Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యోగనిద్ర ఎలా చేయాలి.. యోగ నిద్ర ఉపయోగాలు - Yoga Nidra

శవాసనం యొక్క వికసిత రూపమే యోగనిద్రాక్రియ. శవాసనంలో పడుకొని ఆలోచనలన్నింటిని ఆపి, యీ క్రియ ప్రారంభించే ముందు, శ్వాసపై మనస్సును కేంద్రీకరించాలి...శవాసనం యొక్క వికసిత రూపమే యోగనిద్రాక్రియ. శవాసనంలో పడుకొని ఆలోచనలన్నింటిని ఆపి, యీ క్రియ ప్రారంభించే ముందు, శ్వాసపై మనస్సును కేంద్రీకరించాలి. శరీరమందలి చిన్న పెద్ద అంగ ప్రత్యంగాల్ని మనస్సుతో వీక్షించి వాటి ఆకారాల్ని మనస్సుతో గ్రహించాలి. తరువాత అంగప్రత్యంగాల్ని వదులు చేయాలి. వాటిని వదులుగానే వుంచాలి. శ్వాసను సామాన్య స్థితిలో సాగించాలి. అంగ ప్రత్యంగాల్ని వదులు చేసే ప్రక్రియను ఒక్కొక్క అవయవాన్ని తీసుకొని క్రమబద్ధంగా సాగించాలి.

యోగనిద్ర చేయలనుకున్నప్పుడు సులువుగా వదులుగా ఉండే బట్టలు వేసుకోవాలి. ఒంటిమీద ఎక్కడ బిగ్గరగా ఉండకుండా చూసుకోవాలి. వాచ్, నడుముకి పెట్టుకొనే బెల్ట్‌లాంటి లేకుండా చూసుకోవాలి. ఆ తరువాత వెల్లకిలా పడుకోవాలి. రెండు కాళ్లు కొద్దిగా దూరంగా ఉంచి.. అరచేతులు పైకి ఉండాలి. శరీరంలో ఏ భాగానికీ ఒత్తిడి, అలసట కలిగించకూడదు. శ్వాస మీద దృష్టిపెట్టి మనసుతో శరీర భాగాలను గమనించాలి. ముందు కుడికాలి వేళ్లు, గోళ్లు దగ్గర్నుంచి బయట, లోపల, అలాగే ఎడమకాలిని గమనించాలి. ఎక్కడైనా నొప్పిగా అనిపిస్తే శ్వాస తీసుకుని, అది నొప్పి దగ్గరకు వెళ్తున్నట్లు ఊహించి, మెల్లగా శ్వాస వదలండి. శ్వాసతోబాటు నొప్పినీ వదలండి. కీళ్లు, చీలమండ, కండరాలు, చర్మం, మోకాళ్లను గమనించండి. మోకాలి చిప్పల్లో ద్రవం ఉందా లేక ఎండిపోయినట్లుందా మీకు కనిపించాలి. తొడను లోపల, బయట గమనించి పొత్తికడుపు, పెద్దపేగు, మూత్రనాళాలు, మూత్రకోశం, పొట్ట పైభాగం, ఉదరభాగం, ఊపిరితిత్తులు అన్నిటినీ చూడండి. బాగా శ్వాస తీసుకుని, అది ఊపిరితిత్తులు, గుండె, తక్కిన భాగాలకి అందుతున్నట్లు భావించి ఊపిరితిత్తుల్ని క్లియర్‌ చేసుకోండి. లోపలున్న ఇంప్యూరిటీస్‌ అన్నీ వెళ్లిపోవాలి. తర్వాత గుండె రక్తప్రసరణ, థైరాయిడ్‌ గ్రంథి, స్వరతంత్రులు, గొంతు, రెండుచేతులనూ గమనించండి. ఇదంతా కదలకుండా మనసుతో చేయాలి. అరగంట, ముప్పావు గంట పడుతుంది. తొడ దగ్గరినుంచి పిరుదులు, వెన్నుపూస, కండరాలు, వీపు, మెడ, తల వెనుక భాగం వరకూ గమనించండి. మెడ కండరాలను రిలాక్స్‌ చేయండి. హాయిగా శ్వాస తీసుకుని వదలండి. తల పైభాగమంతా పరిశీలించి సేదతీరి కళ్లు, ముక్కు, చెంపలు, పెదాలు, నోరు, చెవులను గమనించి నుదుటి మధ్య ఆజ్ఞాచక్రం దగ్గర దృష్టిపెట్టండి.

ఈ క్రమంలో ప్రతి అవయవానికి 10 సెకండ్ల చొప్పన సమయంకేటాయించి మనస్సును దానిపై కేంద్రీకరించి, తెరిచిన కండ్లతో చూచినట్లుగా, కండు మూసి కూడా వాటి రూపాన్ని ఆకారాన్ని వీక్షిస వాటిని వదులుచేసూ వుండాలి.

పైన తెలిపిన క్రియలన్నింటిని 10-15 నిమిషాల్లో చేయాలి. అది ఒక రౌండు అన్నమాట. యిట్టి రౌండ్లు ఒకటి లేక ఒకటికి మించి కూడా చేయవచ్చు.

ఈ క్రియను రాత్రి నిద్ర పోయే ముందు పక్క మీద పడుకొని చేయడం మంచిది. దీనివల్ల కొద్ది గంటల పాటు గాఢనిద్ర వస్తుంది. శరీరానికి, మనస్సుకు సంపూర్ణ విశ్రాంతి లభిస్తుంది. నిద్రా సమయం కూడా తగుతుంది.

ఈ క్రియ చేస్తున్నప్పడు క్రింద తెలిపిన అనుభవాలు కలుగుతాయి:

శరీరం బరువుగానో లేక తేలికగానో వున్నట్లు అనిపించుట. శరీరమందలి ఏదో భాగం మీద కాలుతున్న బొగు వంటి పేడియో లేక మంచు గడ్డ వంటి చల్లని తనమో సోకినట్లు అనిపించుట. చర్మం మీద ఏదో పాకినట్లు, ఏదో కుట్టినట్లు, ఏదో పటుకు లాగినట్లు అనిపించుట. శరీరం ఆకాశంలో ఎగిరినట్లు లేక జలంలో ఈదినట్లు లేక నేల మీద ఆణిగినట్లు అనిపించుట. ఈ అనుభూతుల వంటి మరి కొన్ని అనుభవాలు కూడా సాధకులకు కొద్ది సెకండ్ల సేపు కలుగవచ్చు, అయినా ముఖ్య క్రియ నుంచి మనస్సు తొలగకూడదు.

లాభాలు :
ప్రతి వ్యక్తి ఎంతో మందిని కలుస్తూ వుంటారు. అలాగే యోగనిద్ర యందు ప్రతి వ్యక్తి తనని తానే కలుస్తాడన్నమాట. శరీరమందలి ప్రతి అవయవంతో పరిచయం ఏర్పడుతుందన్నమాట. యోగనిద్ర వల్ల, నిద్ర మంచిగా పడుతుంది. తద్వారా జ్ఞానం పెరుగుతుంది. మగతనిద్రకు అవకాశం లభించదు. సమయం వృధా కాదు. శరీరపు అలసట త్వరగా తగ్గిపోతుంది. నిద్రపోయే సమయం తగ్గినా శరీర అవయవాలన్నింటికి విశ్రాంతి లభించి అవి చురుగ్గా వుంటాయి. మానసికంగా, శారీరికంగా మనిషికి శాంతి, స్థిరత్వం లభించి, చంచలత్వం తొలిగిపోతుంది. ఇది అన్ని వయసులవారూ చేయొచ్చు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment