కర్జన్ విల్లీ హత్యను సమర్ధిస్తూ మదన్ లాల్ ధీంగ్రాకు మద్దతు తెలిపిన దేశభక్తుడెవరో తెలుసా? - megaminds - moral stories in telugu

megaminds
1

అది 1909వ సంవత్సరం జూలై నెల అయిదవ తేదీ లండన్లోని కాక్స్ టన్ హాలు, అక్కడ లండన్లో ఉంటున్న భారతీయులలో చాలామంది సమావేశం అయ్యారు. సర్ గాఖాన్ ఆ సమావేశానికి అధ్యక్షుడు అంతకు క్రితం కర్జన్ విల్లీ అనే ఆంగ్లేయ అధికారిని భారతీయ యువకుడు కాల్చి చంపాడు ఆ యువకుడు మదన్ లాల్ డింఘ్రా. ఆ హత్యకు సంతాపాన్ని తెలియ చేయటానికి, మదన్ లాల్ చర్యను ఖండించటానికి, లండన్లోని భారతీయులు ఆనాడు అక్కడ సమావేశం జరిపారు. సభలో మదన్ లాల్ చర్యను ఖండిస్తూ చాలామంది ప్రసంగించారు.

చివరకు అధ్యక్షుడు ఈ సభయావత్తూ మదన్ లాల్ చర్యను ఖండిస్తున్నది అని ప్రకటించాడు. ఆ ప్రతిపాదనలు అందరూ ఆమోదం తెలుపుతారనుకున్నాడు అధ్యక్షుడు, సభ అంతా నిశ్శబ్దంగా ఉంది. కానీ ఒక మూల నుండి. లేదు.. కాదు.. ఏకగ్రీవంగా మాత్రం కాదు..... అని వినిపించింది. అందరూ ఆ మాటలు విని వచ్చిన వైపుకు చూశారు, అధ్యక్షుడు కోపంగా కాదని ఎవరంటున్నారు? అని అడిగాడు. నేను... నేను కాదంటున్నాను. జవాబు మళ్ళీ వినిపించింది.

సభికుల్లో ఉద్రేకం కలిగింది, కోపం పెల్లుబికింది, అతడిని లాగండి.. బయటకు నెట్టండి అని అరిచారు సభికుల్లోంచి ఎవడో కాదంటున్న వ్యక్తి వైపు ఉరికాడు. సభికులంతా ఎవరతను వ్యతిరేకంగా మాట్లాడటానికి ఎంత ధైర్యం అని చిందులు తొక్కారు. ఆ వ్యక్తి సౌమ్మ్యంగా.... నేను... నా పేరు సావర్కర్ అని జవాబు ఇచ్చాడు.

ఎవరో అతడి నెత్తి పైన బలంగా మోదారు. అతడి మిత్రులు ఆ విపత్తు నుండి అతడిని తప్పించారు. అంత మందిలో తన అభిప్రాయాన్ని తెలిపి.. గుండె ధైర్యాన్ని చూపిన ఆ వ్యక్తి దామోదర వీరసావర్కర్ ఆంగ్లేయులను ఎదిరించాడు. అండమాన్ లో అనేక సంవత్సరాలు జైల్లో నిర్బంధింపబడ్డాడు. వీరుడిగా మన్ననలు పొందాడు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.



Tags

Post a Comment

1 Comments
Post a Comment
To Top