Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

గురు అర్జున్ దేవ్ బలిదానం - guru arjan dev ji shaheedi history in telugu

పంజాబ్ ప్రాంతం భారత వాయువ్య సరిహద్దులో ఉన్నది. నిరంతరం విదేశీ దాడులకు గురి అవుతున్న ప్రాంతం. సుమారు 70సార్లు ముస్లిం దురాక్రమణ కారులు ద...


పంజాబ్ ప్రాంతం భారత వాయువ్య సరిహద్దులో ఉన్నది. నిరంతరం విదేశీ దాడులకు గురి అవుతున్న ప్రాంతం. సుమారు 70సార్లు ముస్లిం దురాక్రమణ కారులు దాడి చేశారు. 16వ శతాబ్దం ప్రారంభంలో హిందూ సమాజం భయంకరమైన ముస్లిం అత్యాచారాల నెదుర్కున్నది. ఆ కాలంలో గురునానక్ దేవ్ (1469-1538) సిక్కుమతాన్ని స్థాపించాడు. హిందూ సమాజంలో ఆధ్యాత్మికశక్తిని జాగృతం చేశారు. ఆయన ప్రేరణతో సిక్కు (శిష్య) మతం భవిష్యకాలంలో చాలా ప్రబలంగా పనిచేసి హిందూ సమాజాన్ని రక్షించింది. దేశ-ధర్మ సంరక్షణకు బలిదానంగావించేలా సిక్కు సమాజానికి సిక్కుమతంద్వారా ప్రేరణ లభించింది.

నానక్ దేవ్ తర్వాత గురు అంగద్ దేవ్ గురు పదవిని అలంకరించాడు. సిక్కులకోసం ప్రత్యేకమైన గురుముఖి లిపిని ప్రారంభించాడు. సతీసహగమనం, బురఖా, పరదా వంటి దురాచారాలను ఖండించాడు. సిక్కులు అందరు ఒకచోట సమావేశమై కలసి భోజనం చేసే 'లంగర్' సంప్రదాయాన్ని ప్రారంభించాడు. తర్వాత గురు అమర్ దాస్ మూడవ గురువయ్యాడు (1479-1534); గురు రామదాసు (1534-1581) నాల్గవ గురువయ్యాడు. సుప్రసిద్ధ అమృతసర్ స్వర్ణ మందిర్ నిర్మాణాన్ని ప్రారంభించాడు. నాల్గవ గురురామదాస్ తన గురువు సూచన మేరకు తుంగసుల్తాన్ మరియు గుమ్ టాలా మధ్యప్రదేశంలో మొదట ఒక చెరువును నిర్మించాడు. దానికి 'అమరసరోవర' మని పేరుపెట్టాడు. అక్కడ ఒక గ్రామ మేర్పడింది. దాన్ని 'రామదాసపుర' మన్నారు. అదే తర్వాత కాలంలో 'అమృతసర్' పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన మహానగరమయ్యింది. 

గురు అర్జున్ దేవ్ బలిదానం: గురు అర్జున్ దేవ్ (1581-1606) ఐదవ గురువు గొప్పకవి, వక్త, సాహితీవేత్త, సంఘటనాకర్త. సిక్కుమత గ్రంథం 'ఆది గ్రంథం' గురు అర్జున్ దేవ్ సంపాదకత్వంలో నిర్మాణమయ్యింది. తర్వాత అది 'గ్రంథసాహిబ్'గా సిక్కులకు పరమ ప్రామాణిక మత గ్రంథమై గురుపీఠ మలంకరించింది; సిక్కు గురువు సిక్కులకు పాలకుడుగా కూడా వ్యవహరించసాగినాడు. అప్పుడు జహంగీర్ పాలనా కాలం. అతని పుత్రుడు ఖుస్రో తండ్రి పై తిరుగుబాటు చేసి పంజాకు పారిపోయి వచ్చాడు. గురు అర్జున్ దేవ్ శరణుజొచ్చినాడు. గురువు అతనికి తిలకందిద్ది, రక్షణకు ప్రార్థనచేశాడు. ఖుస్రో అరుదేవ నుండి ఆర్థిక సాయాన్ని అర్థించాడు. తనవద్ద ఉన్న ధనం గురుపీఠానిది, అది పేద-సాదలకు, కాదు-సంతలకు పంచడానికే అన్నాడు. అయినా కొంత సాయం ఇతరత్రా సేకరించి అందించాడు. దీనితో జహంగీర్ కోపించాడు. గురు అర్జున్ దేవ్ ను దండిస్తూ రెండు లక్షల పరిహారం చెల్లించుమన్నాడు. గురువు దాన్ని ధిక్కరించాడు. వెంటనే జహంగీర్ సైనికులను పంపి గురు అర్జున్ దేవ్ ను నిర్భంధించాడు. క్రూరాతి క్రూరంగా హింసించి చంపివేయమని ఆజ్ఞాపించాడు జహంగీర్. అతని ఆదేశం ప్రకారం భగ భగ మండుతున్న పొయ్యి పై పెద్ద కడాయ (మూకుడు) ఉంచి దానిలో నీళ్లు మసలబెట్టారు. సలసల కాగుతున్న నీళ్లలో గురు అర్జున్ దేవ్ ను కాళ్లు చేతులు కట్టి పడవేశాడు. పైనుండి మరింత వేడి ఇసుకవేసినారు. ఆ తర్వాత ఎర్రగా మండుతున్న పెనము (తవా)పై గురువును కూర్చోబెట్టి కాల్చినారు. తర్వాత చనిపోయిన గురు అర్జున్‌ దేవ్ శవాన్ని రావీనదిలో పడవేశారు. ఇలా ధర్మం కోసం ముస్లింపాలకుల నెదిరించి బలిదానంగావడం ఆరంభమయింది.


పంజాబు ముస్లిం పాలకులు అత్యాచారాలు మితిమీరిపోయినవి. ప్రజలంతా బాధల్ని మౌనంగా భరించసాగినారు, తప్ప ఎదిరించాలనే ప్రయత్నం జరుగలేదు. అయితే మన మాతృధర్మాన్ని, మాతృభూమిని, ఆస్తిపాస్తులను, సాధనాసంపత్తులను రక్షించుకోవాలంటే మనమంతా సంఘటితమై పోరాడాల్సిందే!.... అనే భావన ప్రజలందరిలో ప్రబలంగా నిర్మాణం కాసాగింది. గురు అర్జున్ దేవ్ బలిదానం శిక్కులలోనే కాకుండా హిందువులలో కూడా చైతన్యం నింపింది..
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

సేకరణ: హిందూ దేశం పై ముస్లింల దండయాత్రలకు అవిస్మరణీయ ప్రతిఘటనా పరంపర. పుస్తకం నుండి సేకరణ పుస్తకం దొరుకు నిలయం.
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236,

సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments