అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై షాకింగ్ నివేదిక: అసలు దోషి ఎవరు? Shocking Report Reveals What Caused Air India Dreamliner Crash in Ahmedabad
జూన్ 12 2025 తేదీన అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిర్ ఇండియా బోయింగ్ 787 డ్రీమ్ లైనర్ విమాన ప్రమాదంపై ఎయిర్ క్రాష్ విచారణ బ్యూరో (AAIB) తాజాగా విడుదల చేసిన ప్రాథమిక నివేదిక ఆందోళన కలిగించే అంశాలను వెలుగులోకి తెచ్చింది. ఈ ఘోర ప్రమాదంలో 260 మంది ప్రయాణికులు ప్రాణాలు కోల్పోయారు. కానీ అసలు కారణం ఏమిటి? ఎవరి నిర్లక్ష్యం దీనికి కారణమైందనే విషయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
ప్రమాదానికి కారణం ఏమిటి?: విమానం టేకాఫ్ అయిన కేవలం 32 సెకన్లలోనే ఇంజిన్లకు ఇంధనం నిలిపివేయబడింది.
ఇంజిన్-1 ను మళ్లీ స్టార్ట్ (రిళైట్) చేయడానికి పైలెట్లు ప్రయత్నించగా, ఇంజిన్-2 పూర్తిగా విఫలమైంది.
ఇంధనంలో కల్తీ లేదు, వాతావరణం అనుకూలంగా ఉంది, పక్షుల తాకిడి లేని పరిస్థితులు కూడా నమోదయ్యాయి.
పైలెట్లు ఇద్దరూ ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, అత్యధిక అనుభవం కలిగినవాళ్లు.
FAA నివేదిక ప్రకారం, ఫ్యూయల్ ఆయిల్ సప్లై స్విచ్ లో లోపం ఉండగా, ఎయిర్ ఇండియా ముందుగా తనిఖీ చేయకపోవడం కీలక తప్పిదంగా భావించబడుతోంది.
పైలెట్ల వివరాలు: ఎవరు వారు?
కెప్టెన్ సుమీత్ సభర్వాల్ (Sumeet Sabharwal)
వయస్సు: 56 సంవత్సరాలు
మొత్తం ఫ్లయింగ్ అనుభవం: 15,638 గంటలు
ఎయిర్ ఇండియాలో ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్ గా పని చేశారు
బోయింగ్ 787 పై మాత్రమే 9,000 గంటలకు పైగా అనుభవం.
కో-పైలట్ క్లైవ్ కుందర్ (Clive Kunder)
వయస్సు: 32 సంవత్సరాలు
ఫ్లయింగ్ అనుభవం: 3,403 గంటలు
బోయింగ్ 787పై పెద్దగా అనుభవం ఉన్నవారే
ఇంతటి అనుభవం ఉన్న పైలెట్ల చేత ఈ స్థాయిలో ప్రమాదం జరగడం అనేది బోయింగ్ సాంకేతిక లోపం లేదా సంస్థ స్థాయి నిర్లక్ష్యం అన్నదే అనుమానాలకు దారితీస్తోంది.
కాక్‌పిట్ సంభాషణ: పబ్లిక్ అయిందా?
"మీరు ఆయిల్ ఎందుకు నిలిపేశారు?" అని ఒక పైలెట్ అడగగా, "నేను అలా చేయలేదు!" అని మరొక పైలెట్ బదులిచ్చారు.
ఈ డయలాగ్ విన్నా వెంటనే తగ్గిన ప్రెషర్, తప్పిపోయిన స్పందన – ఇవన్నీ పైలెట్లకు కూడా అసహజంగా అనిపించిన సూచనలు కావచ్చు.
పాశ్చాత్య మీడియా బోయింగ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తోందా?: ఘటనపై BBC ముందుగానే కథనాన్ని ప్రసారం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మన ప్రభుత్వం ఇంకా నివేదికను అధికారికంగా విడుదల చేయకముందే, BBC లాంటి పాశ్చాత్య మీడియా సంస్థలు బోయింగ్ తప్పు లేదు – పైలెట్ల తప్పిదమే అన్న నేరేటివ్‌ను ముందుకు తీసుకురావడం వెనుక ఏం ఉన్నది?
బోయింగ్‌ను కాపాడేందుకు పాశ్చాత్య మీడియా ప్రచారం చేస్తోందా? అసలు ఈ రిపోర్టు వారికెవరు లీక్ చేశారు? భారతీయ ప్రయాణికుల ప్రాణాలు పోగొట్టిన విమాన ప్రమాదానికి మలుపు తిప్పే ప్రయత్నమా?
మన పైలెట్లు నిందితులా? లేక కుట్రలో బలి అవుతున్నారా?
మన పైలెట్లు అత్యంత అనుభవం ఉన్నవారు అనే సంగతి స్పష్టమైన నేపథ్యంలో, ఈ స్థాయిలో విమానం క్రాష్ కావడాన్ని విమాన యంత్రాంగంలో లోపమే అని భావించాల్సిందే. పైలెట్లను నిందిస్తూ విదేశీ కంపెనీలను కాపాడే ప్రయత్నం జరగకూడదు.
భారత ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి!
ఈ ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం, డిజీసీఏ, FAA సమగ్ర విచారణ జరిపి:
బోయింగ్ లోపమా?
ఎయిర్ ఇండియా నిర్లక్ష్యమా?
అంతర్జాతీయ రాజకీయ కుట్రా?
అన్నవిషయాలపై నిజానిజాలు బయటపెట్టాలి. పాశ్చాత్య సంస్థలు గల వాణిజ్య ప్రయోజనాల కోసం భారత పైలెట్ల పరువు తీసే ప్రయత్నం జరిగినా, సత్యాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత భారత ప్రభుత్వంపై ఉంది.#AirIndiaCrash #Ahmedabad #Boeing787 #IndianPilots #BBCExposed #FakeNarrative #MegamindsIndia #AviationTruth