Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

అత్యాచారాలకు కారణం ఏమిటి? - What is the cause of the Rapes? - Who is responsible for rapes?

ఈ నేలను మనం భూమాత అంటాం. అన్నంత మాత్రాన భూమి మీద నేరాలన్నీ ఆగిపోతాయా? లేదు. ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి. ఆడవారి మీద లైంగిక పరమైన నేర...


ఈ నేలను మనం భూమాత అంటాం. అన్నంత మాత్రాన భూమి మీద నేరాలన్నీ ఆగిపోతాయా? లేదు. ఎన్నో రకాల నేరాలు జరుగుతున్నాయి. ఆడవారి మీద లైంగిక పరమైన నేరాలు జరుగుతూనే ఉన్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి. మనం కోపంతో వారిని ఉరి తీయండి అనొచ్చు. కానీ మానభంగాలకి ఉరిశిక్ష వేయడం మొదలెడితే ఏమవుతుంది? మనం ఒక విషయం అర్థం చేసుకోవాలి, ఈ నేరంలో సాక్షి ఎప్పుడూ బలి కాబడ్డ వారే. రేప్ చేసే వారికి “మీరు పట్టుబడ్డట్టయితే మీకు ఉరి శిక్ష కాయం” అని చెప్పినట్లయితే, అతను ఏమి చేస్తాడు అనుకుంటున్నారు? అతను సాక్షిని అంతమొందించడానికి ప్రయత్నిస్తాడు. అందువల్ల మీరు ఏదైనా అనేముందు, ఏమి చెబుతున్నారో కాస్త ఆలోచించి మాట్లాడాలి. ఇలా మాట్లాడితే మేమేదో వారికి తోడ్పడుతున్నామని కాదు. మీరు పరిష్కారం వెతుకుతున్నారా? లేక అందర్నీ ఉరితీయ మంటున్నారా?
తరాల మధ్య అంతరం
మనం ఇది ఎందుకు జరుగుతున్నదో చూడాలి. ఒక విషయం ఏమిటంటే సాంస్కృతిక పరంగా ఈ తరం స్త్రీలే బయటకు వస్తున్న మొదటి తరం వారు. మగ వారితో వారు దగ్గరగా మెలగుతున్నారు, కలసి పని చేస్తున్నారు. ఇంతకుముందు ఇలా ఉండేది కాదు. అంతేకాదు ఎన్నో కోట్ల మంది యువత గ్రామాల నుంచి నగరాలకు వలస వెళ్తున్నారు. వాళ్ల గ్రామంలో స్త్రీ అంటే వాళ్ళ అమ్మ, చిన్నమ్మ, అత్త, అమ్మమ్మ. కానీ ఇప్పుడు వీరు బయట రోడ్డు మీద యవ్వనంలోని అమ్మాయిలను చూస్తున్నారు. వారికి ఇది అంతా కొత్తగా ఉంది. ఇది ఏమంత పెద్ద విషయాలు కాదని అనకూడదు. మనం ఎక్కడి నుంచో ఊడి పడలేదని అర్థం చేసుకోవాలి.
మనిషిలో లైంగికత ఉంటుంది. పదిహేను, ఇరవై ఐదు ఏళ్ల మధ్య హార్మోన్ల ప్రభావం ఎంతో ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తిని వివేకవంతంగా లేక ఆటలు, సంగీతం, కళలు, విద్య వంటి అనేక మార్గాల్లో తమ ప్రతిభను చూపటానికి అవకాశం ఇస్తే, వారిని మీరు ఆయా పనుల్లో ఎంగేజ్ చేయవచ్చు. మిమ్మల్ని ఎంగేజ్ చేయటానికి ఏ దారి లేకపోతే, మీ శరీరంలో హార్మోన్లు పూర్తిస్థాయిలో విడుదల అవుతున్నాయి, ఈ గ్రామం నుంచి మీరు పట్టణానికి వచ్చారు, కొత్తగా మీరు ఈ యవ్వనంలో ఉన్న అమ్మాయిలను చూస్తున్నారు. అలా ఉంటే, ఆ కుర్రాడికి పిచ్చెక్కుతుంది, దానికి తోడు మీరు మద్యాన్ని అన్ని చోట్ల ప్రోత్సహిస్తున్నారు. రెండు చుక్కలు తాగితే సాయంత్రానికల్లా వారికి పిచ్చెక్కుతుంది. వాళ్లు తమను ఎవరూ చూడడంలేదు అనుకుంటారు, ఎవరి మీదకో వారు దూకుతారు.
అమానుష వాతావరణం
దీనిలో సాంఘిక పరమైన అంశం కూడా ఉంది. అతను తన గ్రామంలోనే ఉంటే వాళ్ళ అమ్మో, అత్తో ఎవరో ఒకరు, “నీకు అమ్మాయి తెలుసా? నీకు అమ్మాయితో పెళ్లి చేయబోతున్నాము” అంటారు. అతను అమ్మాయిని పెళ్ళి చేసుకుంటారో లేదో కానీ, అతని సమస్యకు కావలసిన పరిష్కారం కనబడుతుంది.
కానీ అతను నగరాలకు ఒక్కడే వస్తే, అతను మరో పదిమంది తన తోటివారితో కలసి ఏదో రూమ్ లో ఉంటాడు. రాత్రనకా పగలనకా చెత్త వాతావరణంలో నివసిస్తాడు. అది ఒక నిర్బంధ శిబిరంలో ఉన్నట్లే ఉంటుంది. చాలామంది అటువంటి వాతావరణంలో నివసిస్తున్నారు. వారి సమస్యకు వారి హార్మోన్ లకు, వారి శరీరానికి, వారి భావావేశాలకు, వారి జీవితానికి, అక్కడ పరిష్కారం కనబడలేదు. ‘‘నువ్వేం చేయబోతున్నావు? ఎవరిని పెళ్ళి చేసుకుందాం అనుకుంటున్నావు? ఎలా జీవితంలో స్థిరపడడం అనుకుంటున్నావు? అని అడిగే వారు కరువయ్యారు. ఇక సాయంత్రం పూట స్నేహితులతో తాగుతుంటే వాడికిక పిచ్చెక్కుతుంది. అంతేకాదు ఈ మధ్య అందరికీ నెట్ సౌకర్యం, స్మార్ట్ ఫోన్ ల వాడకం వలన శృంగార విడియోలు అధికంగా చూస్తున్నారు అవన్నీ చూసి చేయవలసింది ఇక అదే అనుకుంటాడు.
ఎవరన్నా తప్పు చేస్తే వారిని శిక్షించాలి మరి అది వేరే విషయం. నేను దానిలో తల పెట్ట దలచలేదు కానీ సామాజిక పరంగా దీనికి పరిష్కారం ఏమిటి?. వారు ఈ సమస్యల నుంచి బయటపడటానికి మీరు వారికి యోగ సాధనలు ఏమన్నా నేర్పుతున్నారా? లేదు మీరు వారికి అటువంటిదేమీ నేర్పడం లేదు. మీరు వారికి ఏ పరిష్కారము చూపట్లేదు. అతను తన గ్రామంలో ఉంటే 18, 19 ఏళ్లకు ఎవరితోనో వివాహం అయిపోయి ఉండేది. మరి ఇప్పుడు ఇక్కడ అతనికి ఏ ఆశ కనపడుటలేదు. అతను ఒక్కడే ఊరికే ఉండి ఆటవిక పనులు చేస్తాడు. అంతేకాదు మూకుమ్మడిగా కూడా ఈ మధ్య బలాత్కారాలు జరుగుతున్నాయి వాటి గురించి కూడా మనం ఆలోచన చేయాలి, అయితే సమాజంలో మరీ ఈ మధ్య కొంతమంది అత్యాచారాలకు గురైనప్పుడు దేశం అంతా స్పందిస్తున్నారు కానీ ఎవరన్నా హిందువు అమ్మాయి లేదా ఏ ఇతర మతస్తుడైనా బలాత్కారానికి పాల్పడితే ఏ ఒక్క సినిమా వారు అలాగే మానవ హక్కులంటూ రోడ్డులెక్కే వారెక్కడా కూడా ఈ సందర్బంలో కనబడరు ఇలా కాకుండా, బలాత్కారాలను మతంతో లేదా కులంతో సంబదంలేకుండా అయ్యో ఒక మహిళకు అన్యాయం జరిగిందే అనే కోణంతో చూడాలి. 
చర్చించవలసిన విషయం
ఓ యాభై ఏళ్ల క్రితం, దాదాపు ప్రతి అమ్మాయికి 16 లేక 17 వచ్చేప్పటికి పెళ్లి అయిపోయిది. అబ్బాయిలకు ఇరవై ఏళ్లకే పెళ్లి అయిపోయి ఉండేది. వాళ్లు హద్దులు దాటకముందే వారు స్థిరపడి పోయే వారు. ఒక తరంగా, ఒక సంస్కృతి గా ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. ఇప్పుడు అతని జీవితంలో స్థిరత్వం కనబడడంలేదు. మనం మన యువతతో ఏం చేయబోతున్నాం? అన్న ఈ సమస్య పరిష్కారానికి కనీసం చర్చించడానికి సిద్ధపడాలి. ఏదో మడి కట్టుకుని కూర్చుందామంటే సమస్య పరిష్కారం కాదు.
యువత అంటే అక్కడ అనేక అంశాలున్నాయి అందులో ఒకటి హార్మోన్ల ప్రభావం. మీరు వాటికి పరిష్కారం చూస్తున్నారా? లేక కళ్ళు మూసుకుని కూర్చుని ‘అటువంటిదేమీ లేదు’ జనాన్నిఉరి తీయండి, ఏదో ఒక రోజుకి అంతా చక్కబడుతుంది అనుకుంటున్నారా? అలా జరగదు. ఆ సమస్య కు పరిష్కారం వెతకవలసిన సమయం ఆసన్నమైంది. దీనితో భారతమాతకు ముడి పెట్టకుండా పరిష్కారాన్ని వెతకాలి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments