అది అరేబియా సముద్రం ఆ సముద్రంలో ఒక పెద్ద ఓడ ఇంగ్లండు వైపు ప్రయాణిస్తున్నది. దాని లో రకరకాల ప్రయాణీకులు ఉన్నారు. వారంతా పైకి ఆడంబరంగా కని...
అది అరేబియా సముద్రం ఆ సముద్రంలో ఒక పెద్ద ఓడ ఇంగ్లండు వైపు ప్రయాణిస్తున్నది. దాని లో రకరకాల ప్రయాణీకులు ఉన్నారు. వారంతా పైకి ఆడంబరంగా కనిపిస్తున్నారు. వారిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు చాలా సాధారణంగా కనుపిస్తున్నాడు. ఆకృతిలో మాత్రం చక్కని వర్చస్సు ఉన్న ది. అందరి కంటే విలక్షణమైన అతని దుస్తులు అతడొక సామాన్య వ్యక్తి అన్న భ్రాంతిని కలిగిస్తున్నాయ.
ఆ వ్యక్తి ఒక బల్ల వద్ద కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. ఆ ప్రయాణీకులు ఒక ఐరోపా యువకుడు ఉన్నాడు. సామాన్యంగా కనిపిస్తున్న వ్యక్తి ని చూచి అతడిలో గర్వం పడగ విప్పింది. ఆ వ్యక్తిని హేళన చేయాలనుకున్నాడు. గబగబా తన గదికి వెళ్ళి కాగితం ముక్కల మీద ఏవో దుర్భాషలు వ్రాసుకు వచ్చాడు. వాటినన్నిటినీ ఒక గుండు సూది కి గ్రుచ్చాడు. ఆ కాగితాలపైన దుర్భాషలతో పాటు విదేశాలకు వెళ్లాలనే వెర్రిని విడనాడు అని వ్రాసి ఉన్నది.
పట్టరాని గర్వంతో నడుస్తూ సామాన్య వ్యక్తి దగ్గరకు వచ్చాడు. ఆ కాగితాలు ఆ వ్యక్తి ఇచ్చాడు. ఈసడింపుగా ఇది చదువుకో ఆనందించు. నీకు ఉపయోగపడతాయి. అని కాగితాలు అందించి దూరంగా వెళ్లి నిలబడ్డాడు. సామాన్య వ్యక్తి ఆ కాగితాలను చదువుకున్నాడు. వాటిని భద్రంగా చెత్తబుట్టలో వేసి గుండు సూదిని మాత్రం తీసుకున్నాడు. అతడి మొఖంలో సౌమ్యత వెల్లివిరిసింది.
మందహాసం చేస్తూ ఆ యువకుడి దగ్గరకు వెళ్లాడు. అతడితో నీవు చెప్పినట్లే చేశాను. నాకు ఉపయోగించేది ఈ గుండు సూది మాత్రమే! ఇది దగ్గరి ఉంచుకుంటాను. అని అన్నాడు. ఐరోపా యువకుడు విస్తుపోయాడు. తానొకటి తలిస్తే వేరొకటి అయ్యింది. అతడికి కను విప్పు కలిగింది. సామాన్య వ్యక్తి ని క్షమాపణ కోరాడు. నాటి నుండి ఆ యువకుడు తన నడతను చక్కదిద్దుకున్నాడు. మంచితో మనిషిలో మార్పు తెచ్చిన ఆ సామాన్య వ్యక్తి మన మహాత్మా గాంధీ.
ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..