Page Nav

HIDE
GRID_STYLE

Latest Posts

latest

దివ్యాంగులైన పిల్లలు బాధపడతారా? - disabled children's information - Saksham for disabled children

దివ్యాంగులైన పిల్లలు బాధపడతారా? వాళ్లు బాధపడరు, తల్లిదండ్రులే బాధపడతారు. వాళ్లు భిన్నంగా ఉన్నారంతే. వాళ్లు వికలాంగులని మనం అనుకుంటాము అద...


దివ్యాంగులైన పిల్లలు బాధపడతారా? వాళ్లు బాధపడరు, తల్లిదండ్రులే బాధపడతారు. వాళ్లు భిన్నంగా ఉన్నారంతే. వాళ్లు వికలాంగులని మనం అనుకుంటాము అది మన భావన. వాళ్లు మరొకరిలాగా లేకపోతే మనమటువంటి అభిప్రాయాలకు వచ్చేస్తాము. మనం వాళ్లని వికలాంగులన్నా లేదా సామాజికంగా సరైన పరిభాషలో భిన్నసామర్థ్యాలు కలిగిన పిల్లలన్నా మరేం పేరు పెట్టినా వాళ్లు కేవలం భిన్నమైనవాళ్లు. తక్కిన పిల్లల్లో చాలామంది చేసే పనులు వాళ్లు చేయలేకపోవచ్చు. కాని, వాళ్లు బాధపడరు. వాళ్లను ఇతరులతో పోల్చి బాధపెడుతున్న వాళ్లు మనం. లేకపోతే వాళ్లంతట వాళ్లు బాగానే ఉంటారు.
తల్లిదండ్రులెందుకు బాధపడతారు? మనం మరొకరి పిల్లలతో పోల్చి చూస్తున్నాము, ‘‘మా పిల్లవాడు అట్లాలేడు, మా పిల్లవాడికి మొదటి ర్యాంకు రాలేదు’’ అని ఏడుస్తుంటాము. ఇదంతా కేవలం సామాజిక పరమైన అర్థరహిత విషయం. మనం దానితో సహజీవనం చేయలేకపోతే దాన్ని ప్రకృతికే వదిలేసే ధైర్యం ఉండాలి. మనం ప్రకృతికే వదిలేస్తే ఎవరికి సామర్థ్యం ఉంటే వారే బతికి బయటపడతారనే సిద్ధాంతం ప్రకారం జరుగుతుంది. మనకా ధైర్యం ఉందా? లేదు. వాళ్లు చనిపోతే మనం ఏడుస్తాము వాళ్లు బ్రతికుంటే - కూడా మనం ఏడుస్తాము - మరిదేమిటి? ఒక వేళ, వాళ్ల అవయవాలన్నీ చక్కగా ఉన్నా, వాళ్లు మనం ఆశలు నెరవేర్చలేదనుకోండి, మనం వాళ్లు ఎలా జీవించాలని అనుకుంటున్నారో, వాళ్లలా జీవించలేదనుకోండి  అప్పుడూ మనం ఏడుస్తాము. ఏమిటి ఇదంతా? ఎట్లా అయినా మనం ఏడుస్తాము. సరే కొంచెం నవ్వడం నేర్చుకుందాం. జీవితంలో మార్పు ఉంటుంది.
ఒక లోపం వల్ల ఎవరూ దుఃఖంలో ఉండరు. ఒక జబ్బు లేదా ఒక వైకల్యం ప్రాథమికంగా, విచారాన్ని కలిగించలేదు. అది కేవలం ఒక భౌతిక స్థితిని మాత్రమే కల్పిస్తుంది. దుఃఖం మనం కల్పించికునేదే, మరెవరో చేసేది కాదు, మనం కల్పించుకున్నది మాత్రమే, కాకపోతే మనం దీనిని స్పృహతో చేయడం లేదు. మన ప్రాథమిక అంగాలు - మన బుద్ధి, మన శరీరం – ఇవి మన నియంత్రణలో లేవు. మనకు విచారం ఇందువల్ల కలుగుతోంది.
పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి, కొన్ని మనం ఇష్టపడ్డవి, మరి కొన్ని మనకు ఇష్టంలేనివీ. కొన్ని పరిస్థితులను మనం నిర్వహించగలిగినవైతే, మరి కొన్నిటిని నిర్వహించలేకపోవచ్చు. జీవితం ఈ విధంగానే ఉంటుంది. కాని విచారమనేది మనం సృష్టించిందే, పరిస్థితులు కల్పించింది కాదు. పరిస్థితి మన చేతిలో లేకపోతే, మనకై మనం విచారంలో మునిగిపోవడానికి ఉన్న అవకాశం బోలెడంత.
సరే, ఎదో కొద్ది శాతం ఉన్న వికలాంగుల సంగతి పక్కన పెడదాం. కాళ్లూ, చేతులూ బాగుండి, విచారంగా ఉండేవాళ్ల సంగతేమిటి? మన జీవితాన్ని పరిశీలించుకుందాం. మన కాళ్లూ చేతులూ సరిగ్గానే ఉన్నాయి, అంతా సరిగ్గానే ఉంది. కాని 24 గంటల్లో ఎన్ని క్షణాలు మనం నిజంగా ఆనందంగా ఉన్నాము? ఒకవేళ మనం ఆనందంగా ఉంటే ఆ క్షణాలు మరీ కొద్దిపాటివి, కదూ! ఇది చాలా దురదృష్టకరమైన జీవన విధానం.
మనం ఇది పరిశీలించి చూద్దాం తెలుస్తుంది. కొందరు రెండు చేతులతో పుడతారు, కొందరు ఒక చేత్తో. కొందరికి తెలివితేటలు ఎక్కువ, మరి కొందరికి తక్కువ. ఇదంతా ప్రకృతిలో భాగం. మనకున్న వాటిని మనం సరిగ్గా ఉపయోగిస్తే, వైకల్యంలో దీనత్వం ఉండదు. మన అపోహను పక్కకు పెట్టి, మన మానవతను పని చేయనిచ్చారనుకొందాం, వైకల్యంలో దీనత ఉండదు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments

Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..