చిన్నవయసులోలే అన్నకు విలువిచ్చిన బాలుడు పెద్దయ్యాక ఏమయ్యాడో తెలుసా? - megamind - moral stories in telugu

0

అది పాఠశాల ఆవరణ, ఆ రోజు చాలా కోలాహలంగా ఉన్నది ఆ రోజు పరీక్షా ఫలితాలు చెప్పారు. ఉత్తీర్ణులు అయిన వాళ్ళు చాలా అందంగా ఉన్నారు. అంతేకాకుండా రేపటి నుంచి సెలవులు ఆటవిడుపు. ఈ కారణం కూడా వాళ్ళ ఆనందానికి దారి చూసింది. వారిలో బక్క పలుచగా ఉన్న ఒక అబ్బాయి ఉన్నారు. ఆ అబ్బాయి దగ్గరకు పాఠశాల బంట్రోతు వచ్చాడు.

అబ్బాయి! నిన్ను హెడ్ మాస్టర్ గారు రమ్మంటున్నాడు అని చెప్పాడు. ఆ మాటలు విన్న ఆ అబ్బాయి హడలిపోయాడు. తప్పు చేసిన వారిని హెడ్ మాస్టర్ గారు పిలిపిస్తూ ఉంటారు. అందుకని భయం భయంగా హెడ్ మాస్టర్ గదిలోనికి వెళ్ళాడు. ఆయనలోని సౌమ్యతను చూచి అబ్బాయి ఆశ్చర్యపోయాడు. అబ్బాయి లోని భయం కూడా పోయింది. అందరికంటే నీకు ఎక్కువ మార్కులు వచ్చాయి కదూ? నీవు రెండు క్లాసులు ప్యాసయినట్లు చేస్తున్నాను. ఏమంటావు? అన్నారు హెడ్ మాస్టర్ గారు అబ్బాయి సంతోషంతో ఉక్కిరి బిక్కిరి అయ్యాడు.

ఇంకొకళ్లయితే వెంటనే ఒప్పుకొని వారే! కాని అతడు మాత్రం మా అన్నయ్యను అడిగి చెబుతా నుండీ! అన్నాడు అణకువగా, అన్నయ్య ఎవరు? హెడ్ మాస్టర్ గారు అడిగారు. అబ్బాయి చెప్పారు. ఓహో! వాడా! వాడు నాకు తెలుసులే! నాకంటే వాడికి ఎక్కువ తెలుసా? ఎట్లా అయినా పెద్దవాడు కదండీ! పైగా నాకు అన్నయ్య. అందుకనే ఆయన్ను కనుక్కొని... అన్నాడు ఇంకా నమ్రతగా ఆ అబ్బాయి.

సరే! అలాగే చేయి అన్నారు హెడ్ మాస్టర్ గారు. చిన్ననాడే అన్నయ్య అంటే గౌరవం చూపిన ఆ అబ్బాయే బాబు రాజేంద్రప్రసాద్ భారతదేశపు ప్రథమ రాష్ట్రపతి అయ్యాడు. అజాత శత్రువుగా అందరి మన్ననలను అందుకున్నాడు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Tags

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top