తిరువళ్లువర్ జీవిత చరిత్ర - thiruvalluvar life story in telugu

megaminds
0

తిరువళ్లువర్: తిరుక్కురళ్ అనే తమిళ గ్రంధాన్ని రచించిన మహా మనీషి. వీరు క్రీ.శ. 1వ శతాబ్ది కాలానికి చెందినవారు. వీరి కుటుంబ జీవితానికి సంబంధించిన వివరాలు అంతగా తెలియడంలేదు. అయితే నేతపని చేసేవాడని చెప్పడానికి మాత్రం ఆధారాలున్నాయి. చోళరాజ్యంలో ధనమదాంధుడైన ఒక షావుకారి అబ్బాయిలో
ఊహించని పరివర్తనను కలిగించినట్లు ప్రతీతి. అలాగే చోళరాజ్యంలో కరువు సంభవించినప్పుడు ఈ నేతపనివాడు. శెట్టితో మీరు గిడ్డంగుల్లో ధాన్యాన్ని దాచుకున్నారు. ప్రజలు ఆకలితో చస్తున్నారు అని పలికి అతనిలో మార్పు కలిగించాడు.
ఆ నేతపని వాడే మహాపురుషుడైన తిరువళ్లువర్. లోకులకు సన్మార్గాన్ని చూపించడమే ఇతని జీవనకార్యం . శెట్టిగారి ప్రార్ధనను పురస్కరించుకొని వల్లువరు రచన ప్రారంభించి ధర్మము, అర్ధము, కామము, మోక్షము, సదాచారం, క్షమ, శీలం మొదలగు విషయాలను గురించి 133 అధ్యాయాల గ్రంథాన్ని రచించాడు. వాటిలో 1330 శ్లోకాలున్నాయి. ఈ సాహిత్యమంతా తమిళ భాషలో ఉంది. ఈ సాహిత్యం వెలుగులోకి రావాలి. లోకులకు ఉపయోగపడాలి. దీనికి గుర్తింపు కలగాలి అని శెట్టి వళ్లువర్న్ని ప్రార్ధించాడు. వెంటనే వల్లువరు తన గ్రంథాన్ని తీసుకుని మథురలోని రాజసభకు వెళ్ళారు. ఎలేల శింగన్ అనే శిష్యుడు కూడా అతనివెంట ఉన్నాడు. 39 మంది విద్వాంసుల సమక్షంలో ఈ గ్రంథం మీద చర్చ సమీక్ష జరిగింది. చివరకు తమిళంలో ఇలాంటి ఉత్తమగ్రంథం నేటివరకు రాలేదని విద్వాంసులు నిష్కర్షగా చెప్పారు. మానవ జీవన మర్మమంతా ఈ గ్రంథంలో కనిపిస్తున్నదని ప్రశంసించారు పండితులు గ్రంథాన్ని నెత్తిన పెట్టుకుని ఆనందంతో గంతులు వేశారు.
అదే కురళ్ గ్రంథ విశిష్టత. "కురళ్"కి ముందు తిరు ఉపస్సర్గ చేర్చబడింది. తిరు అంటే, అని,పవిత్రమైన అని అర్థాలున్నాయి. ఆ గ్రంథం తిరుక్కురల్ అయింది,దానిని వ్రాసిన వల్లువరు జనులు ప్రేమ తో "తిరువళ్లువర్" అని పిలవడం ప్రారంభించారు.
నేటి పండితులు చాలామంది ఈ గ్రంథం ఆధారంగానే రాజ నిత గురించి సమాజం గురించి చర్చించి నిర్ణయాలు తీసుకుంటుండటం గూడ చూస్తున్నాము. ఈ గ్రంథం కేవలం భారతీయ భాషలలో గాక అనేక విదేశీ భాషల తోకి గూడా అనువదింపబడింది. తిరుక్కురల్ గ్రంథంలో పరంపరాగతమైన హిందూ విచారధార, జీవన పద్ధతులు పరిపూర్ణంగా నిండి ఉన్నాయి. తెలుగు ప్రజలకు వేమన పద్యాలు ఎంతగా సుపరిచితమైనవో తమిళ ప్రజలకు కురళ్లు అంతగా పరిచితమై ప్రాచుర్యం వహించినవి.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia


Post a Comment

0 Comments
Post a Comment (0)
To Top