Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

షాజహాన్ ఎర్రకోట ను నిర్మించలేదా? అయితే ఎవరు నిర్మించారు? Red Fort information in Telugu - megaminds

భారత రాజధాని డిల్లీలో ఉన్నఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసంగా ఉంది, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 1857 తరువాత  బ్రిటిష్ వారు దాని...


భారత రాజధాని డిల్లీలో ఉన్నఎర్రకోట మొఘల్ చక్రవర్తుల నివాసంగా ఉంది, ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామం 1857 తరువాత  బ్రిటిష్ వారు దానిని వారి ఆధీనంలోకి తెచ్చుకున్నారు. భారతదేశంలో మొఘల్ పాలకులు చరిత్రను వక్రీకరించి వారికి కావలసిన విధంగా షాజహాన్ తన పదవీకాలంలో క్రీ.శ 1639 నుండి 1648 మధ్య కాలంలో ఉస్తాద్ అహ్మద్ లాహౌరీ ద్వారా ఈ రాజభవనాన్ని నిర్మించాడని అందరూ అనుకుంటున్నారు.

కానీ వారు చేసినది కొన్ని మార్పులు మాత్రమే మరియు మొఘలులు భారతదేశంలోకి ప్రవేశించక ముందే ఈ కోట ఉంది. డిల్లీలో మొదట ఎర్రకోటను ఎవరు నిర్మించారో రుజువు కోసం క్రింద ఉన్న చిత్రాలను చూడండి.


ఆధునిక పురావస్తు శాస్త్రవేత్తలు ఎర్రకోట లోపల ఒక రాతి పలకను ఉంచారు ఈ కోటను క్రీ.శ 1639 నుండి 1648 వరకు నిర్మించినట్లు ప్రకటించారు, షాజహాన్ (క్రీ.శ. 1628 నుండి 1658 వరకు పరిపాలించారు). ఆక్సఫర్డ్ బోడ్లియన్ లైబ్రరీలో భద్రపరచబడిన షాజహాన్ పరిపాలన సమయం యొక్క (పెయింటింగ్) ఫోటోను చూడవచ్చు. షాజహాన్ పరిపాలన సమయంలో 1628 లో షాజాహాన్ భారత రాజదాని కలకత్తా నుండి డిల్లీ ఎర్రకోట కు మార్చినట్లు తెలుపుతుంది. షాజహాన్ కంటే చాలా ముందు ఈ కోట ఉంది.


ఆక్స్‌ఫర్డ్‌లోని బోడ్లియన్ లైబ్రరీలో భద్రపరచబడిన ఈ పెయింటింగ్ మార్చి 14, 1971 నాటి ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా (పేజీ 32) లో ప్రచురణ  చేయబడింది. షాజహాన్ పరిపాలన సమయంకు ముందే ఈ కోట ఉన్నందున ఈ పెయింటింగ్ ద్వారా అతను నిర్మించలేదు అనే విషయం మనకు తెలుస్తుంది.

రెడ్ ఫోర్ట్ యొక్క ఖాస్ మహల్ లోని ప్రదాన హాలులో దానిని నిర్మించిన అనంగ్‌పాల్ యొక్క రాజ చిహ్నాన్ని క్రింద ఇవ్వబడిన చిత్రాలలో మనం చూడవచ్చు. ఒక జత కత్తులు, పవిత్రమైన హిందూ కలశము, ఒక తామర పూవు మరియు దానిపై తులాభారం యొక్క ప్రమాణాలు ఉన్నాయి. భారత పాలక రాజవంశాలు సంతతికి చెందిన (సూర్య వంశం) నుండి సూర్యుని యొక్క చిత్రము ఉన్నాయి. జత కత్తులు కు అటూ ఇటూ హిందూ సంప్రదాయంలో పవిత్రంగా భావించే రెండు చిన్న శంఖాలు ఉన్నాయి.ఎడమ మరియు కుడి మూలల్లో పెద్ద శంఖాలు చూడవచ్చు.


డిల్లీ ఎర్ర కోటను నిర్మించిన హిందూ రాజు యొక్క ఈ రాజ హిందూ చిహ్నం ఇప్పటికీ ఖాస్ మహల్ లో ఉంది. కానీ ఈ దృశ్య చిహ్నం కూడా అసత్య ప్రచారం చేయడం జరిగింది. రెండు కత్తులను పురావస్తు శాస్త్రవేత్తలు మరియు చరిత్రకారులు ఇస్లామిక్ నెలవంకగా చెబుతూ వస్తున్నారు కానీ కొంచెం పరిశీలించి చూస్తే మనకే వాస్తవాలు తెలుస్తాయి. పవిత్ర హిందూ కలశము కూడా గుర్తించలేని మూర్కులు మన చరిత్రను రాయడం జరిగింది. హిందూ కలశము మీద ఉన్న తామర పూవు రాజ సంపదను సూచిస్తుంది. భారతదేశంలో ధర్మమనికి సంభందించి తులాభారం న్యాయం యొక్క చిహ్నం.


పై చిత్రంలో హిందువులు ఆరాధ్య దైవం సూర్యుడు మరియు వంపులో పవిత్ర హిందూ అక్షరం ఓంతో ఉంటుంది. షాజహాన్ ఎర్రకోటను నిర్మించాడనే వాదన తప్పని ఇది రుజువు చేస్తుంది. మొఘలులు ఈ వంపులపై ఖాళీలలో ఉర్దూ శాసనాలు వ్రాశారు తప్ప మరే ఇతర ఆదారము లేదు.


పై చిత్రంలో ఎర్రకోట యొక్క డిల్లీ గేట్ (డిల్లీ దర్వాజా) చుట్టూ ఉన్న రెండు పెద్ద ఏనుగుల విగ్రహాలు కోట యొక్క హిందూ మూలానికి స్పష్టమైన సంకేతం. క్రీ.శ 1060 లో ఎర్రకోటను రాజా అనంగ్‌పాల్ నిర్మాణం చేసినట్లు జాతీయవాదులు అధ్యయనశీలురు చెప్పడం జరిగింది, అలాగే ఇక్కడ తోమర్ రాజవంశం యొక్క రాజ చిహ్నాలు కూడా చూడవచ్చు. మొగల్ చక్రవర్తి షాజహాన్ (క్రీ.శ. 1639-48) నిర్మించాడు అని ఒక తప్పుడు ప్రచారం తప్ప వేరే ఏమీలేదు. గ్వాలియర్, ఉదయపూర్ మరియు కోటల్లోని ప్యాలెస్లను పరిశీలించడం ద్వారా కోటలు మరియు ప్యాలెస్ గేట్లపై ఏనుగుల విగ్రహాలను నిర్మించడం మన హిందూ ఆచారలలో ఒక పద్దతి అని అనుకోవచ్చు అలాగే మనం కూడా శాతవాహనుల చరిత్రకు సంబందిత చిత్రాలలో ఏనుగుల చిత్రాలు చూడవచ్చు. ఏనుగులతో ఇళ్ళు, కోటలు, రాజభవనాలు మరియు దేవాలయాలను అలంకరించడం ఒక హిందూ సంప్రదాయం. హిందువులకు ఏనుగు  శక్తి, కీర్తి మరియు సంపదను సూచిస్తుంది.


ఎర్రకోటలో ఖాస్ మహల్ యొక్క ప్రతి గది తలుపుల మీద ఏనుగు స్వారీ చేస్తూ ఉన్న చిత్రాలు ఉన్నవి దగ్గరగా చూడవచ్చు, హిందూ మహావీరుల విగ్రహాలు ఉన్నాయి. అలాగే తలుపుల మీద గోదుమ కంకులు కూడా ఉన్నవి ఇవి ప్రతి ఒక్కరూ పంట చేతికి వచ్చినప్పుడు ఇంటికి తెచ్చి వేలాడతీస్తారు దానికి గుర్తుగా ఈ చిత్రాలను చెక్కి ఉండవచ్చు, ఇది సాధారణంగా హిందూ కోట యెక్క మూలాలను తెలుపుతుంది. నక్కర్ ఖానా (మ్యూజిక్ హౌస్) గేటును అలంకరించే ఇతర పెద్ద పరిమాణ రాతి ఏనుగులను ఆక్రమణదారులు పగులకొట్టి ముక్కలు చేశారు. చిన్న ముక్కలుగా చేసిన ముక్కలు ఇప్పటికీ ఖాస్ మహల్ నేలమాళిగల్లో నిల్వ ఉంచడం చూడవచ్చు మనం.


పై ఫోటోలో ఎర్రకోట లోపల మోతీ మసీదు అని పిలవబడే ప్రవేశ ద్వారం లోపలి దృశ్యం. వెలుపల ఉన్న పురావస్తు శిలాపలకం ఈ మసీదును షాజహాన్ కుమారుడు ఔరంగజేబ్ నిర్మించినట్లు పేర్కొంది. ఆ వాదన నిరాధారమైనది ఎందుకంటే ప్రవేశం ఆలయ రూపకల్పనలో ఉంది. గోపురాల మధ్య వంపు హిందూ ఆరాధనలో ఉపయోగించే అరటి పుష్పగుచ్ఛాలతో తయారు చేయబడింది. వంపు పైన ఇరువైపులా పవిత్ర హిందూ నైవేద్యంగా ఐదు పండ్లను కలిగి ఉన్న ట్రేలు ఉన్నాయి. ముస్లిం మసీదుల లోపల పండ్లు నిషిద్ధం. భారతదేశంలో భవనాలు ఇళ్ళకు ముత్యాలు రత్నాలు పేర్లు పెట్టడం అలవాటు (మోతీ అంటే ముత్యం) ఇది హిందూ ఆచారం. గోడపై చిత్రాలలో పందిరితో, గోపురాలు మన హిందూ ఆలయాల దగ్గర ఉన్న పందిరి వలే ఉన్నవి, ఈకోట షాజహాన్ పూర్వ హిందూ కోట అని అనడానికి ఒక నిదర్శనం ఇది, రంగ్ మహల్ పేరు కూడా హిందూ పేరు. దాని ముందు ఉన్న ఒక వాటర్ ఫౌంటెన్ కమలం ఆకారంలో శిథిలావస్తలో ఉంది, ముస్లిం పాలకులు గోడలు మరియు అంతస్తులను నిర్మించారు అంతే అదీ కూడా మరమ్మత్తులు చేసి శిలా పలకాలను మార్చివేశారు.


పై ఫోటోలోని పందిరిని (గొడుగు) అనేక హిందూ దేవాలయాల వద్ద చూడవచ్చు. దాని క్రింద ఉన్న హిందూ కలశము, వేద సంప్రదాయంలో దైవత్వాన్ని సూచిస్తుంది. ఖాస్ మహల్ మరియు రంగ్ మహల్ లోపల చిల్లులు గల పాలరాయి తెరలు రామాయణంలోని రాజభవనాలను వివరించేటప్పుడు కూడా ప్రస్తావించబడ్డాయి.

తోమర్ రాజవంశం 736 నుండి ప్రారంభం అయ్యింది క్రీ.శ 1060 లో లాల్ కోట్‌ను నిర్మాణం చేసింది. పృథ్వీరాజ్ రాసో, రాజా అనంగ్‌పాల్‌ తోమర్ ను లాల్ కోట్ నిర్మాణం చేసినట్లుగా పేర్కొన్నాడు. దీని పేరు కుతుబ్ మినార్ ప్రాంగణం లో ఉన్న విష్ణు స్తంభంపై చెక్కబడింది. డిల్లీ లోని మెహ్రౌలి వద్ద లాల్ కోట్ (ఎర్ర కోట) తోమర్ రాజవంశం నిర్మించింది అనడానికి దాని శిధిలాలు ఇప్పటికీ ఎరుపు రంగు రాళ్లతో కనిపిస్తాయి.

ఇలాంటి గొప్ప చరిత్ర కలిగిన కట్టడాలు కలిగిన మనకు అన్నీ విదేశీయుల ద్వారా నిర్మించబడ్డాయి మనకు ఏమీ తెలియదు అనే ఒక బ్రమను కలిగించి అలాగే మనల్ని అనాగరికులుగా చిత్రికారించే ప్రయత్నం చేశారు. వక్రీకరించిన చరిత్రను రాసి మనల్ని పిరికి వాళ్ళను చేసే ప్రయత్నం జరిగింది ఇకనైనా మేల్కొని మన చరిత్రనెరిగి మనదేశం గురించి ఆలోచిద్దం ఎంతోకొంత దేశం కోసం సమయం కేటాయిద్దాం. మీ నన్నపనేని రాజశేఖర్.
గమనిక: ఈ చరిత్రకు సంబందించిన  విషయాలు అనేకమంది పెద్దలు అధ్యయనం చేసి సేకరించిన విషయాలు మీకు తెలుపడం జరుగుతుంది అలాగే ఏమన్న మార్పులు, చేర్పులు ఉన్న ఎడల తెలుపగలరు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments