ఝూలేలాల్ జీవిత చరిత్ర - jhulelal history - megaminds

0

ఝూలేలాల్ ఈయనకు ఉడేడోలాల్ అని కూడ పేరు. సింధు ప్రాంతానికి చెందిన వాడు. క్రీ.శ.10 వ శతాబ్దానికి చెందినవాడు. కొంతమంది ప్రజలు ఈయనను వరుణ దేవుని అవతారం గా భావించి పూజిస్తుంటారు. ఉగాది పర్వదినాన జన్మించాడు. 10 శతాబ్ది కాలంలో సింధు ప్రాంతాన్ని మర్క్ అనే మూర్ఖ ముస్లిం నవాబు పరిపాలిస్తుండేవాడు. ఆ రాజు హిందువులను ముస్లింలుగా మారాలని ఆదేశించి సామూహికంగా బలవంతపు మతమార్పిడులు చేస్తుండేవారు. ఆదేశాలను ఉల్లంఘించిన వారికి మరణదండన విధించేవాడు.
హిందువులందరూ సింధునదీ దేవతను ప్రార్థించారు. ఎనిమిది రోజుల్లో మీ బాధలను తొలగించడానికి నరసాపూర్లో జన్నిస్తాననే దివ్యవాణి సింధునది నుండి వినిపించింది. సమీపంలో ప్రసిద్ధ హిందూ నాయకుడైన రతన్ రాయ్ ఠాకూర్ భార్య దేవకి గర్భాన ఒక పుత్రుడు జన్మించాడు. ఆయనకు ఉడేడోలాల్ అని పేరు పెట్టారు. అక్కడివాళ్ళు ఆయనను సింధు అవతారంగా భావించి ఆరాధిస్తుంటారు. ఆయనే ఝూలేలాల్ గ లోకప్రసిద్ధి చెందాడు.
ఈయన తన కార్యకుశలతతో మర్క్యొక్క కుట్రను విఫలం చేసి హిందువులను మతాంతరీకరణ బారి నుండి పరిరక్షించాడు. సింధుప్రాంతంలో ధత్తా, సక్కర్, పేల్పాథో, పేర్మింథో. మనోరాజేట్ మొదలగు స్థలాలలో రూలేలాల్ మంత్రాలున్నాయి.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top