Type Here to Get Search Results !

about guru gobind singh in telugu - గురు గోవింద సింహుడు


దశమేశుడు (గురు గోవింద సింహుడు) : సిక్కుల దశమ గురువు కావడం వల్ల దశమేశుడుగా ప్రసిద్ధుడైనాడు. ఈయన సిక్కుల తొమ్మిదవ గురువైన తేగ్ బహదూర్ పుత్రుడు. పౌరుషపరాక్రమాలకు, ధైర్య సాహసాలకు ప్రతి రూపం. జీవితమంతా యుద్ధ రంగం లోనే గడిపి భార్యాబిడ్డల నందరిని పణంగా పెట్టి హిందూ ధర్మం కోసం, దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన దేశ భక్తుడు.

సకల జగత్ మే ఖాల్సా పంత్ గాజే జాగే ధరమ్ హిందూ తురక భండబాజే
ప్రపంచమంతా ఖాల్సా పంథాను ప్రస్తుతించాలి. తురకల దురాగతాలు అంతం పలకాలి. హిందూధర్మం జాగృతం కావాలి. అన్న సందేశం తో హిందూ ధర్మరక్షణకై పవిత్రత, పరాక్రమం మేళవించి ఒక కొత్త సిక్కు పరంపరను సృష్టించిన ఈయన అసలు పేరు గోవిందరాయ్. ఖాల్సా పంథా యుద్ధవీరులు సింహ అని సంబోధిస్తుండటంతో ఈయన పేరు చివర కూడా 'సింహ' చేరి గోవిందసింహుడైనాడు. సిక్కు గురువు కావడం వల్ల గురు గోవింద సింహ అని పిలవబడ్డాడు. తొమ్మిది సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తండ్రికే బలిదానం చేయడానికి ప్రేరణ ఇచ్చిన వీర కిశోరుడు గోవిందరాయ్.
విధర్మీయులు, హిందూధర్మ విధ్వంసకులైన మొగలాయిలను ఎదుర్కోగలిగిన, ధర్మ రక్ష దీక్షను స్వీకరించగల వీరుల తో కూడిన ఖాల్సా పంథాను కేశ గఢ్ లో (ఆనంతపూర్ సాహబ్) స్థాపించారు. ఖాల్సా అంటే విశుద్ధశీలవంతుల సమూహము అని అర్థం. ఈ సాంప్రదాయంలో ధర్మరక్షణకై తమ సర్వస్వం సమర్పించడానికి దయారాంఖత్రీ, ధర్మ జాట్, మోహకం దోబీ, హిమ్మత్ కహార్ సాహెబా నాపితా అనే అయిదు సంసిద్ధులై పంచప్యారాలుగా పిలవబడ్డారు.
గురు గోవిందుని ఇద్దరు పుత్రుడు అమర్ సింహ్, జురర్ సింహ్లు యుద్ధంలో మరణించారు. జొరావరసింహ్, ఫతేసింహ్లు అనే మరో ఇద్దరు పుత్రులను మహమ్మదీయ మతం స్వీకరించని కారణంగా సర్ హిందీ వద్ద సజీవ సమాధి చేశారు. ఇంతటి ఘోరం జరిగిన గురుగోవింద్ సింహుడు తన ధర్మ ప్రచార కార్యాన్ని తన ఉపాసనను సమున్నతమైన ధైర్యంతో నడుపుకుంటూ వచ్చాడు. గోవిందసింహుడు కేవలం ఖాల్సా పంథా స్థాపకుడు, సేనాపతి. మహావీరుడు మాత్రమే కాక గొప్ప గ్రంథ రచయిత కూడా, విచిత్ర నాటక, అకాల స్తుతి, చౌబీస్ అవతార్ కథ, మరియు చండీ చరిత్ర మొదలగు గ్రంథాలు రచించాడు. చౌబీస్ అవతార్ కథ అనే గ్రంథం లోని రామావతార్ అనే భాగం గోవింద రామాయణం పేరుతో బహుళ ప్రసిద్ధి చెందింది. గురు గోవిందుడు శైవ, వైష్ణవ, శాక్తే యాది హిందూ శక్తినంతటిని సమీకరించి దేశ ధర్మారాధన చేసిన వీర భక్తుడి. మానవులందరూ సమానమని అందరి హృదయాల్లో ఒకే జ్యోతి ప్రజ్వలిస్తున్నదని ప్రగాఢంగా విశ్వసించిన మహాపురుషుడు.
ప్రజలలో ఆత్మవిస్మృతి ని దూరం చేయడానికి లక్షమంది తో ఒక్కడివై పోరాడు అని పిలుపునిచ్చి ప్రజల్లో ఉత్సాహాన్ని కలిగించాడు. గురు గోవిందుడు తీర్థయాత్రలు చేస్తూ నాందేడ్ కు చేరుకున్న సమయాన విశ్వాస ఘాతకుడైన ఒక పఠాను ఆయన పై కత్తి వేటు వేసి వధించాడు. ధార్మిక సిక్కు సమాజాన్ని సర్వకాల సర్వావస్థల యందు యుద్ధసన్నద్ధులుగా తీర్చిదిద్దడంలో గురుగోవింద్ సింహుడు అద్భుతమైన భూమికను వహించాడు. తన తదనంతరం సిక్కుమతంలో వ్యక్తికి గురుత్వస్థానం ఉండదని పవిత్రమైన గ్రంథసాహెబ్ గురుస్థానాన్ని వహిస్తుందని ప్రతిపాదించాడు.
ఇలాంటి వ్యాసాల కోసం ఈ క్రింద ఉన్న వాట్సాప్ గ్రూప్ లో జాయిన అవ్వగలరు. మీ MegaMindsIndia.

జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.