Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

రవిదాస్ జీవితం - sant ravidas biography in telugu

రవిదాస్ : భక్తి యుగం లో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడు. క్రీ.శ. 16వ శతాబ్దానికి చెందిన వారు. వీరు చెప్పులు కుట్టు జీవించే మాదిగ కుల...


రవిదాస్ : భక్తి యుగం లో ప్రసిద్ధి చెందిన సంతులలో ప్రముఖుడు. క్రీ.శ. 16వ శతాబ్దానికి చెందిన వారు. వీరు చెప్పులు కుట్టు జీవించే మాదిగ కులం నందు జన్మించారు. వీరు కాశీ పట్టణ వాస్తవ్యులు. వీరు ప్రముఖ విష్ణు భక్తుడైన రామానందుడు అనుయాయులు ఒకరు. చెప్పులు కుట్టే వృత్తి కొనసాగిస్తూనే వీరు తన అసాధారణ కృష్ణ భక్తి తన రచనలలో సహజ సుందరంగా స్వచ్ఛంగా ప్రకటించారు. సంత్ కబీర్ దాసుకు పూర్తి భిన్నమైన రీతిలో రవిదాస్ మిక్కిలి సౌమ్యస్వభావము కలిగిన సాధు పురుషుడు. సౌజన్యమూర్తి. కబీరునొకసారి ఎవరో బ్రహ్మజ్ఞానం గురించి ప్రశ్నించగా,


మై తో ఆయా మా కీ గోద్ మే, క్యా జానూమార్గ్ క్యా హుయే
రాహ్ పూచో రైదాస్ సే, జిన్ గరీ లాయాడోయ్

నేను తల్లి ఒడిలో కూర్చుని వచ్చినవాడిని, నా కేమి తెలుసు? రవిదాస్ నడగండి. తల్లి ఇచ్చిన సరుకుల మూటలు మోసుకువచ్చిన వాడాయన. ఆమార్గం ఆయనకు బాగా తెలుసునని సమాధానమిచ్చాడట.
శ్రీకృష్ణుడు సాధురూపంలో రవిదాసు ఇంటికి వచ్చి, సామాన్య లోహాలను బంగారంగా మార్చి కలిగిన పరుసవేదిని ఇవ్వబోగా, దానితో మనకు అవసరం లేదని తిరస్కరించిన నిష్కామ కర్మ యోగి రవిదాస్. సరి, మున్ముందు అవసరం పడినపుడు ఉపయోగించుకుందువులే అంటూ ఆ స్పర్శ మణి చిరు దోపి వెళ్లిపోయాడు సాధువు. సుమారు ఒక ఏడాది తర్వాత ఆ వృద్ధ సాధువు మళ్లీ వచ్చి ఏమయ్యా! నేనిచ్చి వెళ్లిన పరుసవేది ఎక్కడ? అని రవిదాసుని ప్రశ్నించాడు. తమరు పెట్టిన చోటా ఉంటుంది చూడండి అని జవాబిచ్చాడాయన. తాను పెట్టింది పెట్టినట్లు ఉండటం సూచి ఆ సాధువు దాన్ని తీసి రవిదాసు కివ్వబోయాడు. హే మాధవా? బంగారంతో నా కేమి పని? పరుసవేదిని మీరే తీసుకొని వెళ్ళండి అని వేడుకొన్నాడు, స్వావలంబిత జీవనం, సాధుపురుషుల సేవ శుశ్రూషలు తన పరమకర్తవ్యాలుగా ఎంచుకున్న రవి దాస్ చెప్పులు కుట్టే వృత్తి ఈశ్వర సన్నిధికి చేర్చే సాధనంగా ఎన్నుకున్నారు. కేవలం ఉదర పోషణార్ధం గాదు. తన ఈ భావాన్ని ఎలాంటి అరమరికలు లేకుండా ఎంత స్పష్టంగా వెల్లడించాడు చూడండి.

జిహ్వా సో ఓంకార్ జప, హర్ధన సో కర్ కామ్,
రామ మిలూ ఘోర ఆయికర, కహి రవిదాస్ విచార్
(జిహ్వ తో ఓంకారం జపిస్తూ, చేతులతో పనిచేస్తుంటే, ఆ భగవంతుడే ఇంటికి వచ్చి దర్శనమిస్తాడు) ఎంత ప్రగాఢ విశ్వాసం! ఎంత సుదృఢ ఆత్మబలం! ఆద్యంతాలు ఇలాంటి విశ్వాసప్రపత్తులతోనే రవిదాసు కరయుగళంతో పాదరక్షలు కట్టాడు. వ్యాకుల హృదయంతో ఈశ్వరోపాసన చేశాడు.

ఎంత దుర్మార్గుడైనాగానీ సత్సంగ ప్రభావంతో సజ్జనుడవుతాడని రవిదాస్ గట్టి నమ్మకం. ఇంకా ఈ సత్సంగ ప్రభావం వల్లనే తాను నిమ్న కులం లో జన్మించిన, సంఘంలో ఉచ్చస్థాయికి ఎదగగల్గానని, అన్ని వర్గాల వారికి వంద్యుడనైనాననీ చెప్తాడు. తన పేరు ప్రతిష్టలకన్నింటికీ ఆ సద్గురుని సాంగత్యం, ఆ పరమేశ్వరుని పట్ల గల నిశ్చల భక్తి ప్రపత్తులే కారణమని వినయంగా, స్పష్టంగా చెప్పుకున్నాడు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:
ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

No comments