Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రాజా ఛత్రసాల్ జీవిత విశేషాలు - About Raja Chatrasaal in Telugu - MegaMinds

ప్రస్తుత భారతహిందూ సమాజం అంతా సెక్యులరిజం అనే మత్తులో దేశ హితము కోరేవరో తెలియని అయోమయ స్థితిలో సామాన్య హిందూ సమాజం అంతా నిద్రావస...


ప్రస్తుత భారతహిందూ సమాజం అంతా సెక్యులరిజం అనే మత్తులో దేశ హితము కోరేవరో తెలియని అయోమయ స్థితిలో సామాన్య హిందూ సమాజం అంతా నిద్రావస్తలో ఉంది, ఇటువంటి తరుణంలో మనమంతా ఒక గొప్ప యోధుడు గురించి తెలుసుకొని ప్రేరణ పొందవలసిన సయయమిది. ఆ వీరుడే రాజా ఛత్రసాల్, యమునా నదికి, వింధ్య పర్వతాలకు మధ్య వున్న భూభాగమే బుందేల్ ఖండ్. బుందేల్ ఖండ్ వజ్రాలకు ప్రసిద్ది. అక్కడి వజ్రమే ఛత్రసాల్.

మొగలాయి సామ్రాజ్యం స్థిరపడ్డప్పటి నుండి బుందేల్ ఖండ్ సామంత రాజ్యంగా వుండేది. ఆ ప్రాంత పాలకులు, ప్రజలు పూర్తిగా స్వాభిమానాన్ని పోగొట్టుకున్నారు. ఒక బుందేల్ రాజైతే తన కుమార్తెను ఏలుకొమ్మని షాజహాన్ గారికి సమర్పించుకున్నాడు. అంత దిగజారిన స్థితి అది. ఎందరు బుందేల్ కన్యల్ని తురకలు ఎత్తుకెళ్ళారో ఎవరికీ అంతుతేలని విషయం. మొగలులకు ఎదరు నిలబడ్డ సంస్థానం ఒక్కటే. అది చంపత్ రాయ్ ది. ఆ బుందేల్ పాలక వంశంలో పుట్టాడు ఛత్రసాల్, 26-5-1650 నాటి శుభదినాన. ఛత్రసాల్ స్పురద్రూపి, ధృఢమైన శరీరం కలవాడు. తండ్రి చంపత్ రాయ్ ఔరంగజేబు సైన్యాలతో పోరాడుతూ చనిపోయాడు. తల్లి ఆ విషయం విని ఆత్మాహుతి చేసుకుంది.

1655 లో ఔరంగజేబు దక్కనుమీద దండయాత్రకు మీర్జా రాజా జయసింహ ని పంపాడు. ఆ సైన్యంలో చేరితే తన పరాక్రమాన్ని ప్రదర్శించుకోవచ్చని జయసింహుడి సుముఖానికి వెళ్ళి తన వంశ పరిచయం చేసుకున్నాడు ఛత్రసాల్. అతని తండ్రి, తాతల విషయం తెలిసిన జయసింహుడు ఆ అపార మొగలాయి సైన్యంలో చిన్న నాయకుడి పదవి ఇచ్చాడు ఆ కుర్రాడికి. మొగల్ సైన్యాలు దక్షిణానికి చేరాయి. ఆ రోజుల్లో మొగలుల ప్రథమ శతృవు శివాజీయే గదా! పురంధర్ కోట ముట్టడి మొదలైంది, పోరాటంలో ఛత్రసాల్ కూడా పాల్గొన్నారు, అక్కడే ఓ చమత్కారం జరిగింది, ఆ ప్రాంతంలో ప్రతివాళ్ళూ శివాజీ వీర కృత్యాల్ని కథలుగా చెప్పుకోవటం విన్నాడు ఛత్రసాల్. అఫ్జల్ ఖాన్ వధ, షెహస్తఖాన్ చేతివేళ్ళు నరకటం, పురందర్ ఒప్పందం ప్రకారం శివాజీ ఆగ్రా వెళ్ళగా అతన్ని ఖైదు చెయ్యటం, అక్కడ్నుంచి ఆయన తప్పించుకోవటం అన్నీ ఛత్రసాల్ ను ముగ్ధుడ్ని చేశాయి.

శివాజీలా గొప్పవాడ్ని కావాలనే ఆకాంక్ష ప్రారంభమైంది, కొంత కాలానికి జయసింహుడు చనిపోగా, మరోసారి శివాజీ మీద దాడికి బయలుదేరిన దిలేర్ ఖాన్ సైన్యంలో చేరి చాందా దగ్గరున్న నగర్ కోట ముట్టడిలో పాల్గొన్నాడు ఛత్రసాల్, దేవగడ్ రక్షణలో వున్న హిందూ, గోండ్ సైన్యాలు మొగల్ సైన్యానికి అపార నష్టం కలిగించాయి. ఖాన్ సైన్యం పారిపోసాగింది. అప్పుడు ఛత్రసాల్ వీరావేశంతో పోరాడి ఓటమిని విజయంగా మార్చాడు. ఆ పోరాటంలో అతనికి విపరీతంగా గాయాలు తగిలాయి కూడా. కేవలం అతని శౌర్యం వల్లనే దేవగడ్ మీద ఔరంగజేబు ధ్వజం ఎగరగలిగింది. విజయవార్త విన్న ఔరంగజేబు దిలేర్ ఖాన్ ను పొగుడుతూ బహుమానాలు పంపాడు. ఛత్రసాల్ మాటే తలిచినవారు లేరు.

ఈ అన్యాయం అతనికీ గుండెకోత అయింది. గాయాలనుంచి కోలుకునే సమయంలో అంతర్మథనం ప్రారంభమైంది. మొగలాయిల వల్ల తన బుందేల్ ఖండ్ లో జరిగిన అన్యాయాలు గుర్తుకొచ్చాయి. తన తల్లిదండ్రుల మరణానికి కారకుడైన ఔరంగజేబు తరపున పోరాడి స్వదేశీ హిందూ రాజు అయిన శివాజీ సైన్యాలతో యుద్ధం చెయ్యటం ఎంత అవివేకమో అర్థమైంది. ప్రాణాలొడ్డి పోరాడిన తనకు ఎలాటి విలువ లభించిందో, ఎందుకలా జరిగిందో తెలిసొచ్చింది. నిక్షిప్తమైన నిద్రించే హృదయావేశం మేల్కొంది. సమయం కోసం నిరీక్షించే ఛత్రసాల్ కి ఒక అవకాశం వచ్చింది. వేట పేరుతో కొందరు మిత్రులతో దిలేర్ ఖాన్ అనుమతి తీసుకుని బయలుదేరాడో రోజు ఛత్రసాల్. కానీ అతని గమ్యం వేరు. అదే శివాజీ మహారాజు సమ్ముఖం, ధ్యేయం మరోటి, అదే తన పాత పాప భూయిష్ట జీవితానికి స్వస్తి.

శివాజీ శిబిరం చేరింది బృందం, వార్త శివాజీకి అందింది. అనుచరులతో మంత్రాంగం చేస్తూ పరివేష్ఠితుడై వున్నాడు శివాజీ మహారాజు. బుందేలీ వీరుడు ఛత్రసాల్, పగతుర సైన్యంలో ప్రముఖ వీరుడు దర్శనంకోసం రావటం ఏమిటి? ఛత్రసాల్ గురించి అదివరకే విని వున్నాడు శివాజీ. అతని తండ్రి చంపత్ రాయ్ ను ఔరంగజేబు చంపించిన విషయమూ తెలుసు. అనుమతి లభించింది. ఛత్రసాల్ ప్రవేశించగానే శివాజీ అతనికి ఎదురువెళ్ళి స్వాగతం పలికాడు, ఏ మహనీయుడి దర్శనం కోసం తను ఇంతకాలం ఎదురు చూచాడో, ఏ వీర శిరోమణి గురించి తనెంతగానో విన్నాడో, ఆ శివాజీ స్వయంగా తనకు స్వాగతం పలుకుతున్నాడు! ఛత్రసాల్ హృదయం ఉప్పొంగింది, ఛత్రసాల్ ఉచితాసనం మీద కూర్చోబెట్టి తన ఆసనం మీద అధిష్టించాడు మహారాజు. మాటామంతీ తర్వాత ఆగమన కారణం ప్రస్తావన కొచ్చింది. ఇన్నాళ్ళూ హృదయంలో నిబిడీకృతమైన ఆవేదన పొంగి ప్రవహించింది ఛత్రసాల్ కు.

శివాజీ మహారాజ్! ఇన్నాళ్ళూ ముస్లింల సేవలో బ్రతికినందుకు నేను సిగ్గుపడుతున్నాను. మా తండ్రి ఏమొగలు సైన్యం ఖడ్గానికి ఎర అయ్యాడో నేనా సైన్యంతో కలిసి హిందూ వీరులతో పోరాడి ఆయనకు, నా బుందేల్ భూమికి ఎనలేని ద్రోహం చేశాను, తమ సైన్యంలో చేరి పాపాలు ప్రక్షాళన చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. తమరు నా ఆశల్ని వమ్ము చేయకండి. ప్రార్థించసాగాడు ఛత్రసాల్.

ఛత్రసాల్ ఆవేదనను శాంతంగా విన్నాడు మహారాజు. వీరుడు, ధీరుడు, రాచకళలుట్టిపడే వర్చస్సు. కానీ గ్లాని పట్టింది. ఇరవై ఏళ్ళ ఛత్రసాల్, బుందేల్ వజ్రం. సానపట్టాలి అంతే, వీరుడా! శివాజీ కంఠం ఖంగుమంది, వీర క్షత్రియుడివైన నీవు అనాల్సిన మాటలు కావివి. మీ రాజ్యం బుందేల్ ఖండ్. ఈనాడది ముస్లిం చేతుల్లో వుంది. బుందేల్ ప్రజలకు స్వాతంత్ర్యాన్ని అందించడం మీ బాధ్యత. అదే మీ ధ్యేయం కావాలి. హిందూ దేశంలో హిందువుల రాజ్యమే ఉండాలి. గో, బ్రాహ్మణ, ధర్మాల పరిరక్షణ మన కర్తవ్యం. వాటి వినాశనకారి తురుష్కులపాలన అంతం చెయ్యటం క్షత్రియులుగా మన ధర్మం. బుందేల్ ఖండ్ విముక్తి, మొగలు రాజ్యం మీద దాడి తక్షణ కర్తవ్యాలు.

ఈ ధ్యేయంతో, ఏకదీక్షతో తాగితే మీకు విజయం తథ్యం బుందేల్ ఖండ్ కు మీరే రాజు. మా సహకారం మీకెప్పటికీ ఉంటుంది, మీరు ఇతరుల సేవకాదు చెయ్యాల్సింది, హిందూ ధర్మ సేవ. వెంటనే కార్యోన్ముఖులు కండి. విజయ పరంపర మీ సొత్తే కాగలదు. నిరాశ, నిస్పృహ, భీరుత్వం లాటి అవగుణాలకు తావులేని కర్మశీలి శివాజీ మాటలతో ఛత్రసాల్ ఆత్మవిశ్వాసం మేల్కొంది. పూర్తి ప్రజ్వలితమై మరో దివ్యజ్యోతి వెలిగింది. పరాధీన శృంఖలాలనుంచి మరో ప్రాంతీయుల విముక్తికి నాందీ వాక్యం పలికించాడు శివాజీ మహాప్రభువు. శివాజీ శిబిరాన్ని వదిలిన ఛత్రసాల్ అనతికాలంలోనే రాజా ఛత్రసాల్ బుందేల్ గా ప్రతిష్టను అందుకున్నాడు. మొగల్ సేనలు బుందేల్ ఖండ్ లో నిరంతర ఓటమినే ఎదుర్కొన్నాయి.

తన సామ్రాజ్యం విచ్ఛిన్నమవటాన్ని అరికట్టడానికి ఔరంగజేబు దక్షిణానికి బయలుదేరాడు. కానీ చేజారే వైభవాన్ని తలుచుకుని నిరాశా నిస్పృహలతో 1707లో అంతిమశ్వాస వదిలాడు. ఔరంగజేబు శకం ముగిసింది. దక్కనులో మహారాష్ట్ర సామ్రాజ్యం సుస్థిరం కాగా, ఢిల్లీకి అతి సమీపంలో ఛత్రసాల్ బుందేల్ స్వతంత్ర హిందూ సామ్రాజ్యాన్ని విస్తరించి ప్రకాశింపచేశాడు. తన 89వ ఏట 14, డిసెంబర్, 1731న. సాధించిన విజయాలతో సంతృప్తి చెందిన ఆ హృదయం శాశ్వతంగా విశ్రమించింది. హిందువులారా మేల్కోండి నిద్రాణమై ఉన్న మనలోని శక్తిని గుర్తించండి... జై రాజా ఛత్రసాల్.

ఇలాంటి జీవిత చరిత్రల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

2 comments

  1. చాలా మంచి విషయం చెప్పారు. ధన్యవాదాలు
    నాగ(sailorbook)

    ReplyDelete
  2. ఓకే వీరుడి గురించి చెప్పారు, ధన్యవాదాలు జీ

    ReplyDelete