Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

యోగము అంటే ఏమిటి - అంతర్జాతీయ యోగా దినోత్సవం - About Yoga In Telugu

'యోగము' అంటే ఏమిటి?: యోగ శబ్దము సంస్కృతములోని 'యుజ' అను ధాతువు నుండి వచ్చినది దీని అర్ధము 'జోడించుట' లే...

'యోగము' అంటే ఏమిటి?: యోగ శబ్దము సంస్కృతములోని 'యుజ' అను ధాతువు నుండి వచ్చినది దీని అర్ధము 'జోడించుట' లేదా 'కలుపుట', అనగా జీవాత్మ పరమాత్మలో కలియుట. వ్యవహారిక జీవితములో వ్యక్తిని అధికాధిక ఉన్నతునిగా చేయుటకు పై ప్రయాసలన్ని ఉపకరిస్తాయి. గీతలో “యోగ: కర్మసు - కౌశలమ్" అని చెప్పబడింది. అనగా ఏ పనినైనా కౌశలంలో నిర్వహించుటయే యోగము అందురు. మనస్సు - ఏకాగ్రత, సంతులనం కలిగి ఉండి శరీరము ఆరోగ్యకరముగా ఉన్నప్పుడే ఇది సంభవమగునని స్పష్టము. అందుచేత యోగము నందు ఈ రెంటిని ఆరోగ్యకరముగా ఉంచు మార్గమును మనము చూడగలము.

యోగము భారతీయ షడ్దర్శనములలో ఒకటి. దీనికి మూల పురుషుడు మునిప్రవరుడైన పతంజలి. ఈ అలౌకిక ప్రతిభా సంపన్నుడైన వ్యక్తి ఒకేసారి యోగము, వ్యాకరణము మరియు ఆరోగ్యము అను మూడు విషయములపై గ్రంధములను రచించి సంపూర్ణ మానవాళికి ఉపకారం చేశారు. 

యోగేన చిత్తస్య, పదేన వాచ, మలం శరీరస్యచ వైద్యకేన యో2సా కరోత్ తం ప్రవరం మునీనాం పతంజలి ప్రాంజలిరాన తోస్మి"

అనగా యోగము చే చిత్తమాలిన్యము, వ్యాకరణములతో భాష మరియు శబ్ద మాలిన్యములను (అనగా దోషములను) మరియు వైద్యశాస్త్రము ద్వారా శరీర మాలిన్యములను దూరము చేయగల పతంజలి మునికి నమస్కరిస్తున్నాను అని అర్థము.

పతంజలి యోగ శాస్త్రానుసారముగా, చిత్త వృత్తుల యొక్క నిరోధము లేదా నియంత్రణ యే యోగము. అనగా మన చిత్త వృత్తులను క్రమముగా స్థిరము మరియు ఏకాగ్ర మొనరించి మనస్సు యొక్క నిఃస్పందావస్థను పొందు సోపానముల వర్ణన అందులో కలదు. ఈ యోగము అష్టాంగయుక్తము. అవి యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణా, ధ్యానము మరియు సమాధి. యమము నందు మనస్సుకు సంబంధించిన సంయమము అనగా సత్యము, అహింస, ఆస్తేయము, అపరిగ్రహము మరియు బ్రహ్మచర్యము... ఈ గుణములు సమావిష్ణమవుతాయి. నియమంలో శారీరక సంయమము మరియు శౌచము, సంతోషము, తపస్సు, స్వాధ్యాయము మరియు ఈశ్వర ప్రణిధానము అంతర్భూతమవుతాయి.

విభిన్న పద్ధతులలో శారీరక కదలిక ద్వారా శరీరము పై నియంత్రణ పొందుతూ దానిని అధిక ఆరోగ్యకరముగా మరియు బలిష్టముగా చేయుటను ఆసనములందురు. ఈ విధమైన ఆరోగ్యకరమైన శరీరము ద్వారానే మానసిక ఆరోగ్యము లభిస్తుంది. ఉచ్ఛ్వాస నిశ్వాసల పైన నియంత్రణ ప్రాణాయామము యొక్క క్షేత్రం. ప్రత్యాహారము నందు ఇంద్రియములను బాహ్య విషయముల నుండి మార్చి అంతర్ముఖ మగునట్లు చేయును. ధారణలో దీనిని క్రమముగా ఎక్కువగా ఏకాగ్ర మొనరింపవచ్చును. ధ్యానము ధారణ కన్న ఉన్నతాశస్థ. ఇందులో ఒకే వస్తు విషయము పట్ల మనస్సును ఏకాగ్ర మొనరింతురు. ఎక్కడైతే చిత్తవృత్తులు సంపూర్ణముగా లోపించి, మనస్సు స్థిరముగా తైలజ్యోతి వలె నిఃస్పందావస్థను చేరుకొని, ఎక్కడైతే తాను వస్తు విషయములో సంపూర్ణ తాదాత్మ్యతను చెందునో అది సమాధి స్థితి అనబడును. దీనిని పొందుటకు యోగిజనులు ప్రయత్నశీలురగుదురు.

యోగ సంబంధించిన అనుమానాలు :
యోగము కేవలము ఋషి, మునుల కొరకు లేదా అడవులలో తపస్సు చేసే వారికి గానీ సామాన్య జనులకు కాదను ఆలోచన అనేక స్థలములలో కనిపిస్తున్నది. వాస్తవముగా ఇది భ్రాంతియే. ఏ వ్యక్తి అయినా దీనిని పాటించి దీనిచే లాభము పొందవచ్చును. కొద్ది మార్గదర్శనంలోనే యోగాభ్యాసము ప్రారంభించవచ్చును. అయితే సరైన మార్గదర్శనం లభించిన తక్కువ సమయంలోనే వ్యక్తులు ఎక్కువ ఉన్నతి సాధించవచ్చుననడంలో అనుమానంలేదు.

ఆరోగ్యవంతులు మాత్రమే యోగ సాధన చేయగల్గుతారను కోవడం కూడా సరైన ఆలోచన కాదు. చక్కని ఆరోగ్యవంతమైన శరీరం కొరకు యోగము రామబాణం లాంటి ఔషధము. మరియు పరిపూర్ణ వ్యాయామము కూడా. ప్రత్యాహారము, ధారణ, ధ్యానము మొదలగు పైమెట్లు వదిలిననూ కేవలం ఆసనముల ద్వారానే వ్యక్తి ఉత్కృష్ట శారీరక సామర్ధ్యమును పొందగలడు.

బాలుడు, యువకుడు, వృద్ధుడు, రోగి - ఇలా అందరు యోగాభ్యాసం చేసి లాభం పొందవచ్చునని ఈ క్రింది శ్లోకం తెలుపుతున్నది.

యువా, వృద్ధాతి వృద్ధావా వ్యాధితో దుర్భలోపి వా
అభ్యాసాతో సిద్ధిమాప్నోతి సర్వ యోగేశ తన్దితః॥

యోగము వలన లాభములు :
యోగ అభ్యాసముచే వ్యక్తి యొక్క శరీరము బలముగా, సుదృఢముగా మరియు నిరామయమగును. అతని బుద్ధి యొక్క ప్రఖరతలో, తీక్షణతలో వృద్ధి ఉంటుంది. వ్యక్తి దీర్ఘాయుడై జీవితంలో ఉత్సాహాన్ని అనుభవిస్తాడు.

లాఘువం కర్మ సామర్థ్యం, దీప్తిన్ని : మేదసఃఒక్షయః॥
విభక్త గణ గాత్రత్వం, వ్యాయామాత్ ఉపజాయతే॥ 

యమ నియమాది పాలనకై మనుష్యునిలో శారీరక బలము అవసరము. అనగా జీవశక్తి కొరకు యోగము సహాయకమవుతుంది. మహర్షి అరవిందులు చెప్పినట్లుగా శారీరక, మానసిక, భౌద్దిక, నైతిక మరియు ఆధ్యాత్మిక మొ|| లగు అన్ని విధముల ఉన్నతి కొరకై అనగా వ్యక్తి యొక్క సంపూర్ణ సర్వాంగీణ వికాసానికి యోగము మిక్కిలి లాభదాయకము.

యోగాసనములు: యోగాసనము ద్వారా శరీరములో ఆశ్చర్యజనకమగు మార్పులు రావచ్చును. మరియు శరీరభాగముల యొక్క అప్రయత్న క్రియ (Involuntary Function]లలో అపేక్షంచిన మార్పును కలిగించుకోవచ్చును. ఈ పరిణామము నిర్ణీత గ్రంధుల [Endocrine Glands] లోని స్రావముల [Hormones] ద్వారా జరుగును. యోగాసనముల ద్వారా పిట్యుటరీ మరియు థైరాయిడ్ మొదలగు విభిన్న నిర్ణాళ గ్రంధుల యొక్క హార్మోనులపై పరిణామము కలిగించి, వాటి యందు ఆవశ్యకముగు సంతులనమును నిర్మాణము చేయవచ్చును.

ప్రాణుల యొక్క ఆయువు వాటి శ్వాసక్రియతో మిక్కిలి దగ్గరి సంబంధం కలిగి యున్నది. మనిషి నిముషమునకు సరాసరి 18 నుండి 20 సార్లు శ్వాస తీసుకొనును. కుందేలులో ఇదే గతి 50 నుండి 60 వరకు ఉండును. దాని ఆయువు తులనాత్మకంగా చూసినచో చాలా తక్కువ ఉండును. గుఱ్ఱము, మేక మొ|| లగు ప్రాణుల ఆయువు రమారమి 15 నుండి 20 సం॥రాల వరకు ఉండును. వీటి శ్వాస నిశ్వాసల క్రియా వేగము నిముషమునకు సరాసరి 30 నుండి 40 వరకు - ఉండును. తాబేలు నిముషమునకు కేవలము 3 లేదా 4 సార్లు శ్వాస తీసుకొనును. దాని ఆయువు చాలా ఎక్కువ. సుమారుగా 300 సం॥రాల వరకు ఉండును. కనుక, మనిషి యొక్క శ్వాసక్రియ గతిని తగ్గించినచో ఆయువును పెంచడం సంభవమే. శ్వాసక్రియ గతిని తగ్గించడం ద్వారా మనుష్యుని కదలికలు అధిక నిర్భయముగా, సహజ సుందరముగా కనిపించును.

ఉచ్ఛ్వాస నిశ్వాసల నియంత్రణ యందు ప్రాణాయాయము తొలిమెట్టు. వాస్తవిక చైతన్య ప్రాణమునకు ప్రాణవాయువు లేదా శ్వాస, బాహ్య వ్యక్తీకరణ మాత్రమే. ఈ ప్రాణాయామము ద్వారా మనిషి ఉత్సాహపూరితమైన, చైతన్యవంతమైన దీర్ఘజీవనమును పొందగలడు. 

యోగాసనములు చేయుట ద్వారా రక్తప్రసరణ ప్రక్రియలో అపేక్షిత మార్పులు సంభవించగలవు. ఉదాహరణకు వజ్రాసనము వేయుట ద్వారా నడుము క్రింది | భాగమున రక్తప్రసరణము తగ్గి పైభాగమున పెరగగలదు.

యోగసనముల ద్వారా కండరముల యందు కూడా యోగ్యమగు మార్పులు రాగలవు. కండరముల యొక్క నిర్మాణము చెరుకు గడలోని పీచు (Fibrous) వలె నముల ద్వారా ఉండును. వీటి సంఖ్య పెంచకుండా శక్తిని పెంచుకొని మరియు అనవసరంగా ఉన్న శరీరంలోని బిగువు [Tension]ను తొలగించు కార్యము యోగ సఫలము కాగలదు.

ఆసనము సామూహిక స్వరూపమే సూర్య నమస్కారములు. కాబట్టి  ఆసనముల గూర్చి చెప్పబడిన విషయములన్నీ వాటికి కూడా వర్తించును. వీటికి తోడు సూర్యనమస్కారములలో ఉపాసన యొక్క అంశం కూడా జోడింపబడినది. దీని ద్వారా మనుష్యునకు మానసిక సంతోషము, స్థిరత్వము లభించును.

ఈ విధముగా యోగాసనములు మరియు సూర్య నమస్కారముల ద్వారా మనిషి శారీరక, మానసిక వ్యాధుల నుండి ముక్తి పొంది, రోగరహితావస్థను పొందవచ్చును.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments