రాజా జయసింహునికి శివాజీ లేఖ, లేఖ మూల ప్రతి ఫారసీ భాషలో ఉంది. ఆనాడు ఫార్సీ భాష రాజభాషగా ఉండినది. శివాజీ చారిత్రాత్మక లేఖ ఇలా ఉంది:
రాజాజయసింహునికి వందనాలర్పించి ఇలా సంబోధించాడు.
ఓయ్! సర్దార్లకు సర్దారుడా! రాజులకు రాజా! భారతోద్యానపు పూలమడుల వ్యవస్థాపకుడా! ఓయ్! రామచంద్రుని చైతన్య హృదయాంశమా! మీ వలన రాజపుత్రుల మెడ (తల) ఉన్నతమయింది. మీ వలన బాబరు వంశ రాజ్యలక్ష్మి మరింత బలవర్ధక అయిపోతున్నది.
మీరు నాపై ఆక్రమణకు వచ్చినారని నేను విన్నాను. హిందువుల హృదయం మరియు నేత్రముల రక్తంతో నీవు అరుణముఖునివి (కీర్తిమంతుడవు) కావాలను కుంటున్నావు. అయితే దీనితో నీ ముఖంపై మసిబారుతున్నదని నీకు తెలియుట లేదు. ఎందుకనగా దీనివల్ల మన దేశానికి మరియు ధర్మానికి ఎనలేని హాని కలుగుతున్నది.
నీకుగా నీవు స్వయంగా దక్షిణ విజయయాత్రకు వస్తే నేను నీకు (సేవకుడిలా) నీ గుర్రం వెంట నా సేననంతా తీసుకొని నడిచేవాడిని మరియు ఒక కొననుండి మరో కొనవరకు భూమినంతా గెలిచి నీకు అప్పగించేవాడిని. అయితే నీవు ఔరంగజేబు కొరకు వచ్చావు. ఒకవేళ నేను నీతో కలిస్తే అది పురుషత్వమనిపించుకోదు. సింహం ఎప్పుడూ గుంట నక్కగా వ్యవహరించదు. ఒకవేళ నేను కత్తినెత్తి పనిచేయదలిస్తే ఇరువైపులా హిందువులకే నష్టం సంభవిస్తుంది. ముస్లిం (శత్రువు)ల రక్తం త్రాగడానికి కాకుండా మరోపనికోసం నా కత్తిని ఒరనుండి తీయటం నాకు ఖేదాన్ని కల్గిస్తుంది.
వాడు (ఔరంగజేబు) న్యాయానికి ధర్మాన్ని మరచిన పాపి, మానవరూపదానవుడు. అఫ్జల్ ఖాన్ వధించబడ్డాడు, షాయిస్తాఖాన్ పరాభవింపబడ్డాడు. ఇది చూసే వాడు నిన్ను నాపై యుద్ధానికి పంపాడు. మా దాడిని తట్టుకొనే శక్తి వాడికి లేదు. సింహాలు పరస్పరం పోట్లాడుకొని గాయపడి చనిపోతే ఆ పిరికినక్క మృగరాజు అయి కూర్చుంటుంది. ఈ రహస్య భేదనీతి నీకెందుకు అర్థం కాదు?
“ఒకవేళ నీ కత్తిలో శక్తి ఉంటే, నీ దూకే గుర్రంలో దమ్ముంటే హిందూధర్మ విరోధులపై దాడిచేయి! ఇస్లాంను కూకటివేళ్లతో పెకలించు! నీచుడైన ఆ ఔరంగజేబు దయనెందుకు కోరుకుంటావు? నీ కతనిపట్ల రాజభక్తి దురద ఉంటే అతడు (తన తండ్రి) షాజహాన్ పట్ల ఎలా వ్యవహరించాడో గుర్తు చేసుకో!
"మనం (హిందువులం) పరస్పరం కలహించుకొనే సమయం కాదిది! ఇప్పుడు హిందువులకు సంకటసమయం వచ్చింది. మన బాల-బాలికల పై దేశ-ధనములపై దేవ-దేవాలయాలు మరియు పవిత్ర దేవపూజకులపై సంకట సమయం వచ్చిపడింది. కొన్ని రోజులు ఇలాగే ఉంటే మన ప్రజల ప్రతీక ఏదీకూడా భూమిపై మిగులదు. పిడికెడుమంది ముస్లిములు మన ఈ విశాలదేశంపై అధికారాన్ని స్థాపించటం చాలా ఆశ్చర్యంగా ఇంది. ఇప్పుడు మనం హిందూ, హిందుస్థాన మరియు హిందూ ధర్మ రక్షణ కోసం ఎంతగానో ప్రయత్నం చేయాల్సి ఉంది. నలువైపుల నుండి ముట్టడించి మీరు యుద్ధం చేయండి. ఆ పాముపడగను పెరికివేయండి. నేను ఇటునుండి ఇద్దరు పాదుషాల మెదడును (తలను) తీసి వేస్తాను. దక్షిణదేశ ఆవరణమునుండి ఇస్లాంను, దాని ప్రతీకలను నామరూపాలు లేకుండా కడిగివేస్తాను. మనం మన సేన తరంగాలను (వాహినులను) దిల్లీకి చేరుద్దాం. అప్పుడు (ఔరంగజేబు) ఔరంగము (రాజసింహాసనము) ఉండదు; దాని శోభా ఉండదు.
మనం పరిశుద్ధ రక్తపునదిని ప్రవహింపచేద్దాం; దానిలో మనపితరుల ఆత్మలకు తర్పణాలను వదలుదాం. భగవత్కృపతో మనం ఔరంగజేబును భూమిలోపల సమాధి చేద్దాం. ఇది కఠినమైన పనేమీ కాదు. మన రెండు హృదయాలు ఒకటయితే కొండలను పిండిచేయగల్గుతాం. ఈ విషయమై నేను నీతో చాలా మాట్లాడాల్సివుంది నీవు వినాల్సివుంది. ఆమాటలన్నీ లేఖలో వ్రాయటం యుక్తియుక్తం కాదు.
నాఖడ్గము పై ఒట్టు, గుర్రం పై ఒట్టు, దేశంపై ఒట్టు మరియు ధర్మం పై ఒట్టుపెట్టి చెబుతున్నాను. నీకు ఎలాంటిహానీ సంభవించదు. అఫ్జల్ ఖాన్ వధతో నీవు అనుమాన పడవద్దు. వాడొక అబద్ధాలకోరు. 1200 అరబ్బు యుద్ధాశ్వికదళంతో వాడు నన్ను వధించవచ్చాడు. నేను ముందుగా (యుక్తితో) వాణ్ణి సంహరించకుంటే ఇప్పుడు నీ కీ లేఖ ఎవరు వ్రాసేవారు? నాకు స్వయంగా నీతో వైరం ఏదీ లేదు. నాకు నీ నుండి అనుకూలమైన ప్రత్యుత్తరం వస్తే నేను స్వయంగా రాత్రికి రాత్రే నీ ముందుంటాను.
నేను షాయిస్తాఖాన్ జేబునుండి తస్కరించిన రహస్య లేఖను నీకు చూపిస్తాను. ఈ నా లేఖ నీకు సమ్మతంగా లేకుంటే నాకు మరియు కుత్తుకలుత్తరించే నా కత్తికి (ఏరాగా) నీ సైన్యముంటుంది. రేపు సూర్యాస్తమయం వరకు చూస్తాను, ఆ తర్వాత నా ఖడ్గము ఒరలోనుండి బయటికి వస్తుంది. ఇక ఇంతే, నీకు శుభమగుగాక!వీ
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
ఆజాదీ కా అమృత్ మహోత్సవం, భారత స్వాతంత్ర్య పోరాటంలో వీర నారీమణులు, దేశం కోసం పోరాడిన వీరులు, స్వాతంత్ర్య సమరయోధుల గురించి, భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్, భారత 75వ స్వాతంత్య్ర దినోత్సవాలు, స్వాతంత్ర్య సమరయోధులు పేర్లు, త్యాగమూర్తులు మరియు గొప్ప వ్యక్తిత్వం కలవారి జీవిత చరిత్రలు తెలుసుకోవడానికి మన వెబ్ సైట్ ని అందరికీ పంపగలరు.
ప్రాణాయామం ఉపయోగాలు, అంతర్జాతీయ యోగా దినోత్సవం, గుండె జబ్బులకు కారణాలు నివారణకు యోగాసనాలు, ఆయుష్షు పెంచే సూర్య నమస్కారలు, సూర్య నమస్కారాలు ఎలా చేయాలి, యోగాసనాలు, ప్రాణాయామం – సూర్యనమస్కారాలు. సూక్ష్మ వ్యాయామం- సూర్య నమస్కారాలు అలాగే EPF E-Nominee, jana aoushadi medical shops ఎలా అప్లై చేసుకోవాలి, Types Insurance, Types Loans ఇటువంటి సమాచారం కూడా మన మెగామైండ్స్ వెబ్ సైట్ లో లభిస్తుంది..
At MegamindsIndia, our mission is to empower individuals with practical knowledge that truly matters — the kind that helps you make smarter decisions in life. Whether it's understanding your rights in a legal case, choosing the best insurance policy for your family, filing income tax returns as a freelancer, or planning safe international travel, we're here to guide you. We believe that financial literacy, legal awareness, and access to trusted information are not luxuries — they're necessities. That's why we cover high-impact topics like mesothelioma law, car accident claims, stem cell therapy, commercial real estate loans, and visa-free travel options for Indians. Each article is carefully researched to not only support your goals but also keep our platform sustainable through relevant ads. At MegamindsIndia, knowledge isn't just power — it's progress.
Good work by Mega Minds.
ReplyDelete