Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హిందూ వీరుడు దుర్గాదాస్ రాథోడ్ - Veer Durgadas Rathore Story in Telugu

దుర్గాదాసు రాఠోడ్ పెద్ద నేతకాదు. మహారాజు కానేకాదు గొప్ప యుద్ధాలు చేసి గెలిచినవాడుకాడు. అతి సామాన్యుడు. అయినా చరిత్రలో శాశ్వతంగా ...


దుర్గాదాసు రాఠోడ్ పెద్ద నేతకాదు. మహారాజు కానేకాదు గొప్ప యుద్ధాలు చేసి గెలిచినవాడుకాడు. అతి సామాన్యుడు. అయినా చరిత్రలో శాశ్వతంగా నిల్చిపోయాడు. వీరులకు పుట్టినిల్లయిన రాజపుతానాలో 'కంటే దుర్గాదాసువంటి బిడ్డను కనాలి' అని వీరమాతలు శాశ్వతంగా తల్చుకునేలా సాగిన సంపన్నమైన జీవితం అది మార్వారు రాజు యశ్వంత సింహుడి దివాను అజచరణుడు కొడుకు దుర్గాదాసు. పసితనంనుంచే ధైర్యసాహసాలు అతని ప్రతిచర్యలో ఉట్టిపడుతుంది.

ఆ రోజుల్లో ఏ విషయంలోను తురకలకు ఎదురుండేది కాదు తమ ఒంటెల్ని హిందువుల పచ్చటి పొలాల్లోకి తోలి మేపేవారు. అభ్యంతరం తెలిపే ధైర్యం ఎవరికి ఉండేది కాదు. అలానే ఓరోజు తురక ఒంటెల కాపరి నవాబు ఒంటెలను దుర్గాదాసు పొలాల్లోకి తోలాడు. బాల దుర్గాదాస్ ఒంటెలను అక్కడ్నుంచి తోలుకెళ్ళమని మర్యాదగా చెప్పారు. తమకు ఎదిరు చెప్పే సాహసి ఎవడా అని ఓసారి క్రీగంట చూచి తల తిప్పేసుకున్నాడా తురక. బాల దుర్గాదాసుకు కోపం తన్నుకొచ్చింది. మారు మాట్లాడకుండా పొలంలో కెళ్ళి మేత మేసే ఒంటెను ఒకదాన్ని కత్తితో పొడిచి చంపేశాడు. అదిరిపడి పరుగు లంకించుకున్నాడు, మేపే పనికొచ్చిన తురక. అలాటి చిచ్చరపిడుగు దుర్గా దాసు.

మార్వారురాజు యశ్వంతసింగు ఔరంగజేబు క్రింద సర్దారుగా వుండే ఓ సామంతరాజు. ఎందరో తురక సర్దారుల కంటే ఎక్కువ పలుకుబడి వుండేదతనికి. పరాక్రమవంతులు, గౌరవనీయులు అయిన హిందూ సర్దార్ల విషయంలో ఔరంగజేబు కి ఓ భయంవుండేది. తన పద్దతుల్ని, విస్తృత క్రూరత్వాన్ని చూచి ఈ హిందూ సర్దారులు ఎదురు తిరుగుతారనే భయం వుండేది. అందుకని వాళ్ళను ఇరకాటంలో పెట్టి నొక్కి పెట్టి, చుట్టూ తురకల్ని వుంచి జాగ్రత్త పడేవాడు. మరింతగా పలుకుబడి ఉన్న సర్దారులు ఏ యుద్ధంలో నో, మరో మాయోపాయంతోనో చంపించి సంతాపం ప్రకటించేవాడు.

యశ్వంత సింహ్ ఇప్పుడు ఆ మొగలాయి కి అలాంటివాడే,
కంట్లో నలుసు. ఆఫ్ఘనిస్తాన్ లో తిరుగుబాటు అణిచే పేరుమీద యశ్వంతసింహుడిని కాబూలుకు పంపాడు నవాబు. ఆఫ్ఘన్ లతో యుద్ధమంటే మాటలుకాదు. యశ్వంతుడు తిరిగిరాడని నవాబు నమ్మకం. కాని ఆ వీరుడు తిరుగుబాటు అణిచి తిరుగుముఖం పట్టాడు. అసలే గౌరవపాత్రుడు. ఈ విజయంతో యశ్వంత్ కీర్తి మరింత పెరుగుతుంది. అంతే! 10.12.1673 న దోవలో విష ప్రయోగం మరణించాడు యశ్వంత్ సింహుడు. ప్రాణాలొడ్డి పోరాడి మొగలాయీ సామ్రాజ్యానికి సేవ చేసిన హిందూ వీరుడికి ముస్లిం రాజు అందించిన బహుమానం ఇది!.

ఆ సంఘటన జరిగిన రోజున దుర్గాదాసుకు 40 సంవత్సరాలు, యశ్వంతుడితోనే వున్నాడతను. జరిగిన మోసం, అన్యాయాలను గుర్తించిన దుర్గాదాసు ఎలాగైనా విదేశీ తురకలను ఎదిరించి నాశనం చేయ్యాలనే నిర్ణయం తీసుకున్నాడు. మార్వారు రాజకుటుంబాన్ని నిలపాలన్నదే అతని జీవిత ధ్యేయం అయింది. యశ్వంతుడి దహన సంస్కారాల తర్వాత అతని భార్యలిద్దరూ ససైన్యంగా మార్వారుకు బయలుదేరారు. లాహోర్ చేరగానే ఇద్దరు పిల్లలు పుట్టారు వాళ్ళు. అయితే అందులో ఒక పసికందు చనిపోగా వంశాంకురం ఒక్కటే నిల్చింది. అతనే అజిత్ సింగ్. మార్వారుకు రాజు కావలసినవాడు. వార్తలన్నీ ఎప్పటికప్పుడు నవాబుకు, మార్వారు సంస్థానానికి అందుతూనే వున్నాయి. మిగిలిన పసివాడ్ని రాజుగా ప్రకటించమని మార్వారు మంత్రివర్గం ఔరంగజేబును ప్రార్థించటానికి ఢిల్లీ వెళ్ళారు.

ఔరంగజేబు కుట్ర వల్లనే తమ రాజు మరణించాడు వాళ్ళ స్పష్టంగా ఆ తెలుసు. అయితే ఔరంగజేబు పథకం మరోటుంది. యశ్వంత్ సింహుని భార్యల్ని తన జనానాకి చేర్చటం, అజిత్ సింగ్ ముసల్మానుగా మార్చి తన పర్యవేక్షణలో పెంచడం. 1679 జూన్ చివరి భాగంలో రాణులు, కుర్రవాడు ఢిల్లీ చేర్చబడ్డారు. ఈ వార్త విన్న దుర్గాదాసు, మరితర దేశ భక్తి మార్వార్ హిందూ వీరులు మండిపడ్డారు. మతం మార్పిడి జరక్కముందే వాళ్ళను తప్పించాలనే నిర్ణయం జరిగింది.

మృత్యు గహ్వరంలాంటి ఔరంగజేబు జనానానుంచి రాణిని, అజిత్ సింగును తన శక్తియుక్తులతో తప్పించాడు దుర్గాదాస్. అదో వీరగాధ అయింది రాజస్తాన్ జనపథాల్లో! మార్వార్ చేరగానే యువరాజ పట్టాభిషేకం అయ్యింది. రాణి స్వయంగా పాలనను చూడసాగింది. అయితే మొగలులు ఎప్పుడైనా వచ్చిపడొచ్చనే వార్తలు రాసాగాయి. ఒకటే ఉపాయం తోచింది మంత్రులకు - మేవాడ్ రాజు రాణా రాజసింహుని ఆశ్రయంలో కుర్రాడ్ని వుంచటం. రాణా ఆశ్రయమివ్వటానికి అంగీకరించాడు కూడా. దుర్గాదాసు రక్షణలో కొద్ది సైనికబలంతో రాజకుటుంబం బయలుదేరింది. కానీ ఆరావళీ పర్వత ప్రాంతం చేరగానే పెద్దమొగలాయి సైన్యం వీరిమీద పడింది. ఎందరో రాజపుత్ర సైనికులు సమసిపోయారా పోరాటంలో. అయితే ప్రాణాలొడ్డి పోరాడుతూ ఉపాయంగా యువరాజును రాణా దగ్గరకు చేర్చాడు దుర్గాదాస్.

అజిత్ సింగును తిరిగి బంధించాలనీ, తప్పితే చంపించాలనీ అద్భుతంగా ప్రయత్నాలు చేశాడు ఔరంగజేబు, తన కుమారుడు అక్బర్ పెద్ద సైన్యాన్ని పంపి మేవాడును ఆక్రమించ చూచాడు ఔరంగజేబు, (రెండో అక్బరు) రాజపుత్ర వీరులు సాహసంతో పోరాడి మొగలాయి సైన్యానికి అమితంగా నష్టం కలిగించారు. అయినా ఎన్నాళ్లు నిలవగలమన్న ఆలోచనతో దుర్గాదాసు అక్బరు దగ్గరకు రాయబారుల్ని పంపాడు. వచ్చిన రాయబారులకు అక్బర్, మొఘల్ సర్దారులు భయభీరులై వున్నట్లు అవకాశాన్ని ఆధారంగా తీసుకుని దుర్గాదాసు, 'మీ తాత అక్బరులాటి రాజనీతితో రాజపుత్రులు సహకరించి వాళ్ళను గౌరవిస్తే నిన్నే మొగలు ప్రభువుగా అంగీకరిస్తాం' అని అక్బర్ కు బోధ చేశారు. యుద్ధ బీభత్సంతో బెదిరివున్న కుర్ర అక్బరు తనని తన తాతతో పోల్చగా ఉబ్బిపోయి, 1-1-1681న తనే మొగల్ సామ్రాజ్య అధినేత ప్రకటించుకున్నాడు. దుర్గాదాసు చాణుక్య నీతి పని చేసింది.


ఓ వైపు ఇలా విభేదాలు పెంచి, ఆ తర్వాత అక్బర్ ను శివాజీ కొడుకు శంభాజీ కలిపీ, ఔరంగజేబును చికాకు పరుస్తూ, మేవాడు, మార్వారుల మీద వత్తిడి తొలగించిన ధీశాలి దుర్గాదాస్. ఔరంగజేబు దక్షిణాన మరాఠాలతో సతమతమవుతుండగా మార్వార్ భూముల్లోవున్న మొగలుల్ని ఎదిరించి, వాళ్ళను పూర్తిగా అక్కడినుంచి తొలగించి అజిత్ సింగ్ రాజ్యాన్ని సుస్థిరం చేసిన కీర్తి దుర్గాదాసుదే. క్రీ.శ. 1706 నాటికి జోద్ పూర్ కోట కూడా రాజపుత్రుల స్వాధీనమైనది. తన ఆశయం నెరవేర్చుకుంటూ జోద్ పూర్ సింహాసనం మీద అజిత్ సింగును అధిష్టింపజేశాడు దుర్గాదాస్. ధ్యేయనిష్ఠకు మారుపేరుగా చరిత్రలో నిలిచిపోయాడు. సంపూర్ణంగా అంతమవబోతున్న మార్వారు రాజకుటుంబాన్ని రక్షించి మరో హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టిన నిస్వార్థ వీరుడు దుర్గాదాసు రాఠోడ్. ఎవరైనా హనుమంతుడు తలుచుకోకుండా శ్రీరాముడిని స్మరించగలరా? అలాగే దుర్గాదాసును తల్చుకోకుండా మార్వారు సామ్రాజ్యాన్నే తల్చుకోలేరెవ్వరూ, ఈనాటికీ.

ఇలాంటి జీవిత చరిత్రల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments