Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చిన్నాన్నను నేను విడిపించుకొస్తాను అన్న ఆ బాలుడెవరో తెలుసా? - megamind - short stories in telugu

లాహోరు దగ్గరలో బంగా అనే గ్రామం ఉన్నది. ఆ గ్రామంలో కిషన్ సింగ్ అనే ఆయన ఉండేవాడు. కిషన్ సింగ్ కు ఇంకా ఇద్దరు తమ్ముళ్లున్నారు. వారి పేర...


లాహోరు దగ్గరలో బంగా అనే గ్రామం ఉన్నది. గ్రామంలో కిషన్ సింగ్ అనే ఆయన ఉండేవాడు. కిషన్ సింగ్ కు ఇంకా ఇద్దరు తమ్ముళ్లున్నారు. వారి పేర్లు అజిత్ సింగ్ స్వర్ణ సింగ్ లు ఆంగ్లేయులు మన దేశాన్ని పాలించే రోజులవి. ఆంగ్లేయులకు ఎదురు తిరిగినందుకు ముగ్గురు సోదరులనూ జైల్లో పెట్టారు. కిషన్ సింగ్ అతడితో పాటు స్వర్ణసింగునూ కొద్దిరోజుల తరువాత వదిలారు.

కాని బర్మా లో మాండలే జైల్లో ఉన్న అజిత్ సింగును మాత్రం వదల లేదు. అజిత్ సింగ్ భార్య భర్త కోసం ఎప్పుడూ విచారంగా ఉండేది. కిషన్ సింగుకు ముక్కుపచ్చలారని తనయుడు ఒకడు ఉన్నాడు. చిన్నమ్మ ఎప్పుడూ దుఃఖిస్తూ ఉండటం అతడికి ఆశ్చర్యం అనిపించేది. ఒకరోజు అమ్మను అడిగాడు.

అమ్మ! చిన్నమ్మ ఎందుకు ఎప్పుడూ ఏడుస్తుంటుంది? మీ చిన్నాన్న ను పోగొట్టుకున్నందుకు? అమ్మ సమాధానం ఇచ్చింది. చిన్నాన్న ఇక్కడి కెందుకురాడు? ఆ పసిబాలుడు అడిగాడు. అతడు రాడు బాబు! మన దేశాన్ని ఆంగ్లేయులు దోచుకుంటున్నారు. వాళ్లను ఈ దేశం నుండి వెళ్లగొట్టాలన్నదే మీ చిన్నాన్న ధ్యేయం. అందుకే ఆంగ్లేయులకు అతడు శత్రువు అయ్యాడు అని ఆమె ప్రజలు స్వతంత్రం కోసం జరుపుతున్న సంగతులు ఆ పిల్లవాడికి చెప్పింది. అతడిలో ఆవేశం వచ్చింది.

చిన్నమ్మ దగ్గరకు పరుగు పెట్టాడు. నేను పెరిగి పెద్దవాడినై ఆంగ్లేయులను తరిమి చిన్నాన్నను విడిపించుకు వస్తాను. ఏడవకు చిన్నమ్మా అని సముదాయించాడు. కాని బాబూ! ఆంగ్లేయులకు పెద్ద సైన్యం ఉంది. వీళ్లు తుపాకులు, ఫిరంగులూ ఉన్నాయి. అన్నది అమ్మ. మీరు విచారించకండి. నేనూ తుపాకులు సంపాదిస్తానుగా! అన్నాడు ఆ బాలుడు పిల్లవాడి వీరాలాపాల కు తల్లులు ఇద్దరూ సంతోషించారు. ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడై అన్నంత పనీ చేశాడు. ఇంక్విలాబ్ జిందాబాద్ అంటూ ఆంగ్లేయులను ఎదిరించాడు. ఆ ప్రయత్నంలో తన ప్రాణాలను పణంగా పెట్టాడు. అతడే భగత్ సింగ్.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.


No comments