రైల్వే స్టేషన్లో అడుక్కునే పిల్లల్ని తీసుకెళ్ళి పెంచుకున్న దేశభక్తుడెవరో తెలుసా? - Megamind - moral stories in telugu


మానవ సేవే మాధవ సేవ అన్నది భారతదేశపు నీతి, కష్టాలలో ఉన్న సాటి మానవుని ఐదుకోవటమే ప్రతి మానవుడు ధర్మం. దయ... ప్రేమ.. దైవ భక్తి.. జాలి.. ఇవి మానవ సేవకు మార్గం చూపుతాయి. అటువంటి మానవ సేవకు జీవితాన్ని అంకితం చేసిన మహానుభావుడు ఎందరో ఉన్నారు. అందులో ఒక మహానుభావుడు జీవితంలో జరిగిన సంఘటన ఈ కథ.

విజయవాడ నుండి రైలు మద్రాసు వెళుతున్నది. మద్రాసు దరిదాపుల్లో పొన్నేరి అనే రైలు స్టేషను ఉన్నది. ఆ స్టేషన్లో రైలు ఆగింది. అక్కడ ఎందుకు ఆగిందో కానీ చాలా సేపు మాత్రం ఆగింది. రైల్లోని ప్రయాణీకులు కొందరు గాలికోసం స్టేషన్ ప్లాట్ఫారం మీద తిరగటం సాగించారు. వారిలో ఒక పెద్ద మనిషి బుగ్గ మీసాలు. సాంప్రదాయకమైన తలపాగా... మొఖం లో మంచి వర్చస్సు. కళ్లల్లో దయామృతం వర్షిస్తున్నట్లున్నది. ఆయన దృష్టి లో ప్లాట్ ఫారం మీద ఉన్న నలుగురు బాలికలు పడ్డారు.

ఆ బాలికల రూపురేఖలు వారి పేదతనాన్ని గుర్తు చేస్తున్నాయి ఆ పెద్ద మనిషి వాళ్ల దగ్గరకు రాగానే వాళ్లు ఆయన్ను యాచించారు. ఆ బాలికల దయనీయమైన స్థితిని చూచిన ఆయన కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఎవరి పిల్లలమ్మా మీరు? అని ఆప్యాయంగా అడిగాడు. పిల్లలు ఏదో జవాబు చెప్పారు. ఆయన హృదయంలో ఆలోచనలు పరుగులెత్తాయి. వీళ్ళను తీసుకు వెళ్లి పెంచుకుంటే నో? అని అనుకున్నాడు.

ఆయనది కాకినాడ, మద్రాసు వెళ్తున్నాడు. పిల్లలను గురించి వివరాలు తెలుసుకున్నాడు. తిరిగి కాకినాడ వెళ్లగానే వారిని పిలిపించుకున్నాడు. కన్నబిడ్డల్లా సాకుకున్నాడు. ఆయన ఉన్నత పదవిలో ఉన్నాడు. తనకు వచ్చిన డబ్బునంతా ఇలాగే బీదవారికి నెలనెలా పంచి పెట్టే వాడు. అలా దాన కర్ణుడి గా, దయామయుడి గా పొగడ్తలు అందుకున్నాడు. ఆయనే బ్రహ్మర్షి రఘుపతి వేంకటరత్నం నాయుడు గారు.

ఇలాంటి చిన్న కథల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

0 Comments