Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ది ఫ్యామిలీమ్యాన్‌ సీజన్‌ 2 లో చాలా చక్కగా లవ్ జీహాద్ గురించి చెప్పే ప్రయత్నం చేశారా? - MegaMinds

అమెజాన్ ప్రైమ్ లో జూన్ నాలుగో తారీకు రిలీజ్ అయిన ఫ్యామిలీ మాన్ రెండో సిరీస్ లవ్ జిహాద్ కేసును చక్కగా చూపెట్టారు. వివరాల్లోకి వె...

అమెజాన్ ప్రైమ్ లో జూన్ నాలుగో తారీకు రిలీజ్ అయిన ఫ్యామిలీ మాన్ రెండో సిరీస్ లవ్ జిహాద్ కేసును చక్కగా చూపెట్టారు. వివరాల్లోకి వెళితే అమెజాన్ ప్రైమ్ ఫ్యామిలీ మాన్ (Family Man Series ) సిరీస్ వన్ భారీ అంచనాల తర్వాత రిలీజైన రెండో సిరీస్లో సమంత ఒక ముఖ్య పాత్రలో  నటించడం వల్ల OTT  ప్రేక్షకుల్లో చాలా ఉత్కంఠ ఆసక్తి రేపింది.

శ్రీకాంత్ తివారీ గా నటించిన మనోజ్ బాజ్పాయ్ ప్రధాన పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. శ్రీకాంత్ - సుచిత్ర  ( ప్రియమణి) వాళ్ళ అమ్మాయి ధృతి యొక్క పాత్ర నేటి టీనేజ్ అమ్మాయిలకు, తల్లిదండ్రులకు ఒక మంచి గుణపాఠం అని చెప్పాలి.  ముఖ్యంగా తల్లిదండ్రులిద్దరూ వాళ్ళ వాళ్ళ ఉద్యోగాలు బిజీగా ఉండటం వల్ల పిల్లల మీద ఫోకస్ చేయలేని ఒక సగటు కుటుంబాన్ని చిత్రీకరించడంలో దర్శకుడు చాలా విజయవంతమయ్యారు.

ధృతికి సోషల్ మీడియా ద్వారా ఒక అబ్బాయితో పరిచయం, స్నేహంగా -  తెలిసీ తెలియని టీనేజ్ ప్రేమగా మారి ఈ అమ్మాయి జీవితాన్ని మారుస్తుంది. ఈరోజు సమాజంలో జరుగుతున్న ఎన్నో కేసులకు నిలువుటద్దం లాంటివి ఈ పాత్ర చుట్టూ జరిగే ఎన్నో సంఘటనలు.

సల్మాన్  తన నిజమైన పేరుని దాచిపెట్టి కళ్యాణ్ గా అమ్మాయితో పరిచయం పెంచుకొని ఆ అమ్మాయిని అడ్డుపెట్టుకొని, ఒక పద్మవ్యూహంలో బంధించి తీవ్రవాదులకు సహాయం చేస్తాడు.  
కథ మొత్తం ఈ సన్నివేశం తో ఒక మలుపు తిరుగుతోంది, 

ముఖ్యంగా ఈ సిరీస్ లో లవ్ జిహాద్ ఎంత పకడ్బందీ వ్యూహం తో చేస్తారో చూపించారు.
మొదటిగా ధృతి స్కూల్ బంక్ కొట్టి సల్మాన్ ( కళ్యాణ్ ) తో మాల్ కి,  సినిమాలకీ వెళుతూ ఉంటుంది ఒకసారి ఒక పాన్ డబ్బా దగ్గర సల్మాన్ ( కళ్యాణ్ ) బండి ఆపి సిగరెట్ తీసుకుంటాడు, పాన్ డబ్బా వాడు సల్మాన్ ని చూసి తన నిజమైన పేరు  “ సల్మాన్ అని పిలుస్తాడు“,  అప్పుడు ధృతికి అనుమానం వస్తుంది పాన్ వాడు నిన్ను సల్మాన్ అని పిలుస్తున్నాడు ఏంటి అని అడుగుతుంది,  అప్పుడు సల్మాన్ ( కళ్యాణ్ )  “స్మార్ట్ గా ఉన్న ప్రతి ఒక్కరిని సల్మాన్ అని పిలుస్తారు..” అంటూ మాట  మారుస్తాడు.

రెండోసారి ధృతి సల్మాన్ ( కళ్యాణ్ ) వాళ్ళ  Uncle వాళ్ళ ఇంటికి తీసుకువెళతాడు, అక్కడ ఉర్దూ లో ఉన్న కొన్ని చిత్రపటాలను చూసి ఏంటి  మీ Uncle  ముస్లిం అని అడుగుతుంది.  ఎంతో నేర్పుగా ఇది మా Uncle అద్దెకు ఉంటున్న అపార్ట్మెంట్ బహుశా అది ముందు అద్దెకు ఉన్న వాళ్ళవి కావచ్చు.. అని చెప్తాడు తడుముకోకుండా. 

నేటి సమాజంలో జరుగుతున్న ఎన్నో కేసులు, ఇలాంటి సన్నివేశాల తోనే మొదలవుతాయి. అది సినిమా కాబట్టి అక్కడ ధృతి  వాళ్ళ నాన్న పెద్ద పోలీస్ ఆఫీసర్ , కాపాడగలిగారు కానీ నిజ జీవితంలో కొన్ని వందల మంది ధృతిలాంటి  టీనేజ్ అమ్మాయిలు లవ్ జిహాద్ మహమ్మారికి ప్రతిరోజూ బలైపోతున్నారు. సమాజంలో జరిగే మంచి చెడు రెండూ మన పిల్లలకు  అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ముఖ్యంగా మన హిందూ తల్లిదండ్రుల మీద ఎంతైనా ఉంది.

ఆలోచించండి  ఇలాంటి ఎన్నో కేసులు బాహ్య ప్రపంచానికి తెలీక , మనం మన పిల్లలతో మాట్లాడక,  మీడియాలో బయటికి రాక,  కనీస అవగాహన లేక ఎంతోమంది అమాయకులు ప్రాణాలు  కోల్పోతున్నారు లేదు మనవే మన హిందూ ఆడబిడ్డలను చంపుకుంటున్నాము  కాదంటారా?

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments