Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

హరి కథా పితామహుడు ఎవరో తెలుసా? - megamind - moral stories in telugu

విజయనగరం దగ్గరలో గుంప అనే శివక్షేత్రం ఉన్నది. శివరాత్రి అక్కడ గొప్ప తిరుణాళ జరుగుతూ ఉంటుంది. ఆ తీర్ధానికి ఒక పిల్లవాడు. తన తల్లితో బండి ...


విజయనగరం దగ్గరలో గుంప అనే శివక్షేత్రం ఉన్నది. శివరాత్రి అక్కడ గొప్ప తిరుణాళ జరుగుతూ ఉంటుంది. ఆ తీర్ధానికి ఒక పిల్లవాడు. తన తల్లితో బండి ఎక్కి వెళ్లాడు. తీర్థం అయిన తరువాత బండి తిరుగు ప్రయాణం అయింది. దారిలో ఉన్న ఒక పుస్తకాల అంగడి పిల్లవాడి కంటపడింది. వెంటనే బండి దిగి అంగడి వద్దకు వెళ్లాడు, పుస్తకాలు పరికించి చూడటం సాగించాడు. వాటిల్లో భాగవతం పాత ప్రతి ఒకటి కనుపించింది. దానిలో చక్కటి బొమ్మలు కూడా ఉన్నాయి. ఆ పుస్తకాన్ని చూచిన పిల్లవాడికి, ముచ్చట వేసింది.

దానిని కొనుక్కుందామనుకున్నాడు. దాని వెల ఎంత? అని అంగడి యజమానిని అడిగాడు, ఆ వ్యాపారి వెటకారంగా నీకు భాగవతం ఎందుకయ్యా? పనికిరాదు పో అన్నాడు. ఆ పిల్ల వాడి ముఖం చిన్నపోయింది బండిలో ఉన్న తల్లి ఆ భాగవతాన్ని ఖరీదుకు ఇచ్చివేయి. మా అబ్బాయి చదువుకుందామనే అభిలాషతోనే అడిగాడు. అని అన్నది. ఆ వ్యాపారి ఆశ్చర్యపోయాడు.

అయితే అబ్బాయి ! ఇదిగో ఈ పద్యం చదువు, అని ఆ అబ్బాయికి పుస్తకంలోని ఒక పద్యం చూపించాడు, ఆ అబ్బాయి పుస్తకాన్ని తీసుకొని రాగయుక్తంగా ఆ పద్యం చదివాడు. ఆ వ్యాపారి అబ్బాయి పద్యపఠనానికి విస్తుపోయాడు. ఇదిగో ఇది ఒక్కటి.. ఇంకొక్కటి. అంటూ చాలా పద్యాలు చదివించాడు. ఆ అబ్బాయి విసుక్కోకుండా తప్పులు పోకుండా.. అన్నిటినీ చక్కగా చదివాడు. వ్యాపారి చాలా సంతోషించాడు.

ఆ పిల్లవాడికి భాగవతాన్ని ఉచితంగా ఇచ్చాడు. అంతే కాకుండా కొంత డబ్బు కూడా బహుమానంగా ఇచ్చాడు పిట్ట కొంచెం.. కూత ఘనం అని అనిపించుకున్న ఆ పిల్లవాడు పెరిగి పెద్దవాడయ్యాడు. ఆటల పాటల మేటి అని అనిపించుకున్నాడు. తెలుగునాట హరికథలు ఒరవడి పెట్టాడు, హరికథా పితామహుడు అనిపించుకొన్నాడు. ఆయనే ఆదిభట్ల నారాయణదాసు గారు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments