హిందూ యువతులపై 500 కోట్లతో మతమార్పిడి వ్యాపారం Conversion Plot Against Hindu Women: ₹500 Cr Exposed

megaminds
0


హిందూ మహిళలపై మతమార్పిడి కుట్ర వెనుక 500 కోట్లు: చంగూర్ బాబా నిజాలు బయటికొచ్చాయి!

బ్రాహ్మణులు, సిక్కు, క్షత్రియ మహిళలకు 15 నుంచి 16 లక్షలు, ఓబీసీ మహిళలకు 10 నుంచి 12 లక్షలు, మిగతా వారికి 8 నుంచి 10 లక్షలు రేట్లు కట్టి మరీ హిందూ యువతులని వలలో వేసి మతం మార్చే కుట్ర జరుగుతుంది. ఇటీవల ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో వెలుగుచూసింది. నిజానికి ఇది 2005 సమయానికే భారత్ లో ప్రవేశించింది.

ఇక అసలు ఏమిజరిగిందో తెలుసుకుందాం: యూపీలో బయటపడ్డ ‘‘ఇస్లామిక్ మత మార్పిడి’’. జమాలుద్దీన్ దేశ వ్యాప్తంగా జరుగుతున్న ఇస్లామిక్ మత మార్పిడి ముఠా నెట్ వర్క్ కి నాయకుడు. యూపీలో అతిపెద్ద అక్రమ మత మార్పిడి ముఠాకి అడ్డుకట్ట పడింది. యూపీ ATS పోలీసులు బలరాంపూర్ జిల్లాలో పెద్ద ఎత్తున ఇస్లామిక్ మత మార్పిడి ముఠాను అరెస్ట్ చేసింది. అంతేకాకుండా ఈ ముఠాకి దాదాపు మొదట 100 కోట్ల మేర విదేశీ నిధులు అందుతున్నట్లు కూడా గుర్తించింది. ఈ నెల 5 న ఇస్లామిక్ మత మార్పిడి ముఠాకి నాయకత్వం వహిస్తున్న జమాలుద్దీన్ (ఛంగూర్ బాబా), అతని భార్యను ఏటీఎస్ అధికారులు అరెస్ట్ చేశారు.

అయితే.. ఏటీఎస్ మరో కీలక విషయాన్ని కూడా వెల్లడించింది. ఇస్లామిక్ మత మార్పిడిలో జమాలుద్దీన్ కుటుంబం మొత్తం కూడా పాలు పంచుకుంటోందని తెలిపింది. ఏప్రిల్ మాసంలో జమాలుద్దీన్ కుమారుడు మెహబూబ్ తో పాటు మరో వ్యక్తిని కూడా ఏటీఎస్ అరెస్ట్ చేసింది.

పూర్తి కుటుంబం ఇందులో భాగస్వాములు: మతం మార్చే విషయంలో ప్రేమ వ్యవహారాలు నడపడం, తప్పుడు వాగ్దానాలివ్వడం, ప్రలోభాలకు గురిచేయడం లాంటివి చేస్తున్నారన్నది కూడా తాము కనుగొన్నామని తెలిపారు. అలాగే మైనర్లను కూడా ఈ ముఠా టార్గెట్  చేసింది.

హిందువులమంటూ నమ్మించి, మోసం చేసి జమాలుద్దీన్ భారీ స్థాయిలో ఇస్లామిక్ మత మార్పిడికి ప్రణాళికలు వేసేవాడని తేలింది. ముఖ్యంగా మహిళలను ఆకర్షించి, ఇస్లాంలోకి తీసుకురావడానికి ముస్లిం పురుషులకు భారీ స్థాయిలో నిధులు సమకూర్చేవాడు. అంతేకాకుండా ఈ ముస్లిం పురుషులు తమ పేర్లను హిందూ పేర్లుగా మార్చుకొని, తాము హిందువులమేనని నటించి, నమ్మబలికేవారు కూడా. అంతా అనుకున్నట్లు జరిగితే పెళ్లిళ్లు కూడా చేసేవాడు.

సూఫీ సాధువుగా నటిస్తూ పేరు మార్చుకొని: తన పేరును హజ్రత్ బాబా జమాలుద్దీన్ పీర్ బాబా అని మార్చేసుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా ఇస్లాం వైపు ఆకర్షితులను చేయడానికి ‘‘షిజ్రా -ఎ- తయ్యబా’’ అనే పుస్తకం కూడా రచించాడు. అంతేకాకుండా ఇస్లాంలోకి మారిపోయినా తన ఆధార్, పాన్ కార్డులన్నీ కూడా హిందూ పేర్లతో వున్నట్లు కూడా ఏటీఎస్ విచారణలో తేలింది. ఎదుటి వారిని నమ్మించడానికే ఇలా చేస్తున్నట్లు తెలుస్తోంది. లక్నో లో ఓ మహిళను తాను హిందువుగా నమ్మబలికి, ప్రేమలో పడేశాడని కూడా తెలుస్తోంది. మత మార్పిడి అన్న దాని కోసం ఓ నెట్ వర్క్ ను తయారు చేసి, దీనిని ఓ వ్యాపారంలా నిర్వహిస్తున్నాడని ఏటీఎస్ పేర్కొంది.

అలాగే UP ATS దర్యాప్తులో సంచలన విషయాలు బయటపడ్డాయి - గల్ఫ్, టర్కీ, పాకిస్తాన్ నుంచీ నిధుల మళ్లింపు, నేపాల్ ద్వారా భారత్‌లోకి ప్రవేశం.

ఉత్తరప్రదేశ్ లో మతమార్పిడి కేసులో సూత్రధారి అయిన జమాలుద్దీన్ అలియాస్ చంగూర్ బాబా కేసు దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. హిందూ యువతులను ప్రేమలో పడేసి మతమార్పిడి చేయడంలో కీలకపాత్ర పోషించిన ఈ వ్యక్తికి గల్ఫ్ దేశాలు, టర్కీ, పాకిస్తాన్ నుండి పెద్ద మొత్తంలో నిధులు అందాయని UP ATS (ఆంటీ టెర్రరిజం స్క్వాడ్) దర్యాప్తులో వెల్లడైంది.

500 కోట్ల మతమార్పిడి నిధులు: UP ATS అధికారుల నివేదిక ప్రకారం, చంగూర్ బాబా నేతృత్వంలోని మతమార్పిడి నెట్వర్క్‌కు మొత్తం ₹500 కోట్ల నిధులు అందాయి. ఈ మొత్తం లో ₹300 కోట్లు నేపాల్ ద్వారా భారత్‌కు మళ్లించబడ్డాయి. ఇది దేశ భద్రతకు పెద్ద ముప్పుగా భావిస్తున్నారు.

నేపాల్ సరిహద్దులో 100 కి పైగా బ్యాంక్ ఖాతాలు: చంగూర్ బాబా చేసిన లవ్ జీహాద్ వ్యూహంలో భాగంగా, నేపాల్ సరిహద్దు ప్రాంతాల్లో 100 కి పైగా నకిలీ ఖాతాలు తెరచి, వాటి ద్వారా నిధులు భారత్‌కు పంపించబడ్డాయి. ఈ నగదు బదిలీకి ప్రతీ ట్రాన్సాక్షన్‌పై 4% నుండి 5% వరకు ఏజెంట్లకు కమిషన్ చెల్లించారని సమాచారం.

దేశవ్యాప్తంగా మతమార్పిడి నెట్వర్క్: ఈ నెట్‌వర్క్‌కి ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, ఢిల్లీ, బెంగాల్, తమిళనాడు, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో బ్రాంచ్‌లు ఉన్నట్లు ఆధారాలు లభించాయి. ఈ కుట్రలో వందలాది మంది హిందూ మహిళలు, బాలికలు టార్గెట్ గా పనిచేస్తున్నారు.

UP ATS ఆపరేషన్ - నిరంతర దాడులు: ప్రస్తుతం UP ATS ఈ నెట్వర్క్‌పై ప్రత్యేక దాడులు, విచారణలు నిర్వహిస్తోంది. ఇప్పటికే పలు రాష్ట్రాలలో అనేకమంది అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారిస్తోంది. ఈ కేసులో ఇంటర్నేషనల్ ఫండింగ్, ఇస్లామిక్ సంస్థల మద్దతు, ఆన్‌లైన్ మతమార్పిడి ప్రచారం వంటి అంశాలపై దృష్టి సారించారు.

జాతీయ భద్రతపై ప్రశ్నలు: ఈ సంఘటన మత మార్పిడి ఎంత ప్రమాదకరంగా విస్తరిస్తుందో స్పష్టంగా చూపిస్తోంది. నిధుల సమీకరణ, ఆన్‌లైన్ బ్రెయిన్‌వాషింగ్, భయంకరమైన టార్గెటెడ్ లవ్ జిహాద్ మిషన్లు — ఇవన్నీ జాతీయ భద్రతకు  పెనుసవాలు విసురుతున్నాయి.

భవిష్యత్తులో దర్యాప్తు ఎటువైపు?: ఈ కేసు ఇంకా విచారణలో ఉంది. అయితే కేంద్ర ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు, రాష్ట్ర పోలీస్ విభాగాలు కలిసి ఈ మతమార్పిడి మాఫియా నెట్‌వర్క్‌ను బయటపెట్టే పనిలో ఉన్నాయి.

కాగా...

యోగీ బుల్డోజర్లకు బ్రేకుల్లేవ్..!

లవ్ జిహాద్ కుట్రతో ఏకంగా రూ.500 కోట్ల ఫండ్ కలెక్ట్ చేసిన జలాలుద్దీన్ ఇంటిని కూలుచేశారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


మతమార్పిడి, జమాలుద్దీన్ చంగూర్ బాబా, Love Jihad India, UP ATS Investigation, 500 కోట్లు మత మార్పిడి, Nepal Bank Accounts Terror, Islamic Conversion Network India, హిందూ మహిళలు మత మార్పు, Funding from Pakistan Gulf, India Anti Conversion Law, లవ్ జీహాద్


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top