Page Nav

HIDE

శోధించు !

GRID_STYLE

Pages

Classic Header

{fbt_classic_header}

ABVP విధ్యార్థి‌ సంస్థ మాతృభూమి సేవలో

దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం మాతృభూమి సేవలో 71 సంవత్సరాలు 1949 - 2020 అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తన క్రియాశీలమైన, ప్రభావశీలమై...


దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం
మాతృభూమి సేవలో 71 సంవత్సరాలు
1949 - 2020
అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ తన క్రియాశీలమైన, ప్రభావశీలమైన మరియు సార్థకమైన     విద్యార్థి ఉద్యమానికి  9 జూలై 2020 న 71 ఏళ్లు నింపుకోవడం మనఅందరం వేనోళ్ళ కొనియాడదగిన, కీర్తించదగిన విషయం. విద్యార్థి పరిషత్ ఆలోచనా ధార, సంఘటనాత్మకమైన కార్యపద్ధతి కి పునాది వేసిన స్వర్గీయ యశ్వంతరావు కేల్కర్, స్వర్గీయ దత్తాజీ డిండోల్కర్ గార్లను ఈరోజు స్మరించుకోవాల్సిన దినం. వారి ఆలోచనలను, వారి ఆచరణ, వారి ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి కంకణ బద్దులై నడుం బిగించాల్సిన రోజు... జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం. తన సంపూర్ణ జీవితాన్ని ABVP కోసం సమర్పించిన స్వర్గీయ జనమంచి గౌరీశంకర్ గారు ఈరోజు మన స్మృతిలో మెదిలే రోజు. ఏబీవీపీ ఆలోచనా ధార కోసం ప్రాణత్యాగం చేసిన ఆంధ్రప్రదేశ్, కేరళ రాష్ట్రాల కార్యకర్తలు ఈరోజు మన అందరికి గుర్తుకు వచ్చే రోజు. వీరందరి త్యాగాలు, కృషితోనే జ్ఞానం- శీలం- ఏకత అనే తపస్సు అఖండంగా కొనసాగుతూ వస్తున్నందుకు వారి పాదాలకు నమస్కరించాల్సిన రోజు జూలై 9 జాతీయ విద్యార్థి దినోత్సవం.
స్వాతంత్ర్యం పొందాక మన భారతదేశం యొక్క వేలాది సంవత్సరాల గౌరవశాలి మరియు వైభవ సంపన్న పరంపరను దృష్టిలో పెట్టుకుని వాటిని మరల ఆధునిక, వికసిత మరియు పరిస్థితుల కారణంగా ఏర్పడిన దోషాల నుండి ముక్తి చేయాలనే స్వప్నాన్ని దేశం మొత్తం చూస్తున్నది. ఇలాంటి పరిస్థితులలో కొంతమంది యువకులు ఈ కలను సాకారం చేసుకోవడానికి గాను దేశంలోని విద్యాలయాలు మరియు విశ్వవిద్యాలయాల పరిసరాలను తమ కేంద్రంగా చేసుకుని కార్యకలాపాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమాలను దేశవ్యాప్తంగా బహిరంగ వేదికపై 9 జూలై 1949 న అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) పేరుతో ప్రారంభించారు.
వ్యక్తి నిర్మాణం ద్వారా జాతీయ పునర్నిర్మాణమే ముఖ్య ఉద్దేశ్యంగా విద్యార్థి పరిషత్ ప్రారంభించబడింది. జాతీయ పునర్నిర్మాణం అంటే ఏమిటి? మనదేశంలో ప్రతి వ్యక్తికి భోజనం, దుస్తులు, ఇల్లు, విద్య మరియు వైద్యం లాంటి ప్రాథమిక వసతులు ప్రాప్తించాలి. అలాగే సమాజంలో గౌరవం, అభివృద్ధి చెందడంలో సమాన అవకాశాలు లభించాలి. ఇది అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఆశిస్తున్నది. అన్ని రంగాలలో సమన్యాయం జరగాలి. ఈ దేశం వైభవశాలిగా మారడంతో పాటు రక్షణ దృష్టిలో సంపన్నం కావాలి. సమాజంలో సామాజిక, వ్యక్తిగత జీవన మూల్యాలు మరియు సంస్కృతిక వ్యక్తీకరణ రక్షించబడాలి. ఈ విధమైన పరస్పర అ స్నేహపూర్వకమైన భావాన్ని నింపే సమాజం విశ్వ బంధుత్వ భావనను అనుసరిస్తుంది. దీంతోపాటు మాతృభూమి కోసం జీవించడం, మరణించడం ఈ దేశం కోసం అవసరం. ఈ దేశం అత్యంత ప్రాచీనమైనది కానీ పూర్వీకుల అమూల్య జ్ఞాన సంపదను రక్షిస్తూ మనం ఆధునికంగా సంపన్నమవ్వాలి. సామాజిక దురాచారాల నుండి మరియు చెడు పరంపరలనుండి సమాజాన్ని విముక్తి చేయాల్సిన అవసరం రానున్న తరాలు గుర్తించి సంకల్పం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ABVP - సంఘర్షణ
1982లో ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయాలలో నక్సల్స్ ప్రాబల్యం పెరిగిపోయింది. వారు పేదల అభ్యున్నతి పేరుతో విద్యార్థులను హింసాత్మక కార్యకలాపాల వైపు ప్రేరేపించేవారు. ఈ దేశ సంస్కృతిని ని కించపరుస్తూ విద్యార్థులలో దేశద్రోహ భావాలను ప్రేరేపించి వారిని దేశానికి వ్యతిరేకంగా నిలబెట్టే పనులు చేసేవారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేవారు. వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయం కార్ల్ మార్క్స్ విశ్వవిద్యాలయంగా పిలిచేవారు. ఇక్కడ ప్రతి సంవత్సరం స్వాతంత్ర దినోత్సవం లేదా రిపబ్లిక్ డే సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగుర వేయడాన్ని  వారు నిరోధించేవారు. బెదిరించేవారు. అంతేకాదు ఆరోజున పెద్దపెద్ద నల్ల జెండాలు ఎగురవేసే వారు. విశ్వవిద్యాలయంలో ఇంత జరిగినా ఎవరూ దీనిని ప్రతిఘటించే వారు కాదు. భయం కారణంగా ప్రజలు మౌనంగా ఉండేవారు. 26 జనవరి 1986 నాడు గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాన్ని ఎగుర వేయకుండా అడ్డుకున్నారు. పరిషత్ కార్యకర్తలు దీన్ని సహించలేకపోయారు. సామ జగన్ మోహన్ రెడ్డి పరిషత్ కార్యకర్త ఆయన సహచరులు సంఖ్యాబలం లేకపోయినా, నక్సల్స్ లాగా సాయుధులు కాకపోయినా,  దృఢమైన సంకల్పబలంతో నక్సలైట్ల దురాగతాన్ని ఎదిరించారు. పదిహేను ఇరవై మంది పరిషత్ కార్యకర్తల అభ్యర్థన మేరకు కొంతమంది విశ్వవిద్యాలయ సిబ్బంది గణతంత్ర దినోత్సవం నాడు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ఈ విషయం తెలిసి అక్కడకు నక్సల్స్ వచ్చి దౌర్జన్యం చేసి అక్కడ ఉన్న వారిని కొట్టి త్రివర్ణ పతాకాన్ని చింపివేసి, నల్ల జెండాను ఎగరవేశారు. నక్సల్స్ బెదిరింపులను లెక్క చేయక సామ జగన్మోహన్ రెడ్డి తిరిగి జాతీయ పతాకాన్ని ఎగుర వేశాడు. వారికి వ్యతిరేకంగా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ విషయం న్యాయస్థానానికి వెళ్లి తీవ్రమైనదిగా రూపుదిద్దుకుంది. తమకు వ్యతిరేకంగా కోర్టులో సాక్ష్యం చెప్పవద్దని నక్సలైట్లు జగన్మోహన్ రెడ్డిని బెదిరించారు. కానీ అతడు పరిషత్ కార్యకర్త. నిర్భయుడు బలిదానానికి సిద్ధంగా ఉన్నవాడు. సాక్ష్యం చెప్పడానికి న్యాయస్థానానికి బయలుదేరిన సామ జగన్మోహన్ రెడ్డిని నడిరోడ్డుపై అతి కిరాతకంగా నక్సల్స్ హత్య చేశారు. అలాగే గద్దర్ పాడే విప్లవ గీతాలలో ఉన్న అభ్యంతరకర అంశాలను ఎత్తిచూపినందుకు గాను నాగార్జున విశ్వవిద్యాలయం కు చెందిన నల్గొండ వాసి ఏచూరి శ్రీనివాస్ ను 1981 ఏప్రిల్లో నక్సల్స్ హతమార్చారు. ఈ విధంగా హత్యాకాండను విధ్వంసాన్ని సృష్టించినట్లయితే పరిషత్ కార్యకర్తలు భయభ్రాంతులకు లోనై పారిపోతారని నక్సల్స్ భావించారు. కానీ వారి ఆలోచన తప్పని రుజువు చేశారు పరిషత్ కార్యకర్తలు. ఈ మారణకాండ, విధ్వంసాలకు వ్యతిరేకంగా సంకల్పబలంతో కంకణబద్ధులై పరిషత్ కార్యకర్తలు కార్యరంగంలో మరింత ముందుకు నడిచారు. ఇలాంటి సంఘటనలు వరుసగా జరిగాయి. 45 మంది పరిషత్ కార్యకర్తలు సంఘ సభ్యులు నక్సల్స్ చేతుల్లో అమరులయ్యారు. రెండు దశాబ్దాల ఈ సుదీర్ఘ సంఘర్షణ ఫలితంగా నక్సల్స్ కొనసాగిస్తున్న హింసాకాండకు వ్యతిరేకంగా విద్యార్థిలోకం కనువిప్పు కలిగింది. విద్యార్ధిలోకం అహింసా మార్గంలో పయనిస్తూ నక్సల్ వాదులను తిరస్కరించారు. ఫలితంగా ఈనాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో నలువైపులా "భారత్ మాతా కీ జై", "వందేమాతరం" నినాదాలు మార్మోగుతున్నాయి. చివరకు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ విద్యార్థులు "లాల్ గులామి ఛోడ్ కర్ - బోలో  వందేమాతరం" అనే నినాదాన్ని సమర్థిస్తున్నారు.
(సేకరణ- దేశం కోసం ఒక విద్యార్థి ఉద్యమం పుస్తకం.)

ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

No comments