Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

నవీన భారత ఆవిష్కరణలో రామ జన్మభూమి ఉద్యమం, మందిర నిర్మాణం - Ayodhya Rama Mandir

నవీన భారత ఆవిష్కరణలో రామ జన్మభూమి ఉద్యమం – మందిర నిర్మాణం: మన దేశంలో రాజకీయాలే TOP. ప్రతిదానిని రాజకీయం చేయటం ఒక ఆట. తాజాగా రేపు AUG 5న...


నవీన భారత ఆవిష్కరణలో రామ జన్మభూమి ఉద్యమం – మందిర నిర్మాణం: మన దేశంలో రాజకీయాలే TOP. ప్రతిదానిని రాజకీయం చేయటం ఒక ఆట. తాజాగా రేపు AUG 5న అయోధ్యలో రామాలయ నిర్మాణానికి భూమి పూజ జరగబోతున్నవేళ ఆముహూర్తం సరియినది కాదని, శంకరాచార్య స్వరూపానందా సరస్వతి చెప్పినట్లు Press లో వచ్చింది, అట్లాగే వారణాసి పండితులు ఆ ముహూర్తం మంచిది కాదు అంటూనే భూమిపూజ రాజకీయనాయకుల తో చేయించవద్దని చెప్పారు. పనిలో పనిగా సాకేత్ గోఖలే అనే రాహుల్ గాంధీ మిత్రుడు అయోధ్య లో భూమి పూజ ఆపాలని అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ వేసాడు అతడు చెప్పిన కారణం KOVID -19 సమయంలో కేంద్రప్రభుత్వం విధించిన నియమాలకు ఆ కార్యక్రమము విరుద్ధం ఉన్నదని. కానీ కోర్టు ఆ Pill ను కొట్టివేసింది.

AIMIM ముస్లింపార్టీ శిలాన్యాస్ ప్రధాని నరేంద్రమోదీ తో చేయించటం ఫై అభ్యతరం చెప్పింది. ఎందుకంటే అది మత కార్యక్రమము. మందిరం కట్టబోతున్న స్థలంలో 400 సంవత్సరాల నుండి మసీద్ ఉన్నది దానిని కూలగొట్టారు అని ఒవైసి మాట్లాడాడు. 400 సంవత్సరాలకు పూర్వం వేల సంవత్సరాల నుండి ఉన్న దేవాలయం కూలగొట్టి మసీద్ కట్టారని తెలిసినా చెప్పలేడు ముస్లింల ఇఫ్తార్ విందు ప్రభుత్వాలు ఏర్పాటు చేయవచ్చు కానీ ప్రభుత్వం లో ఉన్నవారు దేవాలయాలకు వెళ్ళకూడదు అదే వాళ్ళ హుకుం అదే ముస్లింల ప్రత్యేకత. పాకిస్తాన్ తీవ్రవాది వాళ్ళను దేవాలయం కట్టనివ్వండి మేము దానిని కూల్చేస్తాం అని అనేశాడు ఎక్కడైనా మేము చెప్పిందే సాగాలి అదే ముస్లింల Secularism దానికి మన Secular నాయకులూ వంత పాడుతూవుంటారు. ముంబయి మహానాయకుడు శరద్ పవర్ July 20న నేడు దేశం కరోనా తో సతమతమౌతూవుంటే ఇప్పుడే భూమి పూజ చేయాలా అని అనకుండానే అయోధ్యలో రామ మందిరం కడితే కరోనా తగ్గిపోతుందా అని వ్యంగంగా ప్రశ్నించాడు అదే ముస్లింలకు సంబందించిన విషయం అయితే నోరు తెరచేవాడా? జులై 22న ప్రశాంతభూషణ్ సుప్రీంకోర్టు న్యాయవాది ట్విట్టర్లో దేశం గడచినా 6సంవత్సరాల నుండి ధ్వంసం చేయబడుతున్నది అని పరోక్షంగా నరేంద్రమోదీ దేశంలో మతతత్వం పెంచుతున్నాడు దానిలో భాగమే రామమందిర నిర్మాణం అని చెప్పక చెప్పాడు. CPI పార్టీ అధికార పూర్వకంగా భూమిపూజ కార్యక్రమాన్నిDD ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం చేయవద్దని డిమాండ్ చేసింది.

AUG 5 లోగా ఇంకా ఎన్ని డ్రామా లు తెరపైకి వస్తాయో వేచి చూద్దాము ఎందుకంటే. రాముడు అరణ్యానికి ఏందుకు వెళ్ళాడు అంటే లోకకల్యాణం కోసం పాపం కైకేయి ధశరధుడిని కోరినవరం తో వెళ్ళాడు అని అనుకొంటాము కానీ అది వసిష్ట విశ్వామిత్రుల సంకల్పం. విశ్వామిత్రుడు వసిష్ఠుడు, ఏందుకు సంకల్పించారు, లోక కల్యాణం కోసం.విశ్వామిత్రుడు రాముడి శక్తి సామర్ధ్యాలు పరీక్షించటానికి యాగ రక్షణ అనే నెపంతో అరణ్యానికి తీసుకొని వెళ్ళాడు అస్త్ర శస్త్రాలు, ఇచ్చి పరీక్షించాడు, రాముడుకి పట్టాభిషేకమే జరగాలంటే దానికి వసిష్ఠుడు ముహూర్తం నిర్ణయించేవాడు, కానీ వసిష్ఠుడు నిర్ణయించిన ముహూర్తం రావణ సంహారానికి కాబట్టే రాముడు అరణ్యానికి వేళ్ళాలి వెళ్ళాడు.

రాముడు దండకారణ్యం లో ప్రవేశించిన దగ్గర నుండీ రాక్షస సంహారం ప్రాంభమై రావణ సంహారంతో పూర్తి అయింది. లోకకల్యాణం కోసం రాముడి జీవితంలో అడుగడునా కష్టాలే, రాముడి కార్యం ఎప్పుడూ ఆటంకాల మద్యే విజయవంతమవుతుందని వందల సంవత్సరాల అయోధ్య ఉద్యమ చరిత్ర కూడా చెబుతున్నది ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు వేగంగా చేసేస్తున్నది. గతంలో అంటే 1992లో అప్పటి కేంద్రప్రభుత్యం అయోద్య చట్టం పేరు తో రామ జన్మభూమి న్యాస్కు చెందిన 67ఏకరాల భూమిని స్వాధీనం చేసుకొంది ఆ భూమిని. ఇప్పటి కేంద్రప్రభుత్యం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆదేశం తోAUG 2న మందిర ట్రస్ట్ కు ఇచ్చి వేసింది. విశ్వహిందూ పరిషత్ దేవాలయ నిర్మాణ ట్రస్ట్ దేశంలోని అన్ని పుణ్య నదుల నుండి నది జలాలు, పుణ్య కేత్రాలనుండి మట్టిని తెప్పిస్తున్నారు ఎందుకంటే అయోధ్యలో రాముడు ఈ దేశం ఆత్మ దేశమంతా కలిసి ఈ పుణ్య కార్యక్రమము చేస్తున్నది. ఒకవేళ కరోనా లేక పోతే ఆ కార్యక్రమము ఎంతో కోలాహలం గా జరిగేది.

ఉద్యమ చారిత్రక నేపథ్యం: భారత దేశం షుమారు 1200 సంవత్సరాల నుండి నిరంతర సంఘర్షణలు సాంస్కృతిక విధ్యంసాలతో గడిచిపోయింది. ఇస్లాం దండయాత్రల కాలంలో భారతీయ సంస్కృతికి కేంద్రాలైన దేవాలయాల విధ్యంసం, భయంకర మతం మార్పిడులు, సామజిక, మతాల ఘర్షణలు నిర్మాణం చేసారు అవిఇంకా కొనసాగుతూనే ఉన్నాయి అవకాశం దొరికిన దగ్గర దేవాలయాలు కూలగొడుతూనే ఉన్నారు ఇస్లాం ఆధిపత్య పోరు ఈ రోజు ప్రపంచమంతా ఉన్నది. బ్రిటిష్ ఆక్రమణ సమయం లో ఈదేశ స్వరూపాన్నే మార్చే లోతయినా కుట్రలు ఎన్నో సాగాయి. పరంపరాగతా మనదేశ వికేంద్రీకృత ఆర్ధిక వ్యవస్థను ధ్వంసం చేసి కోలుకోలేనంత దెబ్బకొట్టారు, విద్యా వ్యవస్థ, న్యాయవ్యవస్థ, సామాజికవ్యవస్థ, పాలనా వ్యవస్థ రూపురేఖలు మార్చేశారు. తమ వలస పాలనకు అనుకూలంగా మన దేశ చరిత్రను మార్చేసి గందరగోళంలో పడేసారు దానినుండి ఇప్పట్టికి బయట పడలేక పోతున్నాం.

ఒకమాట చెప్పాలంటే మనలోని స్వాభిమానం ఆంగ్లేయులు ప్రశ్నర్థకం చేశారు, దానినుండి పూర్తిగా భయటపడటానికి స్వతంత్రం వచ్చి ఇంత కాలం గడచినా ఇంకా ఎంతో ప్రయాస పడుతున్నాం. 1920లో మనదేశంలో ప్రవేశించిన వామపక్ష సిద్ధాంతం తన విద్వంస రచనఇంకా కొనసాగిస్తూనే ఉన్నది. వామపక్ష వాదానికి అనుకూలంగా ఈ దేశ చరిత్ర మార్చేశారు ఈ దేశ ప్రజలలో ఎన్ని సంఘర్షణలు నిర్మాణం చేయాలో అన్నీ చేసుకొంటూనే వస్తున్నారు ఈ పరిణామాలన్నింటి నుండి బయట పడి దేశం తన పరంపరాగత ఆలోచనలు వర్తమాన పరిస్థితులకు అన్వయం చేసుకొని ఒక నవీన భారతాన్ని ఆవిష్కరించుకొనే ప్రక్రియలో మౌలికమైన పని ఈ దేశప్రజలలో స్వాభిమానం నిర్మాణం చేయటం ఇది ఒక చారిత్రక అవసరం. ఆ అవసరం నేపధ్యమే రామజన్మభూమి ఉద్యమం, ఎందుకంటే రాముడు ఈ దేశ అంతరికశక్తి. ఆ శక్తి జాగరణ 400సం వత్సరాల నుండి నడుస్తున్నది. ఆ శక్తికి ప్రేరణ స్రోతస్సు సంత్ తులసీదాస్ ఆవిష్కరించిన రామచరిత మానస్ అదే పెద్ద ఉద్యమము దాని కొనసాగింపే 1989లో ప్రారంభమైన రామ జన్మభూమి జాతీయ ఉద్యమం ఆ ఉద్యమం ముగింపు రామ జన్మభూమిలో భవ్యమందిర నిర్మాణం తో ఒక దశ పూర్తి అవుతుంది. అక్కడనుండి జాతీయ పునర్నిర్మాణ ప్రక్రియ వేగవంతమౌతుంది. 

ఉద్యమ సాఫల్యం: 400 సంవత్సరాలుగా దేశ ప్రజలలో రగులుతున్న సమస్య 134 సంవత్సరాలు గా కోర్టులలో నలుగుతున్న రామజన్మభూమి స్థల వివాదం పై సుప్రీంకోర్టు ఎట్టకేలకు 2019 నవంబర్ 9న ఆ స్థలము రాముడిదేనని తుది తీర్పు ఇచ్చింది. ఆ తీర్పు దేశ చరిత్రలో సువర్ణ అధ్యయం. 1984 నుండి 1992 వరకు ప్రజా ఉద్యమం సాగింది ఆ తదుపరి ప్రభుత్వాలలో కోర్టులలో కదలికలు వేగవంతమైనాయి. 2019 నవంబర్ 9న తుది తీర్పు 2020 AUG 5న భూమిపూజ వాటి వివరాలు సంక్షిప్తంగా.

  • 1934 నుండి ఉత్తరప్రదేశ్ కు పరిమితమైన ఆందోళన 1984లో జాతీయఉద్యమంగా రూపుదిద్దుకొంది. విశ్వహిందూపరిషత్ ఆధ్వర్యంలో 1984లో సాధు సంతులతో ధర్మసంసద్ జరిగింది అక్కడ జాతీయ ఉద్యమ తీర్మానం చేసారు. ఉద్యమం కోసం రామ జన్మభూమి న్యాస్ వ్యవస్థ ఏర్పడింది.
  • 1989లో దేశంలో ప్రపంచంలోని అనేక దేశాలలో రామశిలా పూజలు జరిగి శిలలు అయోధ్యకు చేరుకొన్నాయి.
  • 1989 నవంబర్ 9న శిలాన్యాస్ కార్యక్రమము జరిగింది. ఆ సమయం లో రెండు జర్మనీల మధ్య ఉన్న బెర్లిన్ గోడను రెండు జర్మనీల ప్రజలు కూలగొట్టి రెండు జర్మనీలను ఏకం చేసారు అదే జాతీయ స్వాభిమానం.
  • 1990లో మొదటి కరసేవ జరిగింది. దేశమంతటి నుండి కరసేవకులు పాల్గొన్నారు ప్రభుత్వం కరసేవకులను అడ్డుకొని జరిపిన కాల్పులలో అనేకమంది కరసేవకులు బలిదానమైనారు.
  • 1992 డిశంబర్ 6న జరిగిన కరసేవలో 6 గంటల వ్యవధిలో కరసేవకులు బాబర్ కట్టడం నేలమట్టం చేసి అక్కడ తాత్కాలిక రామ మందిరం ఏర్పాటు చేసారు.
  • ఆ తదుపరి సుప్రీం కోర్టు అయోధ్య కేసు విచారణ కు అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఏర్పాటు చేసి విచారణ ప్రారంభించింది.
  • 2010 September 30న లక్నో బెంచ్ తీర్పునిచ్చింది. ఆ తీర్పులో రాంలల్లా ఇప్పుడు ఎక్కడైతే ఉన్నాడో అదే రామజన్మభూమి అంటూనే 2.77 ఎకరాల భూమిని ముగ్గురు కక్షి దారులకు పంచాలని తీర్పునిచ్చింది.
  • 2019 నవంబర్ 9న సుప్రీం కోర్ట్ఇచ్చిన అంతి మతీర్పులో ఆ భూమి అంతా రాముడిదే అని తేల్చి చెప్పింది.
ఈ తీర్పుతో మందిర నిర్మాణానికి ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయాయి AUG 5 నుండి మందిర నిర్మాణ పని ప్రారంభమవుతుంది. మందిర నిర్మాణం జాతీయ సమైక్యతకు దోహద పడుతుందని చెప్పటం లో అతిశయుక్తి లేదు. శతాబ్దాల చారిత్రక విధ్వంసాలను జాతీయ స్పూర్తితో పరిష్కరించుకోవటం నేర్చుకొంటే విధ్వంసాల వారసత్వం లేదు అని చెప్పే పరిస్థితులు ఏర్పడతాయి అప్పుడే దేశమంతా ఒకత్రాటిపైకి వచ్చి చారిత్రక పరిణామాలు నిర్మాణం చేసిన సమస్యల నుండి బయటపడి భారత్ శక్తి వంతమైన దేశంగా నిలబడ గలుగుతుంది. మందిర నిర్మాణం రామరాజ్య నిర్మాణానికి బాటలు వేయాలి. 400 సంవత్సరాలు గా నడిపిన పోరాటానికి ఆదే ఫలశృతి అవుతుంది. రాంపల్లి మల్లికార్జున రావు. సెల్ నం 9440912192.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments