అగ్గిపుల్లను గీచి స్వతంత్రం అనే వెలుగును తెచ్చిన పిల్లాడెవరో తెలుసా? - megaminds - short stories in telugu


మధ్యప్రదేశ్ లో పూర్వం ఆలీరాజ్ పూర్ ఉండేది. ఆ దగ్గరలో భన్వారా అనేది చిన్న గ్రామం. కొండలు, అడవి ఆ గ్రామం ఆనుకొని ఉండేవి. కొండల్లో చాలామంది భిల్లులు నివసిస్తూ ఉండేవారు. ఆ ఊరిలోనే పండిత్ సీతారాం తివారి అనే ఆయన ఉండేవాడు. ఆయన ప్రభుత్వ ఉధ్యానవనానికి కాపలదారుడు. ఆయనకు ఒక కుమారుడు ఉన్నాడు, ఆకుమారుడిని చదివించాలని తివారికీ చాలా కోరిక ఉండెది. కానీ ఆ కుమారుడు భిల్లుల పిల్లల్తో ఆటపాటలతో మునిగితెలేవాడు అందువలన ఎప్పుడూ బడి ఎగకొడుతూ ఉండేవాడు.

అతడికి అగ్గి పుల్లలు గీచి మంట తెప్పించడమంటె చాలా సరదా! అగ్గిపెట్టె కనబడితే చాలు దానిలోని అగ్గిపుల్లలు గీయందే నిద్రపోయేవాడు కాదు. ఒకరోజు బడికి పోకుండా అదే ఆట ఆడుతున్నాడు ఇంతలో వాళ్ళ అమ్మ వచ్చింది, బడికి పోకుండా ఆ ఆటలు అడుతున్నవా? ఏంచేస్తున్నవక్కడా? అని గద్దించి అడిగింది. అమ్మా నేనొక ప్రయోగం చేస్తున్నా చూడు! అన్నాడు ఆ అబ్బాయి బయపడకుండా. ఒక అగ్గిపుల్ల గీస్తే ఎంతో వెలుగు వస్తుంది అగ్గిపెట్టె ఒక్కసారే గీస్తే ఎంత వెలుగు వస్తుందో? అని అగ్గిపుల్ల గీచి పెట్టెనంతా తగులబెట్టాడు.

ఆమెకు కోపం వచ్చింది ఆ అగ్ని అపాయకరం అని నేను చెప్పలేదా! అని చెవి మెలిపెట్టింది ఇది కూడా ఉపయోగమేనమ్మా? ఇది చీకటిని పోగొడుతుంది అని ధైర్యంగా చెప్పాడు ఆ పిల్లవాడే పెరిగి పెద్దవాడయ్యడు. విప్లవం అనే అగ్గిపుల్లను గీచి స్వతంత్రం అనే వెలుగును మనదేశానికి తీసుకురావాలని ప్రయత్నం చేశాడు, ఆంగ్లపాలకులతో తలపడ్డాడు చివరకు ఆ ప్రయత్నంలోనే తన ప్రాణాలను దేశమాతకు అర్పించాడు అతడే చంద్రశేకర్ ఆజాద్.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments