about dadhichi maharshi in telugu - దధీచి త్యాగం

0
దధీచి మహర్షి : దధీచి బ్రహ్మజ్ఞాని, మహా తపస్వి, సత్త్వ గుణ సంపన్నుడు. శత్రువులను కూడా స్నేహితులుగా మలుచుకొనగల శాంతివనం అతని ఆశ్రమం. ఒకసారి దేవదానవుల మధ్య పరస్పర అస్త్రశస్త్రాలు ఉపయోగించ కుండా ఉండేలా ఒప్పందం జరిగింది. దేవతలు తమ అస్త్రాలు దధీచి ఆశ్రమము నందు దాచి ఉంచమని కొరుకొన్నారు. సంవత్సరాలు గడిచినా దేవతల వచ్చి ఆయుధాలు తీసుకోలేదు. దధీచి వాటిని జలముగా మార్చి త్రాగివేయగా ఆ ఆయుధముల శక్తి అంతా అతని ఎముకలుకు పట్టింది. అప్పటి నుండి అతని ఎముకలు శక్తివంతమైనాయి.
పవిత్ర శరీరుడైన అతని అస్తులు (ఎముకలు) అత్యంత ప్రభావవంతములైనాయి. తదనంతర కాలం లో వృత్రా సురుడు రాక్షసుని వలన దేవతలు కష్టాలు కలుగుతున్నాయి.పైగా దేవతల వద్ద ఆయుధాలు లేవు ఇలాంటి సంకట పరిస్థితులలో ఇంద్రుడు దేవతలను వెంట పెట్టుకొని దధీచి వద్దకు వెళ్ళి తమ నిస్సహాయతను తెలియ చెప్పుకొన్నాడు. అప్పుడు దధీచి దేవతల ఆయుధాలు తన లో జీర్ణమైన విషయాన్ని చెప్పి నన్ను చంపి నా ఆస్తులు తీసుకువెళ్ళండి.
దేవహితము చేయడం కంటే నాకు కావలసిన దేమున్నది? అని తన అభిప్రాయాన్ని చెప్పాడు, అప్పుడు ఇంద్రాదులు భయపడి మహాత్మా దధీచి మిమ్మల్ని చంపగల శక్తి మాకు లేదు. పైగా బ్రహ్మహత్యాపాతక దోషం కలుగుతుంది కూడా అని చెప్పగా దధీచి! స్వచ్ఛంద మరణ శక్తి కలవాడగుటచే లోకకల్యాణార్గం యోగాగ్నిని కల్పించుకొని నేను మరణించిన తదుపరి నా ఎముకలతో తదుపరి కర్తవ్యం నిర్వర్తింపుడని పరమశివుని ప్రార్థించి ఆత్మాహుతి సిద్ధమైనాడు.
దేవతలు గోగణమును ప్రార్థించగా అవి వచ్చి దధీచి రక్తమాంసములను నాకి ఎముకలను శుద్ధి చేయగా వాటిచే బ్రహ్మచక్రము, వజ్రాయుధము మొదలగు ఆయుధముల్లు చేసి ఈయగా వృత్రాసురాది రాక్షసులను సంహరించారు దేవతలు. దధీచి మరణ సమయానికి అతని భార్య గభస్తిని గర్భవతి. ఆమె సహగమన మనకు సిద్ధం కాగా బ్రహ్మాదులు ప్రత్యక్షమై ఆమె ప్రాణత్యాగం చేయడాన్ని నివారించారు. అయినను ఆమె వినక సహగమనమునకే సిద్దమగుచుండ ఆమె గర్భం నుండి శిశువు సమీపమున నున్న పిప్పల వృక్షం కడ జారిపడిన.
అప్పుడు వృక్షం శిశువుపై జాలిపడి చంద్రుని ప్రార్థించి అమృతమును తెచ్చి అతనికిపోసి పెంచుటచే బాలుడు పిప్పలుడని పిలువబడి తరువాత పిప్పలాద మహర్షిగ పేరు పొందినాడు దధీచి శిష్యుడు త్వష్ట మహాముని. పరోపకారార్ధం, ధర్మార్ధం, దేవహితార్థం కైంకర్యం కావడం ఈ దేహానికి సార్ధకత, పరుల సుఖదుఃఖాలు పాలు పంచుకోవటం ఉత్తమ ధర్మం అనే ఆదర్శాన్ని చూపించిన త్యాగజీవి దధీచి. ఆ మహర్షి అడుగు జాడలలోపయనించడం మన కర్తవ్యం.
జాతీయ సాహిత్యం కొరకు సంప్రదించండి:

ప్రతులకు : సాహిత్యనికేతన్‌
కేశవ నిలయం, బర్కత్‌పురా,
హైదరాబాద్‌ – 500 027
ఫోన్‌ : 040-27563236
సాహిత్యనికేతన్‌, ఏలూరు రోడ్‌,
గవర్నర్‌పేట, విజయవాడ – 500 020
సెల్‌ : 9440643348.

Post a Comment

0 Comments
* Please Don't Spam Here. All the Comments are Reviewed by Admin.
Post a Comment (0)
To Top