గంటం దొర ఎలా చంపబడ్డాడు - megaminds

0
1924 సంవత్సరం జూన్ 7వ తేదీ "గామ్ గంటందొర"... ఆంగ్లేయులతో పోరాటం చేస్తూ చేస్తూ  వీర మరణం పొందిన రోజు. గంటందొర పెద్దభార్యను ఆంగ్లేయులు హత్యచేయగా, చిన్న భార్య యుద్ధంలో క్షతగాత్రురాలైనందున అడవిలోకి తీసుకెళ్తుండగా... తనతోపాటు ఉన్న అనేకమంది ఆంగ్లేయుల బుల్లెట్ల తాకిడికి కుప్పకూలుతుండగా.. పోరాటం నుండి  మడమతిప్పని యోధుడుగా నిలబడి ఆంగ్లేయులననేకులను హతమార్చి తానూ బలిదానమయ్యారు... 

భారత దేశ స్వాతంత్ర్యం కోసం తన కుటుంబాన్ని, కుటుంబ సభ్యులందరినీ.., తన సర్వస్వాన్ని, చివరికి తన ప్రాణాన్ని కూడా సమర్పించిన వీర యోధులు గంటందొర వారి చరణాలకు ప్రణమిల్లుతూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.

అల్లూరి సీతారామరాజు గారు మే 7వ తేదీ ఆంగ్లేయులతో జరిగిన ప్రత్యక్ష పోరాటంలో వీరమరణం పాలయ్యారు.

రామరాజు గారి మరణానంతరం...,  వీరి నాయకత్వాన జరిగిన "రంప" పోరాటంలో పాల్గొన్న 300 మందికి పైగా స్వాతంత్ర్య వీరులు బంధించబడి జైలు శిక్ష విధించబడగా..  అనేకమందిని అండమాన్ నికోబార్ దీవుల కాలాపానిజైలుకు తరలించారు.
అర్థంతరంగా ముగిసిపోయిందనుకొన్న1857 పోరాటం యొక్క దుఃఖాన్ని ప్రజలు దిగమింగుకొని బానిసత్వాన్ని అనుభవిస్తున్న సమయంలో.. ప్రజలందరికీ కరదీపం వలె కనిపించింది ఈ పోరాటం.

117 గ్రామాలకు పైగా ప్రజలు పాల్గొన్నారు. కేవలం తెలుగు ప్రాంతాన్నే కాదు సంపూర్ణ భారతదేశ స్వరాజ్య పోరాటాన్ని ప్రేరేపించిందీ పోరాటం.

ప్రాణమున్నంత వరకు ఊపిరి బిగించి పోరాడాలని  పాఠం నేర్పింది..  చరిత్ర గతిని మలుపు తిప్పింది... స్వాతంత్ర్యాన్ని సాధించిపెట్టింది.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top