Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అయోధ్య రామమందిరము సంబంధించి ప్రస్తుతం జరుగుతున్న విషయాలు కూలంకషంగా - Ayodhya Rama Mandir Present Information - MegaMinds

అయోధ్య రామమందిరము సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకూ జరిగిన విషయాలు కూలంకషంగా:  నిన్న (జూన్ 18-2020)  అయోధ్య శ్రీ...

అయోధ్య రామమందిరము సంబంధించి సుప్రీంకోర్టు తీర్పు తరువాత ఇప్పటి వరకూ జరిగిన విషయాలు కూలంకషంగా: నిన్న (జూన్ 18-2020)  అయోధ్య శ్రీరామజన్మభూమి  మందిర నిర్మాణం  సంబంధించి  మాననీయ చంపత్ రాయ్ గారు చేసిన ప్రకటన తర్వాత చాలామంది నిర్మాణ పనుల విషయంలో ఆసక్తిగా ప్రస్తుత పరిస్థితి గురించి అడిగిన దరిమిలా రాంచిలో విడుదల చేసిన ప్రకటన.

అయోధ్య రామజన్మభూమి మందిరం నిర్మాణము మరియు  నిర్వహణ నిమిత్తం గౌరవ సుప్రీంకోర్టు ద్వారా  రామజన్మభూమి  తీర్థ క్షేత్ర ట్రస్ట్  ఏర్పాటు చేయగా, 

గతంలో దేశవ్యాప్తంగా విశ్వహిందూ పరిషత్  ఒక్కొక్క ఇంటి నుండి 'ఒక్క రూపాయి 25 పైసలు' చొప్పున  సేకరించిన ధనం, రెండు లక్షల 75 వేల కు పైగా  గ్రామాలకు  చెందిన భక్తులు  పూజించి పంపిన  రామ శిలలను , అయోధ్య రామ జన్మభూమి ఆలయం కొరకు చెక్కిన శిల్పాలు  మరియు రామజన్మభూమి న్యాస్ ద్వారా కొనుగోలు చేసిన భూమితో పాటు అన్ని ఆస్తులను ట్రస్ట్ కు గత మార్చి నెలలోనే అప్పగించడం జరిగింది.

రామజన్మభూమి  మందిర  స్థలము గతంలో కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకొన్నట్టి భూమిని సుప్రీం కోర్టు తీర్పు మేరకు రామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టుకు  అప్పగించడం జరిగింది.

తీర్థక్షేత్ర ట్రస్ట్ ఆధ్వర్యంలో  మందిర నిర్మాణం నిమిత్తం స్థలం చదును చేసే పనులు ప్రారంభమయ్యాయి.

గతంలో శ్రీకామేశ్వర్ చౌపాల్  గారి చేతుల మీదుగా మందిర నిర్మాణం శిలాన్యాసం నవంబర్ 9, 1989 లోనే జరిగింది. ఇప్పుడు జరగవలసింది మందిర నిర్మాణ పనుల ప్రారంభము.

అది ఏప్రిల్ 30 వ తారీకు ప్రారంభించాలని అనుకోవడం జరిగింది కానీ కరోనా మహమ్మారి వలన ప్రకటించిన లాక్డౌన్ కారణంగా తేదీనే ప్రకటించలేదు.

లాక్‌డౌన్‌ నేపద్యంలోనే ఉగాది రోజున బాల రాముడు  మూర్తులను 1992  డిసెంబర్ 6న నిర్మాణం చేసిన టెంటు నిర్మాణం నుండి  తాత్కాలికంగా చెక్కతో నిర్మాణం చేసిన ఆలయంలోకి అప్పటి అన్ని నియమాలను అనుసరించి మార్చారు... ఈ కార్యక్రమంలో యోగి ఆదిత్యనాథ్ గారు మొదలైన మరికొందరు పెద్దలు మాత్రమే పాల్గొన్నారు. ఇలా ఒక్కొక్క పని జరుగుతున్నది.

వేలాది టన్నుల బరువైన శిలలను ఉపయోగించి కట్టబోయే మందిరము స్థానంలో ఉన్న మట్టి యొక్క సామర్థ్యము పరీక్షించడానికి వంద చోట్ల సుమారు వంద ఫీట్లకు పైగా బోర్ బావి మాదిరిగా త్రవ్వి మట్టి నమూనాలు సేకరించి పరీక్షలకై పంపించడం జరిగింది. నివేదిక రావలసి ఉన్నది.

ఇక ఆ మధ్య జరిగినది ఏమిటంటే రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ అధ్యక్షులు శ్రీ నృత్యగోపాల్ దాస్ గారు ఆలయ పరిసరాలను సందర్శించారు జరుగుతున్న పనులను పేర్కొంటూ"మందిరం నిర్మాణం పనులు మొదలయ్యాయి" అన్న వారి మాటలను,  ఎప్పుడు దేవాలయ పనులు ప్రారంభం కాబోతున్నాయా అంటూ ఎదురు చూస్తున్న భక్తులు మరియు మీడియా దేవాలయ పనుల ప్రారంభం అంటూ ఉత్సాహంతో వార్తలు ప్రసారం చేశారు. 

ఇక గత కొన్ని రోజుల క్రితం తవ్వకాల్లో బయటపడ్డ శివలింగాన్ని పూజిస్తూ అభిషేకాలు యజ్ఞాలు చేశారు.

అయోధ్య శ్రీ రామ జన్మభూమి మంందిరం గురించిన ఏ విషయమైనా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కార్యదర్శి మరియు విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు  అయిన శ్రీచంపత్ రాయ్ గారు కమిటీ నిర్ణయాలను ఎప్పటికప్పుడు  తెలియజేస్తారు ప్రకటించినవే పరిగణలోకి తీసుకోవాలని మనవి.

ఇదిలా ఉండగా, శ్రీ చంపత్ రాయ్ గారు  ప్రకటించినట్లు అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం అత్యంత  విశాలమైన ఎత్తయిన  దేవాలయంగా  రూపుదిద్దుకో బోతున్నది.

 రామ జన్మభూమిలో నిర్మించబోయే భవ్యమైన మందిరం నమూనాను గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ కు చెందిన ప్రసిద్ధ శిల్పాచార్యులు శ్రీమాన్ చంద్రకాంత్ సోంపురా గారు (వీరి తాతగారు సోమనాథ మందిరం యొక్క నమూనాను తయారు చేశారు.)  270 ఫీట్ల పొడవు 135 ఫీట్ల వెడల్పు 125 ఫీట్ల ఎత్తు కలిగిన (సుమారు 12 అంతస్థుల భవనం అంత ఎత్తు ) రాళ్ళతో నిర్మాణం చేయబోయే రెండు అంతస్తుల మందిర నిర్మాణం యొక్క  నమూనాను తయారుచేసి ఇచ్చారు. (మనం తరచుగా చూస్తుండే చిత్రం అదే) ఈ మందిరము నిర్మాణానంతరం బహుశా దేశంలోనే ఎత్తయిన మరియు విశాలమైన  గర్భగుడి కలిగిన మందిరం కావచ్చు.

                   భవదీయులు
~ వీరేంద్ర విమల్, క్షేత్ర మంత్రి.మరియు
~ ఆకారపు కేశవరాజు,పట్నా క్షేత్ర సంఘటన మంత్రి.
విశ్వహిందూ పరిషత్ పట్నా క్షేత్రము (బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలు).

అయోధ్య రామమందిర ప్రస్తుత విషయాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments