్న వారు. అనేక మంది బ్రిటిష్ వారిని మట్టుబెట్టారు.

బ్రిటిష్ వారిని దోచుకుని వారి ఆస్తులను ధ్వంసం చేశారు. వీరపాండ్య కట్టబొమ్మన్ ప్రజలలో ఆదరణ పొందాడు. కానీ బ్రిటిష్ వారికి ఆగ్రహం కలిగించాడు. బ్రిటిష్ వారు ఉద్యమాన్ని అణిచివేసేందుకు. తమ శక్తినంతా ఉపయోగించారు. మోసం చేసి వీరపాండ్య కట్టబొమ్మను పట్టుకున్నారు. ప్రజలను భయపెట్టడానికి బ్రిటిష్ వారు వారి ముందు బహిరంగంగా వీరపాండ్య కట్టబొమ్మను ఉరితీశారు. అతని మరణానంతరం ఉద్యమం బలహీనపడింది. 1806లో బ్రిటిష్ వారి చే పూర్తిగా అణచివేయబడింది.

బ్రిటిష్ వారిని భయపెట్టిన చెరో ఉద్యమం: ఝార్ఖండ్ రాష్ట్రంలో పలామాలోని చెరో తెగ 1800 లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసింది. అధిక పన్నులు విధించడం మరియు పట్టాలను తిరిగి స్వాధీనం చేసుకోవడం ఈ తిరుగుబాటుకు కారణమయింది. తిరుగుబాటుకు భూషణ్ సింగ్ నాయకత్వం వహించారు. క్రీ.శ.1700లో పలామస్ కోటను స్వాధీనం. చేసుకున్న బ్రిటిష్ వారు ఎంతోకాలం దానిని తమ అధీనంలో ఉంచుకోలేకపోయారు. అయితే, కొంతకాలం తరువాత బ్రిటిష్ వారు తిరిగి స్వాధీనం చేసుకోగలిగారు. తమకు నచ్చిన వ్యక్తిని పాలకునిగా నియమించారు. ఆ రాజుపై స్థానికుల మనస్సులలో అసంతృప్తి క్రమంగా పెరగడం ప్రారంభమైంది.

1800లో బ్రిటీషువారిపై చెరో తిరుగుబాటుదారులు బహిరంగంగా తిరుగుబాటు చేశారు. చెరో తిరుగుబాటుదారులు బ్రిటీష్ ను తప్పించుకొని చాలా సంవత్సరాలు తిరిగారు. చెరో తిరుగుబాటు బ్రిటీష్ పాలన వెన్నెముకని విరిచింది. గతంలో కూడా బ్రిటన్ కు వ్యతిరేకంగా పాలమూ మరియు చెరో తెగలు ఆందోళనకు దిగారు. కానీ ఈసారి వారు బలమైన పోరాటం చేశారు. బ్రిటీష్ వారు తిరుగుబాటును అణిచివేసేందుకు అన్ని ప్రయత్నాలు చేశారు. కానీ విజయం సాధించలేకపోయారు. చివరికి భూషణ్ సింగ్ ను పట్టుకున్న బ్రిటిష్ వారు అతనిని 1802 లో ఉరితీశారు. కలనల్ జోన్స్ తిరుగుబాటుకు ముగింపు పలికారు.

అయితే, అసంతృప్తితో ఉన్న ప్రజలు బ్రిటీష్ వారిపై అప్పుడప్పుడు తిరగబడేవారు. ఈ తిరుగుబాటు ఫలితంగా బ్రిటీష్ ప్రభుత్వం 1809లో చోటా నాగ్ పూర్ లో శాంతి భద్రతలను కాపాడేందుకు జమిందారి పోలీస్ బలగాన్ని ఏర్పాటు చేసింది. బ్రిటీష్ వారు పాలము పరగణాను స్వాధీనం చేసుకున్నారు.. వేలం ద్వారా భర్దేస్ రాజు ఘనశ్యామ్ సింగ్ కు పాలనను అప్పగించారు. 1817 లో గిరిజన సహకారంతో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు కూడా అణచివేయబడింది. చెరో తిరుగుబాటుని అణచివేయడానికి సహకరించిన ఘన్ శ్యామ్ సింగ్ కు బ్రిటిష్ వారు రివార్డ్ ఇచ్చారు.

అన్ని వర్గాల నుంచి ఫకీర్ ఉద్యమానికి మద్దతు: బెంగాల్ లో సంచార ముస్లిం తెగలకు చెందిన వారు బ్రిటీష్ వారిపై తిరుగుబాటు బావుటా ఎగరవేశారు. ఆ సమయంలో బ్రిటిష్ పాలనను వ్యతిరేకించడం ప్రమాదంతో కూడిన పని, అయితే, వాస్తవాలు తెలిసిన పకీర్లు బ్రిటిష్ వారిని వ్యతిరేకించాలని నిర్ణయించారు. ఈ ఉద్యమానికి కులం, మతం సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఫకీర్ల ఉద్యమానికి మద్దతుగా నిలవడం ఈ ఉద్యమ ప్రత్యేకతగా చెప్పుకోవాలి, అన్ని వర్గాల మద్దతు లభించడంతో ఉద్యమం బలంగా సాగింది. ఉద్యమంలో పాల్గొన్న అనేకమంది ఫకీర్ల సుఫీ సాంప్రదాయాలతో ప్రభావితులు అయ్యారు. మేఘల్ రాజుల సమయంలో మదారి, బర్హన కులాలకు చెందిన ఫకీర్లు బెంగాల్, బీహార్ ప్రాంతాలలో స్థిరపడ్డారు.

1776 - 77 లో బ్రిటిష్ రాజ్యంలో బెంగాల్ విలీనమయింది. తిరుగుబాటు ఫకీర్లు మజ్నూమ్ షా నాయకత్వంలో స్థానిక రైతులు మరియు జమీందార్ల నుంచి డబ్బులు వసూలు చేయడం ప్రారంభించారు. తమకు సహకరించేందుకు పఠాన్లు, రాజ్ పుత్ బెంగాల్ సైన్యంలో పని చేసిన వారిని ఫకీర్లు నియమించుకున్నారు. అనేకమంది హిందూ నాయకులు కూడా వారికి సహకరించారు. ఆ తర్వాత ఉద్యమంలో పాల్గొన్న వారు హింసాత్మక కార్యక్రమాలకు దిగారు. బ్రిటిష్ వారికి చెందిన కర్మాగారాలు, మిలటరీ స్థావరాలపై వీరు దాడులు చేశారు.

ఈ పరిస్థితిలో మజ్నూ షా కార్యక్రమాలను అణచివేసేందుకు బ్రిటిష్వారు రంగంలోకి దిగారు, కెప్టెన్ జేమ్స్ రినల్ నాయకత్వంలో మజ్నూషా ను బ్రిటిష్ సైన్యం అంతమొందించింది, ఆ తరువాత ఉద్యమ పగ్గాలను చిరాగ్ అలీ షా చేట్టారు. అతని నాయకత్వంలో ఉద్యమం బెంగాల్ తూర్పు జిల్లాలకు విస్తరించింది. ఉద్యమ ప్రభావం ఎక్కువ కాలం కనిపించింది. అయితే, బ్రిటిష్ సైన్యం ఉద్యమాన్ని బలవంతంగా అణచివేసింది.

1857కి ముందే బ్రిటీష్ పై మొదటి తిరుగుబాటు చేసిన సిపాయిలు: భారత స్వాతంత్య ఉద్యమం అంటే అందరికీ ముందు 1857 సిపాయిల తిరుగుబాటు గుర్తుకు వస్తుంది. అయితే, అంతకు 51 సంవత్సరాల ముందే సిపాయిలు బ్రిటిష్ వారిపై మొదటి తిరుగుబాటును చేశారు. 1806లో వెల్లూరులో ఈ తిరుగుబాటు జరిగింది. బ్రిటిష్ వారి అణచివేతకు వ్యతిరేకంగా 1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటుకు 1806లో జరిగిన తిరుగుబాటు స్ఫూర్తిగా నిలిచింది.

1857లో తిరుగుబాటుకు దారితీసిన కారణాలే 1806 తిరుగుబాటుకు తక్షణ కారణం అయ్యాయి. బ్రిటిష్ వారు కొత్త డ్రెస్ కోడ్ ను ప్రవేశపెట్టారు. దీని ప్రకారం హిందువులు నుదుట తిలకం పెట్టుకోకుండా, ముస్లింలు గడ్డం పెంచుకోవడాన్ని నిషేధించారు. మార్పులను ప్రశ్నించిన కొంతమంది సిపాయిలను వెల్లూరు కోట నుంచి సెయింట్ జార్జ్ కోటకి బదిలీ చేసారు. మరికొంత మందిని శారీరకంగా హింసించారు, అన్యాయంగా, దూకుడుతో చేసిన మార్పులను ప్రశ్నించిన వారిని, మరోసారి వెల్లూరులో తిరుగుబాటు జరగకుండా చూసేందుకు అసమ్మతి స్వరాన్ని నిర్దాక్షిణ్యంగా అణచి వేసింది. తమిళనాడు. వెల్లూరు కోటలో జరిగిన తిరుగుబాటులో దాదాపు 200 మంది బ్రిటిష్ సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ తిరుగుబాటు ఒక రోజుకు మాత్రమే పరిమితమైంది.

జూలై 10, 1806వ జరిగిన తిరుగుబాటు పై బ్రిటిష్ వారు క్రూరంగా ప్రతీకారం తీర్చుకున్నాడు. పెద్ద సంఖ్యలో సైనికులను పట్టుకుని విచారించారు. అనేకమంది సైనికుల ప్రాణాలు తీశారు. విచారణ తరువాత దాదాపు 100 మంది ఆందోళనకారులను ఉరితీశారు. వెల్లూరు తిరుగుబాటు జరిగి 200 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వం 2008లో తపాలా స్టాంపును విడుదల చేసింది. బ్రిటిష్ వారి నిరంకుశ, క్రూర విధానాలపై తొలిసారిగా తిరుగుబాటు చేసిన ప్రాంతంగా వెల్లూరు కోట గుర్తింపు పొందింది. ఇక్కడ ప్రారంభమైన అసంతృప్తి పెరిగి స్వాతంత్యం ఉద్యమానికి దారి చూపించింది. దాదాపు 800 మంది విప్లవకారులు పాల్గొన్న ఈ తిరుగుబాటు బ్రిటీష్ వారిని గడగడలాడించింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు  గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.

ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – రెండింటిని కలిపి చేసేవే సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం – యోగసనాలకు మధ్యలో సూర్య నమస్కారాలు చేయాలి. సూర్యనమస్కారాల వలన శరీరంలోని అవయవాలన్నీ బాగా వంగుతాయి. అందువలన నిత్యజీవితంలో, నడకలో, కూర్చోవడంలో, పడుకోవడంలో, శరీరం ఉండాల్సిన స్థితిలో సహజత్వం ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..

At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top