నాయనార్లు చరిత్ర - About Nayanars History

0

నాయనార్లు: నాయనార్లు శైవగురువులు, శివభక్తి ప్రబోధకులు. వీరు 63 మంది శెక్కిలార్ అనే కవి వ్రాసిన పెరియపురాణం అనే గ్రంథంలో నాయన్మారులందరి చరిత్ర వ్రాయబడింది. ఈ ధర్మపురుషులు క్రీ.శ. 2వ శతాబ్దం నుండి 9వ శతాబ్దం వరకు చెప్పులు కుట్టుకొని జీవించే మాదిగ కులం నుండి బ్రాహ్మణుల వరకు అన్నికులాల లోను జన్మించారని ప్రతీతి.
వారిలో తిలకవతీయ, పునీత వతియార్, మంగైయార్కరాసియార్ లాంటి స్త్రీ భక్తశిఖామణులు ముగ్గురున్నారు. దీనిని బట్టి కుల భేదం కాని అస్పృశ్యత వంటి దురాచారం గాని స్త్రీ పురుష వ్యత్యాసం గాని మన ధర్మంలో లేదని తెలుస్తోంది. ఈ ప్రచారకులు సమాజంలో అన్ని వర్గాలవారి లోను, అన్నికులాలవారిలోను భక్తి శ్రద్దలు కలిగించారు. శివభక్తిలోను శివభక్తుల సేవలోను పూర్తిగా నిమగ్నులైన నాయన్మారులు నిస్వార్థ భావన, సామాజిక సమరసత, సేవ మరియు త్యాగభావనలు ఆదర్శంగా ప్రస్తుతించబడుతున్నాయి. దక్షిణాది లోని ప్రముఖ శైవమందిరాలలో నాయన్మారుల విగ్రహాలు స్థాపించబడ్డాయి.
అప్పర్, సుందరర్, మాణిక్య వాచకర్, జ్ఞానసంబందర్ అను నాయనార్లు చాలా ప్రసిద్ధి చెందినవారు. అప్పర్ శూద్రుడు. ఆయన తండ్రి జైనుడై తరువాత శైవుడైనాడు. సుందరర్ బ్రాహ్మణుడు. శంకరుడే ఆయనను తనలో విలీనం చేసుకున్నాడు. మాణిక్య వాచకర్ పాండ్యరాజైన అమర్దమని వద్ద ప్రదానమంత్రిగా ఉండేవాడు. శివభక్తి పావశ్యముచే మంత్రిపదవిని వదిలిపెట్టాడు.
ఇ్ఞానసంబందర్ చిన్న వయసులోనే దేశభక్తి కావ్యాలను వ్రాసి అనేకమంది జైన పండితులను ఓడించాడు. పాండ్యరాజు కూడా జైనాన్ని విడిచి శైవమతాన్ని స్వీకరించాడు. తివభక్తుల గీతాలనన్నింటినీ నంబి అంటారు నంబి అనే శైవ గురువు 11 తిరుమురైలుగా గా క్రోడీకరించి భద్రపరిచాడు. ఇందులో మొదటి ఏడు తిరుమురైలను తేవారం అంటారు. దీనిలో సంబంధార్, అప్పార్, సుందరం గేయాలున్నాయి.
ఎనిమిదవ తిరుమురైని తిరువాచకం అంటారు. దీనిని మాణిక్యవాచకర్ వ్రాశాడు. తొమ్మిదవ భాగంలో వివిధ నాయనారులు వ్రాసిన పాటలున్నాయి. దానిని తిరుమసైప్ప అంటారు ఇవి తమిళనాట సుప్రసిద్ధములే కాక ప్రామాణిక కావ్యములు గా కూడా ప్రసిద్ధి చెందాయి. క్రీ.శ. మొదటి అయిదు శతాబ్దాలలో దక్షిణ భారత జైనబౌద్ధముల పలుకుబడి విశేషంగా ఉండేది. నాయనార్ల ప్రభావంతో ఆ స్థానాన్ని శైవం ఆక్రమించింది. అందుకే భావుకులు ఇప్పటికీ నాయనార్లు పూజిస్తుంటారు.

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top