సక్షమ్ జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు - Saksham Eye Donation awareness

1

21 సెప్టెంబరు 2020 – 4 అక్టోబరు 2020 వరకు  జాతీయ నేత్రదాన ప్రతిజ్ఞా పోటీలు జరుగుతున్నాయని “సక్షమ్” అఖిల భారత ప్రచార విభాగం సమన్వయ కర్త  శ్రీ వెన్నపూస శ్రీనివాసుల రెడ్డి ఓక ప్రకటనలో తెలిపారు.

ఈ పోటీల ముగింపు (Valedictory) కార్యక్రమం 8 అక్టోబర్ 2020 నాడు సాయంత్రం 5గంటలకు జరుగుతుందని, ఆ కార్యక్రమానికి కేంద్ర రోడ్డు రవాణా శాఖ, జాతీయ రహదారులు, చిన్న, సూక్ష్మ మరియు మధ్య తరహా (MSME) సంస్థల మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ పాల్గొంటారని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో దేశంలోని 44 ప్రాంతాలలో గల 350 జిల్లాలలోని నేత్ర బ్యాంకులు, నేత్ర సేకరణ కేంద్రాలు, నేత్ర రక్షకులతో ప్రత్యక్షంగా అనుసంధానము కానున్నారని తెలిపారు.

ఈ మహాయజ్ఞంలో దేశవ్యాప్తంగా అధికంగా ప్రతిజ్ఞా పత్రాలను చేయించిన మొదటి మూడు ప్రాంతాలు మరియు మొదటి పది జిల్లాలకు బహుమతుల ప్రదానం చేయడం జరుగుతుందని కూడా ఆయన తెలిపారు. ”జీవిస్తూ రక్తదానం మరణిస్తూ నేత్రదానం” అనే నినాదం ప్రకారం ప్రతి వ్యక్తీ తాను జీవించి వున్న కాలంలో రక్త దానం చెయ్యాలని, మరణించిన తర్వాత నేత్రదానం చెయ్యాలని, నేత్రదానాన్ని ప్రతి ఒక్కరూ కుటుంబ సాంప్రదాయంగా అలవర్చుకోవాలని ఆయన పిలిపునిచ్చారు.

ప్రముఖ తెలుగు సినీ నటులు శ్రీ అవసరాల శ్రీనివాస్ నేత్ర దాన ప్రతిజ్ఞ చేసి సక్షమ్ చేస్తున్న సేవా కార్యక్రమాలకు తన పూర్తి మద్దతు తెలియజేశారు. మరియు ప్రజలందరూ కూడా ఈ మహోద్యమంలో పాల్గొని నేత్రదాన ప్రతిజ్ఞ చేయాలని పిలుపునిచ్చారు. ఒకసారి వారి సందేశాన్ని విందాం….

వీడియో కోసం ‌క్లిక్ చేయండి.

కింద ఉన్న లింక్ పై క్లిక్ చేయడం ద్వారా ఒక నిమిషం కన్నా తక్కువ సమయంలో మీరు మీ నేత్రదాన ప్రతిజ్ఞను పూర్తి చేయవచ్చు. 👇


సక్షమ్ భారత్ సమర్థ్ భారత్...
Tags

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
  1. దేహదానం మరియు అవయవదానం పై కూడా ఇలాంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం

    ReplyDelete
Post a Comment
To Top