Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

దండి ఉప్పు సత్యాగ్రహానికి నాయతకత్వం వహించిన మహిళ ఎవరో తెలుసా? - MegaMinds - Short Stories in Telugu

అతి సామాన్యుడూ ఆ గర్భ శ్రీమంతుడు ఉప్పును వాడుతారు. అటువంటి ఉప్పు మీద పన్ను వేసింది అంగ్ల ప్రభుత్వం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపు ఇ...


అతి సామాన్యుడూ గర్భ శ్రీమంతుడు ఉప్పును వాడుతారు. అటువంటి ఉప్పు మీద పన్ను వేసింది అంగ్ల ప్రభుత్వం గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపు ఇచ్చారు. ఆంగ్లేయులను కాదని ఉప్పు తయారు చేయటానికి ఆయన సిద్ధపడ్డారు. గుజరాత్ లోని సూరత్ జిల్లాలో సముద్రతీరాన "దండి" అనే గ్రామం ఉన్నది. సబర్మతి ఆశ్రమం నుండి అక్కడకు 200 మైళ్లు దూరం. గాంధీజీ 1930 మార్చి 12న దండికి యాత్ర ప్రారంభించారు.

సత్యాగ్రహులంతా ఏప్రిల్ కి “దండి" చేరుకున్నారు. ఆ శాసనాన్ని ల్లంగించి ఉప్పును తయారు చేశారు. సత్యాగ్రహం లో ఉత్సాహం రెట్టింపు అయింది. ఆంగ్లేయులు ఏమీ చేయలేకపోయారు. “దర్శన" అనే చోట ప్రభుత్వం వారి ఉప్పు గోదాములు ఉన్నాయి. ఆ గోదాముల్లో ప్రవేశించి ఉప్పు తీసుకు వస్తామని ప్రకటించారు గాంధీ గారు సత్యాగ్రహులతో ముందుకు కదిలారు. కొద్ది దూరం వెళ్లగానే గాంధీజీని అరెస్టు చేశారు. జవహర్ లాల్ నెహ్రూ సత్యాగ్రహులకు నాయకత్వం వహించారు. ఆయనను కూడా అరెస్టు చేశారు.

ఆయన తరువాత నాయకత్వం వహించిన అబ్బాస్ తయాబ్జీని కూడా అరెస్టు చేశారు. ఇక మిగిలింది. ఒక మహిళ. ఆమె ధైర్యంతో సత్యాగ్రహులకు నాయకత్వం వహించింది. సత్యాగ్రహుల జట్టును "శాంతిసేన" అనేవారు. పేరుకు తగినట్లుగానే ఆ దళం శాంతిసేనే! పోలీసులు ఎన్ని బాధలు పెట్టినా సహించారు. పోలీసులు కొట్టినా మనం సహించాలి. ఎదురు తిరగకూడదు. ఇది బాపూజీ సందేశం అను సత్యాగ్రహులను హెచ్చరించింది.

చాలా మంది. పోలీసులు బ్రిటీషు ఆఫీసర్లు జనాన్ని చితక్కొట్టారు. ఎటూ కదలకుండా ఎండలో నిలబెట్టారు. అయినా జనం ఎదురు తిరగలేదు. నాయకురాలి మాట జవదాటలేదు. 1930 మే 16 వ తేదీన నాయకురాలిని అరెస్టు చేస్తారు, ఆమె ధైర్యంగా చెరసాలకు వెళ్లింది. భారతీయ మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆమెయే సరోజిని దేవి. ఆంగ్లంలో కవిత్వం చెప్పి కవికోకిల గా పేరు పొందింది.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment