నేను దొంగతనం చేయలదండీ నన్ను కొట్టకండి అని తోటమాలిని బ్రతిమిలాడిన పెల్లాడెవరో తెలుసా? - megaminds - short stories in telugu


కాశీకి దగ్గరలో గంగానది ఒడ్డున మొగల్ సరాయ్ అనేగ్రామం ఉన్నది. మొగల్ సరాయ్ నేడు పెద్ద రైల్వే కూడలి కానీ ఒకనాడది కుగ్రామమే ఆ ఊరిలో చిన్న పాఠశాల ఉన్నది. దానికి ఒకరోజు సెలవు ఇచ్చారు ఇక పిల్లలందరికి ఎక్కడలేని సంతోషం.

పుస్తకాలు పాఠాల సంగతే మరచారు ఆటపాటల్లో మునిగిపోయారు ఇంకేం తోటలూ పొలాలూ ఇష్టం వచ్చినట్లు తిరుగుతున్నారు ఒకచోట తోటలో చెట్లెక్కారు పూలు పిందెలు కోసి వేశారు అందులో ఒక ఆరేళ్ళ పిల్లవాడు వాళ్ళాతోపాటు ఉన్నాడు కాని అతడు అందరిలా గొడవ చేయడంలేదు పిల్లలు త్రుంచి పారవేసిన ఒక పువ్వు చేతపట్టుకుని ఉన్నాడు. ఇంతలో తోటమాలి గర్జన వినిపించింది.

ఇంకేం పిల్లలంతా కాలి కొద్దీ పరుగు తీశారు ఆరేళ్ళ ఆ చిన్నపిల్లవాడు అందరిలా పరుగెత్తలేకపోయాడు తోటమాలి రానే వచ్చాడు అందిన ఆబాలుడిని కొడదామని చేయి పైకెత్తాడు ఆ బాలుడు ఏడుపు ముఖంతో దీనంగా అయ్య నన్ను కొట్టకండి నేను తప్పుచేయలేదు బీద పిల్లవాడిని అని తోటమాలిని వేడుకున్నాడు. ఆ తోటమాలి కోపంగా నీవు పేదవాడివి అని అన్నప్పుడు ఇంకా బుద్దిగా బ్రతకవలసి ఉన్నది అల్లరి చిల్లరగా తిరగొద్దు అని ఉపదేశించి ఆ బాలుడిని వదిలివేశాడు.

బుద్దిగా బ్రతకవలసి ఉన్నది అనే ఉపదేశం ఆ బాలుడి మనస్సులో హత్తుకుపోయింది  ఆ బాలుడి పేరు నానే బహదూర్. నానే అంటే చిట్టి తండ్రీ అని అర్దం చిన్నవాడు తోటమాలి ఉపదేశంతో ప్రభావితుడైన ఆ చిట్టి తండ్రే మన దేశపు రెండవ ప్రదాని కాగలిగాడు. అతడే అజాత శతృవుగా దేశ ప్రజల మన్ననలుపొందిన లాల్ బహదూర్ శాస్త్రి.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments