Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గ్రామాలే రాజధానిగా దేశాభివృద్ధి జరగాలి - శ్రీ రాంపల్లి మల్లికార్జున్ - megaminds

భారతదేశ భౌగోళిక వ్యవస్థను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గ్రామం ఆధారంగా ఈ వ్యవస్థ నిర్మాణమైనట్లు అర్ధమవుతుంది ఆంగ్లేయ అధికారి లెఫ్ట్ నె...


భారతదేశ భౌగోళిక వ్యవస్థను జాగ్రత్తగా పరిశీలించినట్లయితే గ్రామం ఆధారంగా ఈ వ్యవస్థ నిర్మాణమైనట్లు అర్ధమవుతుంది ఆంగ్లేయ అధికారి లెఫ్ట్ నెంట్ కల్నల్ మార్క్విల్స్ పరిశీలనలో "భారతదేశంలో పల్లెటూరుకు "పాటి' అని పేరు. అటువంటి పది నుండి ఇరవై పాడుల మధ్య గల ప్రాంతం ఒక గ్రామం. ఈ పల్లెలకు చెందిన భూములన్నీ ఆ గ్రామ పరిధిలోకే వస్తాయి. ప్రతి గ్రామానికి ఒక పాలనాధికారి ఉండేవారు. అట్టి గ్రామాలు ఐదు నుండి పది మధ్య గల ప్రాంతం ఒక మండలం. ప్రతి మండలానికి ఒక మండల అధికారి; ఆ మండలానికి రక్షణ వ్యవస్థ ఉండేది. అట్లాంటి పది మండలాలను ఒక పరగణ అనేవారు, పరగణ అంటే వెయ్యికి పైగా గ్రామాలు, వెయ్యి గ్రామాలకు కేంద్రం 'నగరం'. పదివేల గ్రామాలకు కేంద్రం 'పురి' అనేవారు. ఇట్లా దేశం ఒక సమయంలో 5, 10,000 గ్రామాలు, 56 రాజ్యాలుగా ఉండేది. ఇప్పటి వ్యవస్థలో 28 ప్రాంతాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, 736 జిల్లాలు, సుమారుగా 3,200 పట్టణాలు, 6,50,000 గ్రామాలుగా ఉన్నది. అప్పుడు వ్యవస్థకు మూలం గ్రామం.

అప్పట్లో మన దేశంలో ఏ గ్రామానికి ఆ గ్రామానికి ప్రత్యేక ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండేది. స్వతంత్రం, సార్వభౌమత్వం కలిగి ఉండేది. ఒక గ్రామం మరో గ్రామం మీద ఆధారపడి ఉండేది కాదు. అందుకే గ్రామంలో అక్కడి ప్రజల అవసరాలు తీర్చే అన్ని వ్యవస్థలు ఉండేవి. దేశాన్ని రాజ్యంలో ఎన్నో రాజవంశాలు పాలించాయి. ఈ దేశం మీద పఠానులు, మొగలులు, ఆంగ్లేయులు మొదలైన విదేశీదాడులు కూడా జరిగాయి. అయినా గ్రామం యొక్క ప్రజాస్వామ్య వ్యవస్థ తన మూల స్వభావాన్ని మార్చుకోలేదు. ఈ వ్యవస్థ యందలి దృఢత్వం మూలంగానే దేశంలో ఎన్ని సామాజిక రాజకీయ మార్పులు వచ్చినప్పటికీ హిందువులు ఎవరి సహాయ సహకారాలు లేకుండానే స్వతంత్రులుగా, సుఖప్రదంగా జీవించగలిగారు.

ప్రతి గ్రామంలో అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ఒక గ్రామ సభ ఉండేది. ఈ గ్రామ నభ్యులు ఎవరి వారసులు కాదు పాలకులచే నియమింపబడేవారు కాదు. వారి గ్రామ ప్రజలే ఎన్నుకొనేవారు. ఇటువంటి స్వతంత్ర గ్రామ వ్యవస్థను, గ్రామ ఆర్థిక వ్యవస్థను ఆంగ్లేయులు కోలుకోలేని దెబ్బకొట్టారు. వాళ్ళ కంపెనీల వ్యాపారం కోసం మన గ్రామీణ వృత్తులను ధ్వంసం చేసారు కమ్యూనిస్టు సిద్ధాంత కర్త కారల్ మార్క్ 1857 లో మనదేశంలో జరిగిన స్వాతంత్ర్య పోరాటముపై వ్యాసాలు వ్రాసారు. ఆ రోజుల్లో భారత గ్రామీణ వ్యవస్థ ఎంతో అద్భుతమైనది అందులో ఆయన ప్రస్థావించారు. వ్యవసాయం ప్రధానంగా ఉన్న గ్రామంలో ఏ వృత్తులవాళ్ళు ఎందరు అవసరమో వారే ఉండేవారని వ్రాసారు. గ్రామం లోని అన్ని వృత్తుల వారి భాగస్వామ్యంలో గ్రామం సమృద్ధిగా ఉండేదని వ్రాసారు. ఆయనే కాదు, అరవింద మహర్షి కూడా 1939 జనవరి 26 ఒక శిష్యుడు అడిగిన పశ్నకు భారత్ లో గ్రామం ఎట్లా ఉండేదో వివరించారు.

మనదేశంలో గ్రామంలో ఒక ప్రత్యేకమైన ప్రజాస్వామ్య కమ్యూనిజం ఉండేది. గ్రామమంతా ఒక కుటుంబం లాగా ఉండేది. ఆ కుటుంబంలో అందరికి తగిన ప్రాధాన్యం ఉండేది. ఎవరి హక్కులు వారికి ఉండేవి. అన్ని వృత్తుల వాళ్ళకు వాళ్ల వాళ్ల అవసరాలు తీర్చబడేవి. ఆచరణీయమైన కమ్యూనిజం అది ఒక్కటే. ప్రతి గ్రామంలో ఉండే ప్రజా సంఘాల మధ్య సమన్వయం ఉండేది. అయితే బ్రిటిష్ పార్లమెంటరీ వ్యవస్థ గ్రామ పంచాయతీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. నేటికీ అదే కొనసాగుతున్నది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే గాంధీజీ "ఈ దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. ఇంకా రావలసినది గ్రామ స్వరాజ్యం' అన్నారు. మారిన కాలమాన పరిస్థితులలో గ్రామ స్వరాజ్ గురించి 1940 లోనే ఆయన రూపకల్పన చేశారు.

గాంధీజీ మాటలలో భారతదేశ ఆర్థిక వ్యవస్థకు మూలం గ్రామం. స్వయం నమ్మద్దు కలిగిన ఆర్థిక వ్యవస్థ గ్రామాలలో ఉండాలి. వ్యక్తి ప్రాథమిక అవసరాలన్నీ గ్రామంలోనే తీరాలి. గ్రామంలోని ప్రతి ఒక్కరికి ఉపాధి లభించే, ఉపాధి కోసం వలసలు ఉండకూడదు దీనికి ప్రేరణ స్వదేశీ, స్వదేశీ అనేది భారతీయ జీవన రచన, స్వదేశీ ఆర్థిక ప్రగతికి, పాలనకు మూలం నైతిక విలువలు. అందుకే గాంధీ 'రాట్నం స్వతంత్ర పోరాటంలో స్వదేశీ ఆయుధం అయింది. గాంధీజీ సాంకేతిక పరిజ్ఞానం కు వ్యతిరేకం కాదు. ఆర్థికాభివృద్ధికి ఈ దేశంలో వికేంద్రీకృత పరిశ్రమలే ఉండాలన్నారు. బ్రిటిష్ వారి కేంద్రీకృత ఆర్థిక వ్యవస్థను వ్యతిరేకించారు. స్వదేశీ విధానం వ్యక్తిలోనూ, వ్యక్తుల మధ్య కాంతి సహృద్బావ వాతావరణం వెల్లివిరిసేలా చేస్తుంది. ప్రకృతితో సహజీవనం వైపు మళ్లిస్తుంది. ఆధ్యాత్మికతను పెంపొందిస్తుంది. ఈ ఆధ్యాత్మిక భావాలు వ్యక్తి జీవితాలపై ప్రభావం చూపిస్తాయి. అటువంటి భావాత్మకత ఒకప్పుడు పల్లెలలో ఉండినది. ఇప్పుడు ఆ స్వదేశీ ప్రేరణ దెబ్బతిన్నది. దాని ఫలితాలు ఎలా ఉన్నాయో విశ్వనాథ సత్యనారాయణ శార్వరి నుండి శార్వరీ వరకు అనే తన నవలలో ఆ రోజుల్లోనే ఇలా వివరించారు బ్రిటిష్ వాళ్ల పరిశ్రమలు, వాళ్ల జీవన శైలి గ్రామీణ క్షేత్రంలోని సామాజిక సంబంధాలపై దెబ్బ కొట్టింది. ఆర్థిక అసమానతలు పెంచింది. రాజకీయ కక్షలను పెంచింది. దానిని తొలగించుకొనేందుకు ఒక ప్రయత్నం చేయాలి అంటూ వ్రాశారు.

పారిశ్రామికీకరణం - దుష్ఫలితాలు: స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి మన పాలకులు గ్రామాలను నిర్లక్ష్యం చేస్తూ పారిశ్రామికీకరణ వైపు మొగ్గు చూపారు. గాంధీజీ ప్రవచించిన గ్రామ స్వరాజ్ మరుగున పడిపోయింది. వాణిజ్య పంటలు ప్రధానంగా రసాయనిక ఎరువులు, క్రిమిసంహార మందుల వాడకం సుమారు గడిచిన 40 సంవత్సరాల నుండి రైతులు ఎట్లా దెబ్బ తీస్తుంది. వర్తమాన చరిత్ర చెబుతున్నది. పంటల దిగుబడులు సరిగా లేక, ధరలలో గిట్టుబాటు రాక రైతులు ఎట్లా అప్పులు పాలవుతున్నారో, ఎట్లా ఆత్మహత్యలు చేసుకుంటున్నారో నేడు చూస్తున్నాం పంజాబులో వ్యవసాయక విప్లవం ఒక మెరుపులా మెరిసి రైతాంగాన్ని ఎట్లా దెబ్బతీసిందో కూడా మనకు తెలుసు ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు కొన్ని ప్రయత్నాలు జరిగాయి. అందులో చెప్పుకోదగినది, అధ్యయనం చేయదగినది ఎమర్జెన్సీ (1977) తరువాత నానాజీ దేశముఖ్ ఉత్తరప్రదేశ్ లోని గొండా జిల్లాలో చేసిన ప్రయోగం. నానాజీ దేశ్ ముఖ్ ప్రముఖ రాజకీయవేత్త, వారు రాజకీయాల నుండి పూర్తిగా బయటకు వచ్చి గోండా జిల్లాను దత్తత తీసు కున్నారు; 'చిత్రకూట్ ప్రాజెక్ట్ చేపట్టారు. ఈ ప్రాజెక్టు దేశవిదేశాల వాళ్ళు అధ్యయనం చేస్తున్నారు.

ఒకవైపు ఇటువంటి గ్రామ స్వరాజ్య ప్రయత్నం జరుగుతుంటే మరోవైపు మనదేశ పరంపరాగత వ్యవ సాయంలో కేంద్రమైన గోవు, గో ఆధారిత వ్యవసాయంపై అధ్యయనం ప్రారంభమైంది. ఒకప్పుడు భారతదేశ జిడిపిలో 50 శాతం గ్రామాల భాగస్వామ్యం ఉండేది ఇప్పుడది 16 శాతానికి పడిపోయింది. కాబట్టి భారత్ కు అవసరమైన ఆర్థిక వ్యవస్థ నిర్మాణ అవసరం ఏర్పడింది భారతదేశంలో అనాదిగా గ్రామము-గోవు వేరుగా లేవు. గోవు లేకుండా గ్రామము లేదు; గ్రామం లేకుండా గోవు మనలేదు భారతదేశం ఈ ప్రపంచానికి ఆత్మ అయితే, భారతదేశానికి గ్రామం ఆత్మ గ్రామానికి రైతే ఆత్మ ఈ బంధం, గొలుసు ఎక్కడో తెగిపోయింది. రైతుకు గోవుతో ఉన్న ఆత్మబంధం తెగింది. దానికి గ్రామీణ భారతం తన ఉనికిని కోల్పోయే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ పరిస్థితులను చక్కదిద్దేందుకు 2009లో దేశం మొత్తంలో విశ్వమంగళ గోగ్రామ యాత్ర జరిగింది. ఈ యాత్రను 2009 సెప్టెంబరు 30న, విజయదశమి నాడు కర్ణాటకకు చెందిన శ్రీ శ్రీ శ్రీ రాఘవేశ్వర భారతి స్వామి కురుక్షేత్రంలో ప్రారంభించారు. అక్కడి నుండి దేశమంతా పర్యటించారు. మన వ్యవసాయంలో, సంస్కృతిలో గోవు ప్రాధాన్యం గురించి ప్రజలకు తెలియచేయడమే ఈ యాత్ర ఉద్దేశం రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు వాడుకం వల్ల వ్యవసాయ భూములు దెబ్బతినటమే కాదు. మన ఆరోగ్యాలకూ నష్టం జరుగుతున్నదని ఈ దేశ శాస్త్రజ్ఞులు కూడా చెబుతున్నారు. ఈ పరిస్థితులలో ప్రజలకు ప్రత్యామ్నాయ మార్గం చూపవలసిన ఆవశ్యకతను పూరించటానికి స్వామీజీ శంఖారావం పూరించారు. గ్రామం-గోవుకు ఉన్న సంబంధం శరీరానికి అత్మకు ఉన్న సంబంధం వంటిది, గో సంరక్షణ గ్రామీణాభివృద్ధి కలగలిసి జరగాలి. గోవు గ్రామాన్ని కాపాడుకోవటంలోనే మానవజాతి సంరక్షణ ఉన్నదని రాఘవేశ్వర భారతి స్వామి దేశ ప్రజలకు వివరించారు. గ్రామం యొక్క ఆమూలాగ్ర పరివర్తనకు ఒక మహా ప్రయత్నం ఆ రోజు నుండి ప్రారంభమైంది. అది నేడు విస్తరించింది. నేడు గోసంరక్షణకు విశేష ప్రయత్నాలు జరుగుతున్నాయి. మహారాష్ట్రకు చెందిన ఒక ప్రముఖ రైతు పాలేకర్ గో ఆధారిత వ్యవసాయంపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు నేడు దేశమంతటా పర్యటిస్తున్నారు. అనేక మంది ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ప్రయత్నాలన్నిటిని సమన్వయం చేయాల్సిన అవసరం నేడు కనబడుతోంది.

ఎలా ఆవిర్భవించిందో తెలియదు, మొదటిసారి ఎవరికి సోకిందో తెలియదు కరోనా ప్రపంచాన్ని కదిలించి వేస్తున్నది. ఆంక్షల వలయంలో మనుష్యులను బందీ చేసింది. లాక్డౌన్ పెట్టాల్సిన దుస్టితి నెలకొంది, లాక్డౌన్ సదలిస్తే వ్యాప్తి పెరుగుతోంది. లేదంటే ఆర్థిక వ్యవస్థ పతనమవుతోంది. దీని ప్రభావము ప్రపంచీకరణ పై కూడా ఉంటుంది. దీనివలన ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడులు వలసలు తగ్గుముఖం పడతాయి. దీని ప్రభావం అభివృద్ధి చెందుతున్న భారత్ పై ఉంటుందని ఇండియాటుడే కాంక్లేవ్ లో గ్లోబల్ స్ట్రాటజిస్ట్ రుచి శర్మ వార్యానించారు. కాబట్టి మారుతున్న నేటి పరిస్థితుల్లో భారత్ పెట్టుబడిదారీ వ్యవస్థ నుండి బయటపడి, గ్రామాలే రాజధానులుగా నూతన ఆర్థిక వ్యవస్థను రచించుకోవాలి. ఒక క్రొత్త నమూనాను ఆవిష్కరించుకోవాలి. ఇది నేటి తక్షణ అవసరం. దానికి మార్గాలు అన్వేషించాలి. ప్రకృతికి వైరస్ గా మారిన అన్ని రకాల కాలుష్య భూతాలను వదిలించుకొని ప్రకృతితో సహజీవనం చేయమని కరోనా బోధిస్తున్న కఠోర సత్యం, చరిత్ర నుండి పాటాలు నేర్చుకొని మనం మారవలసిన సమయం ఆసన్నమైంది. ఆధునిక, సాంకేతిక, పరంపరాగత మన పద్దతులు మేళవించి నూతన భారతాన్ని నిర్మాణం చేసుకోవటం మన తక్షణ కర్తవ్యం. ఇదే మన భారతదేశం స్వాభిమాన భారత్ గా స్వయం సమృద్ద భారత్ గా ఎదిగే మంచి అవకాశం.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments