1.ఉక్కు పరిశ్రమ పితామహుడైన జంషెడ్జీ టాటా కు దిశానిర్దేశం చేసిందెవరు ? 2.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యపదవిని సున్నితంగ...
2.హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో తత్వశాస్త్ర ఆచార్యపదవిని సున్నితంగా తిరస్కరించిన వారు ఎవరు?
3.ఆధునిక విద్యుచ్చక్తి శాస్త్రజ్ఞుడైన నికోలా టెస్లా(Nikola Tesla) తన విజ్ఞాన శాస్త్ర పరిశోధనలలో ఆధ్యాత్మిక సహాయం చేయమని స్వయంగా ఆహ్వానించిన వ్యక్తి ఎవరు?
4.బిల్‌గేట్స్,అన్నాహజారే,ఒబామా,గాంధిజీ,నెహ్రుజీ,సుభాష్‌చంద్రబోస్,సర్వేపల్లి రాదాక్రిష్ణన్,అరవిందయోగి లాంటి గొప్పగొప్ప వ్యక్తుల కే స్పూర్థినిచ్చిన ఆ మహావ్యక్తి ఎవరు?
5.బెంగళూరులోని IISc కు మొట్టమొదటి Director గా ఉండమని టాటాలచే ఆహ్వానింపబడ్డ వ్యక్తి ఎవరు?
6.అడవులలోని వేదాంతాన్ని సమాజంలోనికి తీసుకువచ్చిన వారెవరు?
7.స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొన్న అధిక సంఖ్యాకులకి స్పూర్థిప్రదాత ఎవరు?
8.కొడగట్టిన దీపంలా ఉన్న హిందూమత ప్రాభవాన్ని విశ్వ వినువీధులలో నిలబెట్టిన ఘనుడెవరు ?
9.మానవసేవే మాధవసేవ అని గురువుగారైన రామకృష్ణపరమహంస గారి ఉపదేశాన్ని స్వీకరించి విశ్వంలో చాటిన మహానుభావుడెవరు ?
10.మతరహితంగా సర్వసమాజానికీ సేవలు చేస్తున్న రామకృష్ణ సంస్థల స్థాపకుడెవరు ?
11.వంద సంవత్సరాలు దాటినా ఇంకా లక్షలమందికి స్పూర్థిప్రదాతగా వెలుగొందుతున్న ఏకైక మహానుభావుడెవరు ?
12.యువతకు కావలసినవి ఇనుపకండలు, ఉక్కు నరాలు అని తెల్పిన మహానుభావుడు ఎవరు?
ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నని చెప్పుకోవాలి?
వీటన్నిటికీ సమాధానం స్వామి వివేకానంద అని మనకు తెలుసు.
ఆ మహానుభావుడు శివసాయుజ్యం పొంది నేటికి 117 సంవత్సరాలు. స్వామీజీ స్థాపించిన రామకృష్ణ సంస్థలు నేటికీ వివాద రహితంగా సేవలు అందిస్తూనే ఉన్నాయి.
తన సందేశం 1500 సంవత్సరాలకు సరిపడినంత ఇచ్చానని స్వామి వివేకానందుడే స్వయంగా చెప్పారు.
"వివేకానందుడే బ్రతికి ఉంటే ఆ మహాపురుషుడి కాళ్ల దగ్గర ఒక శిష్యపరమాణువుగా కూర్చుని ఉండేవాడిని."
-సుభాష్ చంద్రబోస్
చివరగా స్వామి వివేకానందుడు చెప్పిన ఒక సందేశంతో మనం ఆయనకు నివాళులర్పిద్దాం.
No comments
Dear Readers, Give your valuable comments and Suggestions on this comment box..