Type Here to Get Search Results !

తులసీదాసు - about tulasidas in telugu

తులసీదాసు : వాల్మీకి రామాయణం వలే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన రామచరిత మానస్ అనే గ్రంథాన్ని రాశాడు. గొప్ప రామభక్తుడు. భక్త మీరాబాయి ఈయనకు సమకాలికురాలు. తులసీదాసు క్రీ.శ. 16వ శతాబ్దం నాటి వాడు. యమునానదీ తీరాన ఉన్న రాంపూర్ అనే గ్రామంలో జన్మించాడు. తండ్రి ఆత్మారాం దూబే. తల్లి హులసి. ఇతనిని రాంబోలా అని తులారాం అని పిలిచేవారు. రామానందుడు, శేష సనాతనుడు, నరహరిదాసులాంటి సత్పురుషుల సాహచర్యం లో విద్య నభ్యసించాడు. మంచి తర్క శాస్త్ర పండితుడు.
దీనబంధు పాఠక్ యొక్క కుమార్తె అతిలోకసుందరి యైన రత్నావళి వివాహం చేసుకున్నాడు. చాలా కాలం పాటు భార్యావ్యామోహంలో మునిగి పోగా ఒకనాడు పుట్టింట్లో ఉన్న తన వద్దకు వచ్చిన భర్తతో రత్నావళి నాపై వ్యామోహంతో తాడు కి, సర్పానికి ఉన్న భేదాన్ని కూడా గ్రహించలేకపోయారు. ఇంతటి వ్యామోహం దేవుని పై ఉంటే? అంటూ మందలించగా ఈయనకు కర్తవ్యం బోధపడిందని అంటారు కొందరు.
రామమందిరం లో హరికథ వినటానికి వస్తున్న వృద్ధుని రూపంలో ఉన్న శ్రీరాముని ఉపదేశానుసారం తులసీదాసు చిత్రకూట పర్వతం కి వెళ్లి శ్రీ రామ దర్శనం పొందాడు. హనుమంతుని ప్రేరణ వల్ల రామ చరిత రచనను ప్రారంభించాడు. సంస్కృత భాషలో రామాయణ రచన చేయగలిగిన పాండిత్యం ఉన్నప్పటికీ లోకుల సమస్య పరిష్కారానికి లోక చైతన్యానికి సరళంగా పబోధకంగా ఉండేలా ప్రజల వాడుక లో నున్న బ్రజ భాషలో రచించారు. కోటానుకోట్ల హృదయాలలో రామభక్తిని రగిలించారు.
సమస్త భారతం లో ఎంతో ప్రజాదరణను పొందింది. ఈ గ్రంథం. ముస్లింల దురాక్రమణలు వల్ల హతాశులై ఉన్న హిందువులకు మనో బలాన్ని ప్రసాదించింది. ప్రతి స్త్రీ తన భర్త చైతన్యవంతుడు కావాలని కోరుకుంటుంది కాని జీవచ్చవం లా ఉండాలని కోరుకోదు. జీవచ్ఛవం లా పడి ఉన్న హిందూ జాతిలో ప్రాణం పోసి చైతన్యవంతంగా మార్చిన మహత్కార్యాన్ని చేశాడు తులసీ దాసు.
మనో బలాన్ని కలిగించే రామ కథ లోని పాత్రల ద్వారా సంస్కృతి లో శ్రేష్టమైన ఆదర్శాలు మరియు జీవన మూలాలు ప్రతిపాదించారు. గౌరవింపదగిన మహోన్నత ఆదర్శాలు తన జీవితంలో స్వీకరించి చేరిన ప్రసిద్ధికెక్కిన శ్రీ రాముడు దివ్య చరిత్రను సృజించాడు తులసీదాస్. మహమ్మదీయుల రాజ్య కాలంలో ఉత్తర భారతదేశంలో ఈ రామాయణం హిందూ ధర్మాన్ని కాపాడింది. తులసీదాసు శ్రావణ శుద్ధ సప్తమి రోజు వారణాసి లొని అసీ ఘట్టంలో తన తనువును విడిచిపెట్టారు. తులసీదాసు వినయ పత్రికా, దోహావళీ, గీతావళి, కవితా వళి మొదలగు గ్రంథాలు కూడా రచించారు.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.