Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దేశ విభజన అసలు కారణాలు? వాస్తవ చరిత్ర. Why Did the Partition of India and what Happen?

దేశవిభజన చారిత్రక తప్పిదం: క్రీ. శ 644 నుండి మనదేశం ఫై ఇస్లాం ఆక్రమణ ప్రారంభమైనది ఇస్లాంతో పోరాటం కీలకదశకు చేరుతున్న సమయం...


దేశవిభజన చారిత్రక తప్పిదం:
క్రీ. శ 644 నుండి మనదేశం ఫై ఇస్లాం ఆక్రమణ ప్రారంభమైనది ఇస్లాంతో పోరాటం కీలకదశకు చేరుతున్న సమయంలో ఈస్టిండియా వ్యాపార కంపెనీ 1757లో కలకత్తాలో ప్రారంభమైనది. 1857 నుండి బ్రిటిష్ ప్రభుత్వం పాలనా ప్రారంభమైనది బ్రిటిష్ వారిపై చిన్న చిన్న పోరాటాలు జరుగుతున్నా వ్యవస్థితంగా కాంగ్రెస్ వేదికగా 1885 నుండి పోరాటం క్రమంగా దేశమంతా విస్తరించింది. ఇట్లా క్రమముగా పోరాటం 1920 నాటికీ వేగం పుంజుకొంది. 1947ఆగష్టు 15న దేశం ముక్కలై స్వతంత్రం సిద్ధించింది. శతాబ్దాల సంఘర్షణ లో దేశం చాలా మార్పులకు లోనయింది. చరిత్రలో ఒక గాయం గా దేశ విభజన మిగిలింది రెండవ ప్రపంచ యుద్ధం లో గెలిచిన కూటమి ప్రపంచంలో జర్మనీ మొదలైన దేశాలను ముక్కలు చేసాయి ఆ క్రమంలో ఆంగ్లేయులు భారత్ ను ముక్కలు చేసి పాకిస్తాన్ దేశం సృష్టించారు. ఈ విభజనలో ఈ దేశానికీ నాయకత్వం వహించిన పెద్దల అంగీకారం ఉన్నది. ఆ పెద్దలు దేశవిభజన అంగీకరించి సాధించినది ఏమిటంటే ఒక్క రోజులో కోట్ల మంది ప్రజలను పరాయి దేశస్తులుగా మార్చేశారు. మనదేశ సార్వభౌమత్వంను ప్రశ్నార్ధకం చేసారు విడిపోయిన పాకిస్తాన్ తో నిరంతర సంఘర్షణ కొనసాగుతూనే ఉన్నది. ఏ నాయకత్వం దేశం విభజనకు కారణమైయిందో ఆ నాయకత్వమే పాలకులైనారు. ఆ పాలకులు దేశవిభజన నుండి పాఠాలు నేర్చుకొని భవిష్యత్ లో అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకున్నారా అంటే లేదు అని చెప్పవచ్చు. కాశ్మీర్ విషయంలో అదే పొరపాటు పునరావృతం అయింది. ఆ తప్పటడుగులు కొనసాగుతూ దేశాన్ని సమస్యలలోకి నెట్టివేశారు. జరిగిన పొరపాటును యాదృచ్ఛాకంగా జరిగినదని నమ్మినవారు ఆ ఊహాలోకాల నుండి బయట పడలేక పోతున్నారు. చరిత్ర పునరావృతం అవుతున్నది. దానినుండి ప్రజలు ఇప్పుడిప్పుడే సత్యాలు తెలుసు కొంటున్నారు. ఈ సమయంలో దేశం ముక్కలు కావటానికి దారి తీసిన పరిస్థితులను అవగాహన చేసుకొందాం. దేశవిభజనలో బ్రిటిష్ వారి బేధతంత్రము ఇస్లాం ఆక్రమణ, కాంగ్రెసు నాయకత్వం ఇస్లాం విసిరిన సవాలుకు లొంగిపోవటం కలగలిసి దేశ విభజనకు దారితీసింది. దేశవిభజనలో 1] బ్రిటిషువాళ్ళు 2] ఇస్లాం 3] కాంగ్రెసు ఎవరెవరు ఏమిచేసారోసంక్షిప్తంగా  తెలుసు కొందాము. 
బ్రిటిష్ భేధతంత్రము: బ్రిటిష్ వాళ్ళ దృష్టిలో ఇస్లాం ఒక విస్మరించజాలని శక్తి. ఈదేశంలో హిందువులు శక్తివంతులే కానీ వారిలో అనేక సమస్యలు ఉన్నాయి దీనిని ఆంగ్లేయులు తెలివిగా ఉపయోగించు కొన్నారు. హిందూ సమాజం మూడవ పానిపట్ యుద్ధం నుండి గుణపాఠం నేర్చుకోలేదు. బ్రిటిష్ వాళ్ళు ఈ దేశంలో హిందువులు, సిఖ్ఖులు, ముస్లింలు లలో తన భేదతంత్రము ఉపయోగించి పని చేయసాగింది. ఈ దేశంలో పక్కా ప్రణాళికతో  ముస్లిం మెజారిటీ ఉన్న ప్రాంతాలను విడదీయటం ప్రారంభించింది. భారత్ లో ఓట్ బ్యాంకు రాజకీయాలకు తేర లేపింది 1905లో బెంగాలును విభజించి ఢాకా కేంద్రంగా ముస్లిం మెజార్టీ స్టేట్ ఏర్పాటు చేసే ప్రయత్నం చేసింది ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వచ్చిన కారణంగా కొద్దీ కాలం వేచి ఉండి చేసేసింది ఢాకా కేంద్రంగా ఉన్నబెంగాలులో అస్సాంలోని కొన్ని జిల్లాలను కలిపేసింది పంజాబును తూర్పు పంజాబ్ దక్షిణ పంజాబ్ గా విభజించింది. 1936లో ముంబయి లో భాగమైన సింధు ప్రాంతం ను విడగొట్టింది బలూచిస్తాన్ ను వేరుచేసింది ఇట్లా ముస్లిం మెజారిటీ ప్రాంతాలు ఏర్పడ్డాయి 1936లో భాష ప్రాంతాలు ఏర్పాటు చేయటం ప్రాంభించింది ఇట్లా దేశవిభజనకు రంగం సిద్ధం చేసుకొంటూ వచ్చింది. విభజన ప్రక్రియనంత 1935 లో చేసిన ప్రొవిజిన్స్ హాఫ్ 1935 ఇండియన్ ఆక్ట్ ఆధారంగా చేసింది. వాస్తవంగా బ్రిటిష్ వాళ్ళు 1948 జూన్ లో భారత్ కు స్వాతంత్రము ఇస్తామని ముందుగా చెప్పారు కానీ 1947 ఆగష్టు 15న స్వతంత్రం ఇచ్చేసారు దాని కారణాల గురించి ఒక ప్రముఖ పాత్రికేయుడు విశ్లేషణ ప్రకారం స్వాతంత్రం ఇవ్వటం ఆలస్యమైతే తమ లక్ష్యమైన దేశం విభజన కష్టాలలో పడుతుందేమోనని భావించారు దానికి రెండు కారణాలు 1] పెరుగుతున్న హిందుత్వ శక్తి 2] కాంగ్రెస్ లో దేశవిభజనను వ్యతిరేకించే నాయకత్వము  బలపడవచ్చు అని భావించివుంటారు అందుకే ముందుగానే స్వాతంత్రం ఇచ్చేసారు. ఈ దేశంలో హిందువులు, సిఖ్ లు, ముస్లింలు బలమైన శక్తులు అందుకే ముస్లింలను రెచ్చగొడుతూ, సిఖ్ లను దగ్గరకు తీసుకొంటూ హిందువులను బలహీనపరుస్తూ తాము చేయవలసినది చేసేసారు అదే బ్రిటిష్ భేద తంత్రము.

ఇస్లాం ఆక్రమణ అసలు కారణం: ఇస్లాం అంటేనే ఆక్రమణ. వందల సంవత్సరాలు ఈ దేశం పాలించిన మాకు ఏవిధంగానైనా అధికారం చేచిక్కించు కోవాలి ఈ దేశం ఫై ఆధిపత్యం కోనసాగించాలి అని నిర్ణయించు కొని దానికి మార్గాలు ఆలోచిస్తున్నారు. 1905 లో బ్రిటిష్ వాళ్ళు చేసిన బెంగాల్ విభజన వారికీ మార్గం చూపించింది వాళ్ళ ఆలోచనలకు కార్యరూపం ఇచ్చింది 1906లో అల్ ఇండియా ముస్లింలీగ్ పార్టీ ని ప్రారంభించారు. 1920 లో జరిగిన ఖిలాఫత్ ఉద్యమం వారికీ కలిసివచ్చింది.గాంధీజీ కూడా ఖిలాఫత్ ఉద్యమాన్ని సమర్ధించారు. ఆ పేరుతో ముస్లిం నాయకత్వం బలపడింది ఢాఖకేంద్రం గా ఉన్న బెంగాల్ లో ముస్లిం మెజార్టీ ఉన్నది దానిపై పూర్తి ఆధిపత్యం సాధించేందుకు అక్కడ ఉన్న హిందువులను మతం మార్చటం లేక వెళ్లగొట్టటం దాడులు చేయటం ప్రారంభించారు అట్లా అస్సాం లో ప్రయత్నాలు మెదలు పెట్టారు. బ్రిటిష్వాళ్ళు చేసిన బెంగాల్, పంజాబ్, సింధు విభజనను  పూర్తిగా ఉపయోగించుకొని మూడు దశాబ్దాలు పని చేసి దేశ విభజనకు అనుకూల వాతావరణము నిర్మాణం చేసుకొన్నారు. కాంగ్రెస్ లో ఉన్న ముస్లిం నాయకులు కూడా ముస్లింలీగ్ యోజనకు ఎట్లా సహకరించారో  ఒక ఉదాహరణ ఈ సందర్బములో గుర్తుచేసుకొందాం గాంధీ, నెహ్రులకు అత్యంత సన్నిహితుడు మౌలానా అబుల్ కలాం ఆజాద్, ఆసఫలీ ఇద్దరు సింధ్ ప్రాంతంలో ముస్లింలీగ్ నాయకత్వము బలపడి కాంగ్రెస్ నాయకత్వం బలహీనమైయేందుకు పనిచేసారు. ఇట్లా కాంగ్రెస్ లోని ముస్లిం నాయకులూ ముస్లిం లీగ్ కు సహకరిస్తూ మరోప్రక్క దేశ విభజనకు కాంగ్రెస్ లో అనుకూల వాతావరణం నిర్మాణం చేయటానికి కృషి చేసారు ఈ పరిస్థితులను గమనిస్తున్న గాంధీ గారి విశ్వసనీయుడు జిన్నా కాంగ్రెస్ నుండి వెళ్లి పోయి ముస్లింలీగ్ కు పటిష్టమైన నాయకుడైనాడు గాంధీజీ ఉదారవాదాన్ని ఉపయోగించుకొని పాకిస్తాన్ సాధించుకోవడంలో విజయవంతమైనాడు. దానికి సంబంధించి కొన్ని వివరాలు తెలుసుకొందాం మొదట ఢిల్లీలో దాడులు జరిగాయి.

16 ఆగస్టు 1946లో దేశమంతా ప్రత్యక్ష చర్య ప్రకటించారు   ప్రత్యక్ష చర్య ప్రారంభము కలకత్తాలో జరిగింది అనేకరోజులు సాగిన దాడులలో ముస్లిం లు కూడా ఎదురు దెబ్బలు తిన్నారు. అంతిమ విజయం కోసం ఉత్తర దక్షిణ పంజాబుల లో దాడులు కొనసాగించారు అపుడప్పుడు యుద్ధ విరామం తీసుకొంటూ చిట్టచివరకు ముస్లింలీగ్ దే పైచేయి అయింది ఈ సమయంలో కాంగ్రెస్ నాయకత్వం దాడులు జరిగినచోట శాంతి కపోతము ఎగురవేయటం సహాయక చెర్యలు తీసుకోవటం చేసారుగాని దాడుల నుండి రక్షణకు చర్యలు తీసుకోలేదు దానితో సామాన్య ప్రజలు బలి అవుతున్నారు. ఈ పరిస్థితులలో జిన్నా గొడవలు జరిగిన ఒక్క స్థలానికి వెళ్లకుండా పరిస్థితులను అంచనా వేస్తూ ఏమిచేయాలో ప్రణళికలు రచించేవాడు దాడులు కొనసాగిస్తూ కాంగ్రస్ పై తీవ్ర వత్తిడి తెచ్చేవాడు. వత్తిడికి గురయినా కాంగ్రెస్ నాయకులూ జిన్నా విధించిన షరతులు ఒకొక్కటే అంగీకరిస్తూ ఉండేవారు చిట్టచివరకు దేశవిభజనకు కాంగ్రస్ ద్వారాలు తెరచింది దేశం ముక్కలైపోయింది. విడిపోయిన భూభాగాలలోని హిందువులు పరిస్థితి అగమ్యగోచరంగా ఉన్న సమయంలో  వారిపై భయంకర దాడులు జరిగాయి. అనేకమంది ప్రాణాలు కోల్పోయారు లక్షల మంది ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకొని భారత దేశానికీ పారిపోయి వచ్చారు. దేశ విభజన భారత చరిత్రలో ఒక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. స్వాతంత్ర పోరాటంలో కాంగ్రెస్  ముస్లిం ఒత్తిడిని ఎందుకు ఎదుర్కోలేకపోయింది ఎందుకు లొంగిపోయింది ఆవివరాలు గమనిద్దాం.       
                            
దేశవిభజనలో కాంగ్రెస్ భాగస్వామ్యం: ప్రధాని నెహ్రు ఒక సందర్భంలో K.M. మున్షి కి వ్రాసిన  ఉత్తరంలో ఈ దేశంలో ముస్లింలకు పూర్తిగా రక్షణ కల్పించవలసిన బాధ్యత కాంగ్రస్ ప్రభుత్వం పైన ఉన్నది అన్నారు. దీనినిబట్టి నెహ్రు ఆలోచనలు అంటే నెహ్రు దృష్టిలో హిందువులు కారణంగా ముస్లింలకు రక్షణలేదు అనేది స్పష్టంగా అర్ధమౌతున్నది కాంగ్రెస్ వ్యవహారమంతా దానికి తగినట్లుగానే ఉండటంలో ఆశ్చర్యంలేదు దీనికి భిన్నంగా ఆలోచించే నాయకులకు గాంధీజీ దగ్గర ఎక్కువ ప్రాధాన్యతలేదు మొత్తం మీద నెహ్రు ప్రభావం గాంధీజీ మీద ఉన్నది అనేది స్పష్టం. కాంగ్రెస్ 1929 లో లాహోర్ లో జరిగిన సమావేశాలలో సంపూర్ణ స్వతంత్రం ప్రకటించింది, అదే లాహోర్ నుండే 1940లో జిన్నా పాకిస్తాన్ సాధించుకొంటాము అని ప్రకటించాడు 1942 లో గాంధీజీ క్విట్ ఇండియా ఉద్యమం ప్రకటిస్తే జిన్నా బ్రిటిష్ వాళ్లతో ‘’దేశవిభజన చేయండి  భారత్ వీడండి అని ‘’ చెప్పాడు. కాంగ్రెస్ ప్రతి చర్యకు కౌంటర్ చర్య జిన్నా నుండి  వచ్చేది ముస్లింలీగ్ ప్రత్యక్ష పిలుపు నిచ్చినప్పుడు కాంగ్రెస్ నాయకత్వం చారిత్రక తప్పిదాలు చేసుకొంటూ పోయింది. 1] ప్రత్యక్ష చర్యను తీవ్రంగా పరిగణించకపోవటం దాడుల నుండి ప్రజలను కాపాడేందుకు ప్రభత్వం పై ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నించకపోవటం ఆర్భాటాలు చేయటమే కానీ సరియైన నిర్ణయాలు తీసుకోకపోవటం పై కొద్ది దాడులలో ముస్లింలు నస్టపోయిన దగ్గరకు కాంగ్రెస్ నాయకులు వెంటనే పరుగులు పెట్టేవారు. ఒకసారి బీహార్లో ముస్లింలకు హిందువులు గట్టి సమాధానం చెప్పారు నెహ్రు వెంటనే బీహార్ కు వెళ్ళాడు. నెహ్రూ కాని కాంగ్రెస్ నాయకులుగాని కలకత్తా, రావల్పిండి, ముల్తాన్ కు వెళ్ళలేదు ఎందుకు వెళ్ళలేదు చరిత్రలో ఇదో పెద్ద ప్రశ్న. 

1947 మే 30న గాంధీజీ ప్రార్ధన కార్యక్రమము పూర్తీ అయిన తరువాత చేసిన ప్రసంగంలో ఒకవేళ హిందూస్తాన్ మొత్తం తగలబడి బూడిద ఐనా కూడా ఒక ఇంచ్ భూమి పాకిస్తానుకు ఇవ్వనని ప్రకటించారు. మేలో ఇట్లా ప్రకటించి ఆగష్టు నాటికీ దేశాన్ని విభజించేందుకు ఎందుకు అంగీకరించారు. డా||రాజేంద్రప్రసాద్ కాంగ్రెస్ పెద్దల నిర్ణయాన్ని ప్రశ్నించాడు కానీ ఏమీ సాగలేదు.  ఈ పరిస్థితులకు దారితీసిన మరో కాంగ్రెస్ నిర్ణయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాలి.     దేశవిభజన పరిణామాల సమయంలో కాంగ్రెస్ ప్రసిడెంట్ ఎంపిక జరిగింది. దేశంలోని ప్రాంతీయ ప్రెసిడెంట్లు ఒక్కరు మినహా అందరూ వల్లభాయి పటేల్ పేరు ప్రతిపాదించారు. ఈ విషయం తెలిసిన మౌలానా అబుల్ కలం ఆజాద్ ఢిల్లీ లో భంగిని కాలనిలో ఉన్న గాంధీజీ దగ్గరకు పరుగెత్తాడు గాంధీజీతో మాట్లాడుతూ కాంగ్రస్ ప్రెసిడెంట్ ఒకవేళ పటేల్ ఐతే కాంగ్రెస్ నుండి హిందువులు కాని నాయకులందరూ వెళ్లిపోవటమో పంపించివేయటమో జరుగుతుంది ఆలోచించండి అని చెప్పాడు. చివరకు గాంధీజీ జోక్యంతో నెహ్రు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఆ తరువాత  పరిణామాలు వెంటవెంటనే జరిగిపోయాయి. దేశవిభజనపై కాంగ్రెస్ నాయకులు  సంతకాలు చేసేసారు. దేశ విభజనపై ముస్లింలీగ్ బ్రిటిష్ ప్రభుత్వం స్పష్టమైన వైఖిరి  ఉంటే కాంగ్రెసులో భిన్న అభిప్రాయాలూ కనిపించాయి       కాంగ్రెస్ లోని ఒకవర్గం దేశవిభజన అనివార్యం అని నమ్మింది. పటేల్ మొదలైన నాయకులూ అసమ్మతి తోనే ఒప్పుకున్నారు. ఒకవేళ పటేల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయుంటే దేశవిభజన ఆపగలిగి వుండేవాడు కాంగ్రెస్ లోని ముస్లిం నాయకులూ కొందరు పాకిస్తానుకు అనుకూలంగా పనిచేస్తూ పరిస్థితులలో చాలా మార్పులు తెచ్చారు ఈ విషయాలు పెద్దగా ఎక్కడా ప్రస్తావనకు రాలేదు.

మొత్తానికి కాంగ్రెస్ దేశ స్వాతంత్రాన్ని సాధించింది కానీ దేశసమగ్రతను ప్రశార్ధకం చేసింది ముస్లింల మెప్పు కోసం హిందుత్వం అంటే మతం అనే స్థిర అభిప్రాయం కలిగించి దేశానికీ చాల నష్టం చేసింది. ముస్లింల యడల నెహ్రు ఆలోచనలు ముస్లిం సంతుష్టికరణ స్వాతంత్ర అనంతరం కొనసాగుతూనే ఉన్నది. ఈ విషయం తాజా ఉదాహరణతో అర్ధం  చేసుకొనే ప్రయత్నం చేద్దాము. పౌరసత్వ సవరణ -2019 బిల్ ను ఇప్పటి ప్రభుత్వం ప్రవేశపెట్టి లోకసభలో ఆమోదం పొంది రాజ్యసభకువెళ్ళింది. ఆ బిల్లులో పాకిస్తాన్, బాంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్ నుండి వచ్చిన ముస్లింలు కానివారికి భారత పౌరసత్వం ఇస్తామని ఉన్నది ఎందుకంటే ఆదేశాలలో ముస్లింలు కానివాళ్లకు రక్షణ లేదు వారిని కాపాడేందుకు చేస్తే కాంగ్రెస్ దానిని వ్యతిరేకించింది. ఆ దేశాలనుండి వచ్చిన ముస్లింలకు కూడా పౌరసత్వం ఇవ్వాలి అనేది కాంగ్రెస్ వాదన. రాజ్యసభలో విప్ జారీచేసి బిల్ కు వ్యతిరేకంగా ఓటు వేసింది.  కాంగ్రెస్ వ్యతిరేకించిన రాజ్యసభలో బిల్ ఆమోదించబడింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నసమయంలో కమ్యునల్ వయలెన్స్ బిల్ తెచేప్రయత్నం చేసింది. కాంగ్రెస్ వైఖిరి నెహ్రు కాలం నుండి ముస్లిం సంతుష్టికరణ కొనసాగుతూనే ఉన్నది. దేశం యెడల హిందువుల యెడల కాంగ్రెస్ వైఖిరిలో పెద్ద  మార్పు రాలేదు.
స్వాతంత్ర్యనంతర పరిణామాలు చివరిగా పాకిస్తాన్ పరిస్థితులుఎట్లా ఉన్నాయో చూద్దాం: 1986 లో G.H.JANSON అనే  ప్రముఖ పాత్రికేయుడు రెండుసార్లు పాకిస్తాన్ ను సందర్శించి  అప్పటి మిలట్రీ అధికారి జియాహుల్ హాక్ తో మాట్లాడి అక్కడి ప్రతిపక్షనేతలను కలిసాడు ఆవిషయాలు తనపత్రికలో ''పాకిస్తాన్లో ఐక్యత తీసుకురాలేని ఇస్లాం ''అనే వ్యాసం వ్రాసాడు. పాకిస్తాన్ లో ఇస్లామీకరణ పెద్దగా పాటించబడటం లేదని దానిని అధికారపూర్వకం గా ప్రజలపై రుద్దుతున్నారని చివరకు అది పనిచేయటం లేదని తేలిపోతున్నది  పాకిస్తాన్ ప్రతిపక్ష నాయకుడు చెప్పిన విషయాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఆయన మాటల లోనే  ''ఒకవేళ ప్రపంచంలో ఉన్నపళంగా  ఇస్లాం మాయమైతే ఇరాన్ దేశం వాళ్ళు ఇరానీయులు,  అరబ్ వాళ్ళు అరేబియన్లు, ఈజిప్టు ఈజిప్టినియన్లు అవుతారు కానీ ఈ పాకిస్తాన్లో ఉన్న మేము ఎవరిలో మాగుర్తింపు చూసుకోవాలో అర్ధం కావటం లేదు అని ఆవేదనవ్యక్తం చేసాడు. ప్రపంచంలో పాకిస్తాన్ దేశం ఒక్కటే ఇస్లాం పేరుతొ ఉన్నది. పాకిస్తాన్ అమెరికాకు చైనాకు ఉపగ్రహంగా ఉన్నది. ఒక్కమాటలో చెప్పాలంటే అక్కడి ప్రజలు గందర గోళంలో ఉన్నారని చెప్పవచ్చు. ఉగ్రవాదులకు తీవ్రవాదులకు ఇస్లామిక్ సామ్రాజ్య వాదులకు స్వర్గధామంగా ఉన్నది. పాకిస్తాన్ ప్రజలను కలిపి ఉంచటానికి కాశ్మీర్ అక్కడి పాలకులకు తారకమంత్రం. అంతకు మించి ఏమి లేదు. బలూచిస్తాన్ ప్రత్యేక ప్రతిపత్తి కోసం పోరాటం చేస్తున్నది పూర్తి అరాచికా పరిస్థితులు అక్కడ ఉన్నాయి‌. పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ గిల్గిట్ బాల్టిస్థాన్లు భారత్ తిరిగి స్వాధీనం చేసుకొంటే పాకిస్తాన్ కుప్పకూలేందుకు సిద్ధమైనట్లే. భారత్ శక్తి వంతమైతే  దేశవిభజన సమసిపోతుంది. అరవింద మహాఋషి చెప్పినట్లు దేశవిభజన సమసిపోయి అఖండ భారత్ నిర్మాణానికి దేశం ఎదురు చూస్తున్నది సమీప భవిష్యత్ లో ఆ కల సాకారం కావాలని కోరుకొందాము. -రాంపల్లి మల్లికార్జున రావు. వ్యాసకర్తతో మీ అభిప్రాయాలు పంచుకొనుటకు ఈ నెంబర్ తో సంప్రదించవచ్చు 9440912192.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments