శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం పాకిస్థాన్‌లోని కరాచీలో సోల్జర్ బజార్ వద్ద ఉంది. ఇక్కడి శ్రీ పంచమ...
శ్రీరామభక్తుడు ఆంజనేయస్వామి స్వయంభువుగా వెలసిన ప్రముఖమైన క్షేత్రం పాకిస్థాన్‌లోని కరాచీలో సోల్జర్ బజార్ వద్ద ఉంది. ఇక్కడి శ్రీ పంచముఖి హనుమాన్ మందిరం యుగయుగాల నుంచి పూజలందుకుంటోంది.
ఆలయం ఇప్పుడు ఉన్న ప్రదేశంలో నీలం మరియు తెలుపు 8 అడుగుల విగ్రహం చాలా శతాబ్దాల క్రితం నుండి పూజలందుకోంటోంది. ముందు వాకిలిలో నలుపు మరియు తెలుపు పాలరాయి అంతస్తుతో ఇరువైపులా చెక్కిన పసుపు రాయి స్తంభాలు ఉన్నాయి, సవ్యదిశలో ప్రదక్షిణ కోసం విస్తృత మార్గం (పరిక్రమ / ప్రదక్షిణ) దాని చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు.
వనవాసంలో శ్రీరాముడు సీతా సమేతంగా లక్షణుడితో కలిసి ఇక్కడ విడిది చేసినట్టు స్థానిక స్థలపురాణం చెబుతోంది. పాక్‌లోని హిందువులు ప్రతి ఏటా ఈ క్షేత్రాన్ని దర్శించుకుంటారు. పురావస్తుశాఖ అధ్యయనంలో ఈ ఆలయం 1500ఏళ్ల క్రితం నిర్మించినట్టు వెల్లడయింది.
శ్రీ ఆంజనేయుడు స్వయంభువుగా ఇక్కడ వెలసినట్టు తెలుస్తోంది. పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహం హనుమ, నరసింహ, ఆదివరాహ, హయగ్రీవ, గరుడ ముఖాలతో దర్శనమిస్తుంది. ఎనిమిది అడుగుల ఎత్తు ఉండే ఈ విగ్రహం భక్తులకు అభయమిస్తుంది. ఈ ఆలయంలో మూలవిరాట్ ఉన్న ప్రాంగణంలో 21 ప్రదక్షిణలు చేస్తే కోరుకున్న కోరికలు నెరువెరుతాయన్నది భక్తుల ప్రగాఢ విశ్వాసం. కొన్ని సంవత్సరాల క్రితమే ఆలయంలో అభివృద్ధి పనులు చేపట్టారు. ఆలయ ప్రాంగణ తవ్వకాల్లో పురాతనమైన అనేక విగ్రహాలు బయటపడ్డాయి. వీటిని ఆలయప్రాంగణంలో ప్రతిష్టించారు. పాక్‌లోని కరాచీలో హిందువులకు శ్రీ పంచముఖి హనుమాన్ ఆలయం పవిత్రమైన ప్రదేశం.
భారతదేశంలో బాబ్రీ కట్టడం కూల్చివేత తరువాత ఈ ప్రాంతంలోని దేవాలయాల మీద దాడి నుండి బయటపడిన పాకిస్తాన్లోని కొన్ని హిందూ దేవాలయాలలో ఇది ఒకటి. ఇప్పటికీ భారతదేశం నుండి మహారాష్ట్రులు, అలాగే సింధీలు అలాగే బలూచిలు ఈ ఆలయాన్ని సందర్శిస్తారు. నన్నపనేని రాజశేఖర్.
Source: booksfact and harbhakta
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.
No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..