Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చిక్కబళ్ళాపూర్ సర్దార్ బైచు గౌడ పోరాటం - About Baichu Gowda the Warrior Against Hyder Ali MegaMinds

క్రీ.శ. 1755 శ్రీరంగపట్నంలో హైదరాలీ భవనం ఆనంద సాగరంలో మునిగి తేలుతోంది. మరి బుల్లి నవాబు టిప్పు పుట్టినరోజాయే!. అధికారులంతా వింద...

క్రీ.శ. 1755 శ్రీరంగపట్నంలో హైదరాలీ భవనం ఆనంద సాగరంలో మునిగి తేలుతోంది. మరి బుల్లి నవాబు టిప్పు పుట్టినరోజాయే!. అధికారులంతా విందులో కులాసాగా బాతాఖానీ కొడుతున్నారు. హైదరాలీ చూపులు మంత్రి మీర్ సాదక్ మీద నిలిచాయి. మీర్! ఆ చిక్కబళ్ళాపూర్ పోలియగార్ ఏడీ? రాలేదా? గత అయిదేళ్ళు కప్పం కట్టాడా లేదా?. లేదు సర్కార్! మనం ఎన్ని ఆజ్ఞలు పంపినా లెక్కచెయ్యటం లేదు. మాది స్వతంత్ర దేశం. అక్రమంగా మామైసూరు సింహాసనాన్ని ఆక్రమించి కూర్చుంది మీ హైదరాలీయే అని జవాబు పంపాడు జహాపనా!. ఊ! అంత పొగరా? ఉగ్రుడయ్యాడు హైదరాలీ.

అప్పటికే చుట్టు ప్రక్కలున్న పోలియగార్లు, తాబేదార్లు మిరాసీదార్లు గుసగుసలాడసాగారు. చుట్టూ పరికించిన హైదరాలీ ముఖం మరీ ఎర్రబారింది. చిక్కబళ్ళాపూర్ పోలియగారు దాసోహం అనిపించకపోతే తనకు తలెత్తుకు తిరిగే అవకాశమే ఉండదు. బైచు గౌడ సద్వంశీయుడు. తరతరాలుగా చిన్న సంస్థానాన్ని కలిగివున్న వంశం. శివ భక్తులు, వీరులు, ప్రజారంజకంగా పాలించేవారు అన్న పేరున్న వంశం వారిది. అన్నింటినీ మించి దేశభక్తి, శార్యం, ఆత్మగౌరవం నరసరాల లో ప్రవహించే వంశాంకురం బైచుగౌడ.

తన మాతృభూమిలో మ్లేచ్చులపాలనను అనుక్షణం నిరసిస్తున్న బైచుగౌడ హైదరాలీ పోలియగార్ గా వంగి సలాంలు ఎలా చెయ్యగలడు? కానీ నిస్సహాయుడు బైచుగౌడ. స్వార్థం కోసం, స్వసుఖాల కోసం, పదవులకోసం మిగతా సంస్థానాధీశులు దాసోహం అయ్యారు. పోలియగారులుగా మారి ఆ తురుష్కుల మో చేతినీళ్ళు త్రాగుతూ బతుకుతున్నారు. అయితే ఇక వర్షాకాలం దాటింది పశ్చిమానికి జైత్రయాత్రకు తరలింది హైదరాలీ సైన్యం. తానే స్వయంగా సైన్యాన్ని నడుపుతూ, మంత్రి మీరే దత్, సైన్యాధిపతులు, అసంఖ్యాక సైన్యం వెంటరాగా అదుపు లేకుండా సాగుతున్నాడు హైదరాలీ. దోవలో పోలియగార్ల సుస్వాగతాలు, విందులు, వినోదాలు, చెల్లించే బహుమానాలతో హైదరాలీ హృదయం పొంగిపోతోంది. ప్రతి పోలియగారూ తన సైన్యంలో కొంత భాగాన్ని తురక సైన్యంతో కలిపి పంపసాగాడు జైత్రయాత్ర కోసం.

చిక్కబళ్ళాపూర్ సమీపానికొచ్చి ఆగింది అఖండ సేనావాహిని. బురుజు మీద పహరావాళ్ళు ఎగిసే దుమ్ము చూశారు. క్రమంగా కనిపించసాగింది సైన్యం. రెపరెపలాడే ఆకుపచ్చ జండాలు దర్శనమిచ్చాయి. పరిస్థితి అర్థమైంది, గుండెలు గుబగుబలాడాయి. ఒక్క పరుగున వచ్చి చేరారు బైచుగౌడ సమ్ముఖానికి. ఊ! అంటూ గంభీరంగా తలూపాడు బైచుగౌడ. నిశిత దృష్టితో పరికించాడు. మంత్రి, సేనానుల మీద చూపు నిలిచింది. బైచుగౌడ మనస్సును అర్థం చేసుకోలేని మూర్ఖులు కాదు ఆ ఇద్దరు. ప్రభూ! మీ ఆఖరి శ్వాసదాకా పోరాడుతాం అన్నారు. దృఢంగా కోట తలుపులు మూత పడ్డాయి. యుద్ధ ప్రయత్నాలు ముమ్మరంగా సాగాయి. తనముందు నిలిచి అహంకరిస్తూ మాట్లాడే దూతను తేరిపార చూచాడు బైచుగౌడ. అతడు తన దేశీయుడే. కన్నడ వ్యక్తి! ఏమి బానిసత్వం? విదేశీ తురుష్కుడి పాదసేవే పరమపదం అనుకుంటున్నాడతడు. ఆఖరి హెచ్చరిక! ఇప్పటికీ మించిపోయింది లేదు. సర్కార్ వారికి అయిదేళ్ళు బకాయిలు చెల్లించి దాసోహమంటే నీ సంస్థానాన్ని నువ్వే ఏలుకోవచ్చు. నవాబు వారు క్షమిస్తారు అన్నాడు దూత.

హూ! ఆపు నీ నైచ్యం! ఈ దేశంలో పుట్టి, తురుష్కుడి తరపున మాట్లాడటానికి సిగ్గు లేదా? యుద్ధ భూమిలోనే జవాబిస్తామని చెప్పు నీ సర్కార్ కు! బైచు గౌడ ఉగ్రరూపం చూచి గడగడలాడిపొయ్యాడు దూత. యుద్ధ భేరీలు మోగాయి. మూడురోజుల యుద్ధం సాగినా కోట తలుపుల్ని ఛేదించలేకపోయ్యాయి హైదరాలీ సైన్యాలు. కోట మీద నుంచి వచ్చిపడే బాణాలు బల్లేలకు తన సైన్యం నేలకొరుగుతోంది. రహస్య మంతనాలు సాగాయి, మరునాడు ఎవరో కోట తలుపులు తెరిచారు. కుట్ర తెలిసిన బైచు గౌడ స్వయంగా హైదరాలీ సైన్యంతో తలపడ్డాడు. ఎక్కడ చూచినా తానే అయి పోరాడసాగాడు బైచుగౌడ. కాని అసంఖ్యాక సేనావాహిని ముందు చిన్న సంస్థానం నిలువలేకపోయింది. పట్టుపడ్డ బైచుగౌడ శృంఖలాబద్దుడై హైదరాలీ ముందుకు తేబడ్డాడు.

హూ! పాలేగార్లేమంటున్నారు? ఇప్పటికైనా తెలివి తెచ్చుకొని ఇస్లాంలో నీ ప్రజా మొత్తంతో చేరు. నీ సింహాసనం నీకే దక్కుతుంది. అక్రమాలకు, దౌర్జన్యాలకు లొంగి బానిస బ్రతుకు బ్రతికే వంశంగాదు మాది. ఈ భూమిమాది. నీలాంటి నీచులకు ఏహక్కూ లేదు. బైచుగౌడ గర్జనకు హైదరాలీ తో సహా అంతా కళవళ పడి పొయ్యారు. చీకటికొట్లో పారెయ్యండి అజ్ఞాపించాడు హైదరాలీ. జైత్రయాత్ర నుంచి శ్రీరంగపట్నం వైపు తిరిగి వస్తూ చిక్కబళ్ళాపూర్ లో ఆగాడు హైదరాలీ. చీకటి కొట్టు శిక్షకు ఈపాటికి బైచు గౌడ నీరుగారి పోయి వుంటాడని గట్టి నమ్మకమే అతనికి. తలుపు తెరిపించి బయటకు పిలిపించాడు.

ఇప్పటికైనా తెలివి వచ్చిందా బైచుగౌడా! మా అధికారానికి ఎదురులేదు. ఇస్లాం పుచ్చుకో... సుఖాలను అనుభవించు. తుపుక్ ఉమ్మి వెనుదిరిగి చీకటి గదిలోకి వెళ్ళిపోయాడు బైచుగౌడ. ఆ చీకట్లో శృంఖలా బద్దమైన భారతావని మసకగా కనిపించిదా మనిషికి. ఇలాంటి గొప్ప యోధులను కన్న భూమి మనది. జై హింద్. సేకరణ: చరిత్రలో ఇలా జరిగిందా పుస్తకం నుండి.

ఇలాంటి జీవిత చరిత్రల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments