Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

మహా శివరాత్రి - ఆధ్యాత్మికస్పూర్తి - Maha Shivaratri, Adhyatmika Spoorti

మహా శివరాత్రి లింగాష్టకము  1. బ్రహ్మమురారిసురార్పితలింగం, నిర్మలభాసితశోభితలింగమ్‌ । జన్మజదుఃఖవినాశకలింగం, తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥ 2. దే...

మహా శివరాత్రి - ఆధ్యాత్మికస్పూర్తి - Maha Shivaratri, Adhyatmika Spoorti
మహా శివరాత్రి
లింగాష్టకము 

1. బ్రహ్మమురారిసురార్పితలింగం,
నిర్మలభాసితశోభితలింగమ్‌ ।
జన్మజదుఃఖవినాశకలింగం,
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥

2. దేవముని|ప్రవరార్చితలింగం,
కామదహనకరుణాకరలింగమ్‌ ।
రావణదర్పవినాశనలింగం,
తతీప్రణమామి సదాశివలింగమ్‌ ॥!

3. సర్వసుగంధసులేపితలింగం,
బుద్ధివివర్ధనకారణలింగమ్‌ 1
సిద్ధసురాసురవందితలింగం,
తత్‌ ప్రణమామి సదాశివలింగమ్‌ ॥1

4. కనకమహామణిభూషితలింగం,
ఫణిపతివేష్టితశోభితలింగమ్‌ !
దక్షసుయజ్ఞవినాశనలింగం,
తత్‌'ప్రణమామి సదాశివలింగమ్‌ ॥!

5. కుంకుమచందనలేపితలింగం,
పంకజహారసుశోభితలింగమ్‌ |
సంచితపాపవినాశనలింగం,
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥

6. దేవగణార్చిత సేవితలింగం,
భావైర్భక్తిభిరేవచ లింగమ్‌ !
దినకరకోటి ప్రభాకరలింగం,
తత్‌ప్రణమామి సదాళివలింగమ్‌ ॥

7. అష్టదళోపరివేష్టితలింగం,
సర్వసముద్భవకారణలింగమ్‌ ।
అష్టదరిద్రవినాశనలింగం,
తత్‌ప్రణమామి సదాశివలింగమ్‌ ॥

8. సురగురుసురవరపూజితలింగం,
సురవనపుష్పసదార్పితలింగమ్‌ ।
పరమపదం పరమాత్మకలింగం
తత్‌'ప్రణమామి సదాశివలింగమ్‌ ॥
ఫలత్రుతి
లింగాష్టక మిదం పుణ్యం యః పఠే చ్చివసన్నిధా
శివలోక మవాష్నోతి శివేన సహ మోదతే ॥

“నమ శ్శివాయ”

మహా శివరాత్రి - ఆధ్యాత్మికస్పూర్తి
మాఘబహుళచతుర్దశినాటి అర్ధరాత్రికాలమున పరమ శివుడు కోటి నూర్యకాంతులతో లింగరూపమున ఆవిర్భవించినాడు. కనుక ఈనాటి అర్దరాత్రి నుండి చతుర్దశి ఉన్నప్పుడే మహాశివరాత్రి. ఈ మాఘమాససంబంధమువలెనే ప్రతిమాసమునను బహుళచతుర్దశి 'మాసశివరాత్రి” అయినది. మహా శివముగల రాత్రి - మహాశివునియొక్క రాత్రి - మహాశివరాత్రి. శివు డనగా బ్రహ్మానంద స్వరూపుడు. నిర్వికారుడు గనుక శమించియుండవా డనియు ఇతనియందు సజ్జనుల మనస్సులు ఉండు ననియు, సాధువుల మనస్ఫ్సులందు శయనించి యుండు వాడనియు.
 • సకలశుభములతో కూడినవాడనియు, అర్ధములు. “శివము' అనగా మంగళము, శుభము, కైవల్యము, శ్రేయస్సు. 
 • రాత్రి అనగా సుఖము నిచ్చునది. కనుక గొప్ప శుభముతో కూడినదియు, పరమసుఖమును ఇచ్చునదియు, మహో శివస్వరూపమైన పబ్రహ్మానందమును ప్రసాదించునదియు మహాశివరాత్రి! శివుడు మహాతేజోలింగరూపమున ఆవిర్భవించిన సన్నివేశము - 18 కల్పములలో - ఈశానకల్పమున జరిగినది. 
ఈ నందర్శములో శ్రీమన్నారాయణుడు శ్వేతవరావారూవము దాల్చి, శివలింగ ప్రొదుర్శవస్థాన మును చూచివచ్చుటకై యత్నించినందున - ఆనాటి నుండి ఈ కల్పమునకు “శ్వేతవరాహకల్ప” మని పేరు వచ్చినది. పరమేశ్వరుడు సర్వవ్యావకు డయినప్పుడు అతనికి ప్రత్యేకముగా ఒకరూపమనునది లేదు. అన్నియు తానే! కాని అందరికిని కనిపించవలెననెడి అనుగ్రహముతో పరమేశ్వరుడు “సాంబమూర్తి” (అంబ = పార్వతి, సాంబ = స + అంబ = పార్వతితో గూడినవాడు) యై ఆవిర్భవించినాడు. కేవలజ్ఞాన రూపము నిరాకారము. జ్ఞానము తేజోరూపము. ఆ జ్ఞానతేజమే 'రాశీభూతమై' జ్యోతిర్మయలింగముగా సాక్షాతృరించినది. రూపము కంటికి కనిపించవలెనన్నచో జ్యోతిస్సు (కాంతి) అవసరము. కనుకనే శివుడు మొట్టమొదట జ్యోతిర్లింగమై, పిదప సాంబ శివుడై - విష్ణుబ్రహ్మలకు గోచరించినాడు. 

లింగ మనగా - ప్రకృతిలో లీనమైయున్న పరమాత్మ స్వరూపమును తెలుపునది. ఆ స్వరూపమును పొందించునది - అనగా అనుభవింప జేయునది - అని ఆర్ధము. కనుక నిరాకారమై, సర్వవ్యాపకమైన సచ్చిదానంద శివస్వరూపము. సాకారమై, సర్వజనానందకరముగా నేశ్రోత్సవముగా గోచరించిన మహాపవిత్రపర్వదినము 'శివరాత్రి'. 
కృష్ణపక్షములోని చీకటి - జీవుని ఆవరించిన మాయాంధకారము. జ్ఞానదాతయగు పరమశివుని కృపవలన జీవుడు మాయనుండి ముక్తుడై, ఆత్మ స్వరూపమును గుర్తించి, సర్వవ్యాపకమయిన ఆనంద తేజమును శివలింగరూపములో దర్శించి, జీవన్యుక్తుడు కావలెననెడి సదాశయముతో,
జీవితమును సత్యశివ సుందరముగా తీర్చిదిద్దుకోవలయునను శుభాకాంక్షలతో - అట్లు భావించి, దర్శించి, తరించిన మనపూర్వులు శివరాత్రిని పర్వదినముగా నిర్ణయించినారు.
“ జాగ్రత్‌స్వప్పసుషుప్తిరూపం - అవస్థాత్రయం, ఆత్మరూపే - శివాభిన్నస్వరూేపేణ , రాతి - ఆదదాతి - శివరాత్రిమ్ " అని వ్యుత్పత్తి * కనుక ఆధ్యాత్మికతత్త్వాను భూతి నొంది, “శివో౭ హమ్‌” అను పరమాద్వైతస్థితి సిద్ధించుటయే శివరాత్రి.
ఫలము! ఇది యోగరాత్రి! శివరాత్రిఎల్లరికిని భుక్తి ముక్తులను ప్రసాదించు పరమప్రతము. శివపూజకు, శివరాత్రి ప్రతమునకు భేద మున్నది. వేదములలో శివుడు రుద్రుడుగా పేర్కొనబడినాడు. సంసార దుఃఖమును నాశనము చేయువాడు, వేదరూపమున ధర్మమును పొందిపజేయువాడు, మున్నగు నర్ధములు రుద్రశబ్దమునకున్నవి. సహస్రారకమలమున అర్థమాత్రాస్వరూపమున నిలిచిన పరతత్త్వమే 'శివుడు'. శివరాత్రినాడు శివునికి ధారాపూర్వకముగ
చల్లని నీటితో అభిషేకము గావించవలెను. ఇది యోగశాస్త్ర రీత్యా - సహస్రారకమలమున ప్రకాశించు సదాశివ తత్వామృతము వర్షించుటకు ప్రతీక. శివరాత్రి విశేషములలో, ఉపవాసము, రాత్రివేళ అర్చనలు, చతుర్దశీయుక్తమైన అమావాస్య మున్నగునవి ప్రముఖమైనవి. ఇందలి ఆధ్యాత్మిక రహస్యములను గమనింతము.

ఉపవాస మనగా నిరాహారియైయుండుట అనునది సామాన్యార్థము. ఆహార మనగా ' “మనస్సుతో, బుద్ధితో, ఇంద్రియములతో స్వీకరింపబడునది” అని అర్ధము. సంస్కార రూపమున మనస్సు స్వీకరించునది సూక్ష్మాహారము. పంచ జ్ఞానేంద్రియముల ద్వారా మనస్సు స్వీకరించునది స్థూలహారము. ఇది శబ్ద స్పర్శరూప రస గందాత్మకము శరీరమునకు స్వీకరించు అన్నము  మున్నగునది స్థూలతరాహారము. 

“ఉపవాస” మనగా ' సమీపపాసము'. మనశ్యరీరములను శివుని సమీపమున నుంచుటయే శివరాత్రినాటి ఉపవాసము. కనుక కేవలము ఆహార రూపవస్తువులను స్వీకరింపకుండుటయే గాక - సూక్ష్మ, స్థూల, స్థూలతరాహారములను వదలుటయే నిజమైన ఉపవాసము. ఇట్టి తాత్త్వికమైన ఉపవాసముచేసినపుడే “శ్రివో౭ హమ్" స్థితి అనుభవింవబడును. కేవలం బాహ్యూనుష్టానము నిష్ప్రయోజనము! ఈ విశాలబ్రహ్మాండమున సృష్టి ప్రళయము లనెడి రెండు విభిన్నప్రవాహములు నిత్యము ప్రవహించుచున్నవి. కాల ప్రవాహమున రాత్రి - పగలు అను రెండుచీలికలున్నవి. 
మనస్సునందును ఈ సృష్టి ప్రళయములున్నవి. ప్రకృతియందు నిత్యసృష్టి, నిత్యలయము గలదు. ఇది ఏకత్వమునుండి భిన్నత్వమునకు, భిన్నత్వమునుండి ఏకత్వమునకు చేర్చు మహాశక్తి. కార్యకారణరూపము. పగలు కార్యరూపము. రాత్రి కారణరూపము. రాత్రిలో సర్వములయించియుండి, పగలు సృష్టిరూపమున కార్యము జరుగును. కారణము ఏకరూపము. కార్యము. నానారూపము.

శివరాత్రినాడు అర్ధరాత్రివేళ శివుడు ఏకాకారతేజోలింగ రూపమున సాక్షాత్కరించుటచే” సర్వసముద్భవ కారణలింగమ్మని లింగాష్టక స్తోత్రముననున్నది. కాగా మనః ప్రాణేంద్రియములు 
ఆత్మ సన్నిధిలో చేరి, ఆనందించుటయే రాత్రి. అనగా పగలు విషయానందమగ్నములయిన కార్యరూప మనః ప్రాణాదులు, రాత్రి కారణరూపశివసన్నిధిలో తమతమ కార్యములు చాలించి, నిర్విషయానందస్థితిలో సుఖించుటయే శివరాత్రి. పగలు భిన్నత్వము. రాత్రి ఏకత్వము.
చతుర్దశి - అమావాస్య. అమా = కూడిక; వాస్య = వసించియుండుట. అనగా = ఈరోజు = సూర్య చంద్రులు కూడికొనియుందురు. ఆధ్యాత్మికముగా సూర్యుడు - పరమాత్మ, చంద్రుడు జీవాత్మ. జీవాత్మ పరమాత్మతో చేరుటయే యోగ సాధనలో చివరిదశ, కనుక అమావాస్య అద్వైత పరమానందమునకు సంకేతము. ఉపాసనాశక్తి లేనిదే ఈ అభేదస్థితి లభింపదు. కనుక చతుర్దశి అవసరమైనది.చతుర్దశినాడు చంద్రుడు సూర్యునికి అత్యంతసమీపమున రేఖామాత్రముగ నుండును. అట్లే సాధనకాలమున జీవాత్మ పరమాత్మసన్నిధానమున రేఖామాత్రదూరమున భేదస్థితిలో నుండును. మాఘబహుళచతుర్దశినాడు జీవాత్మ - పరమ శివునికి అత్యంతసమీపమున నుండును. సాధన - ఉపాసన తీవ్రతరమైనపుడు - చతుర్ధశిస్థితినుండి - అమావాస్యస్థితి అనగా శివైక్యస్థితి సిద్ధించును. "ఇట్టి శుభలగ్నమే అర్ధరాత్రి లింగోద్భవకోలము! ఇదియే మహాశివరాత్రి! ఇట్లు ఆధ్యాత్మికముగ ఆచరించిననే శివరాత్రిప్రతము సార్థకము. సఫలము అగును. అద్వైతానుభూతియే శివరాత్రి!

జాగరణము : జాగరణ మనగా ఏదో పిచ్చాపాటి మాటలతో, వినోదకార్యక్రమములతో మేల్కొనుట కాదు. ప్రకృతిలో నిద్రాణ౭మైయున్న శివశక్తిని, శివపూజా భజన లీలా శ్రవణాదులతో మేల్మొల్చి, తాను శివుడై, సర్వమును శివస్వరూపముగా భావించి, దర్శించుటయే నిజమైన జాగరణము. అప్పుడు శివపూజలో సాపూర్పయము, శివభజనలో సామీప్యము, శివభక్తులతో కూడి, శివ విషయములు ప్రనంగించుటలో సాలోక్యము. శివ ధ్యానములో సారూప్యము సిద్ధించుననిన ఆదిశంకరుల మాట ప్రత్యక్షర ప్రత్యక్ష సత్యమగును. చతుర్విధముక్తులును ఇహలోకముననే ఈ దేహముతోనే స్వానుభవములోనికి వచ్చును. ఈ నాల్గింటిని శివరాత్రినాడు ప్రత్యక్షముగా సాధించుటయే శివరాత్రి జాగరణము. నాల్గయామముల పూజలతో మనోబుద్ధి చిత్తాహంకారములు నాల్గును పరిశుద్ధములు కావలెను. ప్రపంచము అశాశ్వత మనియు, బ్రహ్మ "మొక్కటే శాశ్వత మనియు గ్రహించి, మనబుద్ధిని మేల్కొల్పుటయే జాగరణము.

బిల్వవృక్షము :
శివరాత్రిమామహాత్య కధలలో బిల్వవృక్షము, వ్యాధుడు (వేటాడి జీవించు బోయ), జింకలు ప్రధానములు. మానవదేహమే - ఈ సంసారమే - బిల్వవృక్షము. బిల్వపత్రమునకు గల మూడు ఆకులు త్రిగుణములు. కాడ మనస్సు. కామక్రోధాదులే ముండ్లు. కొమ్మలే శరీర భాగములు, ఈ జీవాత్మయే సంసార బిల్వ వృక్షము నెక్కిన “అంకిలుడు” - అను వేటగాడు. (అంకిలుడు అనగా ఇట జీవాత్మ అను గుర్తుగలవాడు.) ఇంద్రియరూప బాణములతో, విషయరూప పక్షి జంతువులను వేటాడుట ఇతని ప్రవృత్తి, ఈ ప్రాకృతజీవుడు శుద్ధజీవుడై తనసమస్తకర్మలను, కర్మఫలములను భగవంతునికి అర్చించినప్పుడే మోక్షము చేకూరును. కనుక దేహమనెడి బిల్వవృక్షము నెక్కి త్రిగుణముల నెడి బిల్వ పత్రములను కోనీ, గుణాతీతుడైన పరమేశ్వరునిశిరస్సుపై అర్చించుటయే బోయ చేసినపుణ్య కార్యము! 
ధర్మభక్తిజ్ఞాన వైరాగ్యములే అతనిని ప్రబోధించిన జింకలు, బోయను భయపెట్టిన క్రూర మృగములే కామాదులు. కాని అతని ప్రారబ్ద" కర్మ ఆనాటితో తీరుటచే - అవి ఏమియు చేయజాలక పోయినవి. అతని జన్మాంతర సుకృతము బిల్వ వృక్టము నెక్కించినది. బిల్వము మోక్షలక్ష్మీ! నివాసస్థానము. బిల్వమనగా "సేవకుని పాపమును పోగొట్టునేది', అని "వ్యుత్పత్తి, బిల్వవృక్షము నెక్కినందున అతని పాపములు అన్నియు నశించినవి. అప్రయత్నముగ జరిగిన జాగరణముచే బిల్వార్చణముచే - అతనికి కైలాసము లభించినది. తెలియక చేసిన బిల్వపూజ, జాగరణము,
ఉపవాసము - అంతటి ఫలము నీయగా - ఇక ఇందలి ఆధ్యాత్మిక తత్త్వరహస్యములను గుర్తించి, శివరాత్రిప్రతమును ఆచరించువారికి గలుగు మహాఫలము వర్జనాతీతము.

వాచామగోచరము అత్మైకవేద్యము. మృత్యుంజయునిఆరాధన మృత్యుంజయు త్వమును చేకూర్చుననుట అనుభవసిద్ధము! సంవత్సరమునకో, నెలకో ఒకరాత్రి కాక - ప్రతిరాశత్రిని నిజమైన శివరాత్రిగా మార్చుకొన్నప్పడే జీవితము శివమయముగా పరిణమించి, అద్వైతానందానుభూతితో "శివో౭ హా”మ్మగును. 
సంవత్సరములో ఐదురకాల శివరాత్రులు ఆచరణ యోగ్యములని పెద్దలందురు :
  1) నిత్యశివరాత్రి - ఇది (ప్రతి నిత్యము శివారాధనకై సంకల్పించి, పూజించురాత్రి. 
  2) పక్ష శివరాత్రి - 15 రోజుల్లో అనగా శుక్లపక్ష్మ కృష్ణపక్షచతుర్దశి రాత్రి శివారాధన గావించుట, 
  3) మాసశివరాత్రి - ప్రతి మాసములో కృష్ణపక్షచతుర్ద శిరా(తి శివారాధన గావించుట. 
  4) మహాశివరాత్రి - మాఘబహుళచతుర్దశి రాత్రి గావించు శివారాధన, 
  5) యోగశివరాత్రీ - యోగి తన యోగమహిమతో యోగనిద్రలో సమాధిస్థితి నొందు రాత్రి.
ఇందలి ఐదు శివరాత్రులలో అన్నింటిని 'ఆచరింపకున్నను, సంవత్సరమునకు ఒక్కమారు మాఘమాసబహుళచతుర్దశినాటి అర్ధరాత్రి సంభవించు మహాశివరాత్రిని శివారాధనతో సార్థకము చేసికొన్నను ధన్యత నొందవచ్చును.

సామాన్యముగా రాత్రివేళ స్త్రీదేవతాపూజలు (అమ్మవారి పూజలు), పగటివేళ పురుషదేవతాపూజలు నిర్వహింతురు. కాని ఒక్క శివరాత్రికి మాత్రమే రాత్రి నాల్గు యామములందును శివుని పూజించుటచే ఈ మహాశివరాత్రికి గల విశిష్టత తెలియుచున్చది. ఈశివరాత్రి - పగలు, రాత్రి ఉపవాసముతో ఉండి, నిర్వహించునది. చతుర్దశి కనుక -
కర్మేంద్రియములు ఐదు, జ్ఞానేంద్రియములైదు, "అంతఃకరణ చతుష్టయము (మనో బుద్ధి "చిత్రాహంకారములు) (5+5+4= 14 ) శివార్చణముగావించి, శివానందానుఖూతినొందుట ఇందలి ఆంతర్యము. శివరాత్రినాడు నాలుగుయామము లందును శివలింగమును నాల్గు విధములగు వస్తువులతో అభిషేకింతురు. శివుడు అఖిషేకప్రియుడు కదా!
 1.  మొదటి యామమున పాలతో అభిషేకము, తామర పూలతో పూజ. పెసరపప్పు, బియ్యము కలిపి పులగమువండి శివునికి నివేదన. బుగ్వేదమంత్రములు పఠించవలెను.
 2.   రెండవ యామమున పెరుగుతో అభిషేకము. తులనీదళములతో అర్చన. పాయసము నైవేద్యము. యజుర్వేదమంత్రపఠనము. 
 3.   మూడవ యామమున నేతితో అభిషేకము. బిల్వదళములతో పూజ. నూగుల పొడి కలిపిన పదార్థము (నూగు చిమ్మిలి) నైవేద్యము. సామవేదమంత్ర పఠనము. 
 4.    నాల్గవ యామమున తేనెతో అభిషేకము. నల్లనికలువపూలతో పూజ. కేవలము అన్నము నైవేద్యము. అధర్వణవేదమంత్ర పఠనము. 
ఇట్టిపూజ వారివారిఅవకాశమునుబట్టి ఇంటనే శివలింగమునకుగాని, శివాలయమునందలి శివ లింగమునకుగాని నిర్వహించవచ్చును.
అభిషేకవేళలో శివుని దర్శించుట మహాపుణ్య ప్రదము, శివరాత్రినాడు బిల్వపూజ ముఖ్యము. బిల్వము అనగా మారేడు. ఇది మాడు ఆకులు ఒకే కాడకు కలిసియున్న పత్రములు గలది. బిల్వదళము, బిల్వ పత్రము అని అందురు. బిల్వమనగా “బిలతి కుష్టాదీన్‌ - బిల్వ బిల భేదనే” - కుష్టాదులను పోగొట్టునది. “సేవకస్య పాపం బిలతి, హినస్తి” - సేవకుని పాపమును పోగొట్టునది - అని వ్యుత్పత్తులు. దీనికి మాలూర మనియు పేరు. “మల్యతే దేవైః” - దేవతలచే ధరింపబడునది - బిల్వము సకల దేవతలకు ప్రియమైనది. శ్రీ ఫలమనియు పేరు. లక్ష్మీప్రదమైనది, లక్ష్మీప్రియమైనది అని అర్థములు. బిల్వము ఓషధీజాతికి చెందినది. పంచ బిల్వములని ప్రసిద్ధి చెందిన - తులసి, మారేడు, వావీలి, ఉత్తరేణు, వెలగ - అనువానిలో బిల్వము (మారేడు) చేరినది. ఈ యైదును బిల్వములే - అనగా పాపనివారకములు.
మారేడు (బిల్వము) స్పర్శ, వాసనకూడ ఆరోగ్య ప్రదమే! దీని వేరు లేదా ఆకురసము కషాయము గావించి, సేవించినచో ఉష్ణమును తగ్గించును. మేహవ్యాధిని తొలగించును. పైత్యమును తగ్గించును. ఆకలిని పెంచును. వేరు కషాయము గుండెదడను పోగొట్టును. వేరుగంధము
సర్పవిషమును హరించును. పత్ర కషాయము ఉబ్బసమును, వాంతులను హరించును. దీని పూలను నీళ్లలో నానబెట్టి, కాచి, ఆ నీటిని సేవించుటచే కలరా మొదలగు అంటువ్యాధులు తొలగును. బిల్వపత్రములను ఎండబెట్టి, పొడిచేసి, నిత్యము సేవించినచో “రక్తపోటు” (బి.పి.) తగ్గి
పోవును. దశమూలములలో మారేడువేరుకూడనున్నది. దీనీ కాయలు, గుజ్జు శిరోవ్యాధంల నివారణలో మిక్కిలి ఉపకరించును. ఇట్లు బిల్మము మహౌషధీగుణములు విశేషముగా నున్న ప్రశస్త వృక్షము. 
మాఘమాసమున వాతావరణము శీతలమై, వ్యాధి కారకములగు సూక్ష్మ!క్రిములతో కలుషితమై యుండును. కనుకనే మాఘమాసమంతయు సాయంకాలము శివునికి రుద్రాభిషేకము గావించి, బిల్వపత్రములతో అర్చించుటవలన ఇంట వాతావరణము ఆరోగ్యప్రదమై యుండును. పంబిల్వములుగా నున్న ఆకులు ఎండినవైనను, ముందురోజు పూజకు ఉపయోగించిన వైనను - వాటిపై నీరు చల్లి, మరల పూజకు ఉపయోగింపవచ్చు నందురు.
బిల్వము శివునికి పరమ ప్రీతికరము కనుక “ఏకబిల్వం శివార్పణమ్‌” అని బిల్వాష్టకాదులు, బిల్వాప్టోత్తరశతనామావళులు శివ సంబంధములై ప్రసిద్ధి నొందినవి. ఇందలి త్రిదళములు = త్రిలోకములకు, త్రిగుణములకు, త్రికరణములకు, త్రిజన్మలకు, - ఇలా త్రిసంఖ్యాకములైన అసంఖ్యాక తత్త్వములకు సంకేతములు. ఇన్ని తత్వములను మహాతత్త్వ సంకేతమైన శివలింగమునకు అర్పించుటచే జీవుడు శివస్వరూపుడై “శివో౭ హమ్‌” అనెడి దివ్యాద్వైతానుభూతి
నొందును. ఒక్క బిల్వదళము శివునికి అర్చించుటచే “కోటి యజ్ఞఫలము” లభించునని  ఆర్నవాక్యము! జమ్మి, ఉసిరిక, గరిక - చేర్చి అష్టబిల్వము లనియు ప్రసిద్ధి కలదు.

Shivalinga
శివలింగము
సామాన్యముగా లింగ మనగా చిహ్నము (గుర్తు) అని అర్థము. శివునికి గుర్తు అనునర్థములో “శివలింగిమని రూఢి. ఇవి ఒక సంకేతమే కాని, వాస్తవమునకు ఇదే శివుని రూప మని కాదు. ధ్యానానుగుణముగ శివుని రూపములు అనేకములున్నవి. లింగములో సాకార నిరాకారములు లీనమైయున్నవి. సర్వమును తనయందు లీనము గావించుకొనునది కనుక 'లింగ'మని పేరు. ప్రళయాగ్నిలో సర్వమును భస్మమై శివలింగములో లయించును. (లీనమగును) మరల సృష్టిప్రారంభములో అందుండియే ఉద్భవించును. 
పంచలింగములు, ద్వాదశ జ్యోతిర్లింగములు ఇవన్నియు విశ్వమునకు, అందలి తత్త్వములకు సంకేతములు. విశ్వమే విశ్వేశ్వరతత్త్వముకదా! శివలింగము ఆపాతాళన భస్స్థలాంత ఐ వ్యాప్తము - అనగా సర్వవ్యాప్తము! 
శివలింగములు అనేక విధములు:- 
 • అందు సువర్ణ నిర్మిత లింగము ముక్తి నిచ్చును. 
 • వెండి లింగము ఐశ్వర్యమును వైడూర్యలింగము శత్రునాశమును, 
 • సృటికలింగము సర్వవాంఛాఫలప్రదత్వ మును, కల్లించును. (కాని రాగి, కంచు, సీసము. ఎట్టి
 • చందనము శంఖము, ఇనుము లింగములు కలియుగములో నిషేధింపబడినవి). 
 • పాదరస లింగము మహైశ్వర్య ప్రదాయకము. మహా ప్రభావ సంపన్నము. పాదరసమునకు “పారది మనిపేరు, “రోగములను నశింపజేయునది” అని వ్యుత్పత్తి. ఇందు 'ప = విష్ణువు, ఆ = పార్వతి, ర = శివుడు, ద = బ్రహ్మ - అని అర్ధములు కనుక 'పారద' - (పాదరసము) త్రిమూర్త్యాత్మక పరాశక్తి స్వరూపము. 
 • పాదరస లింగపూజ జీవితములో ఒక్కమారైనను చేయుట సకలాభ్యుదయ ప్రదము.
 • బాణలింగ పూజ ముక్తి ప్రదము. బాణలింగములు నర్మదా నదిలో లభించును. ఇంద్రాదిదేవతలును బాణలింగములను పూజించి నారని పురాణోక్తి. ఇందు ఆవాహన విసర్జనము లుండవు.
వేదములలో శివుడు
బుగ్వేదములోని మూడు సూక్తములలో (మం 114 నూ 2-33, 7-46) రుద్రుని స్తుతియున్నది. కృష్ణయజుర్వేదములో చతుర్ధ కాండము 5,7 ప్రపాఠకములకు రుద్రాధ్యాయ మనిపేరు. వీటిని నమక చమకము లందురు. శుక్షయజుర్వేదములోని 16వ అధ్యాయము రుద్రదేవతాకమైనది. అధర్వవేదములో 11వ కాండములోని 2వ సూక్తములో రుద్రమాహాత్మ్య మున్నది. పురాణములు
శివప్రభావమును అనేకరీతుల వర్ణించినవి.

రచన: విద్వాన్, డాక్టర్ పామిడికాల్వ చెంచు సుబ్బయ్య గారు

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments