Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

తాడాసన్, అర్థకటి చక్రాసన్, అర్దచక్రాసన్ యోగాసనాలు నేర్చుకుందాం - megaminds

తాడాసన్: స్థితి: తిన్నగా నిలబడి. మడమలు దగ్గరగా ఉంచి, వేళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు, కిందికి జార్చి విశ్రాంతిగ...


తాడాసన్: స్థితి: తిన్నగా నిలబడి. మడమలు దగ్గరగా ఉంచి, వేళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు, కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి. మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూ ఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.

తాడాసన్

క) స్థితి నుండి శ్వాస పీలుస్తూ రెండు చేతులు భుజాలకు సమానంగా ప్రక్కలకు, శ్వాస వదలాలి.
ఖ) శ్వాస పీలుస్తూ, చేతులు తలపైకి తీసుకొని వెళ్ళి అరచేతులు కలపాలి. రెండు చేతులు మొత్తం శరీరాన్ని పైకి లాగాలి. దృష్టి అర చేతులవైపు
గ) శ్వాస వదులుతూ 'క' స్థితిలోకి రావాలి శ్వాస పీల్చాలి.
ఘ) శ్వాస వదులుతూ స్థితి.

ఫలితములు: రెండు కాళ్ళ మడిమలు మరియు పంజాలపైన సమాన భారం ఉంచి నిలబడడంతో అనేక ప్రయోజనాలున్నాయి. అవన్ని ఈ ఆసనంలో లభిస్తాయి. తాడాసన్లో పిరుదులను బిగించి, పొట్టను లోపలికి లాగడం వలన శరీరం తేలిక అవుతుంది. మానసిక ఉల్లాసం కలుగుతుంది. శరీరం మొత్తాన్ని పైకి లాగడం వలన వెన్నెముక శక్తివంతం అవుతుంది. ఎత్తు పెరిగే అవకాశం ఉంది.

అర్థకటి చక్రాసన్:
అర్ధ-సగం, కటి-నడుము, చక్ర-చక్రము. ఈ ఆసనం పూర్తయినపుడు, శరీరం నడుంవద్ద 'సగంచక్రం' లాగా ఉంటుంది.
స్థితి: తిన్నగా నిలబడి. మడమలు దగ్గరగా ఉంచి, వేళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలిపీల్చి భుజాలు. కిందికి జార్చి విశ్రాంతిగా నిలబ డండి. మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూ ఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.
అర్థకటి చక్రాసన్

ఒకటి: కుడిచేతిని నెమ్మదిగా పైకి లేపండి. భుజం చెవిని తాకాలి. అరచేయి ఎడమవైపు తిరిగి చూస్తూ ఉండాలి. శ్వాసలోనికి తీసుకోండి.
రెండు: నెమ్మదిగా నడుము భాగం వంచుతూ ఎడమవైపుకు వంగండి. ఎడమచేయి ఎడమకాలు పైన కిందకు ఎంత వీలయితే అంత కిందకు తీసుకు వస్తూ... శ్వాసను వదలండి.
మూడు: నెమ్మదిగా శ్వాస లోనికి తీస్తూ నిటారుగా రండి. కుడిభుజం చెవికి తాకిస్తూ చేయిని నిటారుగ పైకి ఉంచండి.
నాలుగు: కుడి చేతిని కిందకు "స్థితి"కి తీసుకువస్తూ శ్వాస విడిచిపెట్టాలి.. ఇలాగే ఎడమచేయితో కూడా చేయండి.

లాభాలు:
వెన్నెముక సాగుతుంది.
రక్తప్రసరణ పెరుగుతుంది.
తుంటి కీళ్లు బలపడుతాయి.
ఊపిరితిత్తుల శక్తి పెరుగుతుంది.
నడుము చుట్టూ చేరిన కొవ్వు కరుగుతుంది.
వెన్ను నొప్పి పోతుంది. మలబద్దకం పోతుంది.
మెడ కండరాలకు చాలా మంచిది. విశ్రాంతి కల్గిన భావన కలుగుతుంది.

ముఖ్యాంశాలు:
1.పైకెత్తిన చేతులు నిటారుగా ఉండాలి..
2. ఖచ్చితంగా నడుముభాగం మాత్రమే వంచాలి..
3. కాళ్లు చక్కగా ఉంచాలి..
4. రెండో చేయి కాలితోపాటు కిందకు రావాలి..

శ్వాస: క్రిందకు వొంగే ప్రతిసారి శ్వాసను విడవండి. పైకి లేచేటప్పుడు శ్వాస తీసుకోండి. చివరిస్థాయిలో శ్వాస సాధారణంగా ఉండాలి.


అర్దచక్రాసన్:
అర్ధ-సగ, చక్ర-చక్రం. చివరి స్థితిలో "సగం చక్రం’ లాగా ఉంటుందీ ఆసనం.

స్థితి: చక్కగా నిలబడి, కాళ్ల మడమలు దగ్గరగా ఉంచి, వేళ్ళు కొంచెం దూరంగా ఉంచండి. గుండెలనిండా గాలి పిల్చి భుజాలు కిందికి జార్చి విశ్రాంతిగా నిలబడండి. మెడ నిటారుగా ఉండాలి. వేళ్లు నేలను చూస్తూ... అరచేతులు తొడలను తాకుతూఉండాలి. ముఖం ప్రశాంతంగా ఉండాలి.
అర్దచక్రాసన్

ఒకటి: శ్వాస బయటికి తీస్తూ అరచేతులను నడుముపై ఉంచండి...
రెండు: శ్వాసలోనికి తీస్తూ... నడుము పైభాగాన్ని వెనక్కి వంచండి. మెడ కండరాలు సాగతీస్తూ... మెడను కూడా వెనక్కి వంచండి. ఇలా చివరిస్థితికి చేరిన తరువాత సాధారణంగా శ్వాసించండి.
మూడు: నడుముపై చేతులు ఉంచి, శ్వాస తీస్తూ... నిటారుగా రండి.
నాలుగు: శ్వాస బయటికి విడుస్తూ... చేతులు నడుముపై నుంచీ తీసివేయాలి.

లాభాలు: భుజం కండరాలు, వెన్నెముక కండరాలు గట్టి పడతాయి. రొమ్ముకు, మెదడులో రక్తప్రసరణం పెరుగుతుంది. వెన్ను గట్టిపడుతుంది. శ్వాసకోశాల పనితనంకూడా వృద్ధి చెందుతుంది. తుంటినొప్పి, ఆస్మాను నివారించగలదు. తొడ కండరాలకు విశ్రాంతినిస్తుంది. స్థిరత్వాన్ని, ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తుంది.

సూచన: ఉద్రేకాలు, గుండె జబ్బులు కలవాళ్లు చాలా నెమ్మదిగా చేయాలి. సన్నగా, పొడుగ్గా ఉన్నవాళ్లు కాళ్లు ఎడంగా ఉంచి పడిపోకుండా నిలబడి ఈ ఆసనం వేయాలి.
ముఖ్యాంశాలు: కాళ్లు చక్కగా, నిటారుగా ఉంచి, పాదాలవేళ్లు కలిపి ఉంచి ముందుకు సాగి ఉండాలి.
శ్వాస: వెనక వంగినప్పుడు పైకి లేచేటప్పుడు శ్వాస తీయాలి. చివరిస్థితిలో సాధారణశ్వాస తీయాలి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments