క్రైస్తవుడికి తనదైన శైలిలో సమాదానం చెప్పిన వివేకానంద - MegaMinds - Moral Stories in Telugu

 
ఒక కరడుగట్టిన క్రైస్తవుడు వివేకానంద ను చూడ్డానికి వచ్చాడు.. అతను వచ్చిన దగ్గర్నుంచి టేబుల్ మీద ఉన్న పుస్తకాల దొంతరమీదే దృష్టి పెట్టాడు.. ఓ గంట సంభాషణ తర్వాత నెమ్మదిగా సర్కాస్టిగ్గ మాట్లాడం మొదలెట్టాడు..
సంభాషణ వాదనగా మారుతుంది..వాతావరణం కొద్దిగా వేడెక్కింది స్వామిజీ మొహం మీద చిరునవ్వు చెరగలేదు.

వచ్చిన అతిధి లో అసహనం మొదలయింది ఎలా అయినా వివేకానంద కు కోపం తెప్పించాలి అని రెచ్చగొట్టే మాటలు వాడుతున్నాడు.. స్వామీజీని అడిగాడతను ' స్వామి ఈ పుస్తకాల దొంతరలో అన్నింటికన్నా పైన బైబిల్ పెట్టారు తర్వాత ఖు.రాన్ ఇంకా ఇతర మత గ్రంధాలు పెట్టి అన్నింటికన్నా కింద మీ భగవద్గీత పెట్టారు ' అంటే అన్నింటికన్నా పైన క్రైస్త.వం ఉన్నతం అన్నింటికన్నా కిందది హిందుత్వ అని మీరు కూడా మానసికంగా ఒప్పుకున్నట్టున్నారు !!.

వివేకా చిన్నగా నవ్వారు...కింద ఉన్న భగవద్గీత ను  లాగేశారు పుస్తకాల దొంతర మొత్తం కింద పడిపోయింది పుస్తకాలు నేల మీద చెల్లాచెదురుగా పడిపోయాయి..
చేతిలో ఉన్న భగవద్గీత ను ఆ క్రైస్తవుడికి చూపుతూ వివేకా అన్నారు ' అన్నింటికీ ఆధారం ఈ ధర్మమే  అన్నింటికీ మూలం  కూడా సనాతన ధర్మమే..మీరు ఏం చెప్పినా దీనినుంచి తీసుకున్నదే ' అందుకే ఇది పునాది దీన్నితొలగిస్తే ఇప్పుడు చూశారు కదా! అన్ని మతాలు పుస్తకాల దొంతర కూలినట్టు కూలిపోతాయి అందుకే  ' అన్నింటికంటే కింద ' పెట్టాను.. అదే ధర్మానికి పునాది..
వచ్చిన అతిధికి నోరుపెగల్లేదు.. నమస్కారం చేసి వెళ్ళిపోయాడు.. మిత్రులకు అర్ధం అయిందని భావిస్తున్నాను..

Post a Comment

0 Comments