Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

వసుచరిత్ర చదువుతూ బడిమానేసిన పిల్లాడెవరో తెలుసా? - megamind - short stories in telugu

ఆ అబ్బాయికి పన్నెండేళ్లుంటాయి. ఉన్నత పాఠశాలలో చదువు కుంటున్నా డు . అతడు కాసుల పుస్తకాలు కాకుండా ఇతర మంచి పుస్తకాలు కూడా చదువుతూ ఉండేవాడ...


ఆ అబ్బాయికి పన్నెండేళ్లుంటాయి. ఉన్నత పాఠశాలలో చదువు కుంటున్నాడు. అతడు కాసుల పుస్తకాలు కాకుండా ఇతర మంచి పుస్తకాలు కూడా చదువుతూ ఉండేవాడు. వాళ్ల ఇంట్లో చాలా తాటాకుల పుస్తకాలు ఉండేవి. అవి అన్నీ ఓపికగా అధ్యయనం చేస్తూ ఉండేవాడు.

అతడు ఒక్క సారి చదివితే చాలు. అంత చక్కగా మనస్సుకు ఎక్కేది పాఠశాలకు వెళ్లే దారిలో ఒక పుస్తకాల అంగడి ఉన్నది. దానిలో వసుచరిత్ర అనే పుస్తకం ఉన్నది. ఆ అబ్బాయికి దానిని చదవాలనిపించింది. ఆ పుస్తకం చాలా ఖరీదు. ఆ రోజుల్లోని ఏడెనిమిది నెలల పాఠశాల ఫీజుతో ఆ పుస్తకం వెల సమానం.

అది బడి పుస్తకం కాదు. అమ్మ కొన్ని పెట్టదు. ఏం చేయాలి? అంగడి యజమానితో ఒక ఒప్పందం చేసుకున్నాడు. అయ్యా! పుస్తకం ఖరీదులో నెలకు కొంత ఇస్తాను. అది తీరిందాకా పుస్తకం ఇక్కడే చదువుకుంటాను. అని ఆ ఒప్పందం సారాంశం. సరే! బాగానే ఉంది. అని వ్యాపారి ఒప్పుకున్నాడు. ఆ అబ్బాయి బడికి అని బయలుదేరేవాడు. దారిలో ఉన్న అంగడిలో కూర్చొని వసుచరిత్ర చదివేవాడు.

దానితో బడికి పోవటం కుదరలేదు. ఆ సంగతి ఆ అబ్బాయి వార్ల అమ్మకు తెలిసింది. అబ్బాయి ఇంటికి రాగానే గద్దించి అడిగింది. పిల్లవాడు భయపడుతూ. తనకు పుస్తకం చదవాలనిపించిందని. అందుకే అది చదువుతూ బడికిపోలేదని చెప్పాడు. ఆ అబ్బాయి నిజమే చెప్పినందుకు వాళ్ల అమ్మ ఎంతో సంతోషించింది. తన కుమారుడిలో ని పఠనాశక్తికి ఆశ్చర్యపోయింది. ఎట్లాగో డబ్బులు పోగుచేసి ఆ పుస్తకాన్ని కొనిఇచ్చింది. అలా ఆ పిల్లవాడు ఎన్నో గ్రంథాలు చదివాడు. పెద్దయినాక మంచి పండితుడు అయ్యాడు. ఎన్నో గ్రంథాలు వ్రాశాడు. సంఘ సంస్కర్త గా పేరు పొందాడు ఆయనే కందుకూరి వీరేశలింగం గారు.


ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

1 comment