Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

స్వాతంత్ర్యోద్యమంలో ఆర్ ఎస్ ఎస్ స్థాపకులు డాక్టర్ హెడ్గేవార్ పాత్ర - megaminds

కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. కానీ, హెడ్గేవార్ వ్యక్తిత్వ...



కేశవ్ బలిరామ్ హెడ్గేవార్ ప్రధానంగా ప్రపంచంలోనే అతిపెద్ద స్వచ్ఛంద సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ వ్యవస్థాపకులు. కానీ, హెడ్గేవార్ వ్యక్తిత్వానికి సంబంధించిన కొన్ని అంశాలు, స్వాతంత్రోద్యమంలో ఆయన పాత్రపై ప్రపంచానికి తెలియాల్సిన కొన్ని అంశాలున్నాయి. ఆయన చిన్న వయసులోనే స్వాతంత్ర్య ఉద్యమంలో చేరి, లోకమాన్య తిలక్ యొక్క జాతీయవాదానికి ఉత్తేజితులయ్యారు.

హెడ్గేవార్ నాగపూర్, యవత్ మల్, పూనాలో చదువుకున్నారు. 1910 లో మెడిసిన్ చదువుకోడానికి కలకత్తా వెళ్లేముందు స్వాతంత్ర్య సమర యోధుల సుప్రసిద్ధ సమూహమయిన ‘అనుశీలన సమితి’లో కూడా సభ్యుడయ్యారు. మే 1921లో, మహారాష్ట్రలో తన “ఉత్తేజ పూరితమైన” ప్రసంగాలకు గానూ “తిరుగుబాటు” ఆరోపణలపై హెడ్గేవార్ అరెస్టయ్యారు. ఈ కేసు విచారణను జూన్ 14, 1921 న ప్రారంభించారు. కొన్ని విచారణల తరువాత, ఆయన తన కేసును తానే స్వంతంగా వాదించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఆగస్టు 5, 1921న కోర్టులో హెడ్గేవార్ ఒక లిఖిత ప్రకటనను చదివారు. అది విన్న తర్వాత, జస్టిస్ స్మెల్లీ ఇలా అన్నాడు: “అతని వాదన అసలు ప్రసంగం కంటే కూడా చాలా తీవ్రంగా ఉంది.” ఆగస్టు 19న తీర్పులో, హెడ్గేవార్ ఒక సంవత్సరం పాటు ఉద్రేకపూరిత ప్రసంగాలు చేయనని వ్రాత పూర్వకంగా తెలియజేస్తూ, 3,000 రూపాయలపూచీకత్తును సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించాడు.

హెడ్గేవార్ ప్రతిస్పందన సంక్షిప్తంగా: “నేను పూర్తిగా అమాయకుడినని నా మనస్సాక్షి చెబుతోంది. ఈ అణచివేత విధానం ప్రభుత్వ దుర్మార్గపు విధానాల కారణంగా ఇప్పటికే రగులుతున్న అగ్నికి ఆజ్యం పోసేది మాత్రమే. విదేశీ పాలనకు, వారి పాపపు చర్యలకు ఫలితాలను పొందే రోజు ఎంతో దూరంలో లేదని నేను విశ్వసిస్తున్నాను. అంతర్యామియైన దేవుని న్యాయము మీద నాకు విశ్వాసము ఉంది. అందువల్ల బెయిల్ స్వీకరించడానికి నేను నిరాకరిస్తున్నాను. ”
”ఆయన ప్రత్యుత్తరం ముగించిన వెంటనే న్యాయమూర్తి ఆయనకు ఒక ఏడాది కఠిన కారాగార శిక్ష విధించారు. హెడ్గేవార్ కోర్టు వెలుపలకు వెళ్లి, అక్కడ గుమికూడిన పెద్ద ప్రజా సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. “మీకు తెలుసు, నాపై మోపబడిన కేసును నేనే వాదించుకున్నాను. అయితే, ఈ రోజుల్లో, కేసు మోపబడిన వారు కేసులో తమ వాదన వినిపించడం జాతీయోద్యమానికి ద్రోహం చేసే చర్య అని ఒక ముద్ర ఉంది. కానీ మన మీద కేసు పెట్టినప్పుడు కేవలం ఒక కీటకంలాగా నలిగిపోవడం చాలా అవివేకమని నేను భావిస్తాను. విదేశీ పాలకుల దుష్టత్వాన్ని యావత్ ప్రపంచానికీ బట్టబయలు చేయడం మన కర్తవ్యం. అది నిజ౦గా దేశభక్తి పూరితమైన చర్య. అలా కాకుండా మనల్ని మనం రక్షించుకోజూడడమంటే అది ఆత్మహత్యా సదృశమే అవుతుంది.

ఆయన ఇ౦కా ఇలా అన్నారు: “మీరు మీ తరపున కేసు వాదించుకోవడానికి నిరాకరి౦చవచ్చు. కానీ మీతో విభేదించే వారిని తక్కువ దేశభక్తులుగా భావించకండి. మన దేశభక్తి విధి నిర్వహణలో భాగంగా మనం కారాగారంలో వేయబడవచ్చు, లేదా అండమాన్ కు పంపబడవచ్చు లేదా ఉరి కూడా తీయబడవచ్చు. ఇవన్నీ మనం ఇష్టపూర్వకంగానే చేయాలి. కానీ, జైలుకి వెళ్ళడమే స్వేచ్ఛ సాధించడానికి మార్గం అని కొందరు భ్రమ పడుతున్నారు. నిజానికి, జాతి సేవకై అనేక సంస్థలు జైలు వెలుపల పనిచేస్తున్నాయి. అవి మన వంటి వారి కోసం ఎదురు చూస్తున్నాయి. ఒక సంవత్సరం తరువాత నేను మీ మధ్య తిరిగి ఉంటాను. అప్పటి వరకు నేను జాతీయాభివృద్ధిలో పాలు పంచుకోలేను. అప్పటికి ‘ సంపూర్ణ స్వాతంత్ర్యం ‘ కోసం జరుగుతున్న ఈ ఉద్యమం రెట్టింపు వేగం పుంజుకుంటుందని నా విశ్వాసం. హిందూస్థాన్ విదేశీ ఆధిపత్యంలో నలిగిపోవడం ఇక ఏమాత్రమూ జరక్కూడదు. మీ అందరికీ నా కృతజ్ఞతలు. శలవ్.”

ఆగస్టు 19, 1921 శుక్రవారం ఆయనను ‘అజని’ జైలుకు తరలించారు. ఆ సాయంత్రమే ఆయనకు ప్రశంసలందించటానికి ఒక బహిరంగసభను ఏర్పాటు చేయబడింది. బారిష్టర్ గోవిందరావు దేశ్ ముఖ్ అధ్యక్షతన జరిగిన ఈ సభకు, ఉపన్యాసకులు బిఎస్ మూంఝే, నారాయణరావు హర్కరే, విశ్వనాథ రావు కేల్కర్. అందరూ హెడ్గేవార్ గురించి ఆప్యాయంగా మాట్లాడారు. ఆయన జూలై 1922 లో విడుదలవగా, అదే రోజు సాయంత్రం ఆయన కోసం ఒక బహిరంగ సభ నిర్వహించబడింది. ఆ సభలో కాంగ్రెస్ సీనియర్ నేత మోతీలాల్ నెహ్రూ, హకిం అజ్మల్ ఖాన్ లు ప్రసంగించారు.

సంప్రాన స్వత్రంత్ర్య (సంపూర్ణ స్వాతంత్ర్యం) తన లక్ష్యమని కాంగ్రెస్ ఒక తీర్మానాన్ని ప్రతిపాదించినప్పుడు, డాక్టర్ హెడ్గేవార్ స్వయంసేవకులకు ఇలా ఉత్తరం వ్రాశారు: “ఈ ఏడాది కాంగ్రెస్ సంపూర్ణ స్వాతంత్ర్యం తమ లక్ష్యమని ప్రకటిస్తూ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. 1930 జనవరి 26వ తేదీని స్వాతంత్ర్య దినోత్సవంగా జరుపుకోవాలని కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యావత్ జాతికి పిలుపునిచ్చింది. సంపూర్ణ స్వాతంత్ర్య సాధన అనే మన లక్ష్యాన్ని అఖిల భారత కాంగ్రెస్ కూడా ప్రకటించడం మనకు సహజంగానే సంతోషం కలిగించే విషయం. ఆ లక్ష్యం దిశగా పనిచేసే ఏ సంస్థకైనా సహకరించడమే మన కర్తవ్యం. అందుచేత 26 జనవరి 1930 ఆదివారం నాడు సాయంత్రం 6 గంటలకు అన్ని శాఖల స్వయంసేవక్ లు, ఆయా సంఘస్థాన్లలో కలుసుకోవాలి. అన్ని శాఖలలో ధ్వజ ప్రణామ్ పూర్తయిన తర్వాత, స్వయంసేవకులకు సంపూర్ణ స్వాతంత్ర్యం యొక్క ఆవశ్యకతను వివరించాలి. సంపూర్ణ స్వాతంత్ర్యమనే ఆకాంక్షను లక్ష్యంగా, ఆదర్శంగా స్వీకరించినందుకు కాంగ్రెస్ కు అభినందనలు తెలుపుతూ ఆ కార్యక్రమం ముగియాలి. ” అన్నది డాక్టర్ హెడ్గేవార్ శాఖలకు పంపిన ఉత్తరం యొక్క సారాంశం.

ఈ సూచన ఫలితంగా దేశంలోని అన్నిఆర్ఎస్ఎస్ శాఖలలో స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకున్నారు.. మహారాష్ట్రలోని యవత్ మాల్ వద్ద సత్యాగ్రహ ఉద్యమానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ హెడ్గేవార్ మళ్లీ జైలుపాలయ్యారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన ఆయనకు ఆరు నెలల కఠిన కారాగార శిక్ష, మూడు నెలల సాధారణ కారాగార శిక్ష (జూలై 1930 నుంచి ఫిబ్రవరి 1931) పడింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments