Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

చైతన్యుడు జీవిత చరిత్ర - chaitanya mahaprabhu biography in telugu

చైతన్యుడు: భక్తిమార్గ ప్రబోధకులలో చైతన్యుడు అగ్రగణ్యుడనవచ్చు. వైష్ణవ గురువు ల లో ఒకడు. ఈయన గౌరీవర్ణ శరీరులు కావడంతో గౌరాంగ మహా ప్రభువన...


చైతన్యుడు: భక్తిమార్గ ప్రబోధకులలో చైతన్యుడు అగ్రగణ్యుడనవచ్చు. వైష్ణవ గురువులో ఒకడు. ఈయన గౌరీవర్ణ శరీరులు కావడంతో గౌరాంగ మహా ప్రభువని కూడ లోకప్రసిద్ధి. క్రీ.శ. 14వ శతాబ్దికాలంలో జగన్నాథ మిశ్ర, శచీదేవి దంపతులకు వంగప్రాంతంలోని 'నవద్వీపం'లో జన్మించాడు. ఈయన జన్మనామం విశ్వంబరుడు. కృష్ణ చైతన్య అనే పేరుతో గూడ ప్రసిద్ధి చెందాడు.
తన ఇరువదవ యేట ఈశ్వరపూర్తి అనే గురువు దగ్గర కృష్ణ మంత్రం ఉపదేశం పొందాడు. ఈ మంత్రోపదేశం గౌరాంగుని జీవితాన్ని పూర్తిగా మార్చివేసింది. ఈయన న్యాయశాస్ర్తం మీద గొప్ప గ్రంథాన్ని కూడా వ్రాశాడు. కాని నేడది లభ్యం కావడం లేదు. 1510వ సంవత్సరంలో కేశవ భారతీ స్వామి అనే ఆచార్యుని వద్ద సన్యాస దీక్షను పొంది భక్తి భావంతో రాధాకృష్ణుల ప్రేమ తత్వాన్ని ప్రబోధించడానికే జీవితాన్ని అంకితం చేశాడు. అనేక పర్యాయాలు శ్రీకృష్ణుడు గౌరాంగుని ఆవేశిస్తూండేవాడు. అందుకే శ్రీకృష్ణచైతన్యుడుగా పేరు పొందాడు.
కృష్ణ తత్త్వాన్ని కీర్తిస్తూ దేశాటనం చేశాడు. చైతన్యునిది మధుర భక్తి మార్గం. కృష్ణుని పూజించడం, గురువును సేవించడం ద్వారా వ్యక్తి మాయా మోహముల నుండి విముక్తుడై కృష్ణపదసాన్నిధ్యం చేరుకుంటాడని బావించాడు. దశమూల శ్లోకం అనే గ్రంధంలో చైతన్యుడు పరమేశ్వర ప్రేమ తత్వాన్ని వివరించాడు. ప్రస్థానత్రయానికి భాగవతమే భాష్య గ్రంథమ ని చెప్పాడు. నిత్యానంద ప్రభు, రూపగోస్వామి, సనాతన గోస్వామి, అద్వైతాచార్య, రాయ రామా నంద, రఘునాథభట్టు మొదలగు ప్రముఖులు ఆయన అనుయాయులు.
ఉత్కళను పరిపాలించిన ప్రతాపరుద్ర గజపతి ఈయన శిష్యుడు. చైతన్యుడు కూడ కులమత భేదాలను ఖండించి మానవ సౌందర్యాన్ని గుర్తించాలని బోధించాడు. భక్తులాయనను విష్ణుని అవతారంగా భావించేవారు. పురి జగన్నాథధామమున నివసిస్తూ చివరకు భావావేశంలో జగన్నాథునిలో లీనమై తన తనువును చాలించారు. జగన్నాథపురంలో మహాప్రభు చైతన్యుల మఠం కూడ ఉంది. నేను హరేరామ హరేకృష్ణ సమాజం అంతా వారి వారసత్వం.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

No comments