శిథిలీకరణ వ్యాయామం, సూక్ష్మవ్యాయామం: ప్రతిరోజూ యోగాసనాలు లేదా సూర్యనమస్కారాలు చేసే ముందు ఈ సూక్షవ్యాయామం లేదా శిథిలీకరణ వ్యాయామం చేయాలి ఎందుకంటే మన శరీరం ఈ చిన్న చిన్న వ్యాయామం చేయడం వలన తరువాత చేసే ఆసనాలకు లేదా సూర్యనమస్కారాలు చాలా తేలికగా చేయవచ్చు....
చక్కగా నిలబడి, పిడికిళ్లు గుండెలపై ఉంచండి. నెమ్మదిగా మీ మడమలు పిరుదులు తాకే విధంగా జాగింగ్ చేయండి. నెమ్మదిగా వేగం పెంచుతూ ఒక స్థిరమైన వేగంతో అలాగే జాగింగ్ చేయండి. మీ కదలికల కనుగుణంగా ఉచ్ఛాస నిశ్వాసాలను తీస్తూ... శరీరానికి విశ్రాంతినిస్తూ కొంతసేపు అలాగే జాగింగ్ చేయండి. నెమ్మదిగా మీ మోకాళ్లు గుండెల వైపు వచ్చేట్లు జాగింగును మార్చండి. పైవిధంగా కొంతసేపు కొనసాగించండి. ఇప్పుడు కాళ్లు పక్కలకు మారుస్తూ, మోకాళ్లు వంచి కొంతసేపు అలాగే చేయండి. ఆ తరువాత, కొంతసేపు నిలబడి విశ్రాంతి తీసుకోండి.
కాళ్ళు, కాలి మడమలు వదులుచేయండి, మీ శరీరం బ్యాలెన్స్ అంతా కాలి వేళ్ళపై ఉంచుతూ పాదాలను పైకి లేపండి... ఈ ప్రక్రియ అంతా శ్వాస పీలుస్తూ, వదులుతూ చేయండి...
మోకాలి కీళ్లు వదులు చేయండి, తుంటి కీళ్లు వదులు చేయండి, అలాగే పాద సంచాలన అంటే కాళ్ళు మోకాలి దగ్గత వంచకుండా రెండు కాళ్ళూ మారుస్తూ పైకీ క్రిందకు శ్వాస పీలుస్తూ, వదులుతూ చేయండి...
నడుము ముందుకీ వెనక్కీ వంచడం, పక్కకి వంగడం, నడుముని తిప్పడం అలాగే బుజాలని కదిలించడం చేయండి. మెడ వదులు చేయడం, కుడి, ఎడమవైపు లకి మెడ తిప్పడం, ఇవన్నీ నిదానంగా చేయాలి, శ్వాస పీలుస్తూ, వదులుతూ చేయాలి...
చివరిగా శ్వాస వ్యాయామం చేసిన తరువాత మీరు చేయాలనుకున్న ఆసనాలు, సూర్యనమస్కారాలు చేసుకోవచ్చు అప్పుడు చాలా తేలికగా మీరు యోగాసాధన చేయవచ్చు....
శ్వాస వ్యాయామం: శ్వాసకు సంబంధించిన వ్యాయామం 'యోగ' ప్రారంభించటానికి ముందుగా చేయటం వల్ల శ్వాసక్రియ నెమ్మదించి గాఢమైన విశ్రాంతిని కలుగచేస్తుంది. శరీరంలోని వివిధ భాగాల కదలిక వల్లా శ్వాసకు సంబంధించిన విషయాలు తెలుసుకో గలుగుతారు. కళ్లు మూసుకుని ఈ వ్యాయామం చేస్తూ మీలోని శక్తులను పరిశీలించండి. శ్వాసను లోనికి తీసుకుకునేదానికన్నా ఎక్కువసేపు శ్వాసను బయటికి విడవండి. శరీర కదలికలనూ శ్వాసక్రియనూ ఒకే "శృతి"లో చేయండి. శ్వాసక్రియ నెమ్మదిస్తూ మీరెంత విశ్రాంతి పొందుతారో గమనించండి.
ప్రత్యేక సూచనలు : చేతులు, కడుపు కండరాలు, గొంతు కండరాలు కదలికలపై ప్రత్యేక శ్రద్ధ ఉంచండి. కదలికలను క్రమబద్దీకరించండి. ఉచ్ఛ్వాస నిశ్వాసాల కదలికలకు సంబంధించిన నియమాలను బిగ్గరగా చెప్పండి. మీ శరీర కదలికలకూ, శ్వాసక్రియను అనుసంధానించండి... సాధన చేస్తూ... కళ్లు మూసుకుని అభివృద్ధిని గమనించండి.
a) చేతులు లోనికి బయటికీ చాస్తూ శ్వాసించటం
• చక్కగా నిలబడండి. చేతులు ముందుకు చాచి, వేళ్లు నేరుగా ఉంచి, అరచేతులు రెండూ దగ్గర చేయండి.
• విశ్వాసను తీస్తూ చేతులను వెనక్కు తీసుకురండి. ఎంతవరకు వీలయితే అంతవరకు, రొమ్ము విశాలంగా సాగేవరకు చేతులను ఈలాగే చాపి ఉంచండి.
• పూర్తిగా శ్వాసను విడుస్తూ... చేతులను తిరిగి పూర్వస్థానానికి తీసుకురండి. పదిసార్లు ఇలా చేయండి.
b) చేతులు సాగదీస్తూ శ్వాసించటం
• మీ అరచేతులు లోపలివైపు ఉండేటట్లు రెండు చేతివేళ్లు కలిపి చేతుల్ని మీ గుండెలదగ్గర ఉంచండి.
• నెమ్మదిగా శ్వాసలోనికి తీస్తూ... అరచేతుల్ని బయటికి తిప్పుతూ చేతుల్ని బయటికి ఉండాలి. చాచండి. అరచేతులు వెలుపలివైపు
• శ్వాసను విడుస్తూ అరచేతులను గుండెలపై ఉంచి రిలాక్స్ అవ్వండి. 10 సార్లు ఇలా చేయండి.
• ఇదేవిధంగా 45° కోణంలో (కుడి, ఎడమలకి) పైకీ చేయండి.
c) మడమలను సాగదీసే శ్వాసక్రియ
• నిటారుగా నిలబడండి, అరచేతులు కిందకు చాచి ఉంచండి.
• శ్వాస తీస్తూ.. చేతులు పైకి లేపుతూ మునివేళ్లపైన నిలబడండి. (రెండు చేతివేళ్లను కలిపి, అరచేతులు ఆకాశంవైపు ఉంచి చేతులు పైకి చాచి ఉంచండి.)
• శ్వాస విడుస్తూ. చేతుల్ని నెమ్మదిగా మామూలుగా తీసుకురండి. ఇపుడు పాదాలపై నిలబడండి. ఇలా 5 సార్లు చేయండి.
International Yoga Day 2025, Yoga Day 2025, World Yoga Day 2025, Yoga Day theme 2025, Yoga Day date 2025, Yoga Day 2025 celebration, Yoga Day 2025 activities, Yoga Day 2025 speech, Yoga Day 2025 essay, Why is June 21 yoga day?, ఎందుకు జూన్ 21 యోగా రోజు?