చైనా విస్తరణ వాదాన్ని స్వదేశీ డైనమెట్ తో పేల్చేద్దాం We need to reduce our dependence on China - Appala Prasad

megaminds
0
సరిహద్దుల్లో ఆయుధాలతో  భారత  సైనికులు, దేశం లోపల చైనా వస్తువులతో భారత పౌరులు కలిసి పోరాటం చేస్తే చాలు. ప్రపంచ దేశాల మధ్య సమాన స్థాయిలో వ్యాపారాలు కొనసాగించటం ఎవరికీ అంత పెద్ద నష్టం లేదు. కాని చైనా మాత్రం  అలా కాదు. మోసపూరితమైన అలాగే కపట బుద్దితో, వంచనలతో కూడిన విధానాలతో  వ్యాపార వాణిజ్యాలు కొనసాగించి, భారత్ లోని  ఒక్కొక్క వస్తువుల రంగాన్ని వ్యూహాత్మకంగా భారతీయ పారిశ్రామిక వేత్తల నుండి  లాక్కుని,  భారతీయ ఆర్థిక వ్యవస్థను శాశ్వతంగా దెబ్బ కొట్టాలని చైనా పావులు కదుపుతున్నది. చైనా చేస్తున్న‌ కొన్ని‌ దుర్మార్గాలు ఇక్కడ మీముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను.

1. ఉదాహరణకి  వస్త్రాల ఉత్పత్తిలో భారత్ ప్రథమ స్థానంలో ఉంది. భారతీయ రైతులు పండించే ప్రత్తి ధర క్వింటాలు కి 4000 రూపాయలు వుంటే 2013 లో చైనా 7000 రూపాయలు రైతులకు చెల్లించి మొత్తం పంటను కొనివేసింది. మన దేశపు వస్త్ర పరిశ్రమలకు ప్రత్తి దొరక కుండా చేసింది. దాంతో మన వస్త్ర పరిశ్రమలు మూత పడ్డాయి. ఇలా ఏ దేశం లోని మార్కెట్లలోనైనా చైనా ప్రవేశిస్తే, అక్కడ చైనా తమ వస్తువులను తక్కువ ధరకు అమ్మి ఆయా దేశాల వస్తువులు మార్కెట్లో లేకుండా చేయటం చైనా వ్యూహంలో భాగం.

 2. సైకిళ్ళ పరిశ్రమ వల్ల మన దేశం లో లక్షలాది కుటుంబాలు జీవనం గడుపుతున్నాయి. సైకిళ్ళలోని అన్ని భాగాలు చైనా నుండి రావటంతో తక్కువ ధరకు లభించటం వల్ల పంజాబ్ లో వందల ఫ్యాక్టరీలు మూత పడ్డాయి. ఒక్క ఫిరొజాబాద్ లో  400 మూత పడి కేవలం  40 మిగిలాయి. లక్షలాది కార్మికులు ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు.

3. భారత్ లోని ట్రక్కులు, బస్సులకు కావలసిన 1,30,000 టైర్లు మన మార్కెట్లలో డంపింగ్ చెసి, ఎటువంటి వారంటీ, బిల్లు లేకుండా తక్కువ ధరకు  అమ్మటంతో మన టైర్ల ఫ్యాక్టరీలు మూతపడ్డాయి.

4. సొలార్ ప్యానల్ ఒక కిలోవాట్ కి 0.51డాలర్ చొప్పున మనం తయారు చేసి అమ్ముతుంటే, చైనా 0.40 డాలర్ చొప్పున అమ్మి మన ఫ్యాక్టరీలను  దెబ్బ తీసింది. అదే జపాన్ లో నైతే చైనా నుంచి వచ్చిన  సొలార్ ప్యానల్ ల పై దిగుమతి సుంకం భారీగా విధించి జపాన్  తమ ఫ్యాక్టరీలను కాపాడుకున్నది.

5. ఎలక్ట్రానిక్ రంగం పూర్తిగా చైనా చేతుల్లోకి పోయింది. విప్రో, జీనత్ కంపనీలు ఉత్పత్తి చేయలేక చేతులెత్తేశాయి. ఇంజినీరింగ్ కళాశాలలలో ఎలక్ట్రానిక్ సబ్జెక్ట్ తీసుకునే విద్యార్థులే లేరు. ఇలాగే 10 సంవత్సరాలు కొనసాగితే అప్పుడు బీటెక్, ఎంటెక్, పిహెడీ చేసిన టెక్నొక్రాట్లు దొరకక పోతే మళ్లీ ఎలెక్ట్రానిక్ రంగాన్ని పునరుద్దరించేదెలా?

6. భారతీయ మార్కెట్లలో ఆట బొమ్మలు మనవి 80శాతం వుండేవి. ఇప్పుడు చైనా నుండి 60శాతం, ఇతర దేశాల నుండి 20 శాతం వస్తున్నాయి. వేలాది ఆటబొమ్మల ఫ్యాక్టరీలు మూలన పడి లక్షలాది మంది నిరుద్యోగులయ్యారు. పైగా రసాయనాలు కలిపిన బొమ్మలు చైనా అమ్ముతున్నది. మన చిన్న పిల్లలు అవి నోట్లో పెట్టుకొని ఆడుతుంటే ఏమి అవుతుందో ఊహించండీ. కారు మొదలైన  ఆట బొమ్మలకు వెనక వుండే కాయిల్ లు, కాపర్ వైర్లు కూడా చైనా నుండి వస్తున్నాయి.

7. గతం లో చైనా నుండి దీపావళి టపాసులు వచ్చి ఎంత ప్రమాదాన్ని తెచ్చి పెట్టాయో మనకు తెలుసు. భారత  ప్రభుత్వం నిషేధించినా కూడా దొంగ చాటుగా డంపింగ్ చేస్తున్నది.

8. బ్లడ్ క్యాన్సర్, ఎయిడ్స్ వంటి రోగాల  నివారణకు  మందులు తయారు చేయటం లో మన దేశం ప్రథమ స్థానంలో ఉంది. ఆఫ్రికన్ దేశాల్లో నాణ్యమైనవిగా, సరసమైన ధరలకు మందులను అమ్మే మంచి పేరు వుంది. కాని చైనా దొంగతనంగా నాసిరకం మందులు తయారు చేసి ప్యాకట్లపై Made in India అని లేబుల్ వేసి ఎక్కువ ధరకు ఆఫ్రికన్ దేశాల్లో అమ్ముతూ, భారత్ ని అపఖ్యాతి పాల్జెస్తున్నది. 

9. మన దేశం లోని ఫార్మాస్యుటికల్ రంగాన్ని దెబ్బ కొట్టి మార్కెట్ ని ఆక్రమించి ఆధిపత్యం చలాయించే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. విటమిన్ ఫాలిక్ యాసిడ్ ని తయారు చేసే పరిశ్రమ లను మూసి వేయించే పనిలో భాగంగా మనకంటే తక్కువ గా, కిలోకి 4,500 రూపాయలకు అమ్మి, మన పరిశ్రమలు మూత పడగానే, 11 నెలల వ్యవధిలోనే  అదే మందును కిలో కి 50,000 చొప్పున అమ్మి సొమ్ము చేసుకున్నది. 

10. అ)ఆఫ్రికన్ దేశాల్లో 60 శాతం వనరులు చైనా చేతుల్లో వున్నాయి. ఆ) 70 శాతం మౌలిక వసతుల నిర్మాణం ఆ దేశాల్లో చైనానే చేపట్టింది. ఇ) ఆ దేశాల్లో చైనా నగరాలను నిర్మించి 25 లక్షల మంది చైనా పౌరులను ఆ దేశాలకు తరలించింది. ఈ) ఆఫ్రికన్ దేశాల మహిళ లను వివాహాలు చేసుకుంటున్నారు. తద్వారా రాజకీయంగా ఆక్రమణ కోసం వ్యూహం సిద్దపరుచుకున్నారు. సుమారు 20 కోట్ల మంది ఆఫ్రికన్ దేశాల్లోకి చైనీయులని తరలించాలని వ్యూహం.

11. మన సమీప దేశాలైన నేపాల్ బంగ్లాదేశ్, మయన్మార్, శ్రీలంక లకు అధిక మొత్తం లో ఆర్థికంగా అప్పులు ఇచ్చి, అవి మళ్లీ చెల్లించలేని స్థితిలో వున్నప్పుడు  ఆ దేశాల్లో  భూములు సేకరించి సైనిక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నది.

12. శ్రీలంకలో తమిళుల ఉచకొత, తద్వారా జాతుల మధ్య ఘర్షణ సృష్టించి, ఆయుధాలు సరఫరా చేసి, శ్రీలంకను అన్ని విధాల సర్వ నాశనం చేసిన తాటకీ  చైనా.

13. సూడాను దేశంలోని 2లక్షల మంది  పౌరులను చిత్ర హింసల పాల్జెసి, హత మార్చిన ఘనత చైనాదే.

14. లాటిన్ అమెరికా దేశాలు, బ్రెజిల్ దేశంలో కూడా తన ఆర్థిక పంజాను జాపి ఆ దేశాల్లోని ఆర్థిక వ్యవస్థను కుప్ప కూల్చుతున్నది. 

15. హిందూ మహా సముద్రంలో మైనింగ్ పేరుతో  అనుమతులు తీసుకుని, ఆయుధాలు సమకూర్చి  సైనికులను మోహరించింది.

16. చైనా నుండి పారిపోయి అమెరికా శరణు చొచ్చిన ఒక డాక్టర్  అమెరికా సెనేట్ ఉప సమితి సభ్యుల  ముందు బయట పెట్టిన రహస్యాలు  వింటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. ప్రతి సంవత్సరం 3000 మందిని  తప్పుడు  నేరారొపణ చేసి  మరణ శిక్ష విధించి, తుపాకీ తో పేల్చి, గుండె కొట్టుకుంటున్నప్పుడె వాళ్ల చర్మాన్ని వొలిచి,దానిలో వుండే కొలాజిన్ అనే పదార్థాన్ని తీసి సౌందర్య సాధనాల్లొ కలిపి ప్రపంచ వ్యాప్తంగా వ్యాపారం చేస్తున్నదట. అంతే కాదు మరణించిన వారి అవయవాలు కోసి స్మగ్లింగ్ చేసి చైనా  ధనం ఆర్జిస్తున్నది అంటే తన స్వంత పౌరులపై కూడా కనికరం చూపక  అమానుషంగా వ్యవహరిస్తున్న తీరుని  ప్రపంచం తీవ్రంగా ఖండించాలి.

17. ఆసియా మౌలిక వసతులు పెట్టుబడుల బ్యాంక్ లో చైనా  అధిక వాటా కలిగి ఆసియా దేశాలపై ఆధిపత్యం కలిగి ఉండి, భారత్ ని దెబ్బ తీయాలని ప్రయత్నం జరుపుతున్నది.

18. సుమారు 70 దేశాలను కలుపుతూ   వ్యాపార వాణిజ్య విస్తరణకు గాను ఒకే బెల్ట్, ఒకే రోడ్ నిర్మాణం జరుపుతున్నది. రోడ్, నౌకా, రైలు మార్గం కలిపి చేస్తున్న ఈ నిర్మాణం యొక్క ముఖ్యోద్దేశం ఆయా దేశాల మార్కెట్లను ఆక్రమించడమే.ఆ మార్గంలో  వసూలు చేసిన టోల్ రుసుము చైనాకే చెందుతుంది.    

19. 1949లో చైనా లో నూతన  కమ్యూనిస్ట్ ఏర్పడినప్పటి నుండి భారత్ పై అన్ని వైపులా పరోక్ష యుద్దాన్ని   కొనసాగిస్తున్నది . చైనా చెస్తున్న తప్పిదాలను  అప్పటి మన హోం మంత్రి సర్దార్ పటేల్జీ ఒక లేఖ ద్వారా ఎత్తి చూపి, హెచ్చరించినప్పటికీ  చైనా తన  ధోరణి మార్చుకోలేదు.

20. 1949లో భూటాన్ తమ దేశపు రక్షణ మరియు విదేశీ వ్యవహారాలకు భారత్ ను ప్రొటెక్టర్ గా ఉండాలని భూటాన్  కోరింది. బౌద్దలామాలు కూడా అప్పటి ప్రధాని నెహ్రూకి ఈ విషయమై నచ్చ చెప్పారు. కాని నెహ్రూ ఒప్పుకోక, చైనాను భూటాన్ కి ప్రొటెక్టర్ గా ఉంటే బాగుంటుందని సూచించారు.దాని ఫలితంగా చైనా ఇప్పటికీ  భూటాన్ లో  వేలాది ప్రజల మానవ హక్కులను అణిచివేస్తున్నది.

21. చైనాతో మనదేశం పంచశీల ఒప్పందం చేసుకున్న తరువాత, మానస సరొవరం వెళ్ళే దారిలో తపాల, కమ్యూనికేషన్ సౌకర్యాలు మనమే ఉపసంహరించుకునేట్లు  చేసింది. ఫలితంగా యాత్రికులను ఇబ్బందులకు గురిచేసింది.

22. చైనా తమ దేశపు పారిశ్రామిక వేత్తలకు 18 ట్రిలియన్ డాలర్ల మేరకు రుణాలిచ్చి ప్రపంచ దేశాల్లో వ్యాపార విస్తరణకు స్వేచ్ఛనిచ్చింది.

24. హిమాలయాల్లో ప్రవహించే బ్రహ్మపుత్ర నది నీళ్లు మన దేశంలో ప్రవేశించకుండా పవర్  ప్రాజెక్ట్ లు నిర్మించి అడ్డుకట్ట వేస్తూన్నది.

25. జమ్మూ కాశ్మీర్ మరియు అరుణాచల్ ప్రదేశ్ లోనికి వీసా లేకుండా తమ దేశపు  పౌరులను పంపుతున్నది. ఈ రెండూ భారత్ లో భాగం కాదని చెప్పటం కోసం చైనా ఈ విధంగా వ్యవహరిస్తున్నది.

25. తనకు సంబంధం లేకున్నా,అనవసర జోక్యం చేసుకుని, పాకిస్తాన్ తీవ్రవాదులను ఇంటర్నేషనల్ టెర్రరిష్టులుగా ప్రకటించకుండా వీటొ చేసి అడ్డుకున్న విషయం మనకు తెలిసినదే.

26. చైనా పరిశ్రమల ద్వారా ఇతర పనుల ద్వారా కార్బన్ డై ఆక్సైడ్, మీథేన్ వాయువును 50 శాతం పైగా వదిలిపెట్టి భూ ఉపరితలంపై ఉష్ణోగ్రత ను పెంచుతున్నది. ఫలితంగా వాతావరణం లో 1.5 డిగ్రీలు ఉష్ణోగ్రత పెరిగింది. ఉత్తర దక్షిణ ధ్రువాల వద్ద మంచు కరిగి  సముద్ర తీర సమీప దేశాలు, దీవులు, అరణ్యాలు జల ప్రళయంలో చిక్కుకునే ప్రమాదం కొని తెస్తున్నది. ఫలితంగా 130 కోట్ల మంది ప్రజలు నిర్వాసితులు అవుతారు.

27. ప్రతి సంవత్సరం  400 సార్లు సరిహద్దు దాటుతూ బంకర్లను టవర్లను కూల్చటం చైనా నిత్య కృత్యంగా మారింది.

28. 1962లో దొంగ చాటుగా యుద్దానికి దిగి 3000 సైనికులను హతమార్చి,38వేల చదరపు కిలోమీటర్ల భారత భూమిని ఆక్రమించి,పైగా భారతే తమ 1,04,000 చదరపు కిలోమీటర్ల భూమిని స్వాధీనం చేసుకున్నదంటూ  విశ్వ వేదికల పై అబద్దాలు ప్రచారం చేస్తున్నది.

29. అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ లోని తవాంగ్ జిల్లాలో పర్యటన చేయనున్నాడని తెలిసి చైనాలోని భారత దౌత్యాధికారి శ్రీ మతి అనుపమరావుని  మహిళ అని కూడా చూడకుండా రాత్రి 2 గంటలకు లేపి, పిలిచి హెచ్చరించడం జరిగింది. మానవ హక్కుల భక్షకి, పర్యావరణ విధ్వంసకి, యుద్దోన్మాది, మార్కెట్లో వస్తువుల డంపింగ్ తో  ఆర్థిక  సామ్రాజ్య వాద పిపాసి,  నియంత... ఇలా చైనా కేవలం భారత్ కే కాదు ప్రపంచానికే ప్రమాద కారిగా  పరిణమించింది. చైనా విస్తరణ వాదాన్ని, స్వదేశీ డైనమెట్ తో పేల్చేద్దాం. చైనా వస్తువులను బహిష్కరించి, భారతీయ వస్తువులను ప్రోత్సహిద్దాం. -అప్పాల ప్రసాద్.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top