Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తిరుమల దివ్యక్షేత్రంలో భౌగోళికంగా ఏడుకొండల నిర్ధారణ - MegaMinds

తిరుమల దివ్యక్షేత్రంలో భౌగోళికంగా ఏడుకొండల నిర్ధారణ: ప్రాచీన గ్రంథాలు ఆధారంగా ఆధునిక సైన్సు, తర్కం జతచూస్తూ భౌగోళికంగా ఏడుకొండల...


తిరుమల దివ్యక్షేత్రంలో భౌగోళికంగా ఏడుకొండల నిర్ధారణ: ప్రాచీన గ్రంథాలు ఆధారంగా ఆధునిక సైన్సు, తర్కం జతచూస్తూ భౌగోళికంగా ఏడుకొండలను గుర్తించవచ్చు. సర్వే ఆఫ్ ఇండియా మ్యాప్లు (57/0/7/NW&NE) ఆధారంగా, తార్కికంగా ఏడుకొండలను ఈవిధంగా నిర్ధారించవచ్చు. జనసందేశ్ పత్రిక (25.6.2006)లో ఈ థీసెస్ ప్రకటించిన తర్వాత ఎవ్వరూ దీనిలో లోపాలు న్నాయని ఎత్తిచూపడంకాని, ప్రత్యామ్నాయ థీసెస్ ను ప్రతిపాదించడంకాని చేయలేదు ప్రభుత్వాలు మరియు టి.టి.డి. కనుక జనసందేశ్ పత్రిక ద్వారా ముఖ్యమైన వివరాలు, పరిదులు తెలియజేసే ప్రయత్నమే ఈ వ్యాసం.

1. తీర్థాలు ఆధారంగా ఏడుకొండల నిర్ణయం:

అంజనాద్రి: శ్రీవారి ఆలయానికి వాయవ్యంగా 1044 మీ. ఎత్తున బయలుదేరి ఉత్తరదిశగా సాగే జలధార (పాపవినాశనం నది) మీద వరుసగా ఈ క్రింది తీర్థాలున్నాయి.
జాబాలి తీర్థం - 911 మీ. ఎత్తు
ఆకాశగంగ తీర్థం - 823 మీ. ఎత్తు
పాపవినాశ తీర్థం - 610 మీ. ఎత్తు
సనకసనంద తీర్థం - 610 మీ. ఎత్తు

అంజనాదేవి సంతానం కొరకు ఆకాశగంగ తీర్థం దగ్గర తపస్సు చేసిందని, తత్ఫలితంగానే హనుమంతునికి జన్మయిచ్చిందని పురాణగాథ (భవిష్యోత్తరపురాణం). ఆమె తపస్సు చేసిన ఆ ప్రాంతానికి అంజనాద్రి అనే పేరు వచ్చిందని లోక ప్రతీతి.

వృషబాద్రి: పాపవినాశ తీర్థానికి పశ్చిమంగా (రెండు కిలోమీటర్లు) పుట్టిన మరొక జలధార ఈశాన్యంగా ప్రవహించి పాపవినాశ జలధారలో కలుస్తుంది. దీని మీద కూడా నాలుగు తీర్థాలున్నాయి.
పసుపు తీర్థం - 899 మీ. ఎత్తు
కుమారధార తీర్థం - 823 మీ. ఎత్తు
రామకృష్ణ తీర్థం - 686 మీ. ఎత్తు
తుంబుర తీర్థం - 686 మీ. ఎత్తు

తుంబురకోనలో వృషభాసురుడు తప్పస్సు చేశాడని, అతడిని విష్ణుమూర్తి సుదర్శన చక్రంతో వధించవలసి వచ్చిందని బ్రహ్మాండ పురాణం చెపుతున్నది. అప్పటి నుంచి తుంబురు తీర్థం ఉన్న పర్వతశ్రేణికి వృషభాద్రి అనే పేరు ప్రాచుర్యంలోకి వచ్చింది.

హైందవ సాంప్రదాయంలో ఉత్తర, ఈశాన్య దిశల్లో సాగే ప్రవాహాలను పవిత్రంగా భావించడం అందరికీ తెలిసిందే. కాశీ వద్ద గంగ ఉత్తరవాహిని. కాళహస్తి వద్ద స్వర్ణముఖి ఉత్తరవాహినే. శ్రీశైలం వద్ద కృష్ణ ఉత్తరవాహిని. ప్రతి దేవాలయంలోను గర్భగుడిలో నుంచి ఉత్తరం దిశగా నీటిని బయటకు పంపే వసతి కల్గించడం మనం గమనించవచ్చు. ఆలయాల్లో శివలింగం పానవట్టం వాలు కూడా ఉత్తరదిశలోనే వుంటుంది.

పాపవినాశ, తుంబరు జలధారలు ఉత్తర, ఈశాన్య దిశల్లో ప్రవహిస్తున్నాయి. కాబట్టి, వాటి మీద ఈ పవిత్ర తీర్థాలు వెలిశాయి.

తుంబురు, పాపవినాశ జలధారల సంగమం తర్వాత ప్రవాహానికి తుంబురుకోన అనే పేరు వాడుకలోకి వచ్చింది. తుంబురుకోన చుట్టుతిరిగి చివరగా స్వర్ణముఖిలో కలుస్తుంది.

శేషాచలం: స్వామివారి ఆలయానికి ఉత్తరాన 900 మీ. ఎత్తున పుట్టిన మరొక జలధార మీద గోగర్భం తీర్థం ఉంది. ఈ జలధార ఆగ్నేయంగా ప్రవహించి ఆ తర్వాత తూర్పుకు మళ్లుతుంది. అక్కడే వైకుంఠ తీర్థం ఉండేది.
గోగర్భ తీర్థం - 762 మీ. ఎత్తు
వైకుంఠ తీర్థం - 671 మీ. ఎత్తు

మరొక జలధార అదే ప్రాంతంలో (ఎత్తు 900 మీ.) పుట్టి తూర్పు దిశగా ప్రవహిస్తుంది. దీని మీద శేషతీర్థం (ఎత్తు 594 మీ.) ఉంది. ఇంకొక జలధార బాగా ఉత్తరం నుంచి బయలుదేరి ఆగ్నేయంగా ప్రవహిస్తుంది. దీనిమీద సీతమ్మ తీర్థం (762 మీ.) ఉంది.

ఈ మూడు జలధారలు కలిసిపోయిన తర్వాత ఆ ప్రవహాన్ని అవచారికోన అంటారు. అవచారికోన తూర్పుదిశగా ప్రవహించి స్వర్ణముఖిలో కలుస్తుంది. ఈ నాలుగు తీర్థాలు శ్రీవారి ఆలయానికి, ఈశాన్య, తూర్పు దిక్కుల్లో ఉన్నాయి. గోగర్భ-వైకుంఠ తీర్థాలను చుట్టుకొంటూ తూర్పుకు విస్తరించిన పర్వత శ్రేణిని శేషశైలంగా గుర్తించవచ్చు. శేషశైలం మీద ఉంది కాబట్టే ఒక ముఖ్య తీర్థానికి శేష తీర్థం పేరు వాడుకలో వచ్చి ఉంటుంది. శ్రీవారి ఆలయం శేషశైలం మీద ఉంది.

గరుడాద్రి: శ్రీవారి ఆలయ ప్రాంతానికి ఆగ్నేయంగా దక్షిణంగా విస్తరించిన పర్వతశ్రేణిని గరుడాద్రిగా భావించవచ్చు. గరుడాద్రి వనం, గురుడాద్రి కాటేజీలు ఉండేది ఇక్కడే. గరుడాద్రి నుంచి బయలుదేరే జలధారలు దక్షిణంవైపు ప్రవహిస్తున్నాయి. కాబట్టి ఈ కొండ మీద పుణ్య తీర్థాలు లేవు.

వేంకటాద్రి: శ్రీవారి మెట్టు ఉన్న పర్వత ప్రాంతం వెంకటాద్రిగా భావించవచ్చు.

నారాయణాద్రి: శ్రీవారి ఆలయానికి పశ్చిమాన నారాయణగిరి శిఖరం ఉంది. ఎత్తు 1102 మీ. తిరుమలలో ఇది ఎత్తైన శిఖరం. ఈ శిఖరం మీదనే శ్రీవారి పాదాలను భక్తులు పూజిస్తుంటారు.

నారాయణాద్రి నుంచి బయలుదేరే జలధారే అనుపుకోన, అది పశ్చిమంగా ప్రవహించి కళ్యాణి నదిలో కలుస్తుంది. ఆ విధంగా పశ్చిమాన నది వరకూ విస్తరించిన పర్వతశ్రేణులను నారాయణాద్రిగా భావించవచ్చు. నారాయణ వనం, అరుంధతీ వనం, నారాయణగిరి కాటేజీలు, వెంకటేశ్వర గెస్టుహౌస్ - ఇవన్నీ నారాయణాద్రి మీద ఉన్నాయి.

2. Allusive తర్కం ద్వారా ఏడుకొండల నిర్ణయం:

ఈ క్రింది నదీ సూక్తం రుగ్వేదంలోనిది :
ఇమంమే గంగే యమునే సరస్వతి శుతిద్రి స్తోమం సచతా పరుష్టయా ।
అసక్న్యి మరుద్ర్విథే వితస్తయార్జికీయే సృణుక్షా సుషోమయా ॥

ఈ సూక్తం రూపొందిన నాటికి ఆర్యులు ఉత్తర భారతదేశంలోనే ఉన్నారు. దక్షిణాపథానికి రాలేదు. అందువల్ల ఈ సూక్తంలో, నర్మద, గోదావరి, కృష్ణ, కావేరి నదుల ప్రస్తావన లేదు.

రుగ్వేదకాలం నాటి నదుల పేర్లు ఆ తర్వాత ఇలా మారాయి:

శుతిద్రి : సట్లెజ్
పరుష్టయ : రావి
అసికిని : చీనాబ్
మరిద్వ్రిథ : జీలం కలిసిన తరువాత చీనాబ్
వితస్త : జీలం
అర్జికీయ : (చిన్న ఉపనది)
సుషోమ : సింధు
(రాధాకుముద్ ముఖర్జీ : ది ఫండమెంటల్ యూనిటీ ఆఫ్ ఇండియా పేజీ: 96)

ఆ నదుల భౌగోళిక పొజిషన్ లను ఈ నదీసూక్తం నూటికి నూరుపాళ్లు వ్యక్తీకరించడం ఆశ్చర్య చకితులను చేస్తుంది. తూర్పున ఉన్న గంగానదితో ప్రారంభమైన ఈ స్తోత్రం పడమర - వాయవ్య దిశలలో నున్న సింధూనదితో పూర్తవుతున్నది. మిగిలిన నదులన్నీ వరుసక్రమం తప్పకుండా తూర్పు నుంచి పడమరకు ప్రయాణిస్తుంటే తారసపడతాయి. గంగకు పశ్చిమంగా యమున, యమునకు పశ్చిమంగా సట్లెజ్ (శుతిద్రి), సట్లెజ్ కు పశ్చిమంగా రావి (పరుష్ణయ), రావికి పశ్చిమంగా చీనాబ్ (అసికిని), చీనాబ్ కు పశ్చిమంగా జీలం (వితస్త), జీలంకు పశ్చిమంగా సింధు (సుషోమ) దర్శనమిస్తాయి. రుగ్వేదకారులు భౌగోళిక క్రమం మీద అపరిమితమైన శ్రద్ధ చూపించారు.

అయితే ఒకచోట మాత్రం సమస్య ఎదురవుతున్నది. యమునకు పశ్చిమంగా, సట్లెజ్ కు తూర్పున సరస్వతీ నదిని సూక్తంలో పేర్కొన్నారు కాని, భూమి మీద అలాంటి నది ఏదీ లేదు (అంతర్వాహిని).

శాటిలైటు టెక్నాలజీ అభివృద్ధి చెందిన తర్వాత, ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా భూమిలో ఇంకిపోయిన ఒక నదికి సంబంధించిన ఆనవాళ్లను గుర్తించడం జరిగింది. కనుమరుగైపోయిన ఈ నది హిమాలయాలలో బయలుదేరి హరియానా, రాజస్థాన్ల గుండా ప్రవహించేదని శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఇదే సరస్వతి నది. రుగ్వేదకారులు పొరబడలేదు. వారి భౌగోళిక పరిజ్ఞానంలో లోపం లేదు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల సరస్వతి నది భూమి పొరల్లోకి చేరిపోయింది.

ఇదేవిధమైన allusive తర్కం ద్వారా తిరుమల దివ్యక్షేత్రంలోని ఆరుకొండలను నిర్ధారించవచ్చు. ఎలా?

శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలోని ఈ క్రింది చరణాన్ని తీసుకొందాం: “శ్రీశేషశైల గరుడాచల వేంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రిముఖ్యాం"

భౌగోళికంగా ఈ స్తోత్రంలో పేర్కొన్న కొండలు ప్రదక్షిణ క్రమంలో (anti clockwise direction) ఉన్నాయని భావించవచ్చు. ప్రదక్షిణం తూర్పు నుంచి ప్రారంభమై వర్తులాకారంలో ఈశాన్యం వద్ద పూర్తవుతుంది. తూర్పున శేషశైలం, ఆ తర్వాత ప్రదక్షిణక్రమంలో గరుడాద్రి, వెంకటాద్రి, నారాయణాద్రి చెప్పబడ్డాయి. వృషభాద్రి ఉత్తరాన ఉన్నట్లుగా మొదటి భాగంలో విశ్లేషించబడింది. పోతే సుప్రభాతంలోని ఇంకొక కొండ మిగిలింది - వృషాద్రి. Allusive logic ద్వారా (సరస్వతీ నదిని గుర్తించినట్లుగా) వృషభాద్రి, శేషశైలముల మధ్యన ఈశాన్య దిశలోని పర్వతశ్రేణులే వృషాద్రిగా భావించవచ్చు. అంతేకాక శేషశైలం, గరుడాచలం, వెంకటాద్రి, నారాయణాద్రిలకు సంబంధించి మొదటిభాగంలో చేసిన విశ్లేషణతో ఈ తర్కం పూర్తిగా ఏకీభవిస్తున్నది.

3. తిరుమల చేరుకోడానికి ఈక్రింది ఆరు మార్గాలున్నాయి:

1) రాజంపేట రేణిగుంట రైలుమార్గంలోని మామండూరు స్టేషన్ నుంచి పాపవినాశనం రోడ్డును కలిపేమార్గం (ప్రస్తుతం ఆయుర్వేదవనం ఉన్న చోట) ఈ మార్గంలో ఒక ఫారెస్టు గెస్టుహౌస్ కూడా ఉంది..

2) కరకంబాడి రైల్వేస్టేషన్ (మామండూరు-రేణిగుంట మధ్యనున్న) నుంచి బయలుదేరి పాత ఘాట్ రోడ్డు లో కలిసే మార్గం, 18వ శతాబ్దంలో ముస్లింలు, ఆంగ్లేయులు తిరుమలను స్వాధీనం చేసుకోడానికి ఈ మార్గం గుండానే తమ సైన్యాలను నడిపించారు. భారత చరిత్రలో కైబరు కనుమ ఎటువంటిదో తిరుమల చరిత్రలో కరకంబాడి కనుమ అటువంటిది.

3) తిరుపతి - అలిపిరి మార్గం.

4) చంద్రగిరి - శ్రీవారి మెట్టు మీదుగానున్న మార్గం ఇది ఏనుగులు కొండమీదికి వెళ్లే మార్గం కూడా.

5) నాగపట్ల నుంచి కళ్యాణి రిజర్వాయర్ మీదుగా గుడప్పదోన కొండ, బాలసాలతిప్పల మధ్య గుండా మధ్వాచార్య పీఠం చేరుకొనే మార్గం.

6) తలకోన నుంచి అటవీ మార్గం.

చివరిగా తిరుమల పరిధి ఇది: ఈ విధంగా వివరించడిన ఏడుకొండలను, తిరుమలకు వెళ్లే అన్ని ఘాట్ రోడ్లు తిరుమల దివ్యక్షేత్రం పరిధి అవుతుంది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments