హుమయున్ సమాధి హిందూ దేవాలయమా? - Humayun Tomb site in Delhi is an Ancient Temple?

1
ఢిల్లీలోని హుమాయున్ సమాధి నిర్మించింది ఒక స్త్రీ. హుమాయున్ భార్య హమీదా బాను బేగం దీనిని పర్షియన్, భారతీయ శైలుల్ని కలగలిపి నిర్మించింది. పనితనాన్ని పట్టిచూపే టైల్స్‌ తాపడం, కళాత్మక గవాక్షాలకు ఇది చిరునామా. ఎర్ర రాతితో కట్టిన ఈ సమాధి భారత ఉపఖండంలోనే మొదటి గార్డెన్ టూంబ్‌(ఉద్యానవన సమాధి). ఇక జాతీయ వారసత్వ సంపద జాబితాలో ఉన్నచారిత్ర‌క క‌ట్ట‌డం ఇది. అత్యంత సువిశాల స్థ‌లంలో మొఘల్‌ చక్రవర్తి అయిన హుమాయూన్‌ సమాధి విస్త‌రించి ఉంది. 30 ఎకరాల ప్రాంతంలో స‌మాది ఉండగా. చుట్టు 200 ఎకరాలకు పైగానే హుమాయున్ చారిత్ర‌క‌ కాంప్లెక్స్ విస్తరించి ఉంది. దాదాపు రూ.300కోట్ల వ్యయంతో ఈ కాంప్లెక్స్ ను ఆగాఖాన్‌ ట్రస్ట్‌ ఫర్‌ కల్చర్‌ సంస్థ‌ అభివృద్ధి పనులను నిర్వహిస్తోంది. ఈ విషయం మనకు అందరికీ తెలుసు ఎందుకంటే మనం అందరమూ ఒక పనికిమాలిన చరిత్ర స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండీ చదువు కున్నాము కనుక.

ఇక అసలు ఈదేశంలో అనేక మసీదులూ, సమాదులు అన్నీ ఒకప్పుడు హిందూ దేవాలయాలు, కోటలు వాటికి మెరుగులద్ది వాటిని సమాదులుగా, మసీదులుగా, ఖంకాలుగా మార్చారు  అన్న విషయం కాస్త పరిశీలనగా చూసి ఆలోచన చేస్తే వాస్తవాలు మనకే బోధపడతాయి అలాగే మీరు వెబ్ సైట్ లో చరిత్ర  అనేది చూసినప్పటికి మీకు ఇంకా అనేకమైనవి ఇలాంటి విషయాలు ఋజువులతో సహా చూపడం జరిగింది. ఇక మనం హుమయున్ సమాధి విషయానికి వస్తే అది ఒక పురాతనమైన విష్ణు పాద దేవాలయం అని తెలుస్తుంది, కొన్ని చిత్రాలు ఆదారాలతో మీకు క్రింద వివరిస్తాను.

ఈ ప్రదేశం ఒక పురాతన విష్ణు పాద లేదా విష్ణు చరణ్ (विष्णुचरण) హిందూ ఆలయం మరియు హుమయూన్‌ను మరెక్కడైనా ఖననం చేసి ఉండవచ్చు.  వాస్తవానికి, హుమయూన్ డిల్లీలో ఖననం చేయబడలేదు. ఫరిష్టా క్రానికల్ ప్రకారం (జాన్ బ్రిగ్స్ ఆంగ్ల అనువాదం, వాల్యూమ్ II, పేజి 174) హుమయూన్ ఆగ్రాలో ఖననం చేయగా, అబుల్ ఫజల్ (ఇలియట్ & డోవ్సన్, వాల్యూమ్. VI, పేజి 22) ప్రకారం హుమయూన్ సిర్హింద్ (పంజాబ్) లో ఖననం చేయబడ్డాడు.

హుమయూన్ సమాధి ప్రదేశంలో 1893 వరకు మనుగడలో ఉన్న విష్ణు పాదముద్ర స్లాబ్ యొక్క ఛాయాచిత్రం ఇది.
ఈ ఫోటోను డాక్టర్ గుస్టావ్ లే బాన్ 1893 లో తన ‘లెస్ మాన్యుమెంట్స్ డెస్ ఎల్ఇండే’ (ది మోనుమెట్స్ ఆఫ్ ఇండియా) పుస్తకంలో ప్రచురించారు. డిల్లీలోని పురావస్తు శాస్త్రవేత్తలు ఈ ప్రదేశంలో ఈ పాదముద్రలు లేదా హిందూ ఆలయ శైలి స్తంభాలను ఎప్పుడూ గమనించలేదు,అనే సమాచారం తప్పుడు సమాచారం వాస్తవాలను రుజువు చేస్తుంది. ఎవరికి భయపడి ఈ చిత్రాన్ని విడుదల చేయడంలేదో మీకు తెలుసు.

అలాగే పైన ఉన్న చిత్రాన్ని చూస్తే పురాతన హిందూ ఆలయ నిర్మాణ శైలిలో స్తంభాలను చూపిస్తుంది, హిందు దేవాలయాన్ని నాశనం చేసి, ఇక్కడ ఒక సమాధిని నిర్మించిన తరువాత తిరిగి ఉపయోగించబడింది. ఈ నేపథ్యంలో హుమాయున్ సమాధి కాంప్లెక్స్‌లోని ఇసా ఖాన్ సమాధి వద్ద ఒక సాధారణ మొఘుల్ కోట గోడ యొక్క విభాగం ఉంది. హుమాయున్ సమాధి కాంప్లెక్స్ వద్ద ఇసా ఖాన్ సమాధి నిర్మాణానికి ఉపయోగించిన ఆలయ స్తంభాలపై చెక్కిన శిల్పాలు, స్థంభాలు అవి వేరే పురాతన కాలానికి చెందినవని సూచిస్తుంది.
.

కాబట్టి, ఒక పురాతన విష్ణు ఆలయం నాశనమై సమాధిలా కనిపించేలా చేసింది. వాస్తవానికి, హుమయూన్ డిల్లీలో ఖననం చేయబడలేదు. ఇది అసలు విషయం అలాగే అనేకసార్లు హిందుత్వ వాదులు కూడా సమాదులన్న్నీ కుల్చితే ఎన్నో వాస్తవాలు బయట  పడతాయి అనడం కూడా జరిగింది. ఇవే కాక దేశంలో కొన్ని లక్షల ఎకరాల్లో సమాదులు ఉన్నాయి వీటి వలన మన దేశ సంపద కూడా ఎన్నో విధాలుగా వాటిని కాపాడటానికి కూడా ఖర్చు చేయాల్సి వస్తుంది.. మీరూ ఒక్క సారి ఆలోచన చేయండి  వాస్తవ చరిత్ర ను తెలుసుకుందాం. అనేక వెబ్ సైట్ ల నుండి, పుస్తకాల నుండి కొంతమంది పెద్దల నుండి విషయాలు సేకరించి ఈ విషయాలు వివరించడం జరిగింది మీకు తెలిసిన ఇంకా వివరాలు ఉన్నా కూడా తెలుపగలరు... 
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

Post a Comment

1 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment
To Top